Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
సర్ లిఫ్ట్ చేశారు - శ్రీమతి గారూ ..... మనమే గెలిచాము మనమే గెలిచాము , మనల్నే గెలిపించాడు మహేష్ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నాడు .

సంతోషిస్తూనే చెల్లి అన్నాను .
సర్ : ఇదిగో ఇస్తున్నాను మహేష్ ...... 
కీర్తి కనిపించగానే సంతోషం రెట్టింపు అయ్యింది , చెల్లీ చెల్లీ ...... అంటూ ప్రాణంలా పిలిచాను .
కీర్తి : అన్నయ్యా అంటూ సంతోషంగా ముద్దు కురిపించి ఆ వెంటనే బుజ్జికోపంతో చూస్తోంది పో అన్నయ్యా అంటూ ......
ఏమైంది చెల్లీ - ఎందుకా బుజ్జి కోపం ...... ? , ముద్దుగా ఉన్నావు ఉమ్మా .....
కీర్తి : లవ్ యు అన్నయ్యా , అంతలోనే బుజ్జికోపం ......
సర్ - మేడమ్ నవ్వుకుంటున్నారు , మహేష్ ..... నీ ముద్దుల చెల్లి కోపానికి కారణం ....... వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిన తరుణం అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా అంటూ కలవరిస్తూనే ఉంది , తల్లీ ..... మీఇద్దరిలో ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం ? , ల్యాండ్ అవ్వగానే ఎవరు ముందుగా కాల్ చేస్తారో వారికే ఎక్కువ ఇష్టం అన్నాము .
" అన్నయ్య అంటే నాకే ఎక్కువ ఇష్టం నేనే ఫస్ట్ కాల్ చేస్తాను అన్నది " 
మేమిద్దరం మాత్రం నీ అన్నయ్యకే నువ్వంటే ఎక్కువ ఇష్టం - మొదటగా మీ అన్నయ్యే కాల్ చేస్తాడు కీర్తి అంటూ బెట్ కట్టాము - మేమే గెలిచాము మేమే గెలిచాము , జస్ట్ అలా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆగింది మీ మేడమ్ మొబైల్ కీర్తి తీసుకునేలోపు ఇలా కాల్ చేసేసావు - చూడు ఇంకా ప్రయాణీకులు దిగుతున్నారు అంటూ చూయించారు , సో అన్నయ్యకే చెల్లి అంటే ఎక్కువ ప్రాణం ......
మురిసిపోతూనే అన్నయ్యా ...... అంటూ ముద్దుగా కోప్పడుతోంది .
Sorry లవ్ యు చెల్లీ అంటూ కట్ చేసాను .

క్షణంలో మేడమ్ నుండి వీడియో కాల్ ...... , సంతోషంతో నవ్వుతూ ఎత్తాను .
కీర్తి : యాహూ యాహూ ..... నేనే గెలిచాను నేనే గెలిచాను , అన్నయ్య గెలిపించాడు ఉమ్మా ఉమ్మా లవ్ యు అన్నయ్యా అంటూ ముద్దులుకురిపిస్తోంది .
లవ్ యు చెల్లీ ...... .
పో మహేష్ ..... అంటూ సర్ - మేడమ్ నవ్వులను దాకుంటూనే బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకున్నాను , చెల్లికే ఈ అన్నయ్య అంటే ఎక్కువ ప్రాణం , అంతకంటే అదృష్టం ఏముంటుంది , చెల్లీ ..... జర్నీ ఎలా జరిగింది ? .
కీర్తి : మా అన్నయ్యను మొబైల్లో చూస్తున్నానా , అలా ల్యాండ్ అయిపోయింది .
లవ్ యు చెల్లీ అంటూ మురిసిపోతున్నాను , ఉదయం నుండీ నాకోసం అలసిపోయి ఉంటారు పైగా ప్రయాణం , జాగ్రత్తగా ఇంటికివెళ్లి హాయిగా పడుకోండి చెల్లీ - సర్ - మేడమ్ ..... ఉదయం కాల్ చేస్తాను .
కీర్తి : నేనే చేస్తాను నేనే చేస్తాను .
సర్ : బెట్ బెట్ .....
కీర్తి : బెట్ డాడీ ......
సర్ : గెలిచేది నేనే కానీ నీ అన్నయ్య నిన్ను గెలిపిస్తాడు , అంతా చీటింగ్ ....
నవ్వుకున్నాము , గుడ్ నైట్స్ చెప్పుకున్నాము .

నవ్వుకుని చూస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటి దగ్గర నుండి మెయిన్ రోడ్ వరకూ వచ్చేసాను , పరుగున వెనక్కువెళ్ళాను , sorry sorry అన్నా ..... అన్నీ లోపలకు చేర్చండి మావికాదు అన్నా పట్టించుకోకండి అన్నాను .
లోపలికి చేరుస్తుండగా నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళాను .
అక్కయ్య వారిస్తున్నా పట్టించుకోకుండా అన్నింటినీ హాల్లోకి చేరుస్తున్నారు - మరొకవైపు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి టార్చ్ వెలుగులలో అక్కలు ఎలక్ట్రిక్ వర్క్ చేస్తున్నారు .

అక్కయ్య : బామ్మా ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యపోతున్నారు .
బామ్మ : అంతా పైవాడి లీల తల్లీ ...... , ఇన్నాళ్లకు మనపై చూపు పడినట్లుంది , ఆ ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది మధ్యాహ్నం కోర్టు దగ్గర అన్నాచెల్లెళ్ళు ఇద్దరు నన్ను ఓదార్చారు కన్నీళ్లను తుడిచారు , సంతోషం - బాధ ..... ఏదీ శాశ్వతం కాదు బామ్మా , ధైర్యంగా ఉండండి బామ్మా కాలమే సమాధానం ఇస్తుంది అని ఆటోలో పంపించాడు , వెళుతూ వెళుతూ ఇంటి దగ్గర అక్కయ్య ఉందని గుర్తుపెట్టుకోండి జాగ్రత్త అన్నాడు .
అక్కయ్య : ఎవరు బామ్మా ఆ తమ్ముడు - చెల్లి ? , అక్కయ్య అంటూ ఆప్యాయంగా పిలిచారు - నా గురించి ఆలోచిస్తున్నారు .
బామ్మ : మనపాలిట బుజ్జిదేవుడు - బుజ్జిదేవత .... అంటూ గుండెలపైకి తీసుకున్నారు .
అక్కయ్య పెదాలపై రెండవసారి చిరునవ్వును చూసి ఆనందిస్తున్నాను .

డ్రైవర్ అక్క : బామ్మా ...... మొత్తం పూర్తయిపోయింది మెయిన్ స్విచ్ వేస్తాను అంటూ బయటకువచ్చి నావైపు రెడీ అంటూ ఆన్ చేశారు .
లోపల - బయట విద్యుత్ కాంతులతోపాటు అక్కయ్య - బామ్మ కళ్ళల్లో వెలుగులు ....... , కొద్దిసేపటి ముందువరకూ బాధతో నిండుకున్న ఇల్లు సంతోషపు వెలుగులతో నిండిపోయిందా - బాధలను దూరం చేసేస్తున్నాయా అన్నట్లు బ్రైట్ గా మారిపోయింది .
సూపర్ అక్కా .....
డ్రైవర్ అక్క : థాంక్యూ ..... , లోపలికివెళ్లి ఫ్రిడ్జ్ - AC - వాషింగ్ మెషీన్ - ఫ్యాన్స్ - టీవీ ...... అన్నీ ఆన్ చేసి వర్కింగ్ , ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే ఈ నెంబర్ కు కాల్ చెయ్యి .......
అక్కయ్య : సిస్టర్ ఆ సంగతి వదిలెయ్యండి , ఇంతకూ ......
డ్రైవర్ అక్క : ఏమి అడగబోతున్నావో తెలుసు , ఆ ఒక్కటీ తప్ప ఏమైనా చెబుతాను , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అమ్మో 10:30 వెళ్ళాలి , మీ కళ్ళల్లో బాధకు కారణం ఏమిటో తెలియదు తొందరలోనే సంతోషాలు కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తాను , అయినా సంతోషాలను నింపడానికే కదా నీ తమ్ముడు ఉన్నది , ఇక మేము వెళతాము అంటూ బయటకువచ్చారు .
అక్కా ...... కొత్త మొబైల్ అంటూ అందించాను .
అక్కలు మళ్లీ లోపలకువెళ్లారు , మరిచిపోయాము మరొక గిఫ్ట్ ఇవ్వమన్నాడు , మేమే పెద్ద ఫోన్ వాడుతున్నాము అంటూ మొబైల్ ఇచ్చారు , ఇదిగో ఈ పగిలిపోయింది కీప్యాడ్ మొబైల్ చూసి కొన్నాడు , సిమ్ సిమ్ మార్చు అంటూ బాక్స్ అందించారు .
అక్కయ్య ఓపెన్ చెయ్యగానే , ఎంత బాగుంది - అలాంటి తమ్ముడు దొరకడం అదృష్టం - తెలియక ఏదో తప్పు చేసే ఉంటాడు - సంతోషంగా ఇంట్లోకి పిలువు .
అక్కయ్య : అధికాదు .....
డ్రైవర్ అక్క : నీఇష్టం అంటూ బయటకువచ్చారు .

థాంక్యూ థాంక్యూ అక్కలూ ...... , నేను అనుకున్నదానికంటే బాగా చేశారు సమయం లోపే చేశారు  , లోపల వెలుగులను చూస్తుంటేనే అక్కయ్య - బామ్మల కళ్ళల్లో ఆనందం కనిపించింది , మీపనితనం వెలకట్టలేనిది ఎంత ఇవ్వాలి అక్కలూ .......
డ్రైవర్ అక్క : మనిషికి నాలుగు వేలు చాలు , వెయ్యి వెయ్యి అడ్వాన్స్ ఇచ్చావు కాబట్టి ఇక మూడు వేలు ఇస్తే చాలు ఒక్కొక్కరికి .....
మూడు వేలు కాదు ఐదు ఐదు వేలు అంటూ ఐదుగురికి ఇచ్చాను , ఆపైన ఒక్కొక్కరికి 500 500 ఇచ్చి , అక్కలూ ..... పిల్లలకు ఐస్ క్రీమ్స్ - స్వీట్స్ తీసుకెళ్లండి , నావలన ఇంత సమయం అయ్యింది అన్నాను .
అక్కలు : నువ్వు చాలా చాలా మంచివాడివి తమ్ముడూ అంటూ ఆనందిస్తున్నారు , ఎవరికోసమైతే ఇదంతా చేస్తున్నావో వారిద్దరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అన్నారు .
థాంక్యూ అక్కలూ ..... 
డ్రైవర్ అక్క : తమ్ముడూ ..... ఈ ఇంట్లోనే ఉంటావా ? .
లేదు లేదు దగ్గరలోనే ఉంటాను .
డ్రైవర్ అక్క : డ్రాప్ చెయ్యమంటావా ? .
వద్దు వద్దు మీకు ఇప్పటికే ఆలస్యం అయ్యింది , దగ్గరలోనే నేను వెళతాను మీరు వెళ్ళండి , ఒక నిమిషం ఒక్క నిమిషం పెన్ ఏమైనా ఉందా ? .
ఒక అక్క : పెన్సిల్ ఉంది , గోడలపై మార్క్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము .
పెన్సిల్ సరిపోతుంది థాంక్యూ అక్కలూ గుడ్ నైట్ అంటూ పంపించాను .

జేబులో ఉన్న బిల్ పేపర్ తీసుకుని నెమ్మదిగా మళ్లీ విండో దగ్గరికి చేరుకున్నాను , అనుకున్నట్లుగానే గ్రూప్ ఫోటోను చూస్తూ అక్కయ్య - బామ్మ బాధపడుతున్నారు , బామ్మా ...... తమ్ముడు ఎవరు ? - అక్కయ్యా .... మాకోసం మీరే పంపించారా ? అంటూ ఫోటోను గుండెలపైకి తీసుకున్నారు .

బాధపడుతూనే పెన్సిల్ తీసుకుని " అక్కయ్యా - బామ్మా ...... అక్కయ్య అని పిలవచ్చు కదా ? ...... , మీరు నాకేమీ కారు - నేను మీకేమీ కాను , మీ తమ్ముడిలా నేనే అనుకున్నాను , మీ బాధ వర్ణనాతీతం ఎవ్వరికీ రాకూడనిది , ఎవరి బాధ వారికి మాత్రమే తెలుసు , మరిచిపోయి సంతోషంగా ఉండండి అని చెప్పాలి అన్నా కన్నీళ్లు ఆగడం లేదు , నా జీవితంలో పొందిన కష్టాలను - అనుభవించిన బాధతో  ఒక్కటి మాత్రం చెప్పగలను పెద్దక్కయ్య ..... దేవుళ్ళ దగ్గర సంతోషంగా ఉండటం అన్నది మనమీదనే ఆధారపడి ఉంటుంది , మన సంతోషమే మీ ఇద్దరి సంతోషమే పెద్దక్కయ్యకు సంతోషం స్వర్గంతో సమానం - మన బాధ మీ ఇద్దరి బాధ ..... పెద్దక్కయ్యకు నరకం , మీరు ఎంత బాధపడితే పైన పెద్దక్కయ్య అంత బాధపడతారు . పెద్దక్కయ్య అని పిలిచాను మీకిష్టం లేకపోతే క్షమించండి - డబ్బుతో సంతోషపెట్టలేము నాకు తెలుసు కానీ అవసరాలు తీరుతాయి అని మిగిలిన డబ్బునంతా " నా " అనుకున్నాను కాబట్టి నా బామ్మకు - అక్కయ్యకు ఇచ్చి నడుచుకుంటూ వెళుతున్నాను , ఇక నిర్ణయం తీసుకోవాల్సినది మీరే ...... మీరు బాధపడి పెద్దక్కయ్యకు నరకాన్ని అందిస్తారో లేక పెద్దక్కయ్యను హృదయమంతా నింపుకుని సంతోషిస్తూ అక్కయ్య ఆశయాలను ( మీ గోల్స్ ) బ్రతికిస్తూ సంతోషంగా ఉంటూ స్వర్గాన్ని అందిస్తారో మీఇష్టం , నేను కాలినడకన ఇంటికి వెళ్లేసరికి అర గంట పట్టవచ్చు - అంతలోపు కన్నీళ్లను తుడుచుకుని మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఈ తమ్ముడు బహుకరించిన పట్టు లంగావోణీ ధరించి సంతోషంగా రెడీ అయిన బామ్మతోపాటు సెల్ఫీలు తీసుకుని నా నెంబర్ 94 ....... నో నో నో ********* @ మెయిల్ కు పంపించాలి , వేచిచూస్తూ నీ తమ్ముడు " అని రాసి మిగిలిన డబ్బు 47500/- ను రాసిన పేపర్లో చుట్టేసి అక్కయ్య ముందు పడేలా కిటికీలోనుండి విసిరేసాను , చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చి మెయిన్ గేట్ వేసి , అక్కయ్య - బామ్మ సంతోషంగా ఉండాలని ప్రార్థించి నడుచుకుంటూ వెళుతున్నాను .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 04-01-2024, 12:08 PM



Users browsing this thread: 41 Guest(s)