Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
నేను, మహిత ఇద్దరం కలిసి తాత ఇంటి దగ్గరకి వెళ్లి తలుపు కొట్టాము, తాత లేచి ఏమి కావాలి బాబు అన్నాడు, ఏమీ లేదు కొంచెం మాట్లాడాలి అని గార్డెన్ లోకి వెళ్ళాము, తాత కి మందు పోసి తాత నిన్ను ఒకటి అడగాలి అని అడిగాను, అడుగు బాబు అన్నాడు, సుబ్బారావు ఫోటో చూపించి ఎవరో చెప్పు తాత అన్నాను, ఆయన ఫోటో చూడగానే సంతోషం తో ఈయన తెలియకపోవడం ఏంటి సుబ్బారావు గారు అన్నాడు, నేను కలిశాను తాత అన్నాను, అవునా ఎక్కడ ఉన్నాడు బాబు, ఎలా ఉన్నాడో మహానుభావుడు అన్నాడు, బాగున్నాడు లే తాత, అసలు సుబ్బారావు గారు ఎందుకు బిజినెస్ వదిలేసి వెళ్లిపోయాడు అని అడిగాను, తాత నాకు తెలియదు అన్నాడు, తాత నీకు తెలుసు అని నాకు తెలుసు చెప్పు తాత అన్నాను, తాత మరి ఎవరికీ చెప్పకూడదు అన్నాడు, సరే తాత అన్నాను, సుబ్బారావు గారు బిజినెస్ మొదలు పెట్టాడు, ఆయనకి తోడుగా  ఎనిమిది మందిని పెట్టుకున్నాడు, చాలా బాగా బిజినెస్ డెవెలప్ ఆయింది, అందులో సూర్య నారాయణ అని ఒకడు ఉండేవాడు, ఇప్పుడు పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కానీ అప్పుడు చాలా మామూలు మనిషి, ఆయన భార్య అన్నయ్య వెంకట్రావు అని ఒకడు వచ్చాడు, ఆయన బాగా డబ్బు ఉన్నవాడు, సూర్య నారాయణ ది అప్పట్లోనే ప్రేమ వివాహం, ఏవో చిన్న చిన్న గొడవలు ఉండేవి ఇద్దరి కుటుంబాల మధ్య, కానీ సుబ్బారావు గారి దయ వల్ల సూర్య నారాయణ బాగా సంపాదించాడు, అప్పుడు వచ్చాడు ఈ వెంకట్రావు, అన్ని గొడవలు పక్కన పెట్టాడు అని సూర్య నారాయణ చాలా సంతోష పడి, అప్పుడపుడు ఫ్యాక్టరీ కి తీసుకువచ్చేవాడు, అది మందులు తయారు చేసే కంపెనీ,  అందుకే వెంకట్రావు కి దొంగ బుద్ధి కలిగింది, అప్పటికే కంపెనీలో సూర్య నారాయణ మరియు కృష్ణ అని ఇద్దరూ బాగా పొజిషన్ లోకి వచ్చేశారు, ఇక ఉన్న ఆరుగురు వెంకట రమణ, సతీష్, సత్య మూర్తి, మురళీ, రామ కృష్ణ, అమరేంద్ర, వీళ్ళకి చాలా బాధ ఉండేది, సూర్య, కృష్ణ బాగా ఎదిగారు అని, ఆ బాధని తెలుసుకున్న వెంకట్రావు వాళ్ళని కలిసి నకిలీ మందుల తయారీ మొదలు పెట్టాడు, సుబ్బారావు గారికి, కానీ కృష్ణ, సూర్య లకి తెలియకుండా, ఈ ఆరుగురు కూడా డబ్బుల కోసం వెంకట్రావ్ చెప్పినట్టే చేశారు, ఒక నాలుగు నెలలు అలానే చేశారు, తరువాత అది సుబ్బారావు గారికి తెలిసింది, ఆయన సూర్య నారాయణ కి చెప్పకుండా డైరెక్ట్ వెంకట్రావు ని పిలిచి అడిగాడు, బాగా డబ్బులు ఉన్నవాడు కావడం, తెలివి బాగా ఉండటం వల్ల ముందు గానీ ఊహించి సుబ్బారావు గారి కొడుకుని కిడ్నాప్ చేయించి సుబ్బారావు గారి దగ్గరకి వెళ్ళాడు, గొడవ అయ్యాక ఇక సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్తుంది విషయం అనే టైమ్ లో సుబ్బారావు గారి కొడుకుని కిడ్నాప్ చేశాడు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు, కంపెనీ వదిలేస్తే వదులుతా అని చెప్పి బెదిరించాడు, సుబ్బారావు గారికి వేరే ఆప్షన్ లేక చెప్పినట్టు చేశాడు, సుబ్బారావు గారు వెళ్ళిపోతూ కంపెనీ మొత్తం ఎనిమిది మంది కి ఇచ్చాడు, అప్పుడు కానీ మిగతా ఆరు మందికి అర్థం కాలేదు సుబ్బారావు గారి గొప్పతనం, మళ్ళీ వెంకట్రావు వెళ్లి వాళ్ళ బావ అయిన సూర్య తో నువ్వే కంపెనీ తీసుకో, నువ్వు అయితేనే బాగా డెవలప్ చేస్తావు అని చెప్పి, మిగతా వాళ్ళు షేర్స్ కొనడానికి నేను సహాయం చేస్తాను అని చెప్పాడు, ఏమీ తెలియని సూర్య కూడా సరే అన్నాడు, కృష్ణ తో పాటు మిగతా ఆరుగురిని బెదిరించాడు, నకిలీ మందుల విషయం బయటకి చెప్పి మిమ్మల్ని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి పంపిస్తా అని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా షేర్స్ వాళ్ళ బావ కి రాసి ఇప్పించాడు, కృష్ణ మాత్రం తప్పు చేయలేదు కాబట్టి భయపడలేదు, అప్పటికి కృష్ణ కి పిల్లలు లేరు, అందుక్ భార్య ని కిడ్నాప్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ కృష్ణ అప్పటికే సుబ్బారావు గారి కంపెనీ లో మంచి పేరు ఉండటం, సమాజం లో కూడా పేరు తెచ్చుకోవడం, మరియూ సూర్య కి చెప్తా అని బెదిరించడం వల్ల, కొద్దిగా డబ్బులు తీసుకుని వదిలేశాడు, ఆ తరువాత ఏమి జరిగింది నాకు తెలియదు, కానీ వెంకట్రావు నకిలీ మందుల తయారీ చేయడం మాత్రం ఆపలేదు అని తెలిసింది, కానీ ఎక్కువ తెలియదు దాని గురించి అన్నాడు, అసలు తాత నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు అన్నాను, సుబ్బారావు గారి దగ్గరే పని చేశాను కదా అందుకే అన్నాడు, ఇక ఏమీ తెలియదా తాత అన్నాను, లేదు అన్నాడు, మహిత ఫోటో చూపించి ఎవరో గుర్తు పట్టు తాత అంది, తాత ఫోటో చూసి ఆ దుర్మార్గుడు వీడే వెంకట్రావు అన్నాడు,
సరే తాత థాంక్స్ అన్నాను, అయినా మీకు ఎలా తెలుసు బాబు ఇవి అంతా అన్నాడు, నేను నీకు మళ్ళీ చెప్తాను తాత అన్నాను, ఒకసారి కుదిరితే సుబ్బారావు గారిని కలవడానికి వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్లావా అన్నాడు, తప్పకుండా కలిపిస్తాను అన్నాను, సరే అన్నాడు, ఓకే తాత పడుకో అని చెప్పి మేము లోపలకి వెళ్ళాము, మహిత చూసావా కార్తీక్ మీ నాన్న ఎంత పెద్ద దుర్మార్గుడు అంది, ఆయన అలా ఎందుకు చేశాడో తెలుసుకుంటాను, మీ నాన్న ఏమీ తక్కువ కాదు కదా అన్నాను, అది ఆ టైమ్ లో జరిగింది ఇప్పుడు బాగా ఉన్నారు కదా అంది, సరే మనం వెళ్దాము, ఇప్పటిదాకా ముంబై వెళ్ళకూడదు అనే అనుకున్నాను, కానీ రేపు వెళ్ళాలి అన్నాను, సరే వస్తాను కదా నేను కూడా అంది, సరే అని మేము ఇంటికి వెళ్ళి పడుకున్నాము, ఉదయం లేవగానే రాశి ఫోన్ చేసి ముంబై కి వెళ్తున్నావా అని అడిగింది, అవును అన్నాను, సిగ్గు లేదా నీకు అంది, కాదు లాస్య కోసం అన్నాను, నేను వస్తాను అయితే అంది, నువ్వు ఎందుకు అన్నాను, నన్ను కూడా పిలిచింది అంది, అయితే వస్తావా అన్నాను, వస్తాను నాకు కూడా టికెట్ బుక్ చెయ్ అంది, ఇక రెడీ అయ్యి నేను, రాశి, మహిత, విశాల్ నలుగురం ముంబై కి వెళ్ళాము, ఇక ఆఫీస్ కి వెళ్ళాము, అక్కడ చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేశారు, వెళ్లి కూర్చున్నాము, చేతన్ వస్తే మహిత, విశాల్ వెళ్లి మాట్లాడుతూ ఉన్నారు, నేను రాశి వెళ్ళలేదు, రాశి నాతో అసలు లాస్ట్ టైమ్ మనం ఇక్కడకి వచ్చినపుడు ఎంత రెస్పెక్ట్ ఉండేది మనకి, ఇప్పుడు చూడు పట్టించుకునే వారు లేరు అంది, ఏమి చేద్దాము వదిలేయ్ అన్నాను, అందుకే మా కంపెనీ కి వచ్చేయ్, ఒక కింగ్ లాగా చూసుకుంటాము అంది, అది ఇప్పుడు అవసరమా అన్నాను, నువ్వు ఏదీ వినవు, చెప్పింది అంది, ఆపు ప్లీజ్ అన్నాను, మా నాన్న వస్తే వెళ్ళాను, ఏరా వచ్చావా అన్నాడు, నాన్న నువ్వు చేస్తుంది ఏంటి అన్నాను, అరే మీ నాన్న ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు, నీకు నిదానంగా తెలుస్తుంది, నువ్వు సైలెంట్ గా ఉండడం మంచిది అన్నాను, ఇక నేను మళ్ళీ వెళ్లి రాశి పక్కన కూర్చున్న, తను వెళ్ళిపోదాం అని చిరాకు తెప్పిస్తూ ఉంది, అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి నా పక్కన కూర్చుని, కార్తీక్ నీకు మళ్ళీ చెప్తున్న, ఇక్కడితో అంతా వదిలేసి, నా దగ్గరకి రా, మనకు లేదా బిజినెస్, నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు అన్నాడు, అంకుల్ నాకే ఏమీ అర్ధం కావడం లేదు, నాకు కొన్ని రోజులు గ్యాప్ కావాలి అన్నాను, సరే నీ ఇష్టం వెల్లు, ఇండియా లో ఉండకు, నీ ఇష్టం వచ్చిన దేశం వెల్లు, రిలాక్స్ అవ్వండి, నీకు ఎప్పుడు రావాలి అని ఉంటే అప్పుడు రా అన్నాడు, చూద్దాం అంకుల్ అన్నాను, ఈ ఫంక్షన్ అయ్యాక రా నీతో మాట్లాడాలి అన్నాడు, సరే అంకుల్ అన్నాను, లాస్య వచ్చింది వాళ్ళ అమ్మ తో మా నాన్న తో, అంతా లేచి క్లాప్స్ కొడుతూ ఉన్నారు, కొద్దిసేపటికి రోజీ వచ్చింది, సార్ మీరు వస్తున్నారు అని చెప్పలేదు అంది, సడెన్ గా వచ్చేసాను అన్నాను, సరే ఫంక్షన్ అయ్యాక కలుస్తాను, నేను కూడా మీతోనే వర్క్ చేయాలి అనుకుంటూ ఉన్నాను అంది, చైర్మన్ కి సపోర్ట్ చేస్తూ ఉండు చాలు అన్నాను, సార్ ఫంక్షన్ అయ్యాక కలుస్తాను అంది, సరే అన్నాను, తను వెళ్ళాక రాశి ఎవరూ అంది, నా సెక్రెటరీ అన్నాను, నేను కాకుండా ఇంకో సెక్రెటరీ కూడా ఉందా అంది, అబ్బా ఇక్కడ ముంబై లో అంతే అన్నాను, నీతోనే వర్క్ చేస్తాను అంటుంది, ఏంటి సంగతి అంది, ఏమీ లేదు అన్నాను, ఏమైనా అంది, నీతోనే ఏమీ లేదు, ఇంకా తనతో ఏమి ఉంటుంది అన్నాను, చంపుతాను ఏమైనా చేసావు అని తెలిస్తే అంది, ఒసేయ్ ఆపవే తల్లీ అన్నాను, అప్పుడే విష్ణు వచ్చి సార్ ఎలా ఉన్నారు అన్నాడు, బాగున్నాను నువ్వు ఇక్కడ అన్నాను, అప్పుడు సార్ కి ఇప్పుడు సార్ వైఫ్ కి బాడీ గార్డ్ అన్నాడు, మంచిది అన్నాను, ఎక్కడ ఉన్నా మీ కోసం అంతే సార్ అన్నాడు, నవ్వాను నేను, మీరు ఎప్పుడూ ఒక రేంజ్ సార్, కొద్దిసేపు ఉండండి మీకే తెలుస్తుంది అన్నాడు, ఎంటీ అన్నాను, కొద్దిసేపు అంతే అని లాస్య పిలిస్తే వెళ్ళిపోయాడు, రాశి ఏంటి వాడు అనేది అన్నాడు, నాకే చెప్పలేదు నీకు ఏమి చెప్పాలి అన్నాను, ఏమీ చెప్పకు నాకు అంది, నన్ను టార్చర్ చేయడానికే వచ్చావు కదా అని చైర్ నుంచి లేచాను, వద్దు లే కూర్చో అంది, మహిత నేను లేవడం చూసి, నా దగ్గరకి వచ్చి ఒక నిమిషం ఇటు రా అంది, ఎందుకు అన్నాను, చెప్తున్న కదా అంది, సరే అన్నాను, రాశిని కూడా రమ్మని పిలిచింది, అక్కడకి వెళ్ళాక అంతా ఒక బ్యాచ్ ఉన్నారు, తను మేము అంతా చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్ కార్తీక్, నీకు పరిచయం చేయలేదు కదా అంది, తెలుసు కదా అన్నాను, జననీ,చేతన్,నేను, లాస్య, విశాల్ తప్ప ఎవరు తెలుసు అందుకే అని ఒక్కక్కరిని పరిచయం చేయడం మొదలు పెట్టింది, సాహిత్, చేతన్ కి బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు గ్రీస్ లో ఉంటాడు, శైలజ రామ కృష్ణ అంకుల్ కూతురు, అక్షర సత్య మూర్తి అంకుల్ కూతురు అని పరిచయం చేసింది, తరువాత రాశి ని మన కృష్ణ అంకుల్ కూతురు అని పరిచయం చేసింది, అంతా అసలు మన డాడ్ వాళ్ళు ఫ్రెండ్స్ మనం కూడా ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇక కొద్దిసేపు మాట్లాడాక ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే అందరం వెళ్లి కూర్చున్నాము, లాస్య వాళ్ళ అమ్మ ఒక్కో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని పరిచయం ఉంది, ఇక అంకుల్ ఫ్రెండ్స్ ప్లేస్ లో వాళ్ళ పిల్లలని డైరెక్టర్స్ గా చేశారు, అప్పుడే ఒక పేరు చెప్పగానే నాతో పాటు అంతా, మా నాన్న కూడా షాక్ అయ్యాడు, లాస్య ని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ప్రకటించింది, నా ప్లేస్ లో డైరెక్టర్ గా లాస్య ని పెట్టారు, ఇక ఛైర్మన్ ఎవరూ అని అంతా ఆత్రుత గా ఎదురు చూస్తూ ఉంటే, లాస్య వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఇప్పటి వరకూ మాకు మా ఆయన కి సహాయంగా నిలబడ్డ అందరికీ డైరెక్టర్ పదవి ఇచ్చాను, కానీ చైర్మన్ పదవి మాత్రం మా ఆయన చివరి కోరిక, మా ఆయన కి తన కూతురు కంటే ఇష్టం అయిన వ్యక్తి నా అల్లుడు కార్తీక్ రావు ని నియమిస్తున్న, ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం, కార్తీక్ కి బిజినెస్ లో అనుభవం లేకపోవచ్చు కానీ బిజినెస్ చేసే కెపాసిటీ ఉంది, రా కార్తీక్ స్టేజ్ మీదకు అంది, ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు, కానీ అక్కడ ఉన్న స్టాఫ్ చాలా సంతోషం తో క్లాప్స్ కొడుతూ ఉన్నారు.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 03-01-2024, 07:27 PM



Users browsing this thread: 22 Guest(s)