29-12-2023, 09:18 AM
(29-12-2023, 08:26 AM)opendoor Wrote: కధని సమీక్షించి ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో చెప్పాలి
నా సైడ్ నుంచి అడ్మిన్స్ కి చిన్న విన్నపం .. మనకి ఈ సైట్ లో ప్రతి యూజర్ యొక్క అనలిటిక్స్ పోగు చేస్తున్నాం .. నెలలో ఎన్ని నిముషాలు సైట్ లో ఉన్నారు , ఎన్ని లైక్స్ ఇచ్చారు , ఎన్ని పోస్ట్స్ చేసారు .. ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని పాసివ్ రీడర్స్ ని బాన్ చేయండి కొంత కాలం
ఉదాహరణకి ఒక యూజర్ నెలలో 5 గంటలు సైట్ లో ఉన్నాడు , కేవలం 4 లైక్స్ మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి , అతన్ని ఒక నెల ఇన్ ఆక్టివేట్ చేయండి ... ఇలా 3 సార్లు కంటిన్యూ గా ఇన్ ఆక్టివేట్ అయితే అతన్ని బాన్ చేయండి
మన సైట్ కి ఎక్కువ మంది రీడర్స్ అక్కర్లేదు , ఉన్న వాళ్ళు బాగా చదివి , ఎంకరేజ్ చేయాలి .. అప్పుడే కొత్త కధలు , కొత్త రచయితలు వస్తారు .
ఆలోచించండి..
మిత్రమా opendoor
బాన్ చేయడం చిన్న పని. (రెండు క్లిక్కులు అంతే)
అసలే రిజిస్టర్డ్ యూసర్స్ తక్కువగా ఉంటున్నారు. వీళ్ళను కూడా బాన్ చేస్తే , గెస్ట్ యూసర్స్ గా వచ్చి చదువుకుని వెళ్లిపోతారు.
కొన్ని కామెంట్స్ చూశాను ఒక కథ నచ్చి ఆ పాయింట్ కి కనెక్ట్ అయి రిజిస్టర్ చేసుకుని కామెంట్ పెట్టినవాళ్లను.
మీరు రచయిత కాబట్టి మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఎలాంటి కామెంట్లు రచయితలను ఉత్సాహపరుస్తాయి , నీరసం తెప్పించే కామెంట్లు ఏవో అని. (బాగుంది , నైస్ అప్డేట్ , సూపర్.... )
పాఠకులు ఏమి కోరుకుంటారో మనందరికీ తెలిసిందే , అప్డేట్లు త్వరగా ఇవ్వండి , పెద్ద అప్డేట్ ఇవ్వండి , కథ అప్పుడే అయిపోయిందా ..... ఇత్యాదులు ఉంటాయి
దీని గురించి మేధో మధనం చేద్దాము.
తగిన సూచనలు సలహాలు ఇవ్వగలరు.