26-12-2023, 09:44 AM
(17-12-2023, 09:59 PM)కుమార్ Wrote: నా ఆటోగ్రాఫ్
స్టోరీ ను
ప్రసాద్ రావు గారు
ఎన్ని సంవత్సారాలు కష్టపడి రాసారు..
జరీనా పేరు ను జలజ గా మార్పించారు..
మరి ఆయన ఫీల్ అవడా..
చదివే వారి కన్నా రాసే వారు తక్కువ..
రాసేవారి మీద పెత్తనాలు చేసే దరిద్రులు ఎక్కువ ఇక్కడ..
మిత్రమా కుమార్
మీకు బాగా కోపం వచ్చింది అని అర్ధం అయ్యింది.
సమాజం అన్నాక అన్ని రకాల వ్యక్తులు ఉంటారు
మనకు నచ్చేవాళ్ళు , మనం ప్రేమించేవాళ్లు , అభిమానించేవాళ్లు , ఇష్టపడే వాళ్ళు , ఆరాధించేవాళ్లు
అలాగే మనల్ని ప్రేమించేవాళ్లు , ఇష్టపడే వాళ్ళు , అభిమానించేవాళ్లు , ఆరాధించేవాళ్లు కూడా ఉంటారు.
పరిస్థితుల ప్రభావం వల్ల వీరే మనల్ని తిట్టవచ్చు , ద్వేషించవచ్చు , మనపై పగపెంచుకోవచ్చు కూడా
కుల, మత ప్రస్తావన మన కథల్లో వద్దు అని చెప్పాము , అయినా సరే కొన్ని పేర్లను బట్టి వారు ఎవరో తెలిసిపోతూనే ఉంటుంది.
అలా ఒక దానికి చెందిన వాడిని ఆ కథలో హీరోని చేసి గొప్పగా వ్రాస్తే దానికి సంబంధించిన వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ దానికి వ్యతిరేకంగా వాడిని చేతకానివాడిలా అతనికి చెందిన స్త్రీలని కథలోని ఇతర పాత్రల ద్వారా తక్కువ చేసేలా చూపిస్తే వారి మనోభావాలు దెబ్బతిని "Report" చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అప్పుడు కథ పేరునో , పాత్ర పేరునో మార్చల్సి వస్తుంది.
మొన్న నేను రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్నాను , పక్కనుండి కారు వేగంగా వెళ్తుంటే అక్కడ ఉన్న బురద నీళ్ళు నా పై చిల్లి పడ్డాయి.
ఇప్పుడు నేను కారును ద్వేషించాలా , రోడ్డుపై పగ పెంచుకోవాలా , నా మీద పడ్డ బురద నీటిని తిట్టుకోవాలా.
వీటన్నిటికి కారణం నేను బయటకు రావడం అని ఆలోచించి ఇంట్లోనే ఉండిపోవాలా.
మంత్రసాని (పూర్వకాలంలో పిల్లలను కాన్పుచేపించే స్త్రీ) పని ఒప్పుకున్నాక యోనినుండి శిశువు బయటకు రావడం కోసం , ఇంకొంచెం ముక్కు అని అంటే వెనక నుండి అశుద్దం కూడా రావచ్చు. అలాగని ఆ మంత్రసాని ఛీ ఛీ అశుద్దం అని అలిగి వెళ్లిపోతుందా.
ఇక్కడ కథ అంటే శిశువు అనుకోండి.