22-12-2023, 07:01 AM
(22-12-2023, 02:19 AM)Manjeera Wrote: పాఠక మిత్రులకు నమస్కారం. ఈ కథ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు మీ అందరినీ వేచి చూసేలా చేసినందుకు నన్ను క్షమించగలరు. ఇన్నాళ్లు బోల్డు పనులతో బిజీ అయ్యి నేను రాయలేకపోయాను అనంటే అది పాక్షిక నిజమే అవుతుంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు నేను ఇన్నాళ్లు రాయకపోవడానికి కారణాలు బోలెడు. రైటర్ బ్లాక్, ఉద్యోగంలో పెరిగిన హోదా, కుటుంబ బాధ్యతలు ఇంకా రాయడానికి బద్దకం. అసలు ఈ కథ ఇంత పెద్దది అవుతుందని నేను ఊహించలేదు. పోనీ త్వరత్వరగా ముగించేద్దామా అంటే పాత్రలు నన్ను బేలగా చూస్తున్నట్టు అనిపించడంతో కొన్ని నెలలు ఈ సైటుకి రావడం కూడా మానేశా. ఇంత సోది ఎందుకు చెప్తున్నానంటే నేను మరలా ఈ కథ రాయడం మొదలెట్టా. సగానికి పైగా పూర్తిచేశా కూడా. అయితే ఈసారి కథ పూర్తి చేశాకే పోస్టు చేద్దామని నిర్ణయించుకున్నా. దానికి దాదాపు నెలరోజులపైనే పట్టొచ్చు. అసలు చెప్పకుండా సడన్ గా సర్ప్రైజ్ చేద్దామనిపించింది. కానీ ఈ కథ కొనసాగుతుందో లేదో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నా ఈ మొదటి ప్రయత్నంలో చేసిన తప్పులను మన్నించి నన్ను ఆదరించిన మిత్రులకు ఇదే నా ఈ ఆంగ్ల నూతన సంవత్సర కానుక.
త్వరలోనే పూర్తి కథతో మీ ముందుకు
ఇట్లు
మంజీర