22-12-2023, 12:02 AM
ఇక చేతన్ లేచి, వెళ్తాను అన్నాడు, ఇక వాడు వస్తున్నాడు అని బయటకి వచ్చి ఇంటికి వెళ్ళాను, ప్లాన్ ఏమై ఉంటుంది అని ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు, ఎలా అని ఆలోచిస్తూ అలాగే పడుకున్నాను, ఉదయం లేచి, రాశి కి ఫోన్ చేసి, వర్క్స్ చూసుకో అన్నాను, తను చూసుకుంటాను కానీ మొబైల్ కంపెనీలో కొత్త యూనిట్ ఇన్స్టాల్ అవుతూ ఉంది ఆ వర్క్ కొంచెం చూసుకో అంది, సరే చూస్తాను అన్నాను, రెడీ అయ్యి నళిని ఆఫీస్ కి వెళ్ళాను, మేడం గుడ్ మార్నింగ్ అన్నాను, తను జస్ట్ విష్ చేసి వెళ్ళింది, మళ్ళీ వచ్చి నీకు ఏమైనా పనులు ఉంటే ఈ రోజే చేసుకో, రేపటి నుంచి చాలా పనులు ఉంటాయి అంది, సరే మేడం అన్నాను, తను ఫ్యాక్టరీ కి వెళ్ళింది, ఇక ఇదే ఛాన్స్ అని మొబైల్ కంపెనీ కి వెళ్ళాను, అక్కడ వర్క్స్ చూసుకుంటూ ఉన్నాను, రెండు రోజులలో స్టార్ట్ చేద్దాము అన్నాడు, స్టార్టింగ్ ఫంక్షన్ కి చైర్మన్ ని పిలవండి అన్నాను, సరే అన్నారు, నేను అంకుల్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను, మనీ ఎలా సెట్ చేసావు అన్నాడు, చెప్పాను, గుడ్ వస్తాను అన్నాడు, ఇక నేను ఫార్మా కంపెనీ కి వెళ్ళాను, రాశి మొత్తం సెట్ చేసింది, నేను కూడా విషయం చెప్పాను, మంచిది ఛైర్మెన్ వస్తే అంది, సరే అని ఇక తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, తను ఇంట్లోకి వెళ్తూ కార్తీక్ అసలు టైమ్ ఉండటం లేదు, ఫుల్ బిజీ చేసావు నన్ను, నువ్వు బిజీ అయ్యావు, కనీసం నీతో కూర్చుని కబుర్లు చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది, మొత్తం బిజినెస్ చేసావు, కొంచెం టైమ్ ఇవ్వు మనకి కూడా, కొత్త యూనిట్ అండ్ చేతన్ గాడి ప్రాబ్లెమ్ క్లియర్ అయ్యాక టైమ్ ఇవ్వకుంటే చంపుతా అని ఒక ముద్దు పెట్టుకుంది, సరే ఇస్తాను అన్నాను, అలిసిపోయాను బాగా ఇక బై అని చెప్పి వెళ్ళింది, నేను కూడా ఇంటికి వెళ్తుంటే నళినీ ఫోన్ చేసి ఉదయం సరిగ్గా 6 కి వాళ్ళ ఇంటికి రమ్మంది, సరే మేడం అన్నాను, ఇక ఇంటికి వెళ్ళి పడుకున్నాక లాస్య కూడా లవ్ చేసింది కానీ రాశి లాగా మిస్ అవుతున్న ఫీల్ లో ఎప్పుడూ మాట్లాడలేదు, రాశికి ఎంత వర్క్ ఇచ్చినా, ఆ వర్క్ తెలియకపోయినా తెలుసుకుని చేస్తుంది, అసలు లాస్య ఎక్కువ లవ్ చేస్తుందా, రాశి చేస్తుందా అనే డౌట్ వచ్చింది, రాశి ప్రతి పనిలో సపోర్ట్ చేస్తుంది, అడగకు అంటే అడగదు, ఎందుకు ఏమిటీ అని కూడా అని ఆలోచిస్తూ అలారమ్ పెట్టుకుని పడుకున్న, ఉదయం 5 కే లేచి రెడీ అయ్యి నళినీ ఇంటికి వెళ్ళాను, తను కూడా రెడీ అయ్యి వెళ్దామా అంది, సరే అని వెళ్ళాము, ఒక ప్లేస్ కి తీసుకెళ్ళింది, అక్కడ హవాలా లో మనీ తీసుకుని వెళ్దాం అంది, డైరెక్ట్ ఫ్యాక్టరీ కి తీసుకెళ్ళి, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి ఆఫ్రికా ఆర్డర్, జాగ్రత్త గా చూసుకో, నేను వేరే ఆర్డర్ ప్రొడక్షన్ చూసుకుంటాను, డైలీ అప్డేట్స్ ఇవ్వాలి రాత్రికి అని చెప్పింది, సరే మేడం అన్నాను, తను వెళ్లిపోయింది, ఇదేంటి ఇలా చెప్పేసి వెళ్ళింది అనుకుని వర్క్ స్టార్ట్ చేసాను, ఉదయం పది గంటలకు రాశి ఫోన్ చేసి, కార్తీక్ చేతన్ గాడు ఫోన్ చేసి ఆర్డర్ స్టార్ట్ చేశారా అని అడుగుతున్నాడు, టైమ్ లేదు, ఇప్పటికీ లేట్ అవుతుంది అంటున్నాడు, ఈ యూనియన్ లీడర్ ఏమో నీతో ఒక విషయం మాట్లాడాలి అంటున్నాడు అంది, ఏంటి అంట విషయం అన్నాను, ఏమో నీకే చెప్తాడు అంట అంది, ఫోన్ ఇవ్వు అన్నాను, ఫోన్ లో మాట్లాడేది కాదు అంట కలవాలి అంటున్నాడు అంది, ఇప్పుడు కుదరదు సాయంత్రం కలుస్తా అని చెప్పు అన్నాను, మరి చేతన్ కి ఏమి చెప్పాలి అంది, నేను బిజీగా ఉన్న, సాయంత్రం చూసి చెప్తా అని చెప్పు అన్నాను, సరే అంది, ఇక వర్క్ చూస్తూ ఉంటే ఒక అమ్మాయి వచ్చింది, డైరెక్ట్ నా దగ్గరకి వచ్చి హాయ్ ఆమ్ నవ్య, మీరు కిరణ్ కదా అంది, అవును మరి మీరు అన్నాను, నేను నళినీ సిస్టర్ ని, మీరు కొత్త అంట కదా అక్క మీకు హెల్ప్ గా ఉంటుంది అని పంపింది అంది, సరే అన్నాను, తను ఇక వర్క్ లో పడింది, నాకు అంతా ఆ యూనియన్ లీడర్ ఏమి చెప్తాడు అనే టెన్షన్ గానే ఉంది, కానీ వాడిని ఇక్కడకి రమ్మంటే ప్రాబ్లెమ్ అవుతుంది ఏమో అని అలానే ఆలోచిస్తూ ఉన్నాను, నవ్య వచ్చి టెన్షన్ పడకండి వర్క్ మీకు కొత్త ఏమో కానీ ఎంప్లాయీస్ కి కాదు అంది, అలా ఏమీ లేదు అండి అన్నాను, ఇక చేతన్ ఫోన్ చేసాడు, వాడు ఫోన్ లో ఆర్డర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసావా అని అడిగాడు, బిజీగా ఉన్న సాయంత్రం చెక్ చేసి చెప్తాను అన్నాను, ఫాస్ట్ అన్నాడు, సరే అని పెట్టేసాను, అసలే ఏ ప్లాన్ లో ఉన్నాడో అర్ధం కావటం లేదు, మైండ్ అంతా ఏదోలా ఉంది, ఫస్ట్ టైమ్ టెన్షన్ వచ్చేసింది, ఇక వర్క్ చూసుకుంటూ ఉండగా లంచ్ టైమ్ అయింది, నవ్య వచ్చి బాక్స్ తెచ్చుకోలేదా అంది, లేదు అన్నాను, మీరు మంచి హోమ్ ఫుడ్ తెచ్చి ఉంటారని అనుకున్నాను అంది, నేను సింగిల్ గా ఉంటాను అన్నాను, సరే అయితే ఆర్డర్ పెట్టుకుంటారా అంది, ఎందుకు క్యాంటీన్ ఉంది కదా అన్నాను, అది ఎంప్లాయీస్ కోసం, తక్కువ అమౌంట్ లో పెడతాము, మీరు కూడా అక్కడికేనా అండ్ క్వాలిటీ కూడా ఉండదు అంది, నేను కూడా ఎంప్లాయ్ కదా అన్నాను, తను నవ్వి వెళ్ళిపోయింది, నేను క్యాంటీన్ కి వెళ్ళి తినేసాను, ఇక సాయంత్రం అయ్యాక నళినీ దగ్గరకు వెళ్ళి అప్డేట్ ఇచ్చాను, తను నవ్య తో కలిసి వర్క్ స్పీడ్ పెంచండి అని చెప్పింది, సరే అన్నాను, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాశి కి ఫోన్ చేశాను, తను ఆఫీస్ కి కాదు బయట కలుస్తా అన్నాడు అంది, సరే ఎక్కడ అన్నాను, నీ ఇష్టం అంది, నాకు వాళ్ళకి దగ్గరగా ఉండే ప్లేస్ చెప్పి రమ్మన్నాను, వెళ్ళాక వాడు వచ్చి ఫోన్ ఓపెన్ చేసి, సార్ నాకు చేతన్ సార్ వ్యాక్సిన్ పాటర్న్ పంపాడు, మీరు ఇచ్చిన ప్యాటర్న్ కాకుండా ఈ ప్యాటర్న్ లో ప్రొడక్షన్ చేయమని చెప్పాడు అన్నాడు, ఎందుకు అన్నాను, ఏమో సార్ ప్యాటర్న్ పంపి 10 లక్షలు డబ్బులు పంపాడు అన్నాడు, నేను ఆ ప్యాటర్న్ నాకు పంపు అని చెప్పాను, వాడు సరే అని ఇప్పుడు ఏమి చేయమంటారు అన్నాడు, నేను ఒక నిమిషం ఉండు అని నవ్య కి ఫోన్ చేశాను, వ్యాక్సిన్ ప్యాటర్న్ పంపు అని అడిగాను, తను అలా పంపకూడదు అంది, ఏమీ కాదు అన్నాను, తను కావాలి అంటే అక్కని అడుగు అంది, సరే అని నలిని కి ఫోన్ చేసి అడిగాను, తను కిరణ్ పంపితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా మా ఇంట్లో చూసావు కదా అదే అంది, సరే మేడం అన్నాను, ఇక వాడికి చేతన్ చెప్పింది కాకుండా మేము ఇచ్చిన ప్యాటర్న్ లోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి రేపటి నుంచి, నేను 15 లక్షలు పంపిస్తా, చేతన్ కి మాత్రం వాడు చెప్పినట్టే చేస్తున్నాము అని చెప్పు అన్నాను, నాకు ఏదైనా ప్రాబ్లెమ్ రాదు కదా అన్నాడు, ఏమీ రాదు మేము చెప్పిందే చెయ్ అని చెప్పి, రాశిని పిలిచి 15 లక్షలు సెట్ చెయ్ ఉదయం అని చెప్పి పంపించాను, వాడు వెళ్ళాక వాడికి ఎందుకు మనీ అంది రాశి, ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి, వీడు మన సైడ్ ఉండాలి అంటే మనీ ఇస్తేనే హ్యాపీగా చేస్తాడు, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని చెప్పాను, తను సరే అంది, ఇక తనని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను, లాస్య ఫోన్ చేసి ఎల్లుండి కొత్త యూనిట్ స్టార్ట్ అంట కదా డాడీ ని పిలిచావు నన్ను పిలవవా అంది, నిన్ను స్పెషల్ గా పిలవాల అన్నాను, సరే వస్తాను అంది, ఇక కొంచెం సేపు మాట్లాడి, పడుకుని ఉదయం నళినీ ఫ్యాక్టరీ కి వెళ్ళాను, వర్క్ చూసుకుంటూ ఉన్నాను, రాశి ఫోన్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేసాము అంది, చూసుకో జాగ్రత్తగా అన్నాను, ఇక్కడే ఉన్నాను అంది, సరే అన్నాను, రేపు చైర్మన్ వస్తున్నాడు, అసలు నువ్వు వస్తున్నావా లేదా అంది, వస్తాను అన్నాను, రాకుండా ఉండకు, అసలు బాగుండదు అంది, వస్తా కచ్ఛితంగా అన్నాను, తను సరే అని ఫోన్ కట్ చేసింది, మధ్యాహ్నం నవ్య వచ్చి నేను తెచ్చాను బాక్స్ ఈ రోజు మీకు కూడా అంది, పర్లేదు వద్దు అన్నాను, అక్క చెప్పింది మీకు మొహమాటం ఎక్కువ అని పర్లేదు రండి అంది, ఇక తింటూ ఉంటే తను నా గురించి అడిగింది, ఏదో ఒకటి చెప్పాను, తన గురించి అడిగాను, తను ఉడుపి లో ఉంటాను, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది, అది నేను చూసుకుంటాను, ఇప్పుడు పెద్ద ఆర్డర్ అని వచ్చాను అంతే అంది, ఉడుపి అనగానే నాకు స్ట్రైక్ అయింది, కొచ్చిన్ నుంచి వచ్చిన కొన్ని ట్రక్స్ అక్కడికి వెళ్ళాయి అని, సరే అని తింటూ ఉన్నాము, అయ్యాక నేను తనని అడిగాను, రేపు కొంచెం లేట్ గా వస్తాను కొంచెం మేనేజ్ చేయండి అని, సరే అయితే నాకు కూడా కొంచెం హెల్ప్ కావాలి అంది, అడగండి అన్నాను, రేపు అడుగుతాను అంది, సరే కానీ మీ అక్కకి చెప్పకండి అన్నాను, సరే అంది, ఇక సాయంత్రం నళినీ కి అప్డేట్ ఇచ్చి మొబైల్ ఆఫీస్ కి వెళ్ళాను,రేపటి ప్రోగ్రామ్ కి అంతా సెట్ అయింది చూసుకుని ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాక రాశి ఫోన్ చేసింది, కార్తీక్ రేపు ఉదయం ఛైర్మెన్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెల్లు అంది, ఆయనే వస్తాడు కదా అన్నాను, అరే ఫంక్షన్ కి పిలిచింది నువ్వు, అది ఒక ఫార్మాలిటీ, నాకు డౌట్ వచ్చింది నువ్వు వెళ్లవు అని అందుకే ఫోన్ చేశాను, మరిచిపోకుండా వెల్లు అంది, సరే అన్నాను, ఉదయం లేచి అంకుల్నీ, లాస్య ని రిసీవ్ చేసుకున్నాను వెళ్లి, ఫ్యాక్టరీ కి వెళ్ళాము, నేను వాళ్ళని కూర్చో బెట్టి, రెస్ట్ తీసుకోమని చెప్పి, అరేంజ్మెంట్స్ చూద్దాం అని వెళ్ళాను, రాశి చీర కట్టుకుని వచ్చింది, ఒక్కసారిగా తనని అలా చూడగానే నా ఫ్యూజ్ ఎగిరిపోయింది, పింక్ కలర్ చీర లో , జుట్టు లూస్ గా వదిలేసి, సూపర్ గా అనిపించింది, తన దగ్గరకి వెళ్ళి బ్యూటిఫుల్ అన్నాను, ఫస్ట్ టైమ్ కాంప్లిమెంట్ ఇచ్చావు అంది, నిజంగా చాలా బాగున్నావు అన్నాను, అవునా సరే చైర్మన్ అండ్ నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా అంది, నువ్వు ఓవర్ చేయకు అన్నాను, మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా లాస్య వచ్చింది, కార్తీక్ తిను రాశి కదా అంది, అవును అన్నాను, రాశి లాస్య తో హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంది, హేయ్ స్టాప్ రాశి, కృష్ణ అంకుల్ కూతురు అని నాకు తెలుసు, మహిత చెప్పింది, సారీ ముంబై లో హర్ట్ చేసి ఉంటే అంది, పర్లేదు మేడం అంది రాశి, మేడం వద్దు లాస్య అని పిలువు అంది, సరే అంది రాశి, అప్పుడే చేతన్ లోపలకి వస్తూ హాయ్ లాస్య అన్నాడు, తను హాయ్ అంటూ ఉండగా చేతన్ వెనుకాల నళినీ వచ్చింది.