17-12-2023, 10:28 PM
మీరు అసలు మనుషులేనా??? ఇన్నాళ్లు మనిషిని ప్రేమతో, పగతో చంపొచ్చని తెలుసు.. ఇలా కథనాలతో కూడా చంపొచ్ఛని ఇపుడే తెలిసింది.. అరే మీ అప్డేట్ కోసం ఎంతలా ఎదురు చూసామో సాటి పాఠకుడిగా మాకే తెలుసు.. . మీ అప్డేట్ రాకుంటే ఒక బాధ.. వస్తే మళ్లీ ఎపుడు వస్తది అని ఒక బాధ... మీ రచయితలకు జోహార్లు తప్ప ఇంకేం చేసిన అది మీకు చిన్నతనమే.. ఎలాంటి లాభ పెక్ష లేకుండా మమ్మల్ని అలరిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా తెలియట్లేదు.. ఇది మాత్రమే కాదు మమ్మల్ని యాంత్రిక జీవనంలో నుండి బయటపడేలా చేస్తున్న ప్రతి ఒక్క రచయితకు పేరు పేరునా పాదాభివందనం.. ఇంతకు మించి నేను ఏమి చెప్పలేను.. ప్రతిసారి కామెంట్ కూడా ఇవ్వలేను.. కానీ నాలా మీ అప్డేట్స్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు..అది మాత్రం మరిచిపోకండి.. వందలో ఒక కుక్క తప్పుగా కూసిందని పట్టించుకోకుండా మిగతా 99 మంది మీ రచనల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుంచుకోండి.. ఏమైనా తప్పుగా అంటే క్షమించండి..