15-12-2023, 05:47 PM
ఇక ఇంటికి వెళ్ళాక నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఫుడ్ చెయ్ అన్నాను, సరే అని కిచెన్ చూపించి నేను లోపలకి వెళ్ళాను, నేను బయటకు వచ్చాక చూస్తే తను వెతుకుతూ ఉంది ఏదో, ఏమి వెతుకుతున్నావు అని అడిగాను, మ్యాగీ లేదా అంది, అదేనా నేర్చుకున్నావు అన్నాను, అవును అంది, ఈ టైమ్ లో మ్యాగీ నా వద్దు అన్నాను, మ్యాగీ లో డిఫరెంట్ ఐటమ్ నువ్వు హ్యాపీగా తింటావు కదా వెయిట్ అంది, సరే అని తను అడిగిన అన్నీ చూపించాను, తను వైన్ ఉందా ఇంట్లో అంది, నువ్వు తాగుతావా అన్నాను, కాదు ఉంటే చెప్పు అంది, విస్కీ బ్రాందీ అయితే ఉంటాయి అన్నాను, వద్దులే అంది, నేను తన పక్కనే కూర్చుని ఉన్నాను, తను వెజిటేబుల్స్ కట్ చేస్తూ కార్తీక్ నువ్వు అడిగావు కదా నీ దగ్గర మనీ బిజినెస్ లేకుండా ఉన్నా కూడా నీతో వస్తావా అని అంది, అవును చెప్పు అన్నాను, తను నిజం చెప్పనా అసలు నీ దగ్గర జాయిన్ అయిందే నీ టాలెంట్ నచ్చి, అసలు అంత టాలెంట్ పెట్టుకుని నువ్వు ఓన్లీ జాబ్ చేస్తా అని నేను అనుకోను, కచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్న కదా చాలా రోజుల నుంచి ఏది చేయాలి అన్నా కూడా ఫస్ట్ దాని వల్ల వచ్చే నష్టం అలోచిస్తావు తరువాతే లాభం థింక్ చేస్తావు, ఒక డెసిషన్ కే అసలు నీకు సంబంధం లేని కంపెనీ గురించే ఇంత ఆలోచించే వాడివి, నీ లైఫ్ కి సంబంధించిన డెసిషన్ కి ఎంత అలోచిస్తావో నేను థింక్ చేయగలను, నిన్ను ఎందుకు లవ్ చేశాను అంటావా, డబ్బు గురించి కాదు, నా దగ్గర ఉన్నది ఎంతో నీకు తెలుసు, హోదా అంటావా అది అసలు కాదు అని నీకు తెలుసు, నువ్వు ప్రతి ఒక్కరి గురించి చేసే కేరింగ్, భావన మహిత దగ్గరకి వెళ్ళాక కూడా తన గురించి తెలుసుకుంటూనే ఉన్నావు, తనకి ఇబ్బంది అయితే వచ్చేయ్ అన్నావు, నా చిన్న విషయాలు కూడా నీకు గుర్తు ఉంటాయి, నాకు ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలని అనుకుంటానో అప్పుడు నేను అడగకుండా కొనిస్తావు, నాకు ఎప్పుడు ఆన్ ఈజీగా అనిపిస్తుంది కూడా నీకు తెలుసు, ప్యాంపెర్ చేస్తావు, నాకు ఎంత మనీ ఉన్నా కూడా నువ్వు నన్ను అందరి ఎంప్లాయీస్ లాగే ట్రీట్ చేస్తావు, నీకు అసలు హెడ్ వెయిట్ లేదు, ఇలా చాలా ఉన్నాయి, నువ్వు అనుకోవచ్చు నేను అందరితో అలానే ఉంటాను రాశి ఎందుకు స్పెషల్ అని, కానీ నేను నీకు స్పెషల్, నీ గురించి నాకే తెలుసు, ఎప్పుడు తాగుతావు, తింటావు, ఎప్పుడు కోపం లో ఉంటావు, కోపం లో ఉంటే ఏమి చేయాలి నాకు మాత్రమే తెలుసు, అయినా ఇవి అన్నీ చెప్పి నన్ను లవ్ చెయ్ అని చెప్పను, నువ్వు లవ్ చేయనంత మాత్రాన నేను నిన్ను బ్యాడ్ గా అనుకోను, అది నీ ఇష్టం, నీ ఇష్టాన్ని ఎప్పుడూ రెస్పెక్ట్ చేస్తాను అంది, నేను తన దగ్గరకి వెళ్లి, తన మొహాన్ని దగ్గరకి తీసుకుని నిజంగా అంత ఇష్టమా అన్నాను, తను వెంటనే తన పెదవులతో నా పెదాలని అందుకుని ఒక ముద్దు పెట్టింది, నేను కూడా ముద్దు పెట్టాక లవ్ యూ రాశి అన్నాను, తను లవ్ యూ టూ అంది, తను నన్ను జరిపి వంట స్టార్ట్ చేసింది, చూడు కార్తీక్ రెండు రోజుల క్రితం కూడా లవ్ యూ అన్నావు, ఇప్పుడు అంటున్నావు, కానీ అందులో నాకు స్పెషల్ అనిపించలేదు, అలా అనిపించేవరకు నన్ను ముద్దు పెట్టుకోకు అంది, అవునా అని నేను కిందకి దిగి తనని ఎత్తుకుని పైన కూర్చో బెట్టి, తన నడుము చుట్టూ చేతులు వేసి, హగ్ చేసుకుని, మెడ చుట్టూ ముద్దులు పెట్టాను, తను వదులు కార్తీక్ అంటూ గరిట తో మెల్లగా కొట్టింది, తను అలానే కూర్చుని వంట పని చేస్తూ, గరిట తో తిప్పుతూ ఉంది, నేను రాశి నీకు ఒక విషయం చెప్పాలి కానీ అది ఇప్పుడు కాదు రేపు మధ్యాహ్నం మనం లంచ్ కి వెళ్దాము అక్కడ చెప్తాను అన్నాను, ఏంటో అంది, అది చాలా కాన్ఫిడెన్షియల్ అది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో చెప్తాను అన్నాను, ఇప్పుడే చెప్పు అంది, ఇప్పుడు కాదు నాకు కొన్ని కన్ఫర్మేషన్ కావాలి అయ్యాక చెప్తాను అన్నాను, సరే నువ్వు పక్కకి వెళ్తే వంట చేయాలి అంది, సరే అని తనని కిందకి దింపి తన వెనకాల నిలబడి తన వెంట్రుకల్ని జరిపి మెడ మీద ముద్దు పెట్టాను, తను అసలు ఊరికే ఉండలేవా అంది, ఉండలేకే కదా అన్నాను, నీకు ముద్దు పెట్టి తప్పు చేశాను, లేకుంటే ఇంత అడ్వాంటేజ్ తీసుకునేవాడివి కాదు అంది, అది వదిలేయ్ అని తన నడుము చుట్టూ చేతులు వేసి, తనని లాగి, తన చెవిని కొరికాను, తను అబ్బా అని వెనక్కి తిరిగింది, నా కాళ్ళ మీద తన కాళ్ళు వేసి నిలబడింది, నేను తన నడుము పట్టుకుని ఉంటే తను నా మెడ చుట్టూ చేతులు వేసింది, నేను వెనక్కి అలా నడుచుకుంటూ వెళ్ళి గోడ దగ్గర ఆగి, పెదాలకి ముద్దు పెట్టాను, తను కూడా ముద్దు పెడుతూ, ఇంత రొమాంటిక్ ఏంటి నువ్వు అంది, రాశి అంటే ఆ మాత్రం ఉండాలి కదా అన్నాను, ఉంటావు లే అంది, నేను మళ్ళీ అలానే ముద్దు పెడుతూ స్టవ్ దగ్గరకి తీసుకు వెళ్ళాను, తను స్టవ్ ఆఫ్ చేసి, నా కాళ్ళ మీద నుంచి దిగింది, ఇంకో ఐదు నిమిషాలు తినచ్చు అంది, నేను వెళ్లి డ్రింక్ తాగనా అన్నాను, ఓన్లీ రెండు పెగ్స్, తాగాక తినేసి వెళ్ళాలి గుర్తు ఉందా అంది, హా ఉంది అన్నాను, నేను వెళ్లి మందు తెచ్చుకుని, సోఫా లో కూర్చుని తాగుతూ ఉన్నాను, తను ఫుడ్ తెచ్చి నోట్లో పెట్టింది, హేయ్ సూపర్ గా ఉంది అన్నాను, రాశి అంటే ఏమనుకున్నావు అంది, నిజంగా బాగుంది అన్నాను, సరే అని నువ్వు కూడా తిను అన్నాను, తను తింటూ ఉంటే నూడిల్స్ ఒకటి నోటి నుంచి బయటకి వచ్చింది, నేను దానిని నా పంటి తో పట్టుకొని నోట్లోకి తీసుకుంటూ తింటూ తన పెదాల దగ్గరకి వచ్చాను, తన పెదాలని అందుకుని చప్పరించటం మొదలు పెట్టాను, తను అసలు నువ్వు ఉన్నావే అని అంటూ ఉండగా వాళ్ళ నాన్న ఫోన్ చేసాడు, తను ప్లేట్ నాకు ఇచ్చి పక్కకి వెళ్ళింది, నేను తింటూ ఉండగా తను ఫోన్ మాట్లాడి వచ్చింది, ఏమంట మీ నాన్న అని తనకి తినిపించాను, ఏముంది టైమ్ 10 అయింది కదా ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేసాడు అంది, ఏమి చెప్పావు అన్నాను, వస్తున్న దారిలో అన్నాను అంది, నాతో ఉన్నా అని చెప్పచ్చు కదా అన్నాను, నిన్న నన్ను అడిగాడు ఎందుకు ఉన్నాడు ఇక్కడ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా అని, నేనే మేనేజ్ చేశాను అంది, ఎందుకు వర్క్ అయిపోయాక అలానే వచ్చాడు అని చెప్పచ్చు కదా అన్నాను, అయినా నువ్వు నేను ఒకే ఏజ్ అలా ఉండకూడదు కదా అంది, ఉంటే ఏమవుతుంది అన్నాను, నువ్వు కామ్ గా ఉంటావా ఏదో ఒకటి నన్ను చేస్తూనే ఉంటావు అంది, సరే ఏమి చెప్పావు మీ నాన్నకి మరి అన్నాను, వస్తున్న అని చెప్పాను అందుకే తొందరగా తిను నన్ను మా ఇంట్లో డ్రాప్ చేసి, వెయిట్ చేస్తూ ఉండు మా ఇంటి దగ్గరలో, టైమ్ 12 అవ్వగానే ఫోన్ చెయ్ మా నాన్న దగ్గరకి వెళ్దాం అంది, నువ్వు ఎందుకు మధ్యలో నేను వెళ్లి మాట్లాడేసి వస్తాను కదా అన్నాను, అబ్బా నాకు తెలియాలి మీ ఇద్దరి మధ్య ఏమి మాట్లాడుకుంటారు అని అంది, అయితే నన్ను బయట వెయిట్ చేయిస్తావు అన్నాను, నీకు అలవాటే కదా ఏదో ఒక బార్ లో కూర్చొని ఉండు అంది, మరీ నన్ను చీప్ గా చూస్తున్నావు అన్నాను, నా బుజ్జి కదా అంది, తప్పదు కదా అని తినేసి తనని ఇంట్లో డ్రాప్ చేసి నేను దగ్గరలో ఉన్న బార్ కి వెళ్ళాను, అక్కడ తాగుతూ ఉన్నాను, అప్పుడే విశాల్ వచ్చాడు, నన్ను చూడలేదు బిజీగా ఉన్నాడు, నాకు కూడా ఎందుకు అని సైలెంట్ గా ఉన్నాను, మహిత కి ఫోన్ చేశాను, ఏమి చేస్తున్నావు అని అడిగాను, పడుకోవాలి అంది, విశాల్ రాలేదా నీతో అన్నాను, లేదు పని ఉందని చెప్పాడు, రేపు వస్తాడు అంది, అవునా నాకు ఇక్కడ బార్ లో కనిపించాడు అన్నాను, ఫ్రెండ్స్ తో వచ్చి ఉంటాడు అంది, సరే పడుకో అని నేను మెల్లగా తాగుతూ ఉన్నాను, నేను ఫోన్ లో మీమ్స్ చూసుకుంటూ ఉండగా విశాల్ నా దగ్గరకి వచ్చి హాయ్ బ్రో అన్నాడు, హాయ్ అన్నాను, పదా మా టేబుల్ దగ్గరకి అన్నాడు, ఫ్రెండ్స్ తో ఉన్నావేమో కదా పర్లేదు నేను ఇంటికి వెళ్ళే టైమ్ కూడా అయింది అన్నాను, అవునా అండ్ థాంక్స్ బ్రో, ఢిల్లీ లోనే కలవాల్సింది నిన్ను, బిజీగా ఉండి మీట్ కాలేదు, నువ్వు చేసిన హెల్ప్ చాలా అవసరం మాకు అన్నాడు, ఇట్స్ ఓకే అన్నాను, థాంక్స్ బ్రో అని వెళ్ళాడు, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, 12 అయ్యాక రాశి ఫోన్ చేసి ఒక లొకేషన్ పంపింది, అక్కడకి వెళ్ళాలా అన్నాను, అవును అంది, నువ్వు రావా అన్నాను, లేదు డాడీ వద్దు అన్నాడు అంది, సరే వచ్చాక చెప్తాను ఫీల్ కాకు అన్నాను, సరే మరిచిపోకూడదు, ఇప్పటికే తాగేసి ఉంటావు, డాడీ ఆఫర్ చేసినా తాగకు అని అంది, సరే తల్లీ అని బై చెప్పి ఫోన్ పెట్టేసి ఆ లొకేషన్ కి వెళ్ళాను, గంటకి పైగా పట్టింది, అక్కడకి వెళ్లి చూస్తే అది ఒక చిన్న లాడ్జ్, అంకుల్ ఏంటి ఇంత చిన్న లాడ్జ్ కి రమ్మన్నాడు అని ఫోన్ చేశాను, ఆయన రూమ్ నంబర్ చెప్పి లోపలకి రమ్మన్నాడు, అక్కడ ఒక బెడ్ రెండు కుర్చీలు ఒక టేబుల్ ఉన్నాయి అంతే, ఏంటి అంకుల్ ఇక్కడకి రమ్మన్నారు అన్నాను, నా లైఫ్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది, ఈ రూమ్ నుంచే, బెంగళూర్ కి వచ్చిన కొత్తలో ఇక్కడే ఉండేవాడిని, సెంటిమెంట్ అందుకే అమ్ముతుంటే నేనే కొనేసాను, నాదే ఇది కూర్చో అన్నాడు, చెప్పండి అంకుల్ అన్నాను, కార్తీక్ నిన్న రాత్రి మీ ఛైర్మెన్ అదే సూర్యనారాయణ ఫోన్ చేసాడు, ఆయన నేను చాలా క్లోజ్, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాము ఎప్పుడైనా గుర్తు వస్తే, అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు షురిటి ఇచ్చింది చెప్పాను, ఆయన కార్తీక్ సైన్ చేస్తే నేను క్వశ్చన్ చేయను అన్నాడు అండ్ ఇంకా ఏదైనా బిజినెస్ విషయాలు కార్తీక్ తోనే డీల్ చేయమని చెప్పాడు, అందుకే ఒక డీల్ గురించి నీతో మాట్లాడాలి అన్నాడు, చెప్పండి అంకుల్ అన్నాను, ఫస్ట్ నీకు ఒక పాత విషయం చెప్పాలి అన్నాడు, చెప్పండి అంకుల్ అన్నాను, మేము బిజినెస్ చేయాలి అని బెంగళూర్ కి వచ్చాము, అప్పుడు సబ్బరావు గారు అనే వ్యక్తి కూడా బిజినెస్ చేయాలి అని అనుకునేవాడు, నేను(కృష్ణ), సూర్యనారాయణ(లాస్య ఫాదర్), మురళి(మహిత ఫాదర్), వెంకట రమణ (విశాల్ ఫాదర్), సతీష్(చేతన్ ఫాదర్) అమరేంద్ర(జననీ ఫాదర్), రామ కృష్ణ, సత్య మూర్తి, ఎనిమిది మంది సుబ్బారావు గారితో కలిసాము, అప్పుడు మాకు డబ్బులు కూడా లేవు, కానీ సుబ్బారావు గారు చాలా కష్టపడి ఒక ఫార్మా కంపెనీ స్టార్ట్ చేసాడు, ఆయన ఏమనుకున్నాడో ఏమో వచ్చే లాభాల నుంచి 70% ఎంప్లాయీస్ కి అందరికీ ఇవ్వాలి అని ఫిక్స్ చేశాడు, బిజినెస్ స్టార్ట్ అయ్యింది, బాగానే జరుగుతుంది, మేము ఎనిమిది మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉండేవాళ్ళం, నేను, సూర్యనారాయణ సుబ్బారావు గారి తరువాత చూసుకునే వాళ్ళం, ఒక రోజు రాత్రి మమ్మల్ని పిలిచి నేను కంపెనీ క్లోజ్ చేస్తున్న మీరు ఇన్ని రోజులు నాతో ఉన్నారు కాబట్టి మీకే కంపెనీ అని చెప్పి సంతకాలు చేసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు, అప్పుడు ఎనిమిది భాగాలు చేసాము షేర్స్ ని, నేను ఇలాగే చేద్దాం అంటే సతీష్ అవసరం లేదు, ఎవరి షేర్స్ వాళ్ళు అమ్మేసి కొత్త బిజినెస్ పెట్టాలి అన్నాడు, అప్పుడు అందరూ సరే అన్నారు నేను సూర్యనారాయణ తప్ప, కానీ వాళ్ళు షేర్స్ అమ్మేస్తము మీరే కొనుక్కోండి అన్నారు, అప్పుడు సూర్యనారాయణ అందరి షేర్స్ కొన్నాడు, నేను ఇవ్వను అన్నాను, దానితో వాడు నేనే బిజినెస్ చూసుకుంటాను నువ్వు షేర్ హోల్డర్ గా ఉండు, నేను కొన్నది వేరే వాళ్ల చేతుల్లోకి పోకుండా ఉండటానికి అని చెప్పాడు, నేను సరే అన్నాను, తరువాత నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాను, సూర్యనారాయణ అండ్ మిగతా వాళ్ళు కూడా కొత్తగా మొదలు పెట్టారు, కానీ అందరూ లాస్ లోకి వెళ్ళిపోయారు, నేను సూర్యనారాయణ తప్ప, సూర్య నారాయణ చాలా బిజినెస్ స్టార్ట్ చేసాడు, నమ్మకమైన వాళ్ళు ఉండాలి అని ఆ ఆరుగురిని అలానే తన కంపెనీ లోకి తీసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా పెట్టుకుని బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశాడు, నేను కూడా సొంతంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశాను, నేను సూర్య నారాయణ పోటీ పడేలా డెవలప్ అయ్యాము, కానీ ఇద్దరికీ ఎప్పుడూ బిజినెస్ లో పోటీ తప్ప పర్సనల్ గా మంచి ఫ్రెండ్ షిప్ అలానే ఉంచాము, కానీ ఇన్ని రోజుల తరువాత సతీష్ కొడుకు చేతన్ కి ఫార్మా కంపెనీ మీద కన్ను పడింది, వాడు ఆఫ్రికా లో ఉంటాడు, సూర్య నారాయణ ఫారిన్ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు, అక్కడ వర్క్ కోసం ఫార్మా కంపెనీ సపోర్ట్ కావాలి వాడికి, సూర్య నారాయణ ని అడిగితే తను ఒక్కడు డెసిషన్ తీసుకోడు నాకు షేర్ ఉంది అందులో అండ్ అది మా గురువు గారి కంపెనీ, అందుకే వేరే కంపెనీ పేరు మీద ఆర్డర్ చేశాడు కొన్ని మెడిసిన్స్, కంపెనీ ఎంప్లాయీస్ ని తన కంట్రోల్ లో పెట్టుకుని నకిలీ మెడిసిన్స్ చేపించి కంపెనీ ని క్లోజ్ చేయించి తను సొంతం గా ఓపెన్ చేయాలి అని ప్లాన్ చేశాడు, ఇప్పుడు సూర్య నారాయణ కి హెల్త్ కూడా బాగాలేదు, తను నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారు అని తెలిస్తే తట్టుకోలేడు, అది మా గౌరవం, సుబ్బారావు గారు మాకు బిజినెస్ నేర్పిన కాలేజ్ అది, నేను ఒక్కడిని డెసిషన్ తీసుకోలేను, సూర్య నారాయణ కి ఏదో ఒకటి చెప్పి మెడిసిన్స్ ఆర్డర్ కి సైన్ చేయిస్తే ఇక క్లోజ్ అవుతుంది, ఇప్పుడు లాస్య గ్రూప్ కి నువ్వు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకడివి, ప్రెసెంట్ సూర్య నారాయణ కి విషయం చెప్పకుండా ఆ డీల్ ని ఆపాలి అన్నాడు, అది చిన్న విషయం అంకుల్, నేను అంకుల్ తో మాట్లాడుతాను అన్నాను, ఎలాంటి పరిస్థతుల్లోనైనా డీల్ ఆపాలి అన్నాడు, డెఫినెట్ గా స్టాప్ చేస్తాను అన్నాను, నేను వాడికే చెప్పచ్చు ఎందుకు ఏమిటీ అని అడుగుతాడు, నేను విషయం చెప్తే లైట్ గా తీసుకుంటాడు, వాడికి చేతన్ అంటే చాలా ఇష్టం, లాస్య ని కూడా వాడికే ఇచ్చి చేయాలి అనుకుంటున్నాడు, కానీ నీ మీద కూడా నమ్మకం ఉంది అందుకే చెప్తున్న, నాకు డబ్బులు అనేవి పెద్ద విషయం కాదు బాబు, ఏమీ లేకుండా వచ్చాము, మా గురువు గారి దయ వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాము, ఆయన స్టార్ట్ చేసిన కంపెనీ కి నష్టం వస్తుంటే చూస్తూ ఉండలేను కదా అన్నాడు, అవును అంకుల్, ఇప్పుడు నా వల్ల కూడా అవకపోతే ఏమి చేస్తారు అన్నాను, సూర్య నారాయణ కి విషయం చెప్తాను, అంతగా అవసరం అయితే ఆ కంపెనీ ని నేనే కొనేస్తాను కానీ కంపెనీ కి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను అన్నాడు, సరే అంకుల్ ఇదేనా మీరు చెప్పాలి అనుకుంది అన్నాను, అవును బాబు అన్నాడు, అంకుల్ ఒకటి అడగనా అన్నాను, అడుగు బాబు అన్నాడు, సుబ్బారావు గారు ఎక్కడకి వెళ్ళారు అన్నాను, అది ఎవరికీ తెలియని మిస్టరీ, మేము చాలా ట్రై చేసాము, అసలు ఎక్కడకి వెళ్ళాడో, ఎందుకు కంపెనీ మాకు ఇచ్చాడో తెలియదు అన్నాడు, సరే అంకుల్ నేను రేపు అంకుల్ తో మాట్లాడి విషయం మీకు అప్డేట్ చేస్తాను అన్నాను, సరే ఒక పెగ్ తాగు అన్నాడు, వద్దు అంకుల్ అన్నాను, పర్లేదు ఒకటే కదా అని నాకు గ్లాస్ లో పోశాడు, నేను తాగుతూ ఉంటే నిన్ను ఒకటి అడగవచ్చా అన్నాడు, అడగండి అన్నాను, నీకు సూర్య నారాయణ ఎలా తెలుసు, వాడి ఫ్రెండ్స్, బంధువులు అందరూ నాకు తెలుసు, కానీ నిన్ను ఎప్పుడూ చూడలేదు, డైరెక్ట్ గా ఒక కంపెనీ కి హెడ్ చేశాడు, ఇప్పుడు కాబోయే ఛైర్మెన్ అంటున్నారు, మళ్ళీ బోర్డ్ మెంబర్ కూడా చేశాడు అన్నాడు, టైమ్ వచ్చినపుడు చెప్తాను అన్నాను, అంత సీక్రెట్ ఆ అది, వాడు కూడా ఇలానే అన్నాడు అడిగితే అన్నాడు, అలాంటిది ఏమీ లేదు అని చెప్పి వస్తా అంకుల్ అని ఇంటికి వెళ్ళాను, రాత్రి 4 అయింది ఇంటికి వచ్చేసరికి, ఇక పడుకున్న, ఉదయం 11 గంటలకు అలా నన్ను ఎవరో లేపుతూ ఉన్నట్టు ఉంటే లేచాను, చూస్తే రాశి, పందిలా రాత్రి తాగి ఇంకా లేవలేదు అని లేపుతుంది, నువ్వేంటి ఇక్కడ అన్నాను, ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుంటే వచ్చాను అంది, రాత్రి బాగా లేట్ అయ్యింది అందుకే అన్నాను, తను బెడ్ షీట్ లాగుతూ ఉంటే తనని లాగాను, తను వచ్చి నా మీద పడింది, అబ్బా ఈ చుడీదార్ లో ఏమున్నావు అని ముద్దు పెట్టాను, తనని బెడ్ షీట్ లోకి లాగి, తన పక్కన పడుకుని మెడ కింద ముద్దు పెట్టాను, రేయ్ వద్దు అంటుంది, అయినా వినకుండా ముద్దు పెడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంది, తను లేచి లాస్య ఫోన్ చూడు అంది. అబ్బా మరిచిపోయాను కదా అని తన ఫోన్ లిఫ్ట్ చేసి బయటకి వచ్చాను