08-12-2023, 01:36 AM
చాలామంది పాఠకులకి నేను సరిగ్గా అనువాదించట్లేదు అన్న అనుమానం కలుగుతుంది. అక్కడ ఉన్నది ప్రతీది ట్రాన్స్లేట్ చేయాలి అంటే నేను కూడా గూగుల్ ట్రాన్సలేట్ వాడి రాస్తాను. ఇంత కస్టపడి అనువాదం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటి వరకు చాలా కథలనే అనువాదం చేసాను. అందుకని పెద్ద రైటర్ ని అనుకోను కానీ ఒక మోస్తారు గా రాస్తాను అని ఒక క్లారిటీ అయితే నాకు ఉంది. కొన్ని సార్లు ఒక కథని అనువాదం చేసేటప్పుడు కొన్ని లైబర్టీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అంటే ఆ రైటర్ కి రైట్ అనిపించింది నాకు రాంగ్ అనిపించి ఉండొచ్చు సో రెండు ఒకేలా ఉండాలి అంటే ఉండవు. నా వే ఆఫ్ రైటింగ్ వేరేలా ఉంటుంది. ఫైనల్ గా కథలో ఫ్లో మిస్ అవ్వకుండా అందించానా లేదా అనేది చూస్తాను. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడితోనే దీనిని చదవటం ఆపి మిగతా కథలని చదువుకోండి. ఇది ఎవరినీ నొప్పించటానికి పెట్టట్లేదు. పాఠకులు అర్ధం చేసుకోగలరు అని భావిస్తున్నాను.
ఇట్లు మీ
కార్తీక్.
Ping me on Telegram: @Aaryan116