05-12-2023, 11:52 PM
తను సాయంత్రం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాను అని చెప్పింది, సరే అని చెప్పాను, నేను రెడీ అయ్యి అమృత కి ఫోన్ చేశాను, ఎపుడు వస్తున్నావు అని అడిగాను, రేపు ఉదయం కి ఉంటాను అంది, అలానే మాట్లాడుతూ ఆఫీస్ కి వెళ్ళాను, పనిలో బిజీగా ఉన్నాను, మధ్యాహ్నం లంచ్ టైమ్ లో ఫోన్ చూస్తే అమృత మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమైంది అని కాల్ చేశాను, వాళ్ళ ఆయన ముంబై ప్రోగ్రాం కాన్సిల్ అయింది అంట, రాత్రికి వాళ్ళ ఆయనే స్వయంగా వచ్చి బెంగళూర్ తీసుకువస్తాడు అని చెప్పింది, అవునా అన్నాను, హా నీతో టైమ్ పాస్ చేద్దాం అనుకున్న రెండు రోజులు అంది, మిత్ర కూడా సాయంత్రం ఊరికి వెళ్తుంది, నేను కూడా నీతో ఉండచ్చు అనుకున్న అన్నాను, సరే వదిలేయ్ మళ్ళీ టైం వస్తుంది అని చెప్పాను, తను ఇక నువ్వు కాల్ చేయకు ఆయన ఉంటాడు కదా అంది, సరే అన్నాను, ఇక తినేసి పనిలో పడ్డాను, సాయంత్రం అయ్యాక, లాస్య వచ్చి వీకెండ్ కదా ఏంటి ప్లాన్స్ అంది, ఏముంది రెస్ట్ అంతే అన్నాను, నీ ఫ్లాట్ లో ఎవరెవరు ఉంటారు అంది, ఎవరూ ఉండరు నేను ఒక్కడినే అన్నాను, అయితే రాత్రి కి పార్టీ మీ ఇంట్లో ప్లాన్ చేద్దాం అంది, మా ఫ్లాట్స్ లో అంతా ఫ్యామిలీస్, నేను ఒక్కడినే బ్యాచిలర్, పార్టీ అంతా సెట్ కాదు అన్నాను, అవునా అయితే నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడకి రా అంది, ఎక్కడకి అన్నాను, చెప్తా కదా ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి రా అంది. సరే అని ఫ్లాట్ కి వెళ్ళాను, రెడీ అయ్యి ఫోన్ చేశాను, తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాను, అక్కడ తను కార్ లో ఉంది, ఎక్కు అంది, ఎక్కడకి అన్నాను, లాంగ్ డ్రైవ్ అంది, ఎక్కడివరకు అన్నాను, అలా వెళ్తూ ఉందాము, ఇక చాలు అనిపించినపుడు వెనక్కి వద్దాము అంది, సరే అన్నాను, నేను కూర్చున్నాక ఎక్కువ దూరం పోలేము అంది, ఎందుకు అన్నాను, నీకు డ్రైవింగ్ రాదు కదా అంది, నాకు రాదా, ఎవరు చెప్పారు అన్నాను, అనుకున్న అంది, సరే ఏ రూట్ లో వెళ్దాం అన్నాను, తను కళ్ళు మూసుకో అంది, ఎందుకు అన్నాను, చెప్తాను కదా మూసుకో అంది, సరే అని మూసుకున్న, తను ఫోన్ మీద టచ్ చెయ్ అంది, ఎందుకు అంటే టచ్ చెయ్ అంది, సరే అని టచ్ చేశాను, కళ్ళు తెరవమని చెప్పింది, ఫోన్ లో మాప్స్ మీద టచ్ చేశాను నేను, అది మండ్య రూట్, సరే పదా అన్నాను, ఇద్దరం మాట్లాడుతూ స్టార్ట్ అయ్యాము, తను మాట్లాడడం మొదలు పెడితే ఆపదు, మధ్యలో నేను బీర్ కొన్నాను, తను అలవాటు లేదు అంది, ఇక తాగుతూ వెళ్తున్నము, మధ్యలో తినేసి మండ్య కూడా దాటేశాము, తను ఇక నన్ను డ్రైవ్ చేయమంది, నేను సరే అన్నాను, నాకు డ్రైవింగ్ ఇచ్చిన పది నిమిషాల తరువాత పడుకుంది, నేను మైసూర్ లో ఒక బీర్ బ్లాక్ లో కొని అలానే డ్రైవ్ చేస్తూ ఉన్నాను, అలా నాకు నిద్ర వచ్చేదాకా డ్రైవ్ చేసి ఒక ప్లేస్ లో స్టాప్ చేసి, పడుకున్న. ఉదయం అయింది ఏమో లాస్య నన్ను లేపింది, కార్తీక్ ఎక్కడ ఉన్నాము అంది, ఏమో నాకు నిద్ర వచ్చేదాకా డ్రైవ్ చేశాను అన్నాను, గూగుల్ మ్యాప్స్ లో చూడు అన్నాను, తను చూసి ఇంకో 20 kms లో ఊటీ అంది, ఏంటి ఇంత దూరం వచ్చేశాము అంది, పద ఇక వెనక్కి వెళ్దాం అన్నాను, ఇంత దూరం వచ్చి ఊటీ చూడకుంటే బాగోదు అంది, మనకి బట్టలు కూడా లేవు అన్నాను, కొనుక్కుందాం అంది, మా నాన్న అంత రిచ్ కాదు అమ్మ, ఏదో కార్ పెట్రోల్ కి అయితే మేనేజ్ చేస్తాను అన్నాను, నేను ఉన్నా కదా అంది, అయితే మీ నాన్న అంత రిచ్ అహ్ అన్నాను, అంత కాకున్న కొంచెం అంది, కార్ మీదేనా అన్నాను, అవును అంది, మరి ఆఫీస్ కి ఎందుకు తీసుకురావడం లేదు అన్నాను, కార్ లో వస్తే ఓవర్ గా ఉంటుంది కదా కొత్త లోనే అంది, సరే అని ఊటీ కి వెళ్లి అక్కడ ఒక హోటల్ లో రూమ్ తీసుకున్న, కొంచెం ఫ్రెష్ అయ్యి, బయటకి వెళ్లి బట్టలు కొన్నాము, మళ్ళీ రూమ్ కి వచ్చి, స్నానం చేసి బయటకు వెళ్ళాము, ఆ రోజు మొత్తం ఊటీ అంతా తిరిగి ఫుల్ ఎంజాయ్ చేసాము, రాత్రి కి రూమ్ కి వచ్చాము, తను నాకు బీర్ ఆర్డర్ పెట్టింది, తను కంపెనీ కోసం జూస్ తెచ్చుకుంది, తాగుతూ ఉండగా కాలేజ్ లోని కొన్ని విషయాలు చెప్పింది, కార్తీక్ నీకు కాలేజ్ రోజుల్లో నీకు ఇష్టం అయిన బోర్బాన్ బిస్కెట్ ప్యాకెట్ రోజూ నీ ఫ్రెండ్ ఇచ్చేవాడు కదా అంది, అవును అన్నాను, అది నేనే ఇచ్చేదాని నీకు ఇవ్వమని అంది, ఎగ్జామ్ అప్పుడు నీకు ఒక పెన్ పంపెదాన్ని, నువ్వు కాలేజ్ లో యూజ్ చేసిన బైక్ మీద KL అని ఉండేది, నువ్వు అది l అంటే నీ ఫ్రెండ్ పేరు అనుకున్నావు కదా అలా రేడియం తో నేనే చేపించమన్న, నువ్వు కాలేజ్ లో అనాధలకి ఫండింగ్ రైజింగ్ చేస్తుంటే 10k ఇచ్చింది కూడా నేనే, ఇప్పుడు ఈ ఆఫీస్ లో చేరింది కూడా నీ కోసమే అంది, r u serious లాస్య అని అడిగాను, ఇంత చెప్పినా అర్థం కాలేదా కార్తిక్ కాలేజ్ రోజుల నుంచి నువ్వంటే ఇష్టం నాకు, ఇంకా చాలా చేశాను, చెప్తూ పోతే రోజులు కూడా సరిపోవు అంది, మరి లవ్ చేశాను అన్నావు అన్నాను, నువ్వు ఎలా ఫీల్ అవుతావు తెలుసుకుందాం అని అలా చెప్పాను, కానీ నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు, అప్పుడు చెప్తే నీ చదువు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు, ఇప్పుడు చెప్పకుంటే ఇక ఎప్పటికీ చెప్పలేను అనే లాంగ్ డ్రైవ్ కి తీసుకువచ్చాను అంది.