05-12-2023, 02:28 PM
నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 8 అయింది, మిత్ర అప్పటికే వచ్చి ఉంది, నేను అలిసిపోయి ఉండటం వల్ల సోఫా లో పడుకున్న, మిత్ర కాఫీ చేసి తీసుకుని వచ్చింది, నేను అడిగాను ఎలా ఉంది ఆఫీస్ అని, బాగుంది అంది, నచ్చిందా అన్నాను, హా మొదటి రోజే కదా అంది, ఇబ్బంది ఏమీ లేదు కదా ఉంటే ఇంకా ఏదైనా చూద్దాం అన్నాను, అలా ఏమి లేదు పర్లేదు అంది, నేను కాఫీ తాగేసి స్నానం కి వెళ్ళాను, ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ చేసింది, నేను తనతో నీకు ఇందుకు ఇంది అంతా అన్నాను, పర్లేదు నాకు వంట చేయడం ఇష్టం అంది, ఇక తినేసి పడుకున్నాం, రాత్రి 11 గంటలకి అలా వాటర్ కోసం లేచాను, చూస్తే మిత్ర మెలుకువ గానే ఉంది, ఏమైంది అన్నాను, తను నా దగ్గరకి వచ్చి, నా చేతి మీద తల పెట్టి నన్ను గట్టిగా కౌగలించుకొని కార్తీక్ నీకు ఒకటి చెప్పాలి అంది, చెప్పు అన్నాను, I love you Karthik అంది, హేయ్ ఏంటి ఇది అంతా అన్నాను, నాకు తెలుసు నువ్వు ఏమీ ఆశించకుండా సహాయం చేస్తున్నావు అని, నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని, కానీ నా జీవితం లో నాకు చిన్నప్పటి నుండీ ఎవరూ కూడా ఇంతగా కేర్ చేయలేదు, మామూలు పరిచయానికి నువ్వు ఇంత చేస్తున్నావు అంటే అదే నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా ఎంత బాగా చూసుకుంటావు అనిపించింది, అలా అని నిన్ను లవ్ చేయమని అడగను, నిన్ను ఇబ్బంది పెట్టను అని ఒక ముద్దు పెట్టింది నుదుటి మీద, నేను చెప్తుంటే నువ్వు ఏది చెప్పకు, నాకు దొరికిన మంచి వ్యక్తివి నువ్వు, ఇది చాలు అంది, సరే నువ్వు బాధ పడకు అని చెప్పి నేను ఒక ముద్దు పెట్టి, నీళ్ళు తాగి పడుకున్న, ఉదయం తను టీ ఇచ్చి లేపింది, నేను యోగా చేసి స్నానం చేసి, వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసింది, ఇద్దరం టిఫిన్ చేసాము, తను అమృత మొగుడితో ఆఫీస్ కి వెళ్ళింది, నేను అమృత ఫ్లాట్ కి వెళ్ళాను, ఏంటి సార్ బిజీ ఉన్నారు అంది, ఏమి లేదు రాత్రి లేట్ అయింది, ఏంటి నువ్వు రెడీ అయ్యావు, ఎక్కడకి వెళ్తున్నావు అని అడిగాను, ఒక ఇంటర్వ్యు ఉంది, రాత్రి మెసేజ్ చేశాను చూడలేదా అంది, లేదు చెప్పాను కదా అలిసిపోయాను అని అన్నాను, సరే వెళ్ళొస్తా అంది, నేను తనని లాగి ఒక ముద్దు పెట్టి, అల్ ది బెస్ట్ అని చెప్పాను, తను థాంక్స్ అని చెప్పి స్టార్ట్ అయింది, నేను కూడా ఆఫీస్ కి వెళ్ళాను, మధ్యాహ్నం మూడు గంటలకు అమృత ఫోన్ చేసింది, జాబ్ వచ్చింది, వచ్చే సోమవారం నుంచి ఆఫీస్ అని, కంగ్రాట్స్ చెప్పాను, తను నువ్వు ఫ్రీ ఉంటే ఒకసారి బయటకు వెళ్దామా అంది, సరే అన్నాను, ఎక్కడ ఉన్నావు అని అడిగాను, మీ ఆఫీస్ బయట అంది, వస్తున్న అని పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, నువ్వేంటి ఇక్కడ అన్నాను, నీ కోసమే అంది, నేను రాకపోతే ఏమి చేస్తావు అన్నాను, అమృత పిలిస్తే రావా అంది, సరే ఎక్కడకి వెళ్దాం అన్నాను, ఏదో ఒక ప్రశాంతం గా ఉండే ప్లేస్ అంది, సిటీ లో ఎక్కడకి వెళ్ళినా ట్రాఫిక్ ప్రాబ్లెమ్, దగ్గర లో ఒక కాఫీ షాప్ ఉంది, వెళ్దాం అన్నాను, సరే అంది, ఇద్దరం కాఫీ షాప్ కి వెళ్ళాము, టేబుల్ లో కూర్చొని ఆర్డర్ చేసాము, తను టేబుల్ మీద ఉన్న నా చేతి వేళ్ళని తన చేతి వేళ్ళతో హోల్డ్ చేసి, కార్తీక్ I love you అంది, హలో మేడం పెళ్లి అయింది నీకు అన్నాను, సరే ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదు అనుకో నన్ను ఆక్సెప్ట్ చేస్తావా లేదా అని అడిగింది, అవ్వని వాటి గురించి ఎందుకు అన్నాను, చెప్పు చాలు అంది, అమృత నువ్వు అంటే నాకు ఇష్టమే అన్నాను, ఇది చాలు కార్తీక్ అంది, ఇక ఇంటర్వ్యు గురించి చెప్తూ ఉంది, అప్పుడే అక్కడికి మా మేనేజర్ వచ్చాడు, తనతో ఒక అమ్మాయి కూడా ఉంది, నేను వాడితో ఎందుకు అనుకుని తల పక్కకి తిప్పి ఉంచాను, కానీ వాడు నన్ను గుర్తు పట్టి, నా టేబుల్ దగ్గరకే వచ్చాడు, మా మేనేజర్ నాకు క్లోజ్ , నాకు ఆఫీస్ లో అన్నీ వాడే నేర్పించాడు, నేను వాడిని ఒక గురువు లా చూస్తాను, నాతో అమ్మాయి ఉంటే డౌట్స్ తో చంపుతాడు అని తల పక్కకి తిప్పాను, ఇక టేబుల్ దగ్గర కి వచ్చాక ఏమి అనాలి, ఏంటి సార్ మీరు ఇక్కడ అన్నాను, అది నేను కదరా నిన్ను అడగాలి, హెల్త్ బాగోలేదని పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఏమి పని అన్నాడు, సార్ నేను ఇంటికే వెళ్తున్న, తను అమృత నా ఫ్రెండ్, కనిపిస్తే మాట్లాడుతున్న అన్నాను, మీరేంటి సార్ గర్ల్ ఫ్రెండ్ ఆహ్ అన్నాను, అరే నువ్వు ఆపు, తను నాకు చెల్లెలు అవుతుంది, మా బాబాయి కూతురు పేరు లాస్య, రేపటి నుంచి నీ టీమ్ లో జాయిన్ అవుతుంది అన్నాడు, సార్ మీరు ఏమి అనుకోను అంటే ఒకటి అడగనా అన్నాను, చెప్పు రా అన్నాడు, తనని ఎక్కడో చూసినట్టు ఉంది సార్ అన్నాను, నువ్వు తను ఇంజనీరింగ్ లో ఒకే కాలేజ్ అంట, తను నిన్ను గుర్తు పడితేనే నేను నిన్ను చూసి వచ్చాను అన్నాడు, అవునా అని అదేంటి సార్ రికమండేషన్ చేశారు మీ చెల్లి అని తప్పు కదా అన్నాను, అరే తప్పుల గురించి నువ్వు మాట్లాడకు, ఆ కాఫీ ఏదో మాకు తెప్పిస్తే మేము కూడా తాగి పోతాము అన్నాడు, కాఫీ తెప్పించి అందరం తాగేసి బయటకు వచ్చాము, అమృత తో వెళ్దామా అన్నాను, వద్దు నాకు క్యాబ్ బుక్ చెయ్, అపార్ట్మెంట్ లో ఇద్దరినీ కలిసి చూస్తే ఇక అంతే అంది, సరే అని క్యాబ్ బుక్ చేసి తనని పంపి, అరగంట తరువాత నేను కూడా స్టార్ట్ అయ్యాను.