Thread Rating:
  • 8 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ది వారియర్
#28
నీలోఫర్ తనకు పెళ్లి కుదిరింది అని చెప్పిన వెంటనే రాజ్ కీ fuse ఎగిరి పోయింది ఏమీ జరిగిందో అర్థం కాలేదు తను విన్నది నిజమేనా కాదా అని ఆలోచనలో అలాగే అక్కడే ఉండి పోయాడు రాజ్, ఇది ఏమీ పట్టించుకోకుండా నీలోఫర్ మాత్రం అక్కడి నుంచి కల్చరల్ ఈవెంట్స్ గురించి చూసుకోవాలి అని తిరిగి ఆడిటోరియంలోకి వెళ్లింది, అప్పుడే తన కాబోయే భర్త అయినా సిరాజుద్దీన్ నుంచి వచ్చింది దాంతో నీలోఫర్ గట్టిగా ఊపిరి పీల్చుకున్ని "హలో" అని ప్రేమగా ఫోన్ మాట్లాడం మొదలు పెట్టింది అప్పుడు పక్కనే ఉన్న కల్చరల్ ప్రోగ్రాం పిల్లలు రాజ్ కోసం ఒక bgm నీ పెట్టాలి అని ప్లే చేశారు అది మాస్టర్ సినిమా లోని bgm అది విన్న నీలోఫర్ కీ అదే ఆడిటోరియంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన పదవ తరగతి విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.


(2 సంవత్సరాల క్రితం)

రాజ్ ఆ స్కూల్ లో కొత్తగా ఉద్యోగంలో చేరాడు నీలోఫర్ అదే స్కూల్ లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న తనకు ఏమీ గుర్తింపు లేదు, కానీ రాజ్ స్కూల్ లో దసరా పండుగ ముందు చేరాడు వచ్చిన ఆరు నెలల లోనే తను స్కూల్ లో ఉన్న హై స్కూల్ పిల్లలను తన వైపు తిప్పుకొని వాళ్లందరి దృష్టి లో హీరో అయ్యాడు రాజ్, ఇది కొంచెం management వాళ్లకు నచ్చేది కాదు దాంతో రాజ్ ఏదైనా చిన్న తప్పు చేసినా దొరుకుతాడు ఉద్యోగం నుంచి తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, కానీ రాజ్ తెలివిగా తప్పించుకుని తిరుగుతున్నాడు అలా తన స్టూడెంట్స్ అందరూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఫేర్ వెల్ పార్టీ పెట్టారు, దాంతో రాజ్ ఆ రోజు స్టేజ్ ఎక్కి పిల్లలకు ఒక స్పీచ్ ఇచ్చాడు ఏమని అంటే "పిల్లలు బయట మీ కోసం ఒక రేస్ ట్రాక్ రెడీగా ఉంది మీకు ఇష్టం ఉన్న లేకున్నా అందులో పరిగెత్తుతూ ఉండాలి, కాబట్టి నేను మీకు ఇంకో టిప్ ఇస్తాను మీరు ఏమి గుర్రం కాదు ఎలుక కాదు పరిగెత్తుతూ బ్రతకడానికి మనుషులు మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి, ఈ రేస్ లో పరిగెత్తితే మీకు అలసిపోయిన నీళ్లు ఇవ్వడానికి కూడా ఎవరూ ఉండరు ఒక్కసారి ఆగి ముందు వాడితో పోటీ పడడం మానేసి వాడు అలిసిపోతే మీ భుజం నీ ఇచ్చి వాళ్లతో కలిసి నడవండి ఎందుకంటే మీకు దొరికే స్వచ్ఛమైన స్నేహం ఈ స్కూల్ గేట్ లోపలే బయట మీకు అది దొరకదు, కాబట్టి ఇక్కడ దొరికిన స్నేహితులను జీవితాంతం గుర్తు ఉంచుకోండి లేదా ఈ బంధాన్ని మీ చివరి శ్వాస వరకు తీసుకోని వెళ్ళండి, మీరు ఓడిపోవచ్చు కానీ గెలిచిన వాడి కథలో ఆవేశం ఉంటుంది, ఓడిన వాడి కథ లో ఎక్కడ తప్పు జరిగింది అని తెలుసుకొనే అవకాశం ఉంటుంది సరిదిద్దుకున్నే అవకాశం ఉంటుంది" అని చెప్పాడు, దానికి స్టూడెంట్స్ లో ఒకడు లేచి చప్పట్లు కొడుతూ ఉన్నాడు ఆ చప్పట్లు శబ్దం తో పాటు మాస్టర్ సినిమా లోని bgm పెట్టి రాజ్ నీ హీరో నీ చేశారు ఆ స్టూడెంట్స్.

(ప్రస్తుతం)

సిరాజ్ అవతలి నుండి "హలో ఉన్నావా నీలోఫర్ " అని అరిచిన అరుపుకు తేరుకొనీ తిరిగి మాట్లాడాలని చూస్తే ఫోన్ లోని సిగ్నల్స్ పోయాయి, దాంతో నీలోఫర్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లింది అప్పుడు రాజ్ చిరాకుగా స్కూల్ టాప్ ఫ్లోర్ లో గోడ ఎక్కి నిలబడి ఉన్నాడు, అది చూసిన రాజ్ ఫ్రెండ్స్ నలుగురు కలిసి పైకి వెళ్లారు, అప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాన్వాయ్ స్కూల్ క్యాంపస్ లోకి రాగానే కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్ టీచర్ అయిన షేక్ అహ్మద్ తన ఫోన్ తీసి "భాయ్ jammers On లో ఉన్నాయి మీరు రావచ్చు" అని అన్నాడు, దాంతో మినిస్టర్ కార్ నుంచి దిగిన వెంటనే ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద ఉన్న ఒక వ్యక్తి "హ్యాపీ దివాలీ కాఫీరో" అని తన ముందు ఉన్న ఒక బాక్స్ లో బటన్ క్లిక్ చేస్తే స్కూల్ లో ఉన్న బస్ లు అని బ్లాస్ట్ అయ్యాయి అవి ఎగిరిన వెంటనే టాప్ ఫ్లోర్ లో ఉన్న రాజ్ అతని ఫ్రెండ్స్ ఐదు మంది బిల్డింగ్ మీద నుంచి ఎగిరి కిందకు పడ్డారు, అప్పుడే ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి స్కూల్ బిల్డింగ్ మీదకు తాడు తో దూకి ఒక మైక్ తో "you are hijacked" అని అన్నాడు.
Like Reply


Messages In This Thread
ది వారియర్ - by Vickyking02 - 15-11-2023, 09:07 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 17-11-2023, 08:07 PM
RE: ది వారియర్ - by maheshvijay - 17-11-2023, 08:09 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 19-11-2023, 09:18 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:40 AM
RE: ది వారియర్ - by maheshvijay - 19-11-2023, 09:58 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:40 AM
RE: ది వారియర్ - by Heisenberg - 19-11-2023, 11:31 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:40 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 20-11-2023, 04:41 AM
RE: ది వారియర్ - by utkrusta - 20-11-2023, 07:00 PM
RE: ది వారియర్ - by Prudhvi - 21-11-2023, 07:33 PM
RE: ది వారియర్ - by sri7869 - 24-11-2023, 10:11 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 30-11-2023, 06:57 AM
RE: ది వారియర్ - by Raj batting - 30-11-2023, 02:05 PM
RE: ది వారియర్ - by ramd420 - 01-12-2023, 06:33 AM
RE: ది వారియర్ - by phanic - 01-12-2023, 07:20 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 03-12-2023, 08:09 PM
RE: ది వారియర్ - by sri7869 - 03-12-2023, 08:12 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:26 AM
RE: ది వారియర్ - by phanic - 03-12-2023, 09:12 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:27 AM
RE: ది వారియర్ - by ramd420 - 03-12-2023, 09:31 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:27 AM
RE: ది వారియర్ - by maheshvijay - 03-12-2023, 09:40 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 04:27 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 07:29 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 07:29 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 04-12-2023, 06:46 PM
RE: ది వారియర్ - by maheshvijay - 04-12-2023, 10:45 PM
RE: ది వారియర్ - by Vickyking02 - 05-12-2023, 04:46 AM
RE: ది వారియర్ - by Vickyking02 - 05-12-2023, 07:45 AM
RE: ది వారియర్ - by sri7869 - 08-12-2023, 12:08 PM
RE: ది వారియర్ - by hijames - 18-12-2023, 07:27 PM



Users browsing this thread: 4 Guest(s)