22-11-2023, 11:25 PM
(This post was last modified: 23-07-2024, 02:03 PM by Haran000. Edited 16 times in total. Edited 16 times in total.)
ఒక్కటి తప్ప
రచన - హరణ్
అక్టోబర్ లో వాట్సాపులో చూసా, హైదరాబాదులో ఉండే మా విలాసమూర్తి బాబాయి స్టేటసులో పెట్టాడు, ఒక అబ్బాయి ఫోటో, చూడగానే మార్కెట్లోకి కొత్త హీరో వచ్చాడేమో అనుకున్న. చాలా అందంగా సూట్ వేసుకొని ఉన్నాడు. అప్పుడే నా మెదడు చిన్న జ్ఞాపక సంకేతం ఇచ్చింది, ఆ మొహం నాకు తెలుసు, చూసి కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఫోటో కింద “ హ్యాపీ బర్తడే అల్లుడూ భరత్ ” అని పెట్టాడు. నేనలా చూస్తున్నానో లేదో, మా ఫ్యామిలీ గ్రూపులో ఒక కొత్త నంబర్ వచ్చింది. మూర్తి బాబాయ్ ఆడెడ్ 966******2.
ఆ స్టేటస్ లో పెట్టిన ఫోటో గ్రూపులో పెట్టాడు. అది అలా వచ్చిందో లేదో, బలరాం బాబాయ్ ఇంకో మెసేజ్ పెట్టాడు, “ భరత్ గాడి నంబర్ ఇప్పుడు దొరికిందా, అబ్బో ఆప్ తయారు చేసి, ఒక స్టార్టప్ మొదలు పెట్టాడు అంట నిజమేనా? ”. పెద్ద డిస్కషన్ నడిచింది గ్రూపులో. మా చుట్టాలందరిలో తను ఇప్పుడు ఒక టాక్.
నాకు గుండెలో కలుక్కుమంది. ఎందుకు కాదు, తను నా మేనత్త కొడుకు. నేను ఎనమిదో తరగతి చదువుతున్నంత వరకూ మా ఊరిలోనే ఉండేవాడు. ఆ తరువాత, ఇంటర్మీడియెట్ కోసం పట్నం వెళ్ళాడు. అక్కడే హాస్టల్లో ఉన్నాడు. సెలవులకి వచ్చినా నాకు కనిపించేవాడు కాదు. నా పదో తరగతి అప్పుడు వేసవి సెలవుల్లో కలిసాం, అదే ఆఖరి సారి. అప్పుడు చెప్పాడు, ఐఐటీలో సీటు కొట్టాడని. చిన్నప్పుడు తను బాగా చదువుతాడు అని తెలుసు, కానీ ఇంత ఊహించలేదు.
మా ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు ఉండేవి కావు, ఉన్నా నేనే తనని విసిగించే దాన్నేమో. నాకు తెలిసినంత వరకూ అందరితో చనువుగా, హుషారుగా ఉండడం తనకి చేతకాదు. బడిలో ఉన్నప్పుడు అమ్మతో వాల్లింటికెప్పుడైన వెళ్తే మా అత్త, వాడు చదువుకుంటున్నాడు అని చెప్పేది. అందరిలో కలవడు, ఎక్కువ స్నేహితులు లేరు, ఉన్న ఇద్దరితోనే ఎటూ పోయినా. మా ఇంటికి వచ్చినా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చాలా అమాయకంగా ఉంటాడు. ఎవరైనా ఎదైన అడిగినా ఎందుకో ఇబ్బంది పడుతూ సమాధానం ఇచ్చేవాడు. నేను ఆడపిల్లని అయినా కాస్త హుషారుగా ఉంటాను. ఎవరేం అడిగినా టక్కున ఒక మాట చురుగ్గా మాట్లాడతాను. నాతో అప్పుడప్పుడూ మాట్లాడేవాడు అని చెప్పాను కదా, అవి ఏంటో తెలుసా, అన్ని చదువు గురించే. ఒక సినిమా గురించో, ఆటల గురించి పాటల గురించి నా ముందు మాట్లాడడం మాత్రం ఎన్నడూ చూడలేదు. తనని ముద్దపప్పు అనాలో సరస్వతీ పుత్రుడు అనాలో అర్థం అయ్యేదికాదు.
చిన్నప్పటి కొన్ని సందర్భాలు గుర్తొచ్చి కొంచెం నవ్వొచ్చింది. ఇక బ్యాక్ బటన్ నొక్కి ఇనిష్టాగ్రాము చూస్తూ ఉంటే నా ఆడమనసు ఎందుకో ఆ మగాడిని చూడవే అంటుంది. సెర్చ్ బార్ లోకి వెళ్ళి పేరు కొట్టాను. వాడి ప్రొఫైల్ వచ్చింది. ఎక్కువ ఫొటోస్ లేవు. రెండే ఉన్నాయి. ఒకటి ఎక్కడో అది ఒక బ్రిడ్జి పక్కన నిల్చున్నాడు. ఆరడుగులు ఉండడేమో కానీ బాగున్నాడు. చిన్నప్పుడు చామన్ చాయ, మరి ఎక్కడ ఉంటున్నాడో కాస్త ఎర్రబడ్డాడు. బాబాయి పెట్టిన ఫొటోలో గడ్డం లేదు, ఈ ఫొటోలో ఉంది. ఏంటో పక్కనుంటే తన గడ్డం ముద్దు పెడతానో ఏమో. ఛఛ నాకేంటి వీడి మీద ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నా. ఇంకో ఫోటో ఉంది, ఒక హోటెల్లో ఉన్నాడు. ఒక్కడే పక్కన ఎవరూ లేరు. తెలిసిందే కదా ఒంటరిగా ఉండడం తనకి ఇష్టం. నాకెందుకో ఇంకొన్ని ఫొటోలు ఉంటే బాగుండు అనిపించింది.
ఆఖరి సారిగా కలిసినప్పుడు మా ఇంట్లో ఇద్దరం టీవీ ముందు కూర్చుంటే నేనే లోడలోడా వాగుతూ తనకి ప్రశాంతత లేకుండా చేసా, కానీ చాలా ఓపిక పట్టి నేనేం చెప్పినా విన్నాడు. తన అమాయక్త్వం నాకిష్టం. ఎంత మంచొడంటే నా కన్నా పెద్దోడైనా నేను బావ అనకుండా పేరు పెట్టి పిలిచినా ఒక్కసారి కూడా బెదిరించడు. చాలా మొహమాట పడతాడు. కనీసం నన్ను సూటిగా చూడలేదు ఆరోజు. మా అమ్మ అన్ని అది కావాలా ఇది కావాలా అని అడిగితే తప్ప నోరు విప్పడు.
అలాంటి వాడు ఇప్పుడు ఒక కంపెనీ నడుపుతున్నాడు అంటే ఎలానో ఏమో. మారిపోయాడు అనుకుంటా, లేక అలాగే ఉన్నాడో. సర్లే ఇవన్నీ కాదు కానీ చాలా రోజులు అవుతుంది, ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుందో అనిపించింది, కానీ ఏమో నాకు సిగ్గే ఒక్కసారిగా తనకి ఫోన్ చెయ్యాలంటే. పైగా ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నాడు, అలాంటి వాడితో ఎలా మాట్లాడేది అనుకున్నా. మరోసారి ఇనిష్టాగ్రాం తెరిచి ఫాలో కొట్టేసా. హై అని మెసేజ్ కూడా పెట్టా. ఏమంటాడో చూద్దాం అనుకుంటే మూడు రోజులు గడిచినా ఏమీ లేదు. అంత బిజీగా ఉన్నాడా అనిపించింది.
క్షమించండి ఇంత వరకూ నా గురించి చెప్పలేదు కదా. నా పేరు శ్రుతకీర్తి. ఒక్కరు శృతీ అని, అందరూ కీర్తీ అని పిలుస్తారు. వయసు ఇప్పుడు ఇరవై ఐదు. నేను ఐదడుగుల రెండంగులాల ఎత్తు, తెల్లగా, మంచి ఒంపుసొంపులతో చాలా అందంగా ఉంటాను. ఎంత అందంగా అంటే మీరు అనుకోవచ్చు ఎంత పొగరు దీన్ని ఇదే పోగుడుకుంటంది అని. నా గురించి నా అభిప్రాయం అంతే. నేను కాలేజీకి వెళ్తే క్లాసులో అబ్బాయిలు నన్ను చూసి గడ్డకట్టుకుపోవాల్సిందే, అంటే చూపండీ చూపు, ఇంకేదో అనుకోకండి. ఏమో అది కూడా ఏమో నాకు తెలీదండీ వాళ్ళని అడగండి. చిచి..... ఈ ఇనిష్టాగ్రాం వల్ల డబుల్ మీనింగ్ ఎక్కువైపోతోంది. అవునండీ నేను సిగ్గు పడతాను కానీ, మా స్నేహితులతో సిగ్గులేకుండా అన్ని పిచ్చి మాటలే నాకు హహ.... నేను ఎంఎ ఆర్థికశాస్త్రం, అనగా ఎకనామిక్స్ చేసాను. ఏంటోనండీ నేను ఆడపిల్లని నాకెందుకు ఉద్యోగం అనిపించింది. నేను చేస్తాను అని ఇంట్లో చెప్పలేదు, వాళ్ళు అడగలేదు. ఇంట్లో కాళిగా ఉంటున్నా. నేనేం టాపర్ ని కాను. ఎదో పాస్ అయ్యమాలేదా అంతే. ఇంట్లో ఉంటూ రోజు ఆలస్యంగా లేస్తూ అమ్మతో తిట్లు తింటూ బద్ధకంగా ఉంటాను. సాయంత్రం ఎక్సర్సైజు చేస్తాను, చాలా ఆరోగ్యంగా తింటాను. బాగా మెక్కుతాను. నన్ను చేసుకునే వాడికి నా తిండికే కర్చు ఎక్కువ అవుతుంది. ఫ్యాషన్ అంటే పిచ్చి. రకరకాల డ్రెస్సులు, హైర్ స్టైల్ ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఎంతైనా లంగావోణి కట్టుకొని జెడ వేసుకొని ఉండడం చాలా ఇష్టం. ఇంట్లో మామూలుగా టీషిర్టు లూజ్ ప్యాంట్ వేసుకొని ఉంటాను. ఎవరైనా వస్తే మాత్రం చుడీదార్, లంగాఓణిలు వేసుకుంటాను. అబ్బాయిలు స్నేహితులు ఉన్నారు. కానీ స్నేహం మాత్రమే. నాకు అన్నీ తెలుసు, చాలా విన్నాను, చూసాను కానీ చెయ్యలేదు. చెయ్యాలనీ, చేసుకోవాలనీ ఉంటుంది, చాలా ఆలోచనలు వస్తాయి అంతలో ఆగిపోతాను. అదేంటో మరి అన్నీ నన్ను చేసుకునేవాడే చెయ్యాలి అన్నట్టు.
ఆరోజు మధ్యాహ్నం అమ్మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, వచ్చే నెల తను వస్తున్నాడని మా అత్త చెప్పిందంటా. అంత ప్రత్యేకంగా చెప్పడం దేనికో మీకు తెలుసా అండీ?