Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
మూడు సెక్యూరిటీ అధికారి వెహికల్స్ లో స్టేషన్ మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు దిగడంతో ...... , అపార్ట్మెంట్ పార్కులో - బీచ్ లో సేదతీరుతున్న అపార్ట్మెంట్ వాసులు , ఫ్లడ్ లైట్స్ వెలుగులలో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు అందరూ గుమికూడారు , ఏంటి ఒకదగ్గరకు చేరారు అంటూ రెండు అపార్ట్మెంట్స్ నుండి కిందకు వస్తున్నారు .
వాళ్ళతోపాటు రాక్షసులిద్దరూ కూడా రాక్షస నవ్వులతో వచ్చారు డబ్బు దొరికేసి ఉంటుందన్న ఆరాటంతో ......
అందరూ చూస్తుండగా నన్ను లాక్కెళ్లిన స్టేషన్ పెద్ద సెక్యూరిటీ అధికారి sorry చెబుతూ స్వయంగా వెహికల్ డోర్ తెరిచారు .
చుట్టూ అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు - గుసగుసలాడుకుంటున్నారు .
ఇక రాక్షసులకయితే ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు - సెక్యూరిటీ అధికారి ......
సెక్యూరిటీ అధికారి : అక్కడే ఆగిపో , ముందు మిమ్మల్ని లోపల వెయ్యాలి , ఎవరిని అంటే వారిని దొంగగా చేసేస్తారా ? , నీ ఇంట్లో వస్తువునేమైనా దొంగతనం చేశాడా ? చెప్పు ......
రాక్షసులు : లేదు ..... 
సెక్యూరిటీ అధికారి : మీవలన మేమూ తప్పుచేసాము , sorry బాబూ ..... , ఇంకొకసారి ఇలా చేస్తే మిమ్మల్ని లోపల వేస్తాము , అపార్ట్మెంట్ వాసులారా ..... ఈ పిల్లవాడు నిరపరాధి , మిస్టేక్ చేసాము మా తప్పును సరిదిద్దుకుంటున్నాము అనిచెప్పి , చూడండీ మీఇద్దరి వలన ఈ బాబుకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా మీరు స్ట్రెయిట్ గా సెంట్రల్ జైలుకే - ఇదే విషయం కమిషనర్ వరకూ వెళ్లి ఉంటే ఏమి జరిగేదో ఊహకందడం లేదు , బాబూ ..... ఫ్లాట్ ముందు ఎలా ఉండేదో అలా మార్పించే బాధ్యత నాది అనిచెప్పి వెళ్లిపోయారు .
అపార్ట్మెంట్ వాసులు : మాకు ముందే తెలుసు - వీరిద్దరి గురించి ఎవరికి తెలియదు చెప్పండి , గయ్యాళి - సుగుణాలు గల కోడలిని రాచి రంపాన పెట్టింది - పాపం తను ....... , వీరిద్దరి వలన పాపం అభం సుభం తెలియని ఈ పిల్లాడు భలైపోతాడు అనుకున్నాము అలా జరగలేదు సంతోషం ...... - ఈ పిల్లాడిని విడిపించడం కోసమే మేమంతా కలిసి మాట్లాడుకుంటున్నాము ఇంతలో ఎవరైతే లాక్కెళ్లారో వారే తప్పు తెలుసుకుని అంతే గౌరవంగా తీసుకొచ్చారు , ఇకనైనా మీరూ మారితే మంచిది .
రాక్షసులు : మూతిని మూడు సార్లు తిప్పి గయ్యాళిలా వాగుతూనే ఉంది .
అపార్ట్మెంట్ వాసులు : మీకు చెప్పాము చూడు మాకు బుద్ధిలేదు , మంచి పిల్లాడికి ఏమీ జరగలేదు అదిచాలు మాకు ......
రాక్షసులు తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు .

నాగురించి ఆలోచించినందుకు - బాధపడినందుకు కృతజ్ఞుణ్ణి , మీలాంటి మంచివాళ్ళ మధ్యన ఉంటూ నాగురించి చెప్పకపోవడం భావ్యం కాదు , భవిష్యత్తులో నావలన ఎవ్వరూ ఇబ్బందిపడకూడదు , మీరనుకుంటున్నట్లు నేను మంచివాడిని కాదు , నిన్నటివరకూ ఒక హత్యానేరం కింద నాలుగేళ్లపాటు జైల్లో ఉండి వచ్చాను , నిజం చెబుతున్నాను నేను ఏ తప్పూ చెయ్యలేదు అంటూ లాకర్ ను పట్టుకునే మోకాళ్లపై కూర్చున్నాను , ఇలాగే ఒక సెక్యూరిటీ అధికారి తప్పిదం వలన శిక్ష అనుభవించాల్సి వచ్చింది , దేవుళ్ళలాంటి ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు మరియు ఒక బుజ్జిదేవత వలన నన్ను విడుదల చేసారు , సెక్యూరిటీ ఆఫీసర్ శాఖ మరియు కోర్టులు తమ తప్పుగా నాకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించారు , శిక్షను అనుభవించానే కానీ నేరస్థుడిని కాదు , ఇక నిర్ణయం మీదే మీరు ఉండమంటే ఉంటాను వెళ్లమంటే వెళ్లిపోతాను .
అందరూ గుసగుసలాడుకుంటున్నారు - ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు .
లోపలికి వెళుతున్న రాక్షసులిద్దరూ విని పరుగున వెనక్కువచ్చి , విన్నారా విన్నారా ...... మామూలు నేరస్థుడు కాదు చంపి జైలుకు వెళ్లినవాడు మీకు మంచివాడా ? .
అపార్ట్మెంట్ వాసులు : ఆసంగతి మేము చూసుకుంటాము తమరు దయచేయవచ్చు , మాకు చెప్పకుండా దాచిపెట్టవచ్చు కానీ చెప్పాడు .
వెళతాములే అని శాపనార్థాలు పెడుతూ వెళ్లిపోయారు .
అపార్ట్మెంట్ వాసులు మారు మాట్లాడకుండా నన్ను లేపి భుజాలపై - వీపుపై తాకి అంతే మౌనంగా వెళ్లిపోయారు .

థాంక్యూ థాంక్యూ థాంక్యూ ...... అంటూ సంతోషంగానే పైకి చేరుకున్నాను , నిన్నట్లానే తాళం వేసి ఉండటంతో ఆశ్చర్యపోయి తాళం తీసి లోపలికివెళ్ళాను - ఫస్ట్ టైం ఆటోమేటిక్ గా లైట్స్ వెలగడంతో ఆశ్చర్యపోవడంతోపాటు ఫ్లాట్ మొత్తం నీట్ గా ఉదయం నేను వెళ్లేముందు ఎలా ఉండేదో అలాగే ఉండటం చూసి షాక్ అయిపోయాను , నోరుతెరిచి ఫ్లాట్ మొత్తం చుట్టూ చూస్తూ లాకర్ ను యధాస్థానంలో ఉంచాను - పూజ గదిలో దేవుళ్ళ ముందు హుండీ ఉండటం చూసి మీరే కాపాడుకున్నారా స్వామీ అంటూ మొక్కుకుని ప్రాణంలా అందుకున్నాను , హుండీకి ఏమీకాలేదు అంటూ నా ఆనందాలకు అవధులులేవు , ఎందుకో తెలియదు హుండీతోపాటు సెల్ఫీ తీసుకోవాలనిపించి తీసుకుని మేడమ్ కు పంపించాను .
వెంటనే చెల్లి నుండి కాల్ వచ్చింది - కొద్దిసేపు సంతోషంగా మాట్లాడుకున్నాము , మహేష్ ..... ముందు డిన్నర్ చెయ్యి లేకపోతే ఇలానే ఉదయం వరకూ మాట్లాడుతారు మీరు అన్నారు మేడమ్ .
అవునవును అన్నయ్యా లవ్ యు బై .....
లవ్ యు చెల్లీ ..... అంటూ కట్ చేసాను , చూస్తే బోలెడన్ని మెయిల్స్ ఇంకెక్కడ నుండి అక్కయ్య నుండే ......
" తమ్ముడూ ....... 
hi తమ్ముడూ ...... 
డిన్నర్ రెడీ అయ్యింది ......
తమ్ముడూ ......
తమ్ముడూ .....


తమ్ముడూ ...... " 
చెల్లితో వీడియో కాల్ స్టార్ట్ అయినప్పటి నుండీ మెసేజెస్ వచ్చి ఉండటం చూసి నవ్వుకుని Sorry అక్కయ్యా ...... అని మెసేజ్ చేసాను .
" డిన్నర్ రెడీ ...... " 
నాకు ఆకలిగా లేదు మీరు తినెయ్యండి అక్కయ్యా .....
" ఆలస్యంగా రిప్లై ఇవ్వడమే కాకుండా , ఉదయం నువ్వు టిఫిన్ తినకపోతేనే బామ్మ మొట్టికాయలు వేసింది ఇప్పుడు గనుక ఇలానే చెబితే వాతలే , నువ్వు తినకుండా బామ్మ తినదు " 
మా అక్కయ్యా తినదని అర్థమైపోయింది ...... , మన బుజ్జిచెల్లితో మాట్లాడుతున్నాను .
" అయితే sorry sorry ఇదిగో గుంజీలు తీస్తున్నాను , మొదట చెల్లి ..... , చెల్లి నెంబర్ ఇవ్వు , ముందైతే నువ్వు వస్తావా లేక అడ్రస్ చెబితే నేనే తీసుకురమ్మంటావా "
నేనే వస్తాను - ఆటోలోనే ఉంటాను - బామ్మ తెచ్చివ్వాలి ......
" తమ్ముడూ ..... ఇదేమీ బాగోలేదు , ముద్దు లావాలి , చిన్న ముద్దులుపెట్టావా సరిపోవడం లేదు " 
ఇందుకే ఇందుకే ...... , బామ్మతో పంపుతాను అంటేనే వస్తాను .
" సరేలే రా ..... , చెల్లి నెంబర్ ...... " 
ఇస్తాను , ఇచ్చేముందు చెల్లికి కాల్ చేసి నాగురించి ఏమీ ఇవ్వద్దు అని చెప్పాలి .
" తమ్ముడూ ...... " 
అంతే ...... అంటూ అక్కయ్య ముద్దులు తలుచుకుని నవ్వుకున్నాను , హుండీని దేవుళ్ళ ముందు ఉంచి , చెల్లికి కాల్ చేసి విషయం చెప్పి అక్కయ్యకు.... మేడమ్ నెంబర్ పంపించాను , హాల్లోకి వచ్చి చుట్టూ చూసి ఆనందించి లోబ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ నాలుగువైపులా నాలుగు ముద్దులు వదిలాను , బామ్మ - అక్కయ్య తినకుండా వెయిటింగ్ అంటూ ఫ్లాట్ కు తాళం వేసుకుని కిందకువచ్చాను .
వస్తూ వెళుతున్నవాళ్ళు hi మహేష్ hi మహేష్ అంటూ పలకరించడం ఆనందించే విషయమే ...... , సంతోషంగా పలకరించి ఆటోలో అక్కయ్య ఇంటికి చేరుకున్నాను.

ఆటో శబ్దానికి తమ్ముడూ అంటూ అక్కయ్య పరుగున బయటకు రావడం చూసి స్టాప్ అంటూ కేకవేశాను .
అంతే సడెన్ బ్రేక్ వేసినట్లు అక్కడే ఆగిపోయింది , బామ్మా ...... 
నీ తమ్ముడు వచ్చేశాడా ? వచ్చేస్తున్నాను తల్లీ ......
అక్కయ్య : కొద్దిసేపటి ముందే తెలిసింది బామ్మకు దర్శనం ఇచ్చావని మరి నాకు అంటూ ఆశతో అడిగింది .
ప్చ్ ప్చ్ ..... నాకూ తెలియదు .
అక్కయ్య : తమ్ముడూ ...... 
బామ్మ నవ్వుకుంటూ వచ్చి క్యారెజీ అందించారు - సాయంత్రం స్నాక్స్ ను ఆటోలోనే తింటూ వెళ్లడం చూసాను అందుకే ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా ఉంచాను - నీ అక్కయ్యను గదిలోపెట్టి తాళం వెయ్యనా ? .
థాంక్యూ బామ్మా ...... , ఇప్పుడు కాదులే , ముందు మీరు తినండి , అక్కయ్యా ..... sorry లవ్ యు అలా బుంగమూతి పెట్టదు అలకలో కూడా ముద్దుగా ఉన్నావులే , ప్రస్థుతానికైతే ఈ ఫ్లైయింగ్ కిస్ ......
అక్కయ్య జంప్ చేసిమరీ క్యాచ్ పట్టింది , గుండెలపైకి తీసుకుని లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... అంటూ సంతోషంతో బామ్మను చుట్టేసింది .
హమ్మయ్యా అక్కయ్య నవ్వింది - గుడ్ నైట్ తరువాత చెబుతాను అక్కయ్యా , రైట్ రైట్ ......

అపార్ట్మెంట్ కు చేరుకున్నాను , ఆటో కు డబ్బు ఇచ్చేసి మెయిన్ గేట్ వైపు ఒక అడుగు వేశానో లేదో ...... వెనకనుండి అలలు వెల్కమ్ చేస్తున్నట్లు సౌండ్స్ చేస్తుండటంతో , లవ్ టు కమింగ్ అంటూ బీచ్ లోకివెళ్లి వెలుగులో కూర్చుని ఓపెన్ చేసాను .
రోటీ - కూర్మా - రైస్ - దాల్ - వడియాలు - పెరుగన్నం - ఊరగాయ ...... అచ్చతెలుగు భోజనం , లవ్ యు బామ్మా అంటూ అక్కయ్యకు మెసేజ్ చేసి టేస్ట్ చేసాను , లంచ్ లానే సూపర్ ..... అంటూ మళ్లీ మెసేజ్ చేసాను .
" పొగడ్తలన్నీ బామ్మకే అన్నమాట , కనీసం ముద్దులైనా నాకివ్వు " 
ఆకలేస్తోంది - డిస్టర్బ్ చెయ్యకు అక్కయ్యా ......
" ముద్దులు అడిగితే చాలు ఇలా ...... , సరే తృప్తిగా భోజనం చెయ్యి , మేమూ తింటున్నాము " 
లవ్ యు అక్కయ్యా అంటూ చంద్రుడి వెన్నెలలో అలలను వీక్షిస్తూ కడుపునిండా భోజనం చేసి నీళ్లు త్రాగాను , క్యారెజీ శుభ్రం చేసి నీళ్ళల్లోకి వెళ్ళిపోయాను , నిన్న ఎప్పుడో చెల్లితో కలిసి ఆడుకున్నాను అంటూ చెల్లీ - అక్కయ్యలు ఉన్నట్లుగా ఊహించుకుని సమయాన్ని మరిచిపోయి ఎంజాయ్ చేసాను .

" తమ్ముడూ ...... చాలారోజుల తరువాత మళ్ళీ చదువుకుంటున్నాను - చాలా చాలా ఆనందం వేస్తోంది " 
గో టాపర్ గో ......
" స్మైలీలు ..... "
అయితే డిస్టర్బ్ చెయ్యకూడదు గుడ్ నైట్ అక్కయ్యా ..... ఉమ్మా .
" ముద్దుపెట్టావు కాబట్టి హ్యాపీ - గుడ్ నైట్ తమ్ముడూ హాయిగా నిద్రపో " 
అమ్మో 10 గంటలు అయ్యింది అప్పుడే , పూర్తిగా తడిచిపోయాను - క్యారెజీ తీసుకుని ఫ్లాట్ చేరుకున్నాను , బట్టలన్నీ విప్పి వాషింగ్ మెషీన్ లోకి చేర్చి షవర్ కింద వెచ్చగా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చాను ......
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 25-01-2024, 01:43 PM



Users browsing this thread: 9 Guest(s)