Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#16
సర్ ఇక్కడే ఇక్కడే ఆపండి నేను వెళతాను .

సర్ : నిన్ను జైలు గేట్ వరకూ వదలడానికి రాలేదు , జైలు నుండి బయటకు తీసుకొచ్చి ఈ బ్యూటిఫుల్ వైజాగ్ లో స్వేచ్ఛగా తిరిగేలా చెయ్యడానికి వచ్చాము .
సర్ ...... అంటూ కళ్ళల్లో చెమ్మ .
కీర్తి : అవును అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .

సర్ హార్న్ కొట్టడంతో మెయిన్ గేట్ సెక్యూరిటీ సెల్యూట్ చేసి గేట్ తెరిచారు .
సర్ సర్ ...... జైలు లోపలికి మేడమ్ గారు - కీర్తి వద్దు .
సర్ : గుడ్ బాయ్ అంటూ సైడ్ కు కారుని ఆపారు .
డాడీ ..... అన్నయ్యతోపాటు నేనూ వస్తాను అంటూ కీర్తి .
సర్ : మీ అన్నయ్య ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు .
కీర్తి : అన్నయ్యా ......
ప్లీజ్ ప్లీజ్ కీర్తీ , లోపల అందరూ నేరస్థులే , వాళ్ళను చూస్తేనే భయపడతాము , పిల్లలను ఎత్తుకుని వెళ్ళేవాళ్ళూ ఉన్నారు , వారిని చూడటం కూడా పాపమే ..... , అలాంటివాళ్లను మా కీర్తి చూడనేకూడదు , మమ్మీ దగ్గరకు వెళ్లు ప్లీజ్ ......
మేడమ్ : మా కీర్తి అన్నాడు కీర్తి తల్లీ ......
కీర్తి : థాంక్యూ అన్నయ్యా అంటూ ముద్దుపెట్టింది , అన్నయ్య మాట వినాలి కాబట్టి వెళుతున్నాను , డాడీ ..... తొందరగా అన్నయ్యను తీసుకొచ్చేయ్యాలి , ఫ్లైట్ ఎక్కేంతవరకూ ఇక అన్నయ్యతోనే ......
సర్ : నీ ఇష్టం తల్లీ .......
సంతోషంతో కీర్తిని వెనుక కూర్చున్న మేడమ్ కు అందించి కారు దిగాను , కారు వైపే చూస్తూ లోపలికివెళ్లాము .

వచ్చేశాడు ...... మారనే మారవు కదా అంటూ లాఠీతో కొట్టబోయి బాధతో లాఠీనీ ప్రక్కకు విసిరేశారు జైలర్ , ఇంకేంట్రా చూస్తున్నారు ఆనందం కొద్దిసేపే వెళ్ళండి వెళ్ళండి వెళ్లి బాధపడండి అంటూ ఏదో ఆశతో ఎదురుచూస్తున్న కొద్దిమంది ఖైదీలను పంపించేశారు , వాళ్ళు నిరాశతో అక్కడే వర్క్ చూస్తుండిపోయారు .
నాకు నవ్వు వచ్చేసింది .
జైలర్ : అయినా నవ్వు ఎలా వస్తుంది మహేష్ ......
Sorry జైలర్ గారూ ...... నావల్లనే ఆలస్యం అయ్యింది , వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్ళాలి అంటూనే ఉన్నాడు .
జైలర్ : కమిషనర్ సర్ ...... నో నో నో ఇప్పుడు ప్రెసిడెంట్ భవన్ స్పెషల్ ఆఫీసర్ కదూ అంటూ సెల్యూట్ చేశారు , ఏదో గుర్తుకువచ్చినట్లు విక్రమ్ విక్రమ్ ..... కీర్తి ఎలా ఉంది ముందు ఆ విషయం చెప్పు .
సర్ : మహేష్ వలన మళ్లీ జన్మించింది .
జైలర్ : అంటే అంటే ...... న్యూస్ లో చెబుతున్న ఆ అజ్ఞాత బాలుడు - రియల్ బాల సాహసవీరుడు మహేష్ అన్నమాట , మహేష్ ...... అంటూ వచ్చి కౌగిలించుకున్నాడు , తాతయ్యా తాతయ్యా ..... అంటూ ముద్దుగా పిలిచే బంగారాన్ని కాపాడావు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ ....... , అయినా ఏంటి విక్రమ్ ...... కీర్తిని కాపాడిన హీరోని మళ్లీ జైలుకు తీసుకొచ్చావు అంటూ కోప్పడ్డారు .
సర్ ..... నావైపు చూసారు .
జైలర్ : అర్థమైంది అర్థమైంది మహేషే లాక్కుని వచ్చి ఉంటాడు , ఆ మంచితనమే ఇంతకాలం జైలులో ఉండేలా చేసింది , జైలులోకి వచ్చిన సంవత్సరం లోపే మహేష్ మంచితనం తెలిసి నేనే స్వయంగా ఏమి జరిగిందో తెలుసుకుని బాధపడ్డాను , కేస్ క్లోజ్ చేసిన సెక్యూరిటీ అధికారి ప్రమోషన్ తో వేరే స్టేషన్ కు వెళ్లిపోవడం వలన ఏమీచెయ్యలేకపోయాను , మహేష్ క్విక్ లెర్నర్ కాబట్టి చదువులో గేమ్స్ లో ఎప్పుడూ టాప్ లోనే ఉండేవాడు , స్కూల్ కాంపిటీషన్స్ మరియు స్పోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు అటునుండి ఆటే వెళ్ళిపొమ్మని నీకోసం ఎవ్వరూ వెతకరని ప్రతీసారీ చెప్పడం - నిజాయితీగా వచ్చెయ్యడం , ఈ చివరి పరీక్షకు వెళ్లేముందు స్ట్రాంగ్ గా చెప్పాను ఇదే నీ ఫైల్ నువ్వు exam రాసి అటునుండి ఆటే వెళ్లిపోవాలి - ఈ ఫైల్ కాల్చేశాను అంటే నీ గురించి ఎవ్వరికీ తెలియదు తిరిగొచ్చావో దెబ్బలు పడతాయి అన్నాను అయినా వచ్చేశాడు , ఏమైనా అంటే మాత్రం నేను ఖైదీని జైలర్ మళ్లీ ఎప్పుడైనా తప్పుచేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కవచ్చు అప్పుడు నావలన మంచివారైన మీరు సంజాయిషీ చెప్పుకోకూడదు - మీరు జైలర్ గా ఉండటం వలన నాలాంటి పిల్లలు చాలామంది హ్యాపీగా చదువుకుంటున్నారు , మీకేమీ కాకూడదు అంటాడు - ఇక్కడి నుండి వెళ్ళేది నిజాయితీగానే అంటాడు , అంత మంచివాడు ......
సర్ : సెల్యూట్ చెయ్యాల్సినది నీకు మహేష్ ......
సర్ అంటూ ఆపాను .
సర్ : జైలర్ గారూ ..... మహేష్ ను నిజాయితీగానే బయటకు తీసుకెళదాము .
జైలర్ : అలా జరగాలంటే కేస్ క్లోజ్ చేసిన సెక్యూరిటీ అధికారి తో కోర్టుకు వెళ్ళాలి .

వచ్చేశాడు స్వయంగా నేనే తీసుకొచ్చాను , ఈ హీరోనేనా ..... కీర్తిని కాపాడింది థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ చేతిని కలిపారు , అక్కడ బయట నీ సిస్టర్ ఇంకా ఎంతసేపు అంకుల్ అంటూ ఎదురుచూస్తోంది , వెళదామా అంటే అన్నయ్య చెప్పాడు ఇక్కడే ఉండమని అన్నది .
సర్ : ఎంతసేపు వేచి చూడాలిరా ..... , సిటీ కమిషనర్ అయ్యావని బలుపా .....
కమిషనర్ : Sorry sorry స్పెషల్ ఆఫీసర్ ...... , ఈయనగారు సెటిల్మెంట్ కు వెళ్ళాడు , తిని తిని ఈ బొజ్జను ఎంతలా పెంచాడో చూడు .
సర్ కోపం కంట్రోల్ చేసుకోలేక చెంప చెళ్లుమనిపించాడు , ఒక పిల్లాడి నాలుగేళ్ళ జీవితాన్ని నాశనం చేసావు .
లోపలికివచ్చి నన్ను చూడగానే చెమటలు పట్టేసాయి ఆ సెక్యూరిటీ అధికారి కు ..... , sorry సర్ అంటూ తలదించుకున్నాడు .
సర్ : రేయ్ విశ్వ వెంటనే సస్పెండ్ చేసేయ్ రా , లంచాలు తిన్న డబ్బు ఉందికదా దాంతో బ్రతికేస్తాడులే , చేసిన తప్పు రేపు హెడ్లైన్స్ లో రావాలి .
సెక్యూరిటీ అధికారి : సర్ సర్ సర్ .......

వద్దు వద్దు విక్రమ్ సర్ ...... , ఈ సర్ చేసిన తప్పుకు వాళ్ళ ఫ్యామిలీ అవమానాలకు గురికాకూడదు , స్కూలులో పిల్లలు - సమాజంలో మాటలకు మేడమ్ గారు బాధపడకూడదు .
సెక్యూరిటీ అధికారి : తన తప్పు తెలుసుకున్నట్లు sorry మహేష్ అంటూ మోకాళ్లపై చేరాడు , క్షమించరాని తప్పు చేశాను , అయినాకూడా నువ్వు .... నా ఫ్యామిలీ గురించి ఆలోచించావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు , ఇకనుండీ మంచిగా ఉంటాను .
చెప్పడం కాదు విక్రమ్ సర్ ..... , ఇప్పటివరకూ తిన్న లంచం డబ్బులతో అనాథ శరణాలయాన్ని బాగుచేయించాలి .
సర్ : చేస్తాడు , ఈరోజే మొదలుపెడతాడు , ఇదిగో ఫైల్ ఏమిచేస్తావో తెలియదు , మహేష్ వెంటనే నిజాయితీగా బయటకు రావాలి .
సెక్యూరిటీ అధికారి : govt లాయర్ కు ఇప్పుడే కాల్ చేస్తాను - స్వయంగా వెళ్లి జడ్జి గారికి విషయం మొత్తం చెబుతాను - ఏ శిక్షను విధించినా అనుభవిస్తాను .
సర్ .......
సర్ : నువ్వు శిక్షిoపబడటం కాదు కాదు నీవలన నీ కుటుంబం శిక్షింపబడటం మహేష్ కు ఇష్టం లేదు , మేమూ వచ్చి ఏదో ఒక విధంగా సరిచేస్తాము .
సెక్యూరిటీ అధికారి : థాంక్యూ థాంక్యూ సర్ అంటూ మోకరిల్లాడు .
సర్ : ఇవన్నీ వద్దు , మహేష్ చెప్పినట్లు శరణాలయం మారిపోవాలి .
సెక్యూరిటీ అధికారి : అలాగే అలాగే సర్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ లేచాడు .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-11-2023, 06:21 PM



Users browsing this thread: 3 Guest(s)