28-10-2023, 07:17 PM
తాను ఆలా చూసేసరికి ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది... మొఖం మీద చిన్న నవ్వు వచ్చింది... ఇక మేడం పాఠం మొదలు పెట్టింది.. అందరూ ఇంట్రెస్ట్ గా వింటున్నారు... నాకు ఏమో ఎలా చేయాలి... ఎం చేస్తే బాగుండు... అని అవే ఆలోచనలు.. ఆలా ఆలా సాయంత్రం అయ్యింది... ఇక అందరం జబ్బాలకి బ్యాగ్ లు వేసుకొని కిందికి వెళ్తున్నాం నా ఫ్రండ్స్ తో పాటు మా చెల్లి ఏమో హాసిని తో మాట్లాడుతుంది.. ఆలా కిందికి వచ్చి చూసే సరికి వాళ్ళ నాన్న రెడీ గా ఉన్నారు తనని తీసుకు వెళ్ళడానికి చెల్లికి బాయ్ చెప్పి బండి ఎక్కి వెళ్ళిపోయింది....
ఇక నేను మా చెల్లి దగ్గరికి వెళ్లి నీకు ఎప్పుడు తను పరిచయం అయ్యింది పొట్టి అని అడిగా... (మా చెల్లి నిక్ నేమ్ పొట్టి గమనించగలరు)..పొట్టి : తను వచ్చిన రోజే పరిచయం అయ్యింది రా..
నాని : ఓహో ఎం అంటుంది ఏంటి నీతోనే మాట్లాడుతుంది మోర్నింగ్ నుంచి
పొట్టి : తనకి ఇంకా ఫ్రెండ్స్ ఎవరు అవలేదు రా నాతోనే ఎక్కువ మాట్లాడుతుంది....
నాని : ఓహో అవునా తన ఇల్లు ఎక్కడ పొట్టి..
పొట్టి : నన్ను అదోలా చూస్తూ తన ఇల్లు నీకు ఎందుకు రా డాడీ కి చెప్పాలా...
నాని : అరే ఇప్పుడు నేను ఎం అన్నానే బాబూ ఊరికే తెలుసుకుందాం అని అడిగా అంతే... దానికే డాడీ దాక ఎందుకు పొట్టి... అయినా చెల్లి నన్ను ఇంకా అనుమానం గానే చూస్తుంది..
నేను మేటర్ డైవర్ట్ చేయడానికి చాక్లేట్ తింటావా పొట్టి.. అని జేబులో నుంచి తీసి తనకి ఇచ్చా..
నన్ను కోపంగా చూస్తూ చాక్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది..
ఆలా ఇంటికి వచ్చేసాం.. నేను ఫ్రెష్ బయటికి వెళదాం అనుకున్న కానీ హోమ్ వర్క్ ఉంది... మళ్ళీ నాన్న కి తెలిస్తే తాట తీస్తాడు అని బుద్దిగా ఫ్రెష్ అయ్యి కాలేజ్ డ్రెస్ విప్పేసి ఒక షార్ట్ ఒక బనియన్ వేసుకొని కూర్చొని రాయటం మొదలు పెట్టాను... ఆలా ఒక గంట కి కంప్లీట్ చేసేసా.. అమ్మ చాయ్ ఇచ్చింది తాగురా అని.. అది తాగుతూ టీవీ చూస్తున్న సడన్ గా మేడం చెప్పిన మ్యాప్ గుర్తు వచ్చింది... అప్పటికి టైం 6:30 అవుతుంది.. డాడీ రోజు 7:00 వరకు వచ్చేస్తాడు... నేను టక టక టీవీ దగ్గరికి వెళ్లి మొబైల్ తీసుకొని డాడీ కాల్ చేశా.. (మొబైల్ అంటే ఏదో అనుకోకండి చిన్న నోకియా డబ్బా ఫోన్ అప్పట్లో అదే కదా)
నాని : హలో డాడీ.
డాడీ : చెప్పు రా నాని.
నేను : వచ్చేటప్పుడు బుక్ స్టాల్ లో పేపర్ షీట్ తీసుకురా డాడీ ప్రాజెక్ట్ వర్క్ ఉంది...
డాడీ : ఇంకేం కావాలి రా.
నాని : ఇంకా ఒక స్కేల్ ఇంకా స్కెచ్ లు ఉంటే తీసుకొని రా డాడీ అవి కూడా కావాలి...
డాడీ : హ్మ్మ్ సరే రా.
అప్పుడే మా చెల్లి ఎక్కడి నుంచి వచ్చింది ఏమో డాడీ నాకు చిప్స్ ప్యాకెట్ ఇంకా పకోడీ తీసుకొనిరా డాడీ..
ఇంకా అమ్మ పెరుగు కూడా తీసుకోని రమ్మంది...
డాడీ : సరే పొట్టి తీసుకు వస్తా లే బాయ్..
పొట్టి : బాయ్ డాడీ..
ఎప్పుడు తిండి గోలే కదా అని..
ఇక నేను టీవీ పెట్టుకొని jetex ఛానల్ చూస్తున్న... ఆలా ఒక గంటకి నాన్న వచ్చాడు ఇంట్లోకి అన్ని తీసుకోని చెల్లి ఏమో వురికి వెళ్లి అన్ని తీసుకొని టేబుల్ మీద పెట్టింది.. నేను ఆహ్ మ్యాప్ తీసుకొని స్కెచ్ లు తీసుకొని చూస్తున్న . ఎరా ఇవేనా నువ్ చెప్పినాయి అని డాడీ అడుగుతుంటే హా ఇవే డాడీ అని తీసుకొని వెళ్ళిపోయా..
అమ్మ కూడా అప్లుడే ఇంట్లోకి వచ్చింది ముచ్చట్లు పెట్టి..
ఇక డాడీ కూడా ఫ్రెష్ అయ్యి మందు తాగుతున్నాడు టీవీ చూస్తూ.. అమ్మ చెల్లి కూడా చూస్తున్నారు.. నేను నా పని మొదలు పెట్టేసా.. కొంచము కొంచము గీస్తు గీస్తు టైం చూసుకోలే.. చుస్తే టైం 9:30 అవుతుంది... ఎలాగో ఆలా ఫినిష్ చేయాలి అని వేస్తున్న...
మొత్తానికి బానే వచ్చింది మ్యాప్... ఒకసారి డాడీ కి అమ్మ కి చూపించ.. అమ్మ ఏమో నువ్ బంగారం రా ఎంత బాగా గీసావో అని మేచ్చుకుంటూ ఉంటే డాడీ పరవాలేదు రా నువ్ చదవకపోయినా రోడ్ ల మీద బొమ్మలు గీసి అయినా బతుకుతావ్ లేరా అని అంటే... అప్పడు అమ్మ అబ్బా ఊరుకోండి ఎప్పుడు వాడిని తిడుతూనే ఉంటారు.. రేయ్ నువ్ పాడుకోపో.. పొద్దునే లేవాలి అని మళ్ళీ నన్ను పంపించింది....
చెల్లి కూడా నా మ్యాప్ చూసి డాడీ చెప్పింది నిజమేరా అంటూ నవ్వుతుంది.... నేను కోపం తో దాని జుట్టు లాగి వెళ్లి అమ్మ దగ్గరకి వెళ్ళిపోయా... చెల్లి ఏమో డాడీ దగ్గరికి వెళ్ళింది చూడు డాడీ అంటూ... ఆలా రాత్రి గడిచిపోయింది..
పొద్దున్న మళ్ళీ అమ్మ లేపుతుంది.. లేవరా టైం అయ్యింది అని...
నాకు ఈ డ్రాయింగ్ గురించి గుర్తు లేదు...
సడన్ గా లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి ఇడ్లీ ఉంటే తినేసి చెల్లి నేను కాలేజ్ కి వెళ్లిపోయాం....
తరువాత ఒక్కో క్లాస్ జరుగుతుంది... మధ్యాహ్నం అయ్యింది.. సోషల్ మాధవి టీచర్ వచ్చింది...
నాకు ఏమో ఎప్పుడు చూపిద్దాం మేడం కి అని ఉంది.. కానీ మేడం ఏమో అడగట్లేదు... మర్చిపోయింది కావచ్చు అని నేను కూడా సైలెంట్ గా ఉన్న... అప్పుడే మా ఫ్రెండ్ గాడు మేడం నిన్న తేజ కి చెప్పారు కదా మ్యాప్ గురించి వాడు చేసి తీసుకు వచ్చాడు మేడం....
ఓహ్ అవును కదా మర్చిపోయా ఇంత తొందరగానే చేసావా తేజ.. ఇది ఇటు ఇవ్వు చూద్దాం..
నేను వెళ్లి ఇచ్చి వచ్చా.. అపుడు మేడం ఓపెన్ చేసి చూసి హ్మ్ బాగుంది తేజ... అలానే క్లాస్ లో ఉన్న అందరికి చూపించింది... మేడం కూడా ఒకసారి తేజ కి క్లాప్స్ కొట్టండి బాగా చేసాడు కదా అంటే అందరూ చప్పట్లు కొడుతుంటే భలే అనిపించింది నాకు ... సరే క్లాస్ అయిపోయాక ఆహ్ గోడ కి అతికించండి.. ఓకే నా అంటూ మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసింది... క్లాస్ అయిపోయిన తరువాత నేను ఫ్రెండ్స్ అందరం కలిసి గోడ కి ఆంటీచ్చేశాం... ఇక తరువాత అన్ని క్లాస్లు మామూలే... అప్పుడప్పుడు తన వైపు చూసేవాడినికానీ నా వైపు చూసేది కాదు తను.... ఆలా ఆలా ఆరోజు కాలేజ్ అయిపోయింది... ఇక నేను వెళ్తు ఉంటే మా చెల్లి వచ్చి అగు రా ఒక్కడివే వెళ్తున్నావ్ నేను వస్తా అని తెల్సు కదా అని అంటే... సరే రావే వెళ్దాం.. అప్పుడే మా చెల్లి హాసిని రావే వెళదాం అని పిలిచింది... నాకు ఏమో గుండె జల్లుమంది.. తన ని ఎందుకు పిలుస్తుంది అని... తాను వచ్చి మా చెల్లి పక్కన చేరింది... ముగ్గురం మెట్లు దిగుతూ కిందికి వెళ్తున్నాం... అప్పడూ చెల్లి నీకు చెప్పలేదు కదా వీడు నా అన్నయ్య.. తేజ.. ఆలా చెప్పగానే నా వైపు చూసింది నేను మొహమాటం గా హాయ్ కళ్ళతోనే చెప్పా..
తాను నా పేరు హాసిని అని షేక్ హ్యాండ్ ఇచ్చింది.... ఆలా చేతిలో చేయి పెట్టగానే చిన్న పాటి షాక్ నాకు...
తన చేయి అయితే ఎంత సాఫ్ట్ గా ఉందొ లేత కొబ్బరి ముక్క లాగా (ఆహ్ స్పర్శ ఇప్పటికి నాకు గుర్తు ఉంది)
ఆహ్ చేతిని విడిచిపెట్టాలి అనిపించలేదు.. కానీ ఎక్కువ సేపు పట్టుకుంటే బాగోదు అని వదిలేసా..
ఇక మాటల్లో తాను వాళ్ళ డాడ్ పేరు సంపత్ అని లారీ ట్రాన్స్పోర్ట్ లో సూపెర్వైసోర్ అని కొత్తగా ఈ ఊరికి వచ్చారు అని తెల్సింది ఇంకా తనకి ఇద్దరు సిస్టర్స్ అని కూడా తెల్సింది .. ఆలా ఆలా మాట్లాడుకుంటూ కిందికి వచ్చేసాం..కిందికి వచ్చేసరికి రెడీ గా ఉన్నాడు వాళ్ళ నాన్న....
తను వెళ్తున్న వెళ్తున్న ఈసారి చెల్లి కి ఇంకా నాకు కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది...
నేను అలానే చూస్తూ ఉన్న తాను వెళ్లిన వైపు ఇంతలో మా చెల్లి అన్నయ్య గారు వెళదామా ఇక లేకపోతే ఇంకొంచము సేపు చూస్తావా అని వెటకారం గా అంది... అలా అని అనేసరికి పదపద వెళదాం అని ఇంటికి వెళ్ళాము...