25-10-2023, 10:50 PM
లోపలకి వెళ్లి చూసాను. అక్కడ చిత్ర మరియు అనన్య ఉన్నారు. C.వర్ష వచ్చి సారి అంది. నేను అసలు మీకు ఏంటి ఇక్కడ పని అని అడిగాను. అనన్య అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ టైమ్ లో అంది. నాకు ఫుల్ కోపం వచ్చింది. చిత్ర తో నువ్వు ఎపుడు వచ్చావు వైజాగ్ నుంచి అని అడిగాను. ఇప్పుడే వచ్చాను అనన్య పిక్ చేసుకుంది అంది. ఏమి పని నీకు ఇక్కడ అన్నాను. నాకు వర్ష తో పని ఉంది అంది. అదే ఏంటి అని అడిగాను. నీకు ఎందుకు అవి అన్నీ అంది. అరే నీకు నేను క్లోజ్ కదా నాకు చెప్పకూడదా అన్నాను. చెప్పేది అయితే చెప్పకుండా ఉంటానా అంది. నువ్వు అయినా చెప్పు అనన్య అని అడిగాను. అనన్య ఏదో చెప్పబోతుంటే చిత్ర ఆపి ఇప్పుడు నువ్వు వెళ్తే బాగుంటది మాకు, మేము కొంచెం వర్క్ మాటర్ మాట్లాడుకోవాలి వెళ్ళిపో అంది. C.వర్ష కూడా ప్లీజ్ సుమంత్ ఇప్పుడు వెల్లు రేపు ఉదయం నేను కలుస్తా అంది. అన్ని సార్లు వెల్లు వెల్లు అంటుంటే నాకే చిరాకు వేసి వచ్చేసాను. అసలు నేను వెళ్ళింది ఒక పని మీద కానీ నాకు జరిగింది ఇంకొకటి, అసలు ఏంటి ఇది అంతా చిత్ర ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాను. ఒక ఫుల్ బాటిల్ తాగేసి పడుకున్న. ఉదయం లేచేసరికి తల అంతా ఫుల్ నొప్పిగా అనిపిస్తుంది, హ్యాంగోవర్ అయి ఉంటుంది అని ఒక పెగ్ అయినా తాగాలి అని మందు తెచ్చుకుని తాగి కొంచెం రిలాక్స్ అయ్యాను. అనన్య కి కానీ c. వర్ష కి కానీ ఫోన్ చేయాలి అనుకున్న, కానీ వాళ్ళే చేస్తే బాగుంటది అని రిలాక్స్ అవుతూ పడుకున్న. ఉదయం 11:30 టైమ్ లో c. వర్ష వచ్చింది. మందు బాటిల్ చూసి పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసావా అంది. అదంతా ఎందుకు కానీ అసలు విషయం చెప్పు అన్నాను. నువ్వు అసలు ఆ టైమ్ లో ఎందుకు వచ్చావు అంది. నీకు ఫోన్ చేశా నువ్వు లిఫ్ట్ చేయలేదు నీతో ఎందుకో మాట్లాడాలి అనిపించింది అందుకే వచ్చాను అన్నాను. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తోచాను అంది. మామూలుగానే అన్నాను. నిజం చెప్పు అంది. హైదరాబాద్ లో మనం ఇద్దరం కలిసి ఉన్న రోజులు గుర్తొచ్చాయి అందుకే అన్నాను. సరే వదిలేయ్ ఇక అంది. చిత్ర, అనన్య ఏమి చేస్తున్నారు మీ ఇంట్లో అది అంత రాత్రి అన్నాను. చిత్ర కి ముంబై ట్రాన్స్ఫర్ అయింది, ఈ రోజే రిపోర్టింగ్ అంట, నాకు ఫోన్ చేసింది, ఫోన్ చేశాక పిలవకుంటే బాగుండదు అని పిలిచాను అంతే అంది. అనన్య ఏమి చేస్తుంది అన్నాను. అనన్య నే airport నుంచి పిక్ చేసుకుని వచ్చింది అని చెప్పింది. నాకు ఇద్దరు తెలుసు కదా నన్ను ఇంట్లోకి ఎందుకు రానివ్వలేదు నువ్వు అని అడిగాను. చిత్ర నే అసలు నీకు డైరెక్ట్ గా ఈ రోజు సాయంత్రం కలిసి షాక్ ఇవ్వాలి అనుకుంది కానీ నువ్వే మాకు షాక్ ఇచ్చావు అంది. అంత లేదు మీరు ఏదో పని మీద ఉన్నారు అందుకే నన్ను పంపేశారు అన్నాను. ఏమి లేదు అసలు నువ్వు ఎక్కువ థింక్ చేయకు అంది. నాకు అర్ధం అయింది c. వర్ష చెప్పింది నిజమే అయి ఉండాలి లేదా అనన్య నీ అడిగి తెలుసుకోవాలి అని అనుకుని, వర్ష తో బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగాను. తను ఇప్పుడు లంచ్ టైం ఇంకా టిఫిన్ ఏంటి అంది. సరే చాల రోజులకీ ఇంటికి వచ్చావు తినేసి వెల్లు ఆర్డర్ పెడతా అన్నాను. నువ్వు ఫ్రెష్ అవ్వు నేను పెడతాను అంది. సరే అని నేను వాష్ రూమ్ లో కి వెళ్లాను. స్నానం చేసి వచ్చి చూస్తే వర్ష కిచెన్ లో ఉంది. ఏమి చేస్తున్నావు ఆర్డర్ పెట్టచ్చు కదా అన్నాను. డైలీ అదే తింటావు కదా అని ఈ రోజు నేను చేద్దాం అనుకున్న కానీ ఇక్కడ మ్యాగీ నూడుల్స్ తప్ప ఏమీ లేవు అంది. నేను ఫుడ్ అసలు చేసుకోను అవి కూడా ఎప్పుడు అయినా ఎమర్జెన్సీ కోసం అంతే అన్నాను. అదే చేశాను పద తిందం అంది. ఆర్డర్ పెట్టి ఉంటే బాగుండు అన్నాను. వదిలేయ్ నచ్చకుంటే పెట్టుకో అంది. సరేలే అని డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళాము. తను సర్వ్ చేసి తింటూ ఉంది. మేడం కి ఈ రోజు మొత్తానికి ఫ్రీ గా ఉన్నారేమో అన్నాను. లేదు నిన్ను కలవాలి అనే వచ్చాను అంది. నువ్వు కలవకపోయున నేను ఏమి చేస్తాను అన్నాను. అలా కాదు అంత రాత్రి వచ్చావు కదా ఏంటో అని వచ్చాను అంతే అంది. ఒకటి అడగనా అన్నాను. అడుగు అంది. ఫీల్ అవ్వకు చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటున్న అన్నాను. అడుగు కానీ మన బ్రేకప్ నా లవర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు అంది. ఆ రెండు టాపిక్స్ కాదు లే అన్నాను. అయితే నువ్వు ఏదైనా అడగచ్చు అంది. నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నాను. ఏమి లేవే అలా ఎందుకు అడుగుతున్నావు అంది. నాకు ఎందుకో నీ ఫేస్ లో గ్లో అనేది కనిపించడం లేదు చాలా రోజుల నుంచి, ఎప్పుడు చూసినా డల్ గా ఏదో పోయిన దానిలా ఉంటున్నావు అన్నాను. అదేమీ లేదు వర్క్ ప్రెషర్ అంది. అంత వర్క్ టెన్షన్ ఉంటే నాకు చెప్పు ఏదైనా సహాయం చేయగలను ఏమో అన్నాను. నువ్వే ఫుల్ బిజీగా ఉన్నావు, నీ చుట్టూ అంతా ఫేక్ పీపుల్, నిన్ను ఎప్పుడు డౌన్ చేయాలి అని చుసే వాళ్ళే, నీకు అది సెట్ చేసుకోడానికి టైమ్ లేదు మళ్ళీ నా టెన్షన్ చూస్తావా అంది. ఏంటి అంత మాట అనేసావు అన్నాను. ఏమి లేదు లే అని తను లేచి కిచెన్ లోకి వెళ్ళింది. నాది కూడా తినడం అయిపోవడం తో వెళ్ళాను. తను ఇక వెళ్తాను అంది. నేను హేయ్ వర్ష ఒక నిముషం అన్నాను. ఏంటి అంది. ఏమి లేదు, నువ్వు ఒక్కసారి కూడా నన్ను miss కాలేదా అన్నాను. లేదు అంది. నిజం చెప్పు అన్నాను. తను చెప్పబోతుంటే డోర్ బెల్ మోగింది. ఈ టైమ్ లో ఎవరూ అని చూస్తుంటే సెక్యూరిటీ అధికారి వాళ్ళు వచ్చారు.