23-10-2023, 08:18 PM
ఇక విశాల్ చెప్పడం మొదలు పెట్టాడు. C. వర్ష మేడం కి మీ మీద ఇప్పటికీ చాల ఇష్టం ఉంది సార్ కానీ రమేష్ బెదిరించడం వల్ల తన డ్రీమ్ అయిన బిజినెస్ కి ప్రాబ్లెమ్ అని ఇష్టం లేకున్న మీకు దూరంగా ఉంటుంది అన్నాడు. రమేష్ ఏమి చేయగలడు అసలు తన సొంత బిజినెస్ కదా అన్నాను. మేడం బిజినెస్ కి రీచ్ బాగుండాలి అంటే పెద్ద వాళ్ళు ఇన్వెష్ట్ చేస్తే బాగంటుందని నర్మద మేడం తో ఇన్వెష్ట్ చేయించుకుంది, రమేష్ జైల్ నుంచి వచ్చాక నర్మద మేడం నుంచి ప్రెషర్ తెచ్చాడు, మేడం ఏమి చేయలేని పరిస్థతి కి తెచ్చారు, అందుకే మేడం మీకు దూరంగా వెళ్ళింది అన్నాడు. మరి మీ మేడం కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్నాను. వాడా భూషణ్ పటేల్ వాడు, వాడు మేడం కి PA నా కంటే ముందు, వాడిని నర్మద మేడం పంపింది, మీరు ఫీల్ అయ్యి వదిలేస్తారు అని అన్నాడు. ఇప్పుడు లేడా వాడు అన్నాను. ఉన్నాడు కానీ రమేష్ తీసుకెళ్ళాడు పని ఉందని అన్నాడు. మరి వాడితో అంత క్లోజ్ గా ఉండేది కదా అన్నాను. అలా ఉంటేనే కదా మీకు అనుమానం వచ్చి పట్టించుకోరు అన్నాడు. అది అంతా వదిలేయ్ నీకు ఎలా తెలుసు ఇది అంత అన్నాను. మేడం మీ మీద రైడ్ జరిగే ముందు రోజు బాధలో మందులో నాకు చెప్పేసింది అన్నాడు. మీ మేడం మందు తాగదు కదా అన్నాను. మీరు లేరని బాధలో స్టార్ట్ అయ్యింది అన్నాడు. సరే నీకు ఎంత తాగాలి అని ఉంటే అంత తాగు బిల్ నేను కడతాను అని చెప్పాను. వాడు థాంక్స్ సర్ అని నా మీద ప్రామిస్ చేశారు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. సరే లాస్ట్ ఒకటి అడుగుతాను చెప్పు అన్నాను. ఏంటి సార్ అన్నాడు. నా మీద రైడింగ్ జరుగుతుంది అని మీ మేడం కి ఎవరు చెప్పారు అన్నాను. నాకు తెలిసి రమేష్ చెప్పి ఉంటాడు అన్నాడు. మరి మీ మేడం p. వర్ష పేరు చెప్పింది కదా అన్నాను. ఆమెకి కూడా చెప్పి ఉండచ్చు అన్నాడు. సరే నేను వెళ్తా ఇక కానీ నాకు అన్నీ చెప్తూ ఉండు మనీ ఇస్తుంట నీకు అని చెప్పి నా నంబర్ ఇచ్చాను. వాడు సరే అని వాడి నంబర్ ఇచ్చాడు. నేను వాడికి డబ్బులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళాను. నిద్ర రావడం లేదు, c. వర్ష కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, డైరెక్ట్ తన ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. తను వచ్చి తలుపు తీసి నువ్వేంటి ఇక్కడ అంది. నీతో మాట్లాడాలి అన్నాను. రేపు ఉదయం మాట్లాడుకుందాం వెల్లు అంది. నేను కనీసం వాటర్ అయిన ఇవ్వవా అన్నాను. బయట తాగు అంది. బయట ఎందుకు అంటున్న తను వినకుండా తలుపు వేస్తుంది. నేను తనని నెట్టి లోపలకి వెళ్ళాను. అక్కడ ఉన్న పర్సన్ ని చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది.