21-10-2023, 11:16 PM
ఇంటికి వచ్చాక కొద్దిసేపు అనన్య ఉండి వెళ్ళిపోయింది. నేను ఇక పడుకున్న. ఉదయం లేచి రెఢీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. మధ్యాహ్నం రైడ్ మొదలు అయింది. నాకు ముందు గానే తెలిసి ఉండటం వల్ల అంతా సెట్ చేసుకున్న. అర్ధ రాత్రి వరకు రైడ్ జరిగింది, ఇంటిలో మరియు ఆఫీస్ లో. ఒక రెండు లక్షలు దొరికాయి అంతే. సంతకాలు చేయించుకుని వెళ్ళారు.నేను ఇక రైడ్ అంతా అయిపోయాక అన్నీ సెట్ చేసుకుని ఇంటికి వెళ్ళాను. ఉదయం లేచి అనన్య కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పాను. తనని మనీ మరియు డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మన్న. తను వస్తా కానీ ఇప్పుడు కాదు అంది. మరి ఎప్పుడు వస్తావు అని అడిగాను. అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు లేని టైమ్ చూసుకుని వస్తా అంది. సరే అని నేను అలిసిపోయి ఉండటం తో పడుకున్న. మధ్యాహ్నం అనన్య ఫోన్ చేస్తే లేచాను. తను వస్తున్న అంది. సరే అని నేను లేచి ఫ్రెష్ అయ్యాను. తను బ్యాగ్స్ అన్నీ ఇచ్చి చెక్ చేసుకో అంది. పర్లేదు నీ మీద నమ్మకం ఉంది అన్నాను. తను మళ్ళీ రైడ్ జరిగితే దొరుకుతాయి కదా ఎక్కడ అయినా సేఫ్ ప్లేస్ సెట్ చేసుకో ప్రతిసారీ మా ఇంట్లో అంటే కష్టం కదా అంది. నేను అదే ఆలోచిస్తున్న అన్నాను. తను అయితే నీ పేరు మీద కాకుండా వేరే పేరు తో బ్యాంక్ లో లాకర్ తీసుకో అందులో ఉంచుకో అంది. ఎవరి మీద నమ్మకం లేదు నాకు అన్నాను. P. వర్ష ఉంది కదా అంది. అసలు లేదు తన మీద నమ్మకం అన్నాను. మరి ఏమి చేస్తావు అంది. నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది సో నీ పేరు మీదే తీసుకుందాం అన్నాను. నా మీద అంత నమ్మకం ఉందా అంది. నాకు ఇప్పుడు ముంబై లో నమ్మకం ఉంది అంటే నీ మీద మాత్రమే అన్నాను. ఎందుకో అంది. రైడ్ విషయం చెప్పింది నువ్వే కదా మరియు అన్నీ నీ దగ్గరే దాచాను అన్నాను. సరే అయితే అని ఒక పెద్దగా ఫేమస్ లేని బ్యాంక్ చూసుకుని వెళ్లి లాకర్ తీసుకున్నాం అనన్య పేరు మీద. అంతా లాకర్ లో సెట్ చేసుకుని తనకి ఇష్టం అయిన బీచ్ కి వెళ్ళాము. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడే అక్కడ చూస్తూ ఉంటే c. వర్ష ఒకడితో వచ్చింది. వచ్చిన వాడు తన బాయ్ ఫ్రెండ్ కాదు. ఎవడు వీడు అనుకుంటున్న. అయినా నాకు ఎందుకు లే అని అనన్య తో వెళ్దాం పద అన్నాను. ఏమైంది అంది. ఏమి లేదు అన్నాను. తను పక్కన అంతా చూసి ఓహో నీ పాత గర్ల్ ఫ్రెండ్ ఉందని వెళ్దాం అంటున్నవా అంది. అలా ఏమి లేదు లే అన్నాను. అయితే మనం క్లోజ్ గా ఉండేలా ఆక్ట్ చేద్దాం నువ్వు ఎలా జలస్ గా ఫీల్ అవుతున్నావో తను కూడా అలానే ఫీల్ అవుతుంది అంది. ఏమి వద్దు తల్లీ మళ్ళీ మీ అమ్మకో నాన్నకో చెప్పింది అనుకో పెద్ద తల నొప్పి, నాకు ఏమి అవసరం అంతా అన్నాను. నువ్వు ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడుతావు అంది. భయం కాదు లే కానీ నీకు చెప్పినా అర్థం కాదు అన్నాను. సరే లే అయితే వెళ్దాం పద అంది. ఇక లేచి వెళ్తుంటే c. వర్ష నే మా దగ్గరకి వచ్చి హేయ్ సుమంత్ ఎలా ఉన్నావు అంది. హా బాగున్న అన్నాను. నిన్న జరిగిన రైడ్ కి ఎక్కడో డిప్రెషన్ లో తాగుతూ ఉంటావు అనుకున్న బాగానే ఉన్నావ్ అంది. అయినా రైడ్ జరిగింది అని నీకు ఎలా తెలుసు అన్నాను. నాకు తెలిసిపోతాయి అంతే అంది. రైడ్ జరిగినా నేను ఏమి తప్పు చేయలేదు నాకు ఎందుకు భయం అన్నాను. నీకు భయం ఎందుకు ఉంటుంది పక్కనే అప్పుడు నేను ఇప్పుడు అనన్య ఉంది కదా, ఏంటి అనన్య అంతా నీ సూచనల ప్రకారం చేసి తప్పించు కున్నాడ అంది. అనన్య నాకు ఏమి తెలీదు ఊరికే ఇలా వచ్చాము అంతే అంది. నేను గెస్ చేయగలను లే ఒకే ఎంజాయ్ యువర్ టైమ్ అంటూ వెళ్ళింది. నేను వర్ష తో ఆగు నీకు ఎలా తెలుసో ఫస్ట్ అది చెప్పు అన్నాను. నీకు ఒక బెడ్ ఫ్రెండ్ ఉంది కదా తనే చెప్పింది అంది. తనకి పేరు లేదా అన్నాను. అంత మంది బెడ్ రూమ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంది. ఎవరూ వర్ష నా అన్నాను. అవును అంది. సరే అయితే ఇక వెల్లు అన్నాను. తను వెళ్ళాక నేను p. వర్ష కి ఫోన్ చేద్దం అనుకుంటే అనన్య వద్దు ఇప్పుడే ఎపుడైనా ఫ్లో లో అడుగు అంది. సరే కానీ మీ నాన్న రమేష్ చెప్పి ఉంటేనే కదా రైడ్ కి పంపి ఉంటాడు అన్నాను. అంతే కదా అంది. సో రమేష్ p. వర్ష కి చెప్పి ఉంటాడు, తను దీనికి చెప్పి ఉంటది, ముందు రోజు రాత్రి కూడా నా దగ్గరకి వచ్చింది కానీ నాకు చెప్పలేదు, నిన్నటి నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు అన్నాను. అవన్నీ వదిలేసి కూల్ గా నీ పని నువ్వు చేసుకో చాలు అంది. సరే అని అనన్య ని ఇంట్లో డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్తుంటే మధ్యలో సూరజ్ c. వర్ష తో మాట్లాడుతూ కనిపించాడు. నేను వెళ్లి వాళ్ళ దగ్గర కార్ అపగానే టాపిక్ మార్చేసి క్యాజువల్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. ఏదో ఒక రెండు నిమిషాలు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చి p. వర్ష కి ఫోన్ చేశాను. తను లిఫ్ట్ చేయడం లేదు. సరే అని మందు అయినా తాగుదం అని బయటకి వెళ్ళాను. అక్కడ బార్ లో బీచ్ కి c. వర్ష తో వచ్చిన వాడు ఉన్నాడు. నేను కావాలనే వాడు తెలియనట్టు వాడి పక్కనే కూర్చున్న. వాడు నన్ను గుర్తు పట్టి మాట్లాడాడు. నీ పేరు ఏంటి అన్నాను. విశాల్ అన్నాడు. ఏమి చేస్తున్నావు జాబ్ అన్నాను. వర్ష మేడం దగ్గర PA గా ఉన్నా అన్నాడు. వాడికి ఫుల్ గా ఎక్కేదాక మాట్లాడుతూ వాడు ఫుల్ అయ్యాక అడిగాను. నా మీద రైడ్ మీ మేడం కి ఎలా తెలుసు అని. దానికి వాడు సార్ మీకు ఒకటి చెప్తాను ఎవరికీ చెప్పకండి, మనసులో ఉంచుకుంటాను అని ప్రామిస్ చేస్తే చెప్తా అన్నాడు. ప్రామిస్ అన్నాను. వాడు నా చేతిని వాడి తల మీద పెట్టుకుని ప్రామిస్ అనండి అన్నాడు.సరే ప్రామిస్ అని చెప్పాను