15-10-2023, 12:43 AM
అసలు మేము చాలా షాక్ అయ్యాము. నేను పక్క నుంచి ఆ అమ్మాయికి సైగ చేసాను. తను అర్థం చేసుకొని ఒక రోజు కాలేజ్ కి వచ్చినపుడు చూసాను అంది. హమ్మయ్య అనుకున్నాము. అప్పటికే నాకు టెన్షన్ వచ్చి పద అని అనన్య తో చెప్పి కార్ దగ్గరకి వెళ్ళాము. నాకు ఫుల్ టెన్షన్ ఉంది. ఇక కార్ లో వెళ్తూ ఉంటే అనన్య నాతో ఆ అమ్మాయి మా డాడీ ఆఫీస్ కి ఎందుకు వచ్చి ఉంటుంది అంది. నాకేమీ తెలుసు తల్లీ నీ లాగే నేను ఉన్న కదా అన్నాను. ఈ రాజేష్ గాడికి అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ తెలుసా అంది. తెలిసి ఉండచ్చు వాడే కదా చూసుకునేది అన్నాను. హా అవును అంది. నాకు తెలిసి మీ నాన్న రాత్రికి ఇంటికి రాకుంటే ఆ అమ్మాయి మీ నాన్న కోసమే అయ్యి ఉంటుంది అన్నాను. మా నాన్న ఏజ్ తెలిసి కూడా అలా ఎలా అంటున్నావు అంది. ఏమో ట్యాబ్లెట్ వాడుతాడు ఏమో ఎవరికి తెలుసు అన్నాను. నువ్వు అలా మాట్లాడకు అంది. సరే వదిలేయ్ ఇంట్లో డ్రాప్ చేయనా అన్నాను. ఫస్ట్ ఆకలి పెరుగుతుంది ఏమైనా తినేసి వెళ్దాం అంది. సరే అని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళాను. ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఏమి కావాలి అని అడిగింది. ఏదైనా ఒకే అన్నాను. నీకు ఎలాంటి ఇష్టం లేదా అంది. ఫుడ్ దగ్గర ఏముంది ఏదో ఒకటి అన్నాను. తను ఆర్డర్ చేసింది. నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. అనన్య నాతో మాట్లాడుతూ ఉంటే నర్మద ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసి చెప్పండి అన్నాను. ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది అంట కదా అంది. అప్పుడే మీకు తెలిసిందా అన్నాను. తెలుస్తుంది కదా అంది. మీకు ఏదైనా తొందరగా తెలిసి పోతుంది లే అన్నాను. తను నీ పక్కన అనన్య ఉందా అంది. హా అన్నాను. అయితే పక్కకి రా అంది. సరే అని అనన్య కి వాష్ రూం అని చెప్పి పక్కకి వచ్చాను. చెప్పండి అన్నాను. మినిస్టర్ ఈ రోజు ఇంటికి రాడు అంట, మనం ఎంజాయ్ చేద్దామా అంది. అనన్య ఉంటుంది కదా ఇంట్లో అన్నాను. మా ఇంట్లో కాదు ఇంకా ఎక్కడ అయినా అంది. సరే అన్నాను. నువ్వు అనన్య ని డ్రాప్ చేసి దగ్గరలో వెయిట్ చెయ్ నేను వస్తాను అంది. సరే అని చెప్పాను. ఇక ఫుడ్ టేబుల్ దగ్గరకి వెళ్ళాను. ఫుడ్ వచ్చేసింది అప్పటికే. ఏంటి ఇంత ఫాస్ట్ గా తెచేసార అన్నాను. టైమ్ చూడు అర్ధరాత్రి ఇప్పుడు అంది. హ్మ్మ్ సరే అని తింటూ ఉంటే అనన్య నాతో సుమంత్ నీకు ఒకటి చెప్తాను కానీ నువ్వు బాధ పడకూడదు అంది. సరే అన్నాను. ఫీల్ కాకు కానీ ఇది నువ్వు తెలుసుకోవాలి అంది. ఒకే అన్నాను. నువ్వు బిజినెస్ చేస్తున్నావు అది మంచి విషయం బాగా డెవలప్ చేసావు అది ఇంకా మంచి విషయం కానీ ఈ డెవలప్ లో నీ కష్టం ఏముంది అని ఒకసారి అయినా ఆలోచించావా అంది. నా కష్టం లేకుండానే ఇది అంతా జరిగింది అనుకుంటున్నావా అన్నాను. బిజినెస్ చేసేవాడు మెదడు తో కష్టపడాలి జాబ్ చేసేవాడు శ్రమ పడాలి కానీ నాకు నీ బిజినెస్ లో నీ మెదడు కష్టం కంటే శ్రమ ఎక్కువ కనిపిస్తుంది అంది. ఏంటి ఏమి లేకుండానే ఆరు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నానా అన్నాను. ఫస్ట్ నీకు మైనింగ్ ప్లాన్ కూడా లేదు డెవలప్ అనే ఆలోచన కూడా లేదు కానీ అది ఆలోచించి మైనింగ్ లీజు వచ్చేలా చేసింది c. వర్ష, రెండోది మైనింగ్ నిన్ను లవ్ చేసి నీకు సహాయం చేసింది చిత్ర. నీ గురించి వాళ్ళు ఆలోచించి నిన్ను పుష్ చేస్తే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేదు అంది. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేకున్న చేసుకుంటున్న కదా అన్నాను. ఉన్నది అలానే ఉంది, ఉన్న బిజినెస్ ని మెయింటైన్ చేయడం అంతే నీ పని, దానికి ఒక మేనేజర్ ని పెట్టి నువ్వు వారానికి రెండుసార్లు వెళ్లి చూసుకున్న సరిపోతుంది అంది. ఇప్పుడు ఏమైంది బాగానే ఉన్న కదా అన్నాను. నువ్వు నిజంగా చెప్పాలి అంటే ఒక డంబ్, మెతక, నిన్ను మోసం చేయడం చాలా ఈజీ, కానీ నీకు జీవితం లో అన్నీ ఈజీగా వచ్చేసరికి అన్నీ నేనే చేసుకున్న అనే భ్రమ లో ఉన్నావు, ఎక్కడ ఉన్నది పోతుంది అనే భయం తో రమేష్ బెదిరించగానే భయపడ్డవు. కానీ అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి, ఎవరూ ఏమీ చేయలేరు కానీ భయం నీకు, నీ ప్లేస్ లో ఎవరు ఉన్న కూడా అసలు పట్టించుకోరు వాడిని అంది. ఇది ముందే చెప్పచ్చు కదా అన్నాను. నీకు అన్నీ ఈజీగా వచ్చాయి కదా ఒకసారి అయిన తెలుసుకోవాలి అని చెప్పలేదు, ఈజీగా కష్ట పడకుండా వచ్చింది ఎప్పటికీ మనతో ఉండదు, ఇక నుంచి అయినా అమ్మాయిలు ఆంటీలు లాంటివి తగ్గించుకుని కెరీర్ మీద ఫోకస్ చెయ్, మా అమ్మ మొదట్లో నువ్వు ఒక పెద్ద బిజినెస్ మేన్ చిన్న ఏజ్ లో పెద్ద పొజిషన్ కి వచ్చాడు అంటే చాలా హార్డ్ వర్క్ పర్సన్ అనుకున్న, అన్నీ బాగా తెలుసుకోవచ్చు అనుకున్న, కానీ వచ్చాకే తెలిసింది నీది కష్టం కాదు అదృష్టం అని అంది. కానీ నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు ఎక్కడ అంటే బెడ్ మీద కదా అంది. అమ్మా తల్లీ ఇక ఆపు ప్లీజ్ అన్నాను. నీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఫీల్ కాకు అని, నేను నీకు చెప్పకపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు కానీ ఎందుకు చెప్తున్న అంటే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకొని మారుతావు అని అంతే అంది. థాంక్స్ అన్నాను. తను ఇక తిను టైమ్ కూడా అవుతుంది అంది. ఆపేసావ హమ్మయ్య అని తినేసి బయలుదేరాము.