13-10-2023, 09:57 PM
తను రాత్రి నాకు చేసిన హెల్ప్ ఏమైనా తెలిసిపోయింది అనే డౌట్ వచ్చింది. అనన్య కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను అవునా ఒకసారి నీకు వచ్చిన నంబర్ చెప్పు ట్రేస్ చేపిస్తా అంది. సరే అని పంపిన. ఆఫీస్ కి వెళ్ళిన తరువాత తను ఫోన్ చేసి ఏమి టెన్షన్ పడకు అది మా నాన్న మనుషులే తను చాలా సేఫ్ గా ఉంది నువ్వు ఒకసారి ఇంటికి రా అంది. సరే అని వెళ్ళాను. అక్కడ p. వర్ష, నర్మద ఇద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు. నేను వెళ్లి ఏంటి మేడం ఇది అన్నాను. నీకు ఇచ్చిన టైమ్ అయిపోతుంది కదా నువ్వు ఏది పట్టించుకోవడం లేదు అందుకే రమేష్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది అంది. ఇంకా ఉంది కదా టైమ్ అప్పట్లో గా ఏదో ఒకటి చేస్తాను అన్నాను. నీకు ఎలా తెలుసు వర్ష ఇక్కడే ఉంది అని అంది. మీకే చెప్పాలి అనుకుని వచ్చాను తనని ఎవరో కిడ్నాప్ చేశారని చూస్తే ఇక్కడే ఉంది అన్నాను. అయినా నువ్వు రావు అనుకున్న అంది. రావలసి వచ్చింది అన్నాను. సరే ఇంకో రెండు రోజులు చూసుకో ఏదో ఒకటి చేయాలి అంది. సరే అని బయటకి వచ్చాను. అనన్య బయట కలిసి నువ్వు దగ్గరలో ఉన్న కాఫీ షాప్ లో వెయిట్ చెయ్ వస్తాను అంది. నువ్వు ఆఫీస్ కి రావా అన్నాను. ఇప్పుడు ఏమి ఆఫీస్ రేపు వస్తా వెయిట్ చేస్తు ఉండు అంది. సరే అన్నాను. కాఫీ షాప్ లో కి వెళ్ళాక p. వర్ష కి ఫోన్ చెద్దమా అనుకున్న కానీ ఇప్పుడు వద్దులే అని సైలెంట్ అయ్యాను. ఒక అరగంట కి అనన్య వచ్చింది. తను నీకు మా డాడీ నీ కలిపిస్తా ఏదో ఒకటి సెట్ చేసుకో అంది. థాంక్స్ అన్నాను. సరే పదా అంది. ఇద్దరం వాళ్ల డాడీ ఆఫీస్ కి వెళ్ళాము. అక్కడకి వెళ్ళాక తను వెయిట్ చెయ్ వస్తా అని లోపలకి వెళ్ళింది. నేను అక్కడ కూర్చున్న. కొంత సేపటికి తను వచ్చి లోపలకి తీసుకెళ్ళింది. ఆయన గుర్తు పట్టాడు నువ్వు మైనింగ్ చేస్తావు కదా అన్నాడు. అవును సార్ అన్నాను. విషయం ఏమిటి అన్నాడు. రమేష్ గురించి చెప్పాను. ఆయన నాతో నాకు రమేష్ చాలా సంవ్సరాలుగా తెలుసు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు కానీ నీ కోసం నేను ఎందుకు చేయాలి అన్నాడు. మీరే అలా అంటే ఎలా సర్ అన్నాను. ఆయన అనన్య ని బయటకి వెళ్ళమని చెప్పి సీ యంగ్ మ్యాన్ రాజకీయాలు అంటే డబ్బులే కాదు చాలా ఉంటాయి, రమేష్ అడుగుతుంది షేర్ అంతే కదా ఇవ్వు అన్నాడు. నాకు ఆయనతో పాటు బిజినెస్ చేయడం ఇష్టం లేదు అన్నాను. సరే నువ్వు ఏమి చేయాలి అనుకుంటున్నావు అన్నాడు. నేను కష్టపడ్డా కదా సర్ అలా ఎలా ఈజీగా ఇచేస్త అన్నాను. సీ మ్యాన్ నీకు మైనింగ్ కంపెనీ లో మేము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఇచ్చాము కావున వాటికి అయ్యే డబ్బులు నాకు ఇచే బదులు రమేష్ కి ఇవ్వు సెట్ అవుతుంది అన్నాడు. సరే అన్నాను. ఒకే డబ్బులు సెట్ చేసుకుని కలువు నేను రమేష్ ని పిలిపిస్తా అన్నాడు. అమౌంట్ ఎంతనో చెప్పండి అన్నాను. రెండు కోట్లు లోగానే ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడే పిలిపించండి అన్నాను. అంత లిక్విడ్ క్యాష్ రెఢీ గా ఉందా అన్నాడు. అవును సార్ అన్నాను. అయితే బయట వెయిట్ చేస్తుండు పిలిపిస్తా అన్నాడు. సరే అని బయటకి వచ్చాను. నేను ఆఫీస్ కి ఫోన్ చేసి క్యాష్ ఎంత ఉంటే అంతా తీసుకుని రమ్మని చెప్పాను. అనన్య ఏమైంది అంది. విషయం చెప్పాను. అయితే అంతా ఒకే నే కదా అంది. అయిపోతుంది అనుకుంటున్న అన్నాను. తను అయితే మంచింది అంది. ఒక రెండు గంటల తరువాత రమేష్ వచ్చాడు, లోపలకి వెళ్లి అరగంట మాట్లాడాడు తరువాత నన్ను పిలిచారు. నేను వెళ్ళాక సీ మ్యాన్ రమేష్ కి డబ్బులు వద్దు అంట ఒక మైనింగ్ లీజు కావాలి అంట నీకు వైజాగ్ లో సెట్ చేసే టైమ్ లో ఇచ్చారు అంట కదా ఇచేసెయ్ అన్నాడు. అలా ఎలా సర్ అన్నాను. ఫ్రీ గా నే వచ్చింది కదా ఫస్ట్ నా మాట విను నేను చెప్తున్న కదా అని చెప్పి రమేష్ తో నువ్వు డాక్యుమెంట్స్ రెఢీ చేసి ఇవ్వు బాబు చాలా తొందరలో ఉన్నాడు సంతకం చేస్తాడు అని చెప్పాడు. సరే అని రమేష్ వెళ్ళిపోయాడు. నేను ఆయనతో సర్ మీరు మైనింగ్ మినిస్టర్ అనుకుంటే ఆయనకి ఇంకొక మైనింగ్ లీజు ఇవ్వచ్చు మనీ నేను ఇస్తా అన్నాను. నేను అదే చెప్పాను కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కారణం గా అదే కావాలి అని అడుగుతున్నాడు నేను నీకు చెప్తున్న ఒక పది రోజుల తరువాత ఢిల్లీ వస్తె నీకు కొత్త లీజు ఇస్తాను ఇక్కడితో అంతా అయిపోయింది అన్నాడు. నేను ఇక చేసేది ఏమి లేక సరే అని బయటకి వచ్చాను. ఆఫీస్ నుంచి వచ్చిన మనీ నీ తీసుకు వెళ్ళమని చెప్పి అనన్య తో మాట్లాడుతుంటే p. వర్ష ఫోన్ చేసింది. అసలు ఏమైంది అన్నాను. నువ్వు ఏంటి అలా మాట్లాడావు నా మీద నీకు ప్రేమ లేదా అంది. ఉంది అందుకే కదా నంబర్ ట్రేస్ చేపించి వచ్చాను అన్నాను. ఎవరు చేశారు అంది. తెలిసిన సెక్యూరిటీ అధికారి అన్నాను. తను అవునా అంది. నాకు చాలా భయం వేసింది రాత్రి విషయం తెలిసి కిడ్నాప్ చేసారేమో అని అన్నాను. అది సీక్రెట్ అలానే ఉంటుంది అంది. ఎక్కడ ఉన్నావు అని అడిగింది. బయట పని మీద ఉన్న అన్నాను. సరే అయితే అంది. అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడకి అన్నాను. మేడం ఫోన్ చేసి రమ్మంది నీకు ఫోన్ చెయ్ అంది. చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు, మేము మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఆమె చెప్పింది సుమంత్ తో పని ఉంది ఊరికే బెదిరిస్తం అని, సరే అన్నాను అంది. నేను తనతో మాట్లాడుతుంటే అనన్య వచ్చి డాడ్ రమ్మంటున్నారు అంది. నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి లోపలకి వెళ్ళాను. పేపర్స్ మీద సంతకం చేసి ఇక నా జోలికి రావద్దు అని చెప్పాను. నీతో నాకు ఇంకా ఏమి పని ఉంది నా బిజినెస్ నాది నీ బిజినెస్ నీది అన్నాడు. మినిస్టర్ ఇక ఏమి కాదు మ్యాన్ ప్రశాంతంగా ఉండు ఇక అన్నాడు. వాడి పీడ పోయింది అనుకుని థాంక్స్ చెప్పి బయటకి వచ్చేసాను. ఇక అనన్య దగ్గరకి వచ్చి చాలా థాంక్స్ అని చెప్పి ఒక హగ్ ఇచ్చాను. తను చుట్టూ చూసుకోవాలి కదా అంది. సారి అని చెప్పి బయటకి వచ్చాము. బయట కి రాగానే ఒక కార్ వచ్చింది. అందులో నుంచి రాత్రి మేము తీసుకెళ్లిన అమ్మాయి దిగింది. అనన్య ని చూడగానే హాయ్ అక్క అంది. అప్పుడే బయటకి వచ్చిన రమేష్ ఆ అమ్మాయి తో మేడం నీకు ఎలా తెలుసు అన్నాడు.