Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*"కృష్ణం 'వందే' జగద్గురుం"*
#1
0209A1a0309a1.     0207b2-6.  131023-5.
???????????

   *"కృష్ణం 'వందే' జగద్గురుం"*
                ➖➖➖✍️

*"శ్రీకృష్ణుని మహిమలను, వైభవాన్ని, లీలలను పాడుకోవడం సరే. భక్తితో ఆరాధనలూ సరే. కాని, ఆలోచించదగిన విశ్లేషణలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయడంలేదు?"*             
                   ౼ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,

***************************

*"రెండువేల సంవత్సరాల కిందట వచ్చిన చాణుక్యుడిది రాజకీయ చతురత అయితే, అంతకన్న మూడువేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడి రాజనీతిజ్ఞత అంతకన్న చాలా గొప్పది. వేరైనది, ధార్మికమైనది. పరిపూర్ణ ధర్మస్థాపనోత్సాహియైన రాజ్య నిర్మాతగా, సత్యవ్రతుడుగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతూ ఉంటాడు".*                ౼     
                ౼ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,

*****************************

*"రామాయణ కాలమైన 'త్రేతాయుగానికి', శ్రీకృష్ణుడి కాలమైన 'ద్వాపరయుగానికి' విలువలు: ౼మారిపోయినాయి. 'రాజకీయాలు', 'రాజ్యాల స్వరూపం' ౼మారిపోయింది".*

*"వసుదేవుడి కొడుకే అయినా, రాజు కాని, రాజ్యం లేని 'యాదవుడిగా పెరిగిన'; శ్రీకృష్ణుడు, 'సకల రాజన్య లోకానికి ఆరాధ్యుడైన చక్రవర్తిగా', 'మకుటంలేని మహారాజుగా', ఏవిధంగా వెలుగొందాడనేది  ౼చాలా 'సంక్లిష్టమైన' ప్రశ్న".*

*"వెన్న'దొంగతనం' వంటి          శ్రీకృష్ణుడి 'లీలలు', 'మధురమైన' బాల్యం, యమునా తీరంలో: 'రాసలీల' ఒక భాగమైతే; 'కంసుడి వధ' తరువాత 'ఆయన జీవనం' -పూర్తిగా భిన్నమైన- ధోరణిలో: సాగుతుంది".*

*"రాక్షసాంశతో పుట్టిన రాజుల 'దురాశలు', 'సామ్రాజ్య విస్తరణ' వాదాలతో: 'జనం సతమతమవుతున్న' దశలో: 'రాజ్యాంగాలను' నడుపుతూ, 'ధర్మం తప్పని రాజనీతిజ్ఞతను' చూపుతూ, 'ఒక చతురుడైన వ్యూహకర్తగా' మనకు కృష్ణుడు ౼కనిపిస్తాడు".*

*"ఆయుధం పట్టకుండా, 'దుర్నీతిని అంతమొందించే సమర యజ్ఞాన్ని' ౼నిర్వహిస్తాడు".*

*"రెండువేల సంవత్సరాల కిందట వచ్చిన 'చాణుక్యుడిది రాజకీయ చతురత' అయితే, అంతకన్న మూడువేల సంవత్సరాల కిందట 'శ్రీకృష్ణుడి రాజనీతిజ్ఞత' అంతకన్న 'చాలా గొప్పది'. 'వేరైనది', ౼ధార్మికమైనది".*

*"పరిపూర్ణ 'ధర్మస్థాపనోత్సాహియైన రాజ్య నిర్మాతగా', 'సత్యవ్రతుడుగా' శ్రీకృష్ణుడు ౼విరాజిల్లుతూ ఉంటాడు".*

*"శ్రీకృష్ణుడి నోట వెలువడిన 'భగవద్గీత' ఈ నాటికీ, 'మానవుల తలరాతలను', 'జీవనగీతాలను' -మార్చివేయగల- 'వ్యక్తిత్వ వికాస' మార్గదర్శి".*

                                     *"శ్రీకృష్ణుడు 'జగద్గురువు' అయిందీ 'భగవద్గీత' వల్లనే.*                           ౼                    
                   ౼  ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్, 

*******************************

*"మహిమలను, వైభవాన్ని, లీలలను పాడుకోవడం సరే. భక్తితో ఆరాధనలూ సరే. కాని, ఆలోచించదగిన విశ్లేషణలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయడంలేదు?"*                             
                     ౼ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్, 

******************************

*"శ్రీకృష్ణుడు మేధావి, ఆలోచనాపరుడు, వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, పురుషోత్తముడు, ధర్మాధర్మ వివేచనాశీలి, ధర్మపక్షపాతి, నిర్భయుడు, స్థితప్రజ్నుడు".*

*"ఇటువంటి ఒక వ్యక్తిని మరో సాహిత్యంలో ఊహించడం కష్టం".*

*"శ్రీకృష్ణుడిపైనే ఎన్ని పుస్తకాలైనా రావచ్చు".*

*"ఎంత పరిశోధనైనా సాధ్యం".*

*"గుణ 'విశ్లేషణ' ౼అవసరం".* 

*"రామానుజ వైష్ణవ   సిద్ధాంతంలో:  'భగవద్గుణ కీర్తన', 'గుణానుభవం' ముఖ్యమని ౼సూత్రీకరించారు".* 

*"అంటే శ్రీకృష్ణుని 'వ్యక్తిత్వ లక్షణాలను', ఆయన 'విశిష్ట గుణగణాలను' ౼'ఆలోచించి', 'మననం' చేసి, 'అవగాహన' చేసుకొని, 'సంభావించి' ౼విశ్లేషించేవారికి, 'ఆ గుణాలు నచ్చి', 'అనుసరించే అవకాశం' ౼కలుగుతుంది".*

*"సంకెళ్లు తెగిపడిపోయి, 'యమున' కూడా దారి ఇచ్చి, ౼'తలపుల తలుపులు'౼ అవే తెరచుకుంటాయి. 'సత్ప్రవర్తన' అలవడుతుంది. వాటి 'పరిణామాలు శుభంకరంగానే' ౼ఉంటాయి".*

*"శ్రీకృష్ణుడి పట్ల 'భక్తి' ఉంటే, ఆయన గురించి 'తెలుసుకోవాలని ఉంటుంది'. అది 'జ్ఞాన' యోగం".*

*"భక్తి, జ్ఞాన యోగాలను చెప్పేదీ, కర్మలు చేయుట మానరాదని బోధించేది కూడా 'భగవద్గీత' ద్వారా శ్రీకృష్ణుడే".*

*"శ్రీకృష్ణుని 'వ్యక్తిత్వాన్ని', 'గుణశీలాలను' విశ్లేషించే 'పుస్తకాలు' ౼ఎన్నో రావలసి ఉంది".*

*"జర్మనీ, అమెరికా తదితర దేశాలలో: 'ఈ పాత్రల స్వభావం' పైన 'పరిశోధనలు' ౼జరుగుతున్నాయి".*

*"మన దగ్గర కూడా (పరిశోధనలు) 'జరగవలసి' ఉంది".*

*"మహిమలను, 'వైభవాన్ని', 'లీలలను' ౼పాడుకోవడం సరే. 'భక్తి'తో 'ఆరాధన'లూ సరే. కాని, 'ఆలోచించదగిన విశ్లేషణలు' ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయడంలేదు?"*  ✍️
                      (ఇంకా ఉంది).                                 ౼ *ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,* [21-12-2017, *కేంద్ర సమాచార కమీషనర్,* న్యూ ఢిల్లీ. సౌజన్యం: *"శ్రీకృష్ణ చరిత్ర (మొదటి భాగము)"*, శ్రీ అజ్జరపు వెంకటరావు *'నిర్మలం'*, సంపాదకులు:      శ్రీమతి పప్పు శాంతాదేవి,  ప్రచురణ: *"సౌభాగ్య 'నిర్మలం' ఫౌండేషన్"*, న్యూఢిల్లీ. First Edition (Revised): 2018].
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
 సేకరణ; *"ఉపనిషద్ 'యోగ-విద్యా' పరిషత్"*, విశాఖపట్టణము. 
E.mail I.D: [email protected]
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
*"కృష్ణం 'వందే' జగద్గురుం"* - by Yuvak - 13-10-2023, 10:55 AM



Users browsing this thread: 1 Guest(s)