11-06-2019, 08:02 PM
ఇవి రెండూ సక్రమంగా ఉంటే దాని అంతటా అదే బాగుపడుతుంది దేశం . రైతు కు పంటకు ముందే డబ్బు అందించడం జరుగుతుంది . అలానే ప్రతి ఇల్లు ఒక కర్మగారమై వస్తువులను తయారు చేసి మన అవసరాలకు వాడుకొని పక్క దేశాలకు పంపడం జరుగుతుంది . ఎప్పుడో ప్రవేశపెట్టిన విద్యావిధనానికి సమాధి కట్టి కొత్త విద్య విధానం ప్రవేశ పెడతాను . ఇవ్వని మీరు ఇచ్చిన 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను అని మాట ఇస్తున్నాను అంటూ ముగించాడు కిరణ్ . చప్పట్లతో దద్దరిల్లింది రాజ్ భవన్ . విద్య వైద్యాలు ప్రభుత్వ పరం అనగానే గజగజ వణికి పోయింది కార్పొరేట్ ప్రపంచము . ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల త్వరలోనే తెరదింపారు . అసెంబ్లీ లో మెజారిటీ ఉండడం వల్ల ప్రతి బిల్ పాస్ అయ్యింది . విద్య ఆరోగ్యం ప్రాథమిక హక్కులుగా మార్చడానికి ఎంపీ లు ససేమిరా అన్నారు . తన మద్దతు ను ఉపసంహరిస్తానని చెప్పగానే ప్రభుత్వం పడిపోతుందని ఆమోదించారు . స్వతంత భారతంలో ఆరోగ్యం చదువు ప్రాథమిక హక్కులు అయ్యాయి . కార్మిక యాజమాన్యం కూలీలకు భాగస్వామ్యం కల్పించింది . వృత్తి విద్యా విధానాలు నైపుణ్యాలను ప్రతి గ్రామానికి చెర వేసి గ్రామమే పరిపాలన కి మొదటి మెట్టు అన్నట్టు చేసాడు కిరణ్ .వృత్తి విద్యా నైపుణ్యం వల్ల ప్రతి ఇల్లు ఒక కర్కాణగా అయ్యింది . ఎవరు పింఛన్ లా కోసం ఎదురు చూసేది లేదు . ఎగుమతులు పెరిగి ఆంద్రప్రదేశ్ దేశం లోనే మొదటి స్థానానికి చేరుకుని అన్ని రాష్ట్రాలూ ఆంద్రప్రదేశ్ వైపు చూసాయి . తరువాత ఎన్నికల్లో జనాన్ని ఎవరు ఓట్లు అడగలేదు . ఈ ఐదు సంవత్సరాల్లో దేశం లోని విద్యావంతులు నేర చరిత్ర లేని వాళ్ళు సేవ తత్పరత ఉన్నవాళ్లను సెలెక్ట్ చేసాడు . తరువాత ఎన్నికల్లో తాను సెలెక్ట్ చేసిన వారిని పోటీలో నిలబెట్టాడు . ఈ ఎలక్షన్స్ లో కూడా మ్యానిఫెస్టో ఏమి లేకుండా అదేశిక సూత్రాలు అమలు చేస్తాను అని చెప్పాడు . అసాధ్యం సుసాధ్యం అయ్యింది 545 సీట్లకి గాను 400 సీట్లు గెలుచుకుంది కిరణ్ పార్టీ . ఎదురు అనేది ఏమి లేకపోవడం తో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి . దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగి నిలువలు పెరిగాయి . అలాగే మన దేశ అతి పెద్ద దిగుమతి అయిన పెట్రోలియం ను తగ్గించాలంటే వాహనాల వినియోగం తగ్గించాలని దానికి తగ్గట్టు గానే అనుఇందనాలు మీద పరీక్షలు జరపాలి అని చెప్తూ ఎక్కువ ప్రబుత్వం రవాణ సౌకర్యాలు వాడుకోవాలని ప్రబుత్వ ఉద్యోగులు అందరూ వీలైతే సైకిల్ మీద అఫిస్ కి వస్తే ఆరోగ్యం అని మీరు సైకిల్ వాడుతూ అందరికి ప్రచారం చేయాలి అని ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వులు జారిచేసాడు . దేశం మొత్తం ప్రతి ఇల్లు ఒక కర్కాణగా మారి ప్రపంచదేశాలు చూస్తుండగానే డాలర్ రేటు రూపాయి రేటు సమానం అయ్యి అన్ని దేశాల వ్యవహారాలు ₹ సింబల్ తో జరుగుతూ భారతదేశం అగ్రదేశంగా రూపుదిద్దుకుంది . జైహింద్ .