Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కలలు కన్న భారతం
#5
ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో తన నిర్ణయాన్ని చెప్పాడు కిరణ్ . ఇక్కడ కిరణ్ ఫ్యామిలీ గురించి కొంచం చెప్పుకుందాం . కిరణ్ వాళ్ళ తాతయ్య రాఘవయ్య అపరిమితమైన దేశభక్తి ప్రజలకు ఎదో చేయాలని కోరిక ఆ కోరిక తో అవసరం అన్నవాళ్ళకి కాదనకుండా ఇచ్చాడు . ఆస్తిలో సగం అరగదీసి వెళ్ళాడు . రాజరామ్మోహన్ రాయ్ మీద ఉన్న అభిమానం తో రామ్మోహన్ అని పేరు పెట్టాడు . పేకాట మద్యం అన్ని రకాల వ్యసనాలతో మొత్తం ఆస్తి అంత అవ్వచేసి చివరికి 5 ఎకరాల పొలం మిగిల్చి కన్నుమూశాడు . కిరణ్ కి పేరు పెట్టింది రాఘవయ్య నే తన కిరణాలతో దేశాన్ని ప్రసరింప చేస్తాడని ఆ పేరు పెట్టాడు . ఏరా మీ నాన్న తాత కాజేసిన ఆస్తులు సరిపోలేదా మళ్ళీ ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకుంటే రోడ్డు మీద పడతాము రా ఒక్కసారి ఆలోచించు కన్నా అంది కిరణ్ తల్లి . అమ్మ నేను నిర్ణయం తీసేసుకున్నాను అన్నాడు కిరణ్ . నిజమా నా ముద్దుల మనవడా నువ్వు దేశ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్తున్నవా ఐతే నా పేరు మీద ఉన్న 3 ఎకరాలు అమ్ముకొని తీసుకొని వెళ్లు అంది జానకమ్మ . నా పేరు మీద ఉన్న పొలం కూడా అమ్ముకొని తీసుకెళ్లు అంది పద్మ . వద్దులే అమ్మ కనీసం 2 ఎకరాలు అన్న మిగలనివ్వు కనీసం తిండికి జరిగిపోతుంది అని   బజారుకు వెళ్లి ఇలా తన పొలం అమ్ముతున్నాను అని చెప్పగానే చాలా మందే వచ్చారు . 3 ఎకరాలకు కలిపి 14 లక్షలు వచ్చింది . అసలు తాను పొలం ఎందుకు అమ్మతున్నాడో కనుక్కున్న వాళ్ళు రాఘవయ్య గారి మనవడు రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అంట  వాడు చదువుకున్నోడు తెలివైనోడు ఇలాంటి వాడు ఒకడు ఉండాలి రా అని చందాలు పొగుచేసి మొత్తం 14+1=15 లక్షలు కిరణ్ చేతిలో పెట్టారు . వాళ్ళ అభిమానానికి కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా మీ రుణం నేను ఎప్పటికి తీర్చుకోలేను  అని అందరికి నమస్కారం చేసి ఇంటికి వెళ్లి బట్టలు సర్దుకొని ప్రయాణం అయ్యారు మిత్రులు . ఇప్పుడు మన పని ఏంటి రా అన్నాడు చంద్ర . ఏమి లేదు రా ముగ్గురం కలిసి ఉండడం కంటే విడివిడిగా ఉంటేనే పనులు త్వరగా అవుతాయి ముగ్గురం తలో వేరు వేరు జిల్లాల్లో తిరిగి చదుకున్న యువత దేశానికి సేవ చేసే వాడు ఏ నేర చరిత్ర లేని వాళ్ళను వడకట్టడం మొదలు పెడదాం అన్ని ఒక లిస్ట్ తయారు చేసుకొని మన రూమ్ దగ్గర మీట్ అవుదాం అంటూ ఇద్దరికి చెరొక 5 లక్షలు ఇచ్చాడు . రెండు నెలలుకు పైగా పట్టింది లిస్ట్ తయారు చేయడానికి . మొత్తానికి ముగ్గురు రూమ్ లో కలుసుకున్నారు . లిస్ట్ లు అన్ని ప్రింట్ తీసి వారి చరిత్రలు తెలిసినంత వరకు తెలుసుకొని అసెంబ్లీ కి294 మందిని , పార్లమెంట్ కి 42మంది యువకుల్ని సెలెక్ట్ చేసారు మిత్రులు . ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ప్రకాష్ .  చేయడానికి ఏముంది అసలు మనం మన రాష్ట్రం లో ఎవరికి తెలుసు మనల్ని మనం పరిచయం చేసుకుందాం పదండి . ప్రజల అవసరాలు బాధలు కన్నీళ్లు సుఖాలు అన్ని తెలుసుకొని మీ కష్టాలు తీర్చి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము వస్తున్నాం అని తెలుపుదాం పదండి అన్నాడు కిరణ్ . ఎన్నికల కమిషనర్ ని కలిసి కొత్త పార్టీ కి గుర్తు జండా ఆమోదం పొందారు .  పాదయాత్ర ని మొదలు పెట్టాడు కిరణ్ . తన మ్యానిఫెస్టోలో పెద్దగా ఏమి లేదు ఒకటే మాట అదేశిక సూత్రాలను అమలు చేస్తాను అన్న పదం తప్ప . ప్రతి ఊరు తిరుగుతూ తన వాక్చాతుర్యంతో అందరిని నవ్విస్తూ ఒక్కసారి విద్యావంతులైన సేవతత్పరతా భావం ఉన్న 294 మంది ని గెలిపించండి అలాగే పార్లమెంట్ 42 స్థానాల్ని గెలిపించండి ఈ దేశం ఎందుకు మారదో మీకు చూపిస్తాను ఓటు కి డబ్బు ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకోవడం కాదు రాజకీయం అంటే మీ ఓటు తో మమ్మల్ని గెలిపిస్తే ప్రగతి ఏంటో చూపిస్తాను ఒకవేళ చూపించలేకుంటే రాజకీయ సన్యాసం చేస్తాను అని గట్టి గట్టిగా చెప్తుంటే ప్రతి ఒక్కరిని తాకాయి ఆ మాటలు . టీవీల్లో చర్చ మొదలైంది అసలు ఏ అనుభవం లేని వాళ్ళు రాజకీయాలు లోకి వచ్చి ఏమి చేస్తారు అని . విద్యావంతులు త్వరగానే అర్థం చేసుకుంటారు అని పాజిటివ్ టాక్ నే వచ్చింది రాష్ట్రం అంతట . ఎన్నికలు మొదలు అయ్యాయి . అంత ప్రశాంతంగా సాగిపోయింది . ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి . దేశ చరిత్రలోనే ఇదొక ఆమోఘ ఘట్టం విద్యావంతులైన యువత కె పట్టం కట్టారు రాష్ట్రప్రజలు 294 సీట్లకి గాను 275 , 42 కి గాను 38 సీట్లు సాధించింది అంటూ చెప్పుకుపోతున్నారు టీవీల్లో . ఇంకో విషయం ఏంటి అంటే కిరణ్ ఏ పార్టీకి మద్దుతూ ఇస్తే వారే పీఎం . తన మద్దతు తో పీఎం ప్రమాణ స్వీకారం చేసాడు . రాష్ట్ర అభివృద్ధి కి సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు . అట్టహాసలకు దూరంగా కిరణ్ రాజ్ భవన్ లో తోటి మంత్రులతో ప్రమాణం చేసాడు . తన తొలి ఫైల్ సంతకాన్ని ఆరోగ్యం కోసం ఇక నుండి హాస్పిటల్ కి డబ్బులు చెల్లించనక్కరలేదు అందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయి ఇక నుండి డాక్టర్స్ కి నెల జీతం ఇవ్వబడుతుంది అలానే విద్య కూడా ఈ పాఠశాలకు అయిన ఏ కాలేజ్ కైనా వెళ్లి చదువుకోండి ఉచితంగా  ఫీస్ లు కట్టాల్సిన అవసరం లేదు . విద్యని ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కులు గా మార్చబోతున్నాను .
[+] 1 user Likes kp162118's post
Like Reply


Messages In This Thread
RE: కలలు కన్న భారతం - by kp162118 - 11-06-2019, 07:54 PM



Users browsing this thread: 1 Guest(s)