Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కలలు కన్న భారతం
#4
చంద్ర మాటలు బాగా మనసుకు గుచ్చుకుంటున్నాయి ఎంత ప్రయత్నించినా నిద్రరావడం లేదు .    తాను ఇక్కడికి వచ్చింది ఎందుకు ఒక ఐఏఎస్ ఆపిసర్ అవుదామని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏదొక ఉద్యోగం చేసుకుంటూ చదుకోవలని తాపత్రయం . మొన్న జరిగిన ప్రిలిమినరి పరీక్ష లో అర్హత సాధించి కూడా తన ఆలోచనలు ఎందుకు ఇలా సాగుతున్నాయి . చిన్నప్పుడు తాతయ్య దేశానికి ఉపయోగపడేలా బతకాలి రా అని చెప్పిన మాటలు తన మనసులో పాతుకొని పోయాయి ప్రజలకు ఏమైనా చేయాలి చేయాలి అని మనసు మదనపడుతుంటే నువ్వు
 ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన సేవచేయొచ్చు కదా అని ఇంకో వైపు మనసు పోరాటం చేస్తుంది . ఎట్టకేలకు రాజకీయాల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది మనసులో ఎక్కువ భాగం  . అసలు రాజకీయాల్లో అనుభవం పలుకుబడి డబ్బు లేకుండా ఎలా నెగ్గుకు రాగలవు ఈ ప్రజలకు మంచి మాటలు ఎన్ని చెప్పిన వింటారు ఓటు మాత్రం డబ్బు ఇచ్చినవాడికే వేస్తారు ఎప్పుడైతే మంచి ఓటర్లు పోయారో అప్పుడే మంచి రాజకీయ నాయకులు పోయారు నా మాట విని రాజకీయాలు అనే ఆలోచన విరమించుకో నువ్వు ఈ సారి కాకపోయినా వచ్చే సంవత్సరం అయిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతావు రాజకీయాల్లో ఓటమి తట్టుకోలేవు అని మిగిలిన భాగం ఘోషించింది . చివరకు రాజకీయాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించాడు కిరణ్ . ఉదయాన్నే భానుడి కిరణాలు స్పర్శ కి కళ్ళు తెరచి అద్దం లో తన మొహం చూసుకున్నాడు కిరణ్ . ఎప్పుడు లేని ఎదో శక్తి తనలో ఉన్నట్టు అనిపించింది కిరణ్ కి . ఉదయాన్నే రెడీ అయ్యి షూటింగ్ కి వెళ్తున్న చంద్ర ని అపి రాత్రంతా ఆలోచించాను రా నేను పోటీచేస్తాను ఎన్నికల్లో అన్నాడు కిరణ్ . అప్పటి వరకు నిద్రపోతున్న ప్రకాష్ లేచి ఆలోచించావా ఎన్నికల్లో పోటీచేస్తావా ఎవరు ఇస్తారు రా నీకు నువ్వు వస్తున్నావ్ అని నీకు సీట్ ఇచ్చి గెలిపిస్తారు వెళ్లు దండలు రెడీ చేయిరా చంద్ర అన్నాడు ప్రకాష్ నవ్వుతూ . రేయ్ నువ్వు అపరా నువ్వు చెప్పు బంగారం బాగా ఆలోచించే కదా  మళ్ళీ వెనకడుగు వేయవుగా అన్నాడు చంద్ర . వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఈరోజు నుండి రాష్ట్రం మొత్తం చుట్టి వద్దాం పదండి అన్నాడు కిరణ్ . మరి డబ్బు అన్నాడు ప్రకాష్ . మా ఇంటికి వెళ్లి పొలం అమ్మి వచ్చిన డబ్బుతో వెళదాం రా అన్నాడు కిరణ్ . సరే అని పొద్దున్నే రైలు ఎక్కి సాయంత్రం కు కిరణ్ ఇంటికి చేరుకున్నారు మిత్రులు . కిరణ్ ని చూసిన ఆనందం లో కిరణ్ అమ్మ ఎన్ని వంటలు చేసిపెట్టిందో అన్ని తిన్న ప్రకాష్ గాడికే తెలియాలి . రాత్రి మేడ మీద పడక వేసి తనివి తీరా నిద్రపోయారు ముగ్గురు .
[+] 1 user Likes kp162118's post
Like Reply


Messages In This Thread
RE: కలలు కన్న భారతం - by kp162118 - 11-06-2019, 07:54 PM



Users browsing this thread: 1 Guest(s)