11-06-2019, 07:53 PM
హేయ్ కిరణ్ ఈరోజు అయిన వెళ్లిన పని అయ్యిందా అన్నాడు ప్రకాష్ . రోజు ఎలా అవుతుందో ఈరోజు పరిస్థితి కూడా అంతే అన్నాడు కిరణ్ . ఈరోజు కూడా పస్తులేనా మనకి అన్నాడు ప్రకాష్ . కుండలో ఉన్న చల్లని నీళ్లే ఈరోజు కి పాయసం అనుకోని తాగి పడుకో అన్నాడు కిరణ్ . కిరణ్ భోజనం చేసి రెండు రోజులు అవుతుంది రా అన్నాడు ప్రకాష్ . జేబులు తడుముకుంటే మొత్తం చిల్లర కలిపి 15 రూపాయలు ఉన్నాయి సరే రా ఉండు బ్రెడ్ ఐన తీసుకొని వస్తాను అని వెళ్లి బ్రెడ్ తీసుకొచ్చి ప్రకాష్ కి ఇచ్చాడు కిరణ్ .నువ్వు తిను రా అని ఇవ్వబోతుంటే నాకు ఆకలిగా లేదని పడుకొని నిద్రపోయాడు కిరణ్ . ప్రకాష్ కిరణ్ చంద్ర ఉంటారు అదే రూమ్ లో . ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబుల వేటలో పడ్డారు . చంద్ర కి ఎవరో దూరపు చుట్టం సినిమాలో తెలిస్తే అక్కడ ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయాడు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం కడుపు ఐన నిండుతుందని . ప్రకాష్ బ్యాంక్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడు . ముగ్గురు కలిసినప్పటి నుండి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కాలం గడిపేస్తూన్నారు . రాత్రి పది గంటలకు రూమ్ కి చేరుకున్నాడు చంద్ర . ప్రకాష్ ని కిరణ్ లేపి ఈరోజు మా డైరెక్టర్ గారి కూతురు పుట్టిన రోజు అందుకే లెట్ అయ్యింది మీ కోసం ఏం తెచ్చానో చూడండి అంటూ బిర్యానీ ప్యాకెట్స్ బయటకు తీసి తినండి అంటూ ఎదురు పెట్టాడు చంద్ర . ఏరా నువ్వు తిన్నావా అన్నాడు కిరణ్ .మీరు తినకుండా నెనుఎప్పుడైన తిన్నాన అన్నాడు చంద్ర . బిర్యానీ కలిపి ఇద్దరికి తినిపిస్తూ తాను తిన్నాడు కిరణ్ . హమ్మయ్య ఇంకో రెండు రోజులు వరకు ఆకలి ఉండదు అన్నాడు ప్రకాష్ . ఏంటి రా చంద్ర అలా ఉన్నావ్ అన్నాడు కిరణ్ . ఏమి లేదురా రోడ్లమీద చిన్న చిన్న పిల్లలతో పనిచేయిస్తున్నారు ఇదేనా మన భారతం ఇదేనా చదువుకున్న వాడికి ఉద్యోగం ఉండదు తినడానికి తిండి ఉండదు పడుకోవడానికి ఇల్లు సరైన మౌలిక సదుపాయాలు లేకుండా మన దేశంలో ఎంత మంది ఉన్నారో ప్రపంచంలో పేదలు ఎక్కువ ఉన్నదేశం ఆకలి సూచిలో అట్టడుగున ఉన్నాం కానీ మనదేశంలో కుబేరులు ఉన్నారని విదేశీ పత్రికలు చెబుతుంటాయి అందరికి విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారో ఈ రాజకీయ నాయకులు మన పొరుగున ఉన్న చైనా అగ్రదేశలతో పోటీ పడి ఎదుగుతుంటే మనం మనదేశ సంపాదలైన యువకులను విదేశాలకు పంపి మా వాడు అది అయ్యాడు మా వాడు ఇది అయ్యాడు అని గొప్పలు చెప్పుకుంటాం . బ్రిటీష్ వాళ్ళు అడుగుపెట్టకముందు ప్రపంచంలో ధనిక దేశం భారతదేశం . వాళ్ళు మన సంపదని కొల్లగొట్టారు మొత్తం దోచుకొని వెళ్లారు నిజమే వాళ్ళు దేశం విడిచి 65 సంవత్సరాలు అయిన ఈ స్వతంత్ర భారతంలో ఆర్థికద్వందత్వం కనిపిస్తుంది ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుంటే పేదవాడు ఇంకా పేదరికంలో కురుకొని పోతున్నాడు . ఈ పరిస్థితులు మారాలి అంటే యువత రంగం లోకి దిగాలి మన రాష్ట్రంలో 294 స్థానాల్లో విద్యావంతులైన వారు రావాలి అన్నాడు చంద్ర . ఏమిరా చంద్ర ఇంత ఆవేశం ఎందుకు రా మనకి దొరికిందా తిన్నమా లేదా పస్తు పడుకున్నమా అన్నట్టు ఉండాలి రా అన్నాడు ప్రకాష్ . అందరూ నీలాగే ఆలోచిస్తే ఈ దేశం ఎప్పటికి బాగుపడదు రా అని పడుకున్నాడు చంద్ర .