11-06-2019, 07:52 PM
హేయ్ ఆటో ఆగు అంటూ పరుగులు తీస్తూ వస్తున్నాడు కిరణ్ . ఆటో వాడు ముగ్గురు ఆడపిల్లలు ఎక్కించుకొని కనీసం మాట ఐన వినిపించుకోకుండా ముందుకు దూసుకు వెళ్ళాడు . శకునమే బావున్నట్టు లేదు 10 గంటలకు ఇంటర్వ్యూ 9 గంటల నుండి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కిరణ్ 2 బస్సులు వెళ్లి పోయాయి బస్సులో ఎక్కడానికి ఖాళీనేలేదు టైం ఏమో 10 గంటలకి దగ్గర అవుతుంటే ఆటో లో ఐన వెళ్దాం వచ్చేప్పుడు నడిచి అయిన రావచ్చు అని ఆటో కోసం పరుగులేడితే వెళ్ళిపోయాడు ఏం ప్రయోజనం ఆ ఆటో వాడే 9 గంటల నుండి తనని ఆటో ఎక్కమని సతయించి తీరా బస్సు దొరక్కపోయేసరికి తన దురదృష్టవశాత్తు వచ్చిన అమ్మాయిలను ఎక్కించుకొని వెళ్ళాడు . ఎం చేస్తాం కర్మ అనుకుంటూ ఉండగానే ఒక బస్సు వచ్చింది ఊహించని విధంగా చాలా సీట్ లు ఖాళీ గా ఉన్నాయి . బస్సు ఎక్కి తాను దిగవలిసిన స్టాప్ లో దిగిపోయాడు కిరణ్ . ఇంటర్వ్యూకోసం వెళ్ళవలసిన ఆఫిస్ కి 10 నిముషాలు ముందుగానే చేరుకున్నాడు . అన్నింటికి సమాదానాలు సరిగ్గానే చెప్పాడు కానీ ఎవరో మంత్రి ఇచ్చిన సిఫారసు వల్ల తనకి కాకుండా పోయింది ఉద్యోగం . సరేలే రాసి పెట్టి ఉంటే వచ్చేది ఆ భాగ్యం నాకు లేదనుకుంటూ నడుస్తుంటే ఒక పన్నెండేళ్ల పాప రోడ్డు దాటుతుంటే ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది అందరు గుమికూడరే తప్ప ఆ పాపని హస్పటల్ కి తీసుకెళ్దాం అని ఒక్క నాధునికి అనిపించలేదు గుంపు మధ్యలోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న ఆ పాపని రెండు చేతుల్లో ఎత్తుకొని కార్ లు ఆటోలు అపుతుంటే ఎవరు ఆపకుండా వెళ్లిపోతుంటే అలానే దగ్గర లో ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయమంటే 2లక్షలు అడుగుతుంటే ఏమి చేయలేక తన మెడలో చిన్నప్పుడు మెడలో నానమ్మ వేసిన బంగారు గోలుసుని తెరిపరా ఒకసారి చూసాడు ఎప్పుడూ నా గుర్తుగా ఇది నీ మెడలో ఉండాలి రా మనవడా అని చెప్పిన నానమ్మ మాటలు చేవిలో మారుమోగుతుండగా ఇప్పుడే వస్తాను అని చెప్పి పాపని అక్కడే ఉన్న నర్స్ కి అప్పగించి గొలుసు ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఆ పాప కి ఆపరేషన్ చేపించాడు కిరణ్ . కొంత సమయనికి పాప తల్లి తండ్రులు వస్తే ఆ పాపని జాగ్రత్తగా చూసుకోమని హాస్పటల్ నుండి బయటకు వచ్చి రూమ్ కి బయలుదేరాడు .