Thread Rating:
  • 2 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*ఆరోగ్యానికి, దేనికయినా * *సమయపాలన అవసరం..!*
#1
250b 23j1946. 2602B3-8.
121023-8.
???????????*మన ఆరోగ్యం…


*ఆరోగ్యానికి, దేనికయినా  *
      *సమయపాలన అవసరం..!*
                ➖➖➖✍️

కొందరు  రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా లాగిస్తుంటారు. అసలు మనకు రోగాలు రావటాని

కి మొట్టమొదటి కారణం మన ఆహారపు అలవాట్లే….

ఈ పద్ధతులు పాటించినట్లయితే ఎలాంటి జబ్బు మీ ధరి చేరదు.

ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి?
గోరు వెచ్చనివి.

నీరు ఏ విధంగా త్రాగాలి?
క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

ఆహారం ఎన్ని సార్లు నమలాలి?
32 సార్లు.

భోజనం నిండుగా ఎప్పుడు తినాలి?
ఉదయం.

ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి?
సూర్యోదయం అయిన 2.30 గం” లోపు.

ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి?
పళ్ళ రసాలు(fruit juice).

మధ్యానము భోజనం తర్వాత ఏమి త్రాగాలి?
లస్సీ, మజ్జిగ.

రాత్రి భోజనంతో ఏమి త్రాగాలి?
పాలు.

పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు?
రాత్రి.

ఐస్ క్రీం ఎప్పుడు తినాలి?
ఎప్పుడూ తినకూడదు.

ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను?
గంట తర్వాత.

శీతల పానియాలు( cool drink ) త్రాగవచ్చునా?
త్రాగకూడదు.

వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి?
40 నిమిషాల లోగా.

రాత్రి పూట ఎంత తినాలి?
చాలా తక్కువగా, అసలు తిననట్టు.

రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి?
సూర్యాస్తమయం లోపు.

మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి?
48 నిమిషాలు.

రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా?
త్రాగకూడదు.

ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి?
పని.

మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి?
విశ్రాంతి తీసుకోవాలి.

రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి?
500 అడుగులు నడవాలి.

అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి?
వజ్రాసనం వేయాలి.

వజ్రాసనం ఎంత సేపు వేయాలి?
5 – 10 ని.

ఉదయం లేచిన తర్వాత కంటిలో ఏమి వేయాలి?
లాలాజలం,( saliva ).

రాత్రి ఎన్నింటికి పడుకోవాలి?
9- 10 గం.

3 విషముల పేర్లు?
పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

 
మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి?
వాము.

రాత్రి పూట సలాడ్ తినవచ్చునా?
తినరాదు.

ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి?
క్రింద కూర్చుని మరియు బాగా నమిలి

విదేశీ వస్తువులను కోనవచ్చునా?
ఎప్పుడూ కోనరాదు (Buy) .‌

టీ ఎప్పుడు త్రాగాలి?
అసలు ఎప్పుడు త్రాగకూడదు.

పాలలో ఏమి వేసుకుని త్రాగాలి?
పసుపు.

పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి?
క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

ఏ చికిత్సా విధానం మంచిది?
ఆయుర్వేదం.

వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి?
అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో)

రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి?
జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).

మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి?
మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).

ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి?
సుమారు 2,3 గ్లాసులు.

ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి?
సూర్యోదయాని 1.30 గం. ముందుగా.

ఆయుర్వేద చిట్కాలు
*********
* పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది.
* స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
* జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
* లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
* గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
* వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
* వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.✍️
                     …సేకరణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
*ఆరోగ్యానికి, దేనికయినా * *సమయపాలన అవసరం..!* - by Yuvak - 12-10-2023, 11:02 AM



Users browsing this thread: 1 Guest(s)