10-10-2023, 08:51 AM
నరం లేని నాలుక కు 40రుచులు ఎందుకు❓❓❓❓❓❓
అతి వేడిగా, అతి చల్లగా త్రాగ వద్దని దంతాలు బ్రతిమాలినా
నాకు ఇలానే ఇష్టం అంటూ మరుగు మరుగు కాఫీలు, గడ్డ కట్టిన ఐస్ క్రీములు తింటుంది ఈ నాలుక ☕??
తీపి ఎక్కువ తినవద్దు ఒళ్ళు గుల్ల అవుతుంది అని శరీరం ఎంత మొత్తుకున్నా "you are soo sweet" అంటూనే ఒకటికి పది లాగిస్తుంది ఈ నాలుకే,,,,, ???
నీళ్లు ఎక్కువ త్రాగు రక్తం శుద్ధి జరిగి మలినాలు పోతాయని చెబుతుంటే ఒత్తి నీళ్లు ఎట్టా తాగేది అంటూ కూల్ డ్రింక్స్ గట్రా కావాలంటుంది ఈ మొండి నాలుక????
కారం ఎక్కువ తినవద్దు అల్సర్ వస్తుందని ప్రేగులు ఎంత వేడుకుంటున్నా నాకు మిరపకాయ బజ్జీ ఇష్టం, ఆవకాయ అన్నం ఇష్టం, మసాలా కూరలు ఇష్టం అని అడ్డూ అదుపు లేకుండా తింటుంది ఈ నాలుక ??
చక్కని పళ్లు కూరగాయలు తిను ఆరోగ్యానికి మంచిదని మంచి చెబుతుంటే,,,
చచ్చ కక్కా, ముక్కా లేకుంటే ఎట్టా బతికే అంటుంది ఈ తిక్క నాలుక???
పోని తింటే తిన్నావు శుబ్రం గా ఇంట్లో తినమంటే, బయటి రుచులు ఇంటి వంటకు వస్తాయా ? అంటూ వీకెండ్ ఐతే చాలు, జేబులు గుల్ల చేస్తుంది ఈ నాలుకే , ,,,
ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఉన్న ఫ్రూట్స్ & నట్స తినమఁటే జంక్ ఫుడ్ కు ఎట్రాక్టై పిజ్జా, బర్గర్ లు కావాలని మారాం చేస్తుంది ఈ నాలుకే,, ????
చిరుధాన్యాలు తింటే ఒంటికి మంచిది అని బుజ్జగిస్తుంటే,
రుచి, పచి లేని చప్పిడి కూడు తినడానికి నేనేేమైనా పేషెంట్ నా?
అని నిలదీస్తుంది ఈ నాలుకే, ,
గంటల పాటు స్రమపడి శ్రద్ధగా వండి వడ్డిస్తే , నూనె లేదు, ఉప్పు లేదు, తీపి లేదు, కారం లేదు, పులుపు లేదు, వేగ లేదు, ఉడక లేదు అంటూ విమర్శిస్తుంది ఈ నాలుకే ------
విచ్చలవిడిగా నచ్చినవన్నీ తిని ఒంటి మీదికి షుగర్, బిపి, లివర్ డేమేజ్, కిడ్నీ, గాల్బ్లేడర్ రాళ్ళు, కన్ను, కాళ్లు, కీళ్ళు, దంతాలు, నొప్పులు, ఇంకా వందల రకాల వ్యాధులకు కారణం ఈ నగరం లేని నాలుకే కదా_______
మొత్తం అంతా తనే చేసి చివరకు ఒళ్లు గల్లై ఆసుపత్రిలో మందులు మింగమంటే, చేదు వద్దంటూ మాత్రలను అమాంతం గొంతులోకి తోసేస్తుంది ఈ నాలుకే,,
ఇంత పొగరుబోతు నాలుక ని అదుపు చేయకపోతే పాతికేళ్లకే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాం మనం,,,,!