09-10-2023, 12:38 AM
ఇక చాలా బాధగా అనిపించింది. బాధ తో అలానే పడుకున్న. పొద్దున్న లేచాక చూస్తే అనన్య ది ఒక మిస్డ్ కాల్ ఉంది. ఏంటో అని ఫోన్ చేశాను. తను మీటింగ్ ఉంది రావా లేట్ అవుతుంది కదా అంది. నాకు హెల్త్ బాగోలేదు, నువ్వే హ్యాండిల్ చెయ్ అన్నాను. తను సరే అని కొన్ని డీటైల్స్ తీసుకుని కట్ చేసింది. ఒక రెండు రోజులు అలానే ఇంట్లోనే ఉన్న. కానీ ఆఫీసు కి కూడా ఎందుకు రాలేదు అని ఎవరూ అడగలేదు. ఇలానే ఉంటే కష్టం అని మూడో రోజు వెళ్ళాను ఆఫీస్ కి. P. వర్ష మరియు మా ఆఫీస్ లో పని చేసే సుందర్ పెళ్లికి రెడీ అయ్యారు. నాకు ముందుగానే వైజాగ్ లో చెప్పింది సో నాకు కొత్తగా అనిపించలేదు. ఇంకో వారం లో పెళ్లి అని చెప్పారు. సరే వస్తా అని నా పనులలో బిజీగా అయ్యాను. P. వర్ష పెళ్లి ముందు రోజు ఫోన్ చేసి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు మళ్ళీ మామూలు మనిషి గా చేశావు, పెళ్లికి కచ్చితంగా రావాలి, కుదిరితే అనన్య మేడం ని కూడా తీసుకురా అంది. సరే అన్నాను. పెళ్లి సింపుల్ గా చేసుకున్నారు ఒక గుడిలో. ఒక పది మంది అంతే కానీ అనన్య రాలేదు. సాయంత్రం పార్టీ ఇచ్చారు ఆఫీస్ స్టాఫ్ కి. నాకు మూడ్ లేకపోయినా అందరూ పిలుస్తుంటే వెళ్ళాను. P. వర్ష పెళ్లికి రమ్మని చాలా సేపు అడిగింది కానీ పార్టీ కి రమ్మని కూడా పిలవలేదు. పిలవలేదని నేను వెళ్ళడానికి ఇష్ట పడలేదు. కానీ ఆఫీసు స్టాఫ్ చాలా సేపు రిక్వెస్ట్ చేయడం తో సరే అన్నాను. కానీ నన్ను చూసిన p. వర్ష హ్యాపీగా ఫీల్ కాలేదు కొంచెం టెన్షన్ పడింది. కానీ ఏదో కవర్ చేసింది. నేను విష్ చేసి వచ్చేసాను. తనతో నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది ఏదో స్టాఫ్ ఫోర్స్ చేస్తే వచ్చాను అని చెప్పి అక్కడ దూరంగా పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాను. P. వర్ష కొంచెం హ్యాపీ అయింది. కొంత సేపటికి అనన్య మరియు వాళ్ళ స్టెప్ మామ్ అయిన నర్మద వచ్చారు. అనన్య తీసుకు వచ్చి ఉంటుంది అనుకున్న. కానీ నర్మద చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న లాగా మాట్లాడుతుంది. నాకు ఏదో సందేహం వచ్చింది. P. వర్ష కళ్ళు నన్నే వెతుకుతూ ఉన్నాయి. ఇంకో సైడ్ నుంచి c. వర్ష వచ్చింది. తను కూడా చాలా హ్యాపీగా విష్ చేసి మాట్లాడుతూ ఉంది. ఇంకో అరగంట కి రమేష్ భయ్యా వచ్చాడు, ఆయన తో p. వర్ష బాయ్ ప్రెండ్ కూడా వచ్చాడు. వాళ్ళు కూడా నర్మద మేడం తో చాలా క్యాజువల్ గా మాట్లాడుతు ఉన్నారు. అలా చిత్ర, చిత్ర మొగుడు, IG, హారిక, హారిక లవర్ అందరూ వచ్చారు. కానీ అంతా నర్మద మేడం తో క్లోజ్ గా మాట్లాడుతున్నారు కానీ అనన్య తో క్లోజ్ గా లేరు. నర్మద కే క్లోజ్ అనుకుని నేను ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో కూర్చుని ఇంకా ఎవరు వస్తారు అని చూస్తూ ఉన్న.