08-10-2023, 09:11 PM
ఇక కార్ లో వెళ్తుంటే అనవసరం గా p. వర్ష ను తిట్టాను వల్గర్ గా అనిపించింది సారి అని మెసేజ్ చేశాను. తను సరే అంది. డ్రైవింగ్ లో ఫోన్ ఎందుకు వాడటం అని నర్మద మేడం ఇంటికి వెళ్ళాను. తను అక్కడ ఒక అమ్మాయిని పరిచయం చేసి తన పేరు అనన్య, మినిస్టర్ మొదటి భార్య కూతురు, తను మైనింగ్ లో ఇంజనీరింగ్ చేసింది. మినిస్టర్ గారు చాల పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పిన తను కొత్త కంపెనీ అయితే బాగుంటుంది ఎక్కువ స్ట్రగుల్ టార్గెట్స్ ఉంటాయ్ అని అంటే నిన్ను సెలెక్ట్ చేసాను. బీ కేర్ ఫుల్ అంది. సరే మేడం అన్నాను. మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి టీ తెస్తాను అని చెప్పి వెళ్ళింది. నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుని తన గురించి అడిగాను. తను డైరెక్ట్ ఆఫీస్ కి వస్తా అంది. సరే అని టీ తాగి బయలుదేరాను. నర్మద మేడం రాత్రి సెండ్ చేసినట్టు ఎవరికీ సెండ్ చేయకు అది మంచిది కాదు అంది. సరే సారి మేడం అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆఫీస్ కి వెళ్ళాను. అనన్య చాలా ఫాస్ట్ గా వర్క్ నేర్చుకుంది. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో చాలా ఆక్టివ్ గా పని చేస్తుంది. నాకు పని భారం బాగా తగ్గించింది. కానీ తను ఎక్కువ రోజులు పని చేయదు కదా అందుకే ప్రతి విషయం లో నేను కూడా ఉండేవాడిని తను వెళ్తే మళ్ళీ ఇబ్బంది రాకూడదు అని. అలా రోజు మొత్తం బిజీగా ఉండేవాడిని. ఒక రోజు c. వర్ష ఫోన్ చేసి ఈ రోజు నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా రాత్రి 8 కి ఇంటికి రావాలి అంది. ఏమైంది అన్నాను. పని ఉంది వచ్చాకే చెప్తా అంది. సరే అని ఇక వెళ్ళాను తొందరగా. C. వర్ష అసలు ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నాము అని గుర్తుందా అని అడిగింది. అరే మొదట్లో నువ్వు బిజీగా ఉందేదానివి. ఇపుడు నేను బిజీ అయ్యాను అన్నాను. తను అలా ఉండెబదులు సెపరేట్ గా ఉంటే మంచిది కదా అంది. ఇపుడు ఏమైంది ఇక నుంచి నీతో టైమ్ స్పెండ్ చేస్తా అన్నాను. తను నీతో కాదు లే కానీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి సంతకం పెట్టు అంది. ఏంటిది అన్నాను. చదువుకో అంది. తన కంపెనీ హెడ్ పొజిషన్ నుంచి రాజీనామా చేస్తునట్టు ఉంది. నేను సంతకం పెట్టేసాను. తను ఇక లేచి నేను వెళ్తున్న ఇక బై అని చెప్పి వెళ్ళింది. అరె ఏమైందీ ఇప్పటి నుంచి చూడు అని చెప్పాను. చాలా రోజుల నుంచి చూస్తున్న, మరియు నీకు ఒకటి చెప్పాలి, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఉన్న ఫీల్ నాకు రావడం లేదు నీతో అందుకే ఆ ఫీల్ వచ్చిన ఒక అబ్బాయి ని మీట్ అయ్యాను, నేను వెళ్తున్న అని వెళ్ళింది. తన జీవితం లో ఇంకొకరు వచ్చాక ఆపడం తప్పు అనుకుని సైలెంట్ గా ఉండిపోయా.