Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*ఎందుకీ మానవ జన్మ?* *ఎప్పుడు దీనికి విముక్తి?*
#1
0 9క1.2007న2-6.0810క3-4.
???????????


   *ఎందుకీ మానవ జన్మ?* 
             *ఎప్పుడు దీనికి విముక్తి?* 
                   ➖➖➖✍️
```       
జీవితం మీద మనకు విసుగు పుట్టినప్పుడు ‘ఛీ మనిషిగా ఎందుకు పుట్టాను రా బాబూ’ అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు మనిషి జన్మ ఏమిటి, దీనికి విముక్తి ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం.

నిజంగా మానవ జన్మ అంత నీచనికృష్టమైనదా, అసలు మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాం…? ఎందుకు చనిపోతున్నాం? చనిపోయాక ఎక్కడికి పోతాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి.

మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు,ఉత్తమోత్తమమైనది. ‘పునరపి జననం,పునరపి మరణం’ అంటారు. జన్మ అంటే మళ్లీ పుట్టడం… అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. అయినా పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు. ఇందులో మరో దారి లేదు.

’మనుషులకేనా చెట్లకు ఉండవా...                ఇవన్నీ మానవ మాత్రులకేనా చెట్టూ చేమలకు ఉండవా?’ అని మీరనుకోవచ్చు. 
అక్కడికే వద్దాం...
ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది. అది పువ్వై ఆ తర్వాత కాయగా మారింది. పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిందెగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, ‘అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా’అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తుంటాం.

అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది.

కానీ పండు విషయంలో అలా కాదు…. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు. పండు మొదలు లోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.

సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాధే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. 

జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేయాలి.```

కర్మ ఫలాలు ఏమిటో తెల్సుకుందాం.        ```జ్ఞానం, కర్మలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు కర్మల రూపంలో మనతోనే వస్తాయి. 

ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ‘ఆగామి, సంచితం, ప్రారబ్దం’ అని మూడు రకాలుగా ఈ కర్మలు ఉంటాయి.

నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల కిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి… మరికొన్ని తర్వాతి జన్మల్లో ఫలితాన్ని చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దానధర్మాలు ఏమైనా చేశామా… లాంటివన్నీ ఆగామి కర్మల కిందిదకే వస్తాయి.

ఇక సంచిత కర్మలలోకి వెళదాం. మనం పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చాయనుకోండి మనం ఈ జన్మలో కూడా వాటిని అనుభవించకుంటే అవి మళ్లీ రాబోయే జన్మకు వెళ్లిపోతాయి.

వీటిని సంచిత కర్మలు అంటారు. ఉదాహరణకు గత జన్మలో మీరు ఒకర్ని హత్య చేశారనుకుందాం ఈ జన్మలో దాని ఫలితం అనుభవించాల్సి ఉన్నా రకరకాల కారణాలవల్ల అది జరగలేదు… అది రాబోయే జన్మకు తరలిపోతుంది. దీన్ని సంచిత కర్మ అంటారు. 

ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని మనం తరచూ అంటూ ఉంటాం.✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
*ఎందుకీ మానవ జన్మ?* *ఎప్పుడు దీనికి విముక్తి?* - by Yuvak - 08-10-2023, 08:53 AM



Users browsing this thread: