28-12-2018, 08:44 PM
నిర్మలమ్మకి కాళ్ళు వణకసాగాయి. ఎందుకంటే ఉద్యోగం పోతుంది అన్న భయం తో కాదు. ఉద్యోగం పొతే పరువు పోతుంది అన్న బాధ తో. దానికి తోడు నరసింహానికి ఆమె మీద కోపం అని తెలుసు. నిజానికి ఆ కాగితాలు ఉంది ఉంటె అవి అతని మొహాన విసిరి కొట్టాలన్నంత కోపం ఉంది ఆమెకి. కానీ ఏమి చెయ్యలేని పరిస్థితి. తప్పు తన వైపు ఉంది కాబట్టి ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. ఏ సమయం లో రెడ్డి గుర్తుకి వచ్చాడు నిర్మలమ్మకి. రెడ్డి కి చెప్తే అతను చూసుకుంటాడు అన్న ఉద్దేశం తో గబ గబా రెడ్డి ఇంటివైపు రాసాగింది. ఆమె రాకని గమనించిన రత్నం ఏమి తెలియనట్టు ఎదురు వెళ్లి " ఏందీ నిర్మల..వళ్లు అంతా చెమటలు..."అంది అమాయకం గ. "ఎం లేదు రత్నం..రెడ్డి గారు లేదా..మాట్లాడాలి" అంది లోపలి చూస్తూ. "లేదు..పొలం బోయాడు..అయినా ఏందీ సంగతి" అంది విషయం రాబట్టాలి అని. "ఎం లేదు రత్నం..ఆ నరసింహం బడి కి వచ్చి కాగితాలు సాయంత్రం లోపు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు..అవి నాదగ్గర లేవు..రెడ్డి గారు ఒక మాట చెప్తారేమో అని వచ్చా" అంది కొంచం బాధ గ. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రత్నం ,మనసులో నవ్వుకొని " ఆయా నిర్మల..రెడ్డి కి నరసింహం అంటే పడదు..పొలం విషయం లో తగాదా వచ్చి ఇపుడు మాటల్లేవు..సరే..ఒక పని చేద్దాం...నేను అడిగి చూస్తా..నాకు పెద్దగా పరిచయం లేదు..కానీ నీ బాధ చూడలేకపోయా..." అంది బాధ నటిస్తూ. అపుడు నిర్మలమ్మ కి రత్నం మీద మల్లి గౌరవం పెరిగిపోయింది ఆమె సహాయ గుణానికి. "రత్నం..నీ ఋణం ఈ జన్మ కి తీర్చుకోలేను..."అంది కళ్ళు వత్తుకుంటూ.