Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అన్నయ్యా ..... బుజ్జిదేవత - దేవతలు వచ్చారు .
వచ్చా......రా ...... పట్టు పరికిణీలో బుజ్జి సిస్టర్స్ ను పట్టుకున్న బుజ్జిజానకి - పట్టు లంగావోణీలలో అక్కయ్యలు - పట్టుచీరలలో దేవతలు ..... అహ్హ్ అంటూ ఫ్లాట్ అయిపోయినట్లు హృదయంపై చేతినివేసుకుని వెనక్కు ......
మహేష్ - తమ్ముడూ - హీరో ......
పిల్లలు : పట్టుకున్నాము పట్టుకున్నాము బుజ్జిదేవత - దేవతలూ ..... కంగారుపడకండి మాకు .... ఈ బుజ్జిదేవుడి గురించి పూర్తిగా తెలిసిపోయింది - మీరందరూ అంటే ప్రాణం అన్నమాట .......
బుజ్జిజానకి - అక్కయ్యల - మేడమ్ - పెద్దమ్మ అందమైన నవ్వులు , అంటీల కోపపు నవ్వులు .......
అఅహ్హ్ ...... దగ్గరకు వచ్చేన్తవరకూ అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను .

చాలు చాలు అల్లరి కొరుక్కుని తినేస్తావా ఏమిటి ? అంటూ అంటీలు ...... , బుజ్జితల్లికి నీ దిష్టి నే తగిలేలా ఉంది , వెంటనే దిష్టి తీయాలి అంటూ కళ్ళ కాటుక అందుకుని మెడపై - అరి పాదంపై ఉంచి ఇక ఎవరి దిష్టి తగలదు అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
అక్కయ్యలు : తమ్ముడి దిష్టి తప్ప ..... అంతేనా చెల్లీ .....
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ , నన్ను - అక్కయ్యలను మామూలుగానే చూస్తున్నాడు అత్తయ్యలూ ...... మిమ్మల్నే దేవతలనే కొరుక్కుతినేలా చూస్తున్నాడు .
అంటీలు : ఒకసారి నావైపుకు చూసి అవును బుజ్జితల్లీ ..... , తప్పదు ఈ రెండు రోజులూ భరించాల్సిందే ...... , అమ్మలూ - పిల్లలూ ...... మీబుజ్జిదేవత రెడీ ఎక్కడికైనా తీసుకెళ్లండి .
పిల్లలు : థాంక్యూ దేవతలూ ......
మురిసిపోతున్నారు చెల్లీ మురిసిపోతున్నారు ...... అంటూ బుజ్జిజానకితోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు అక్కయ్యలు , మిమ్మల్ని దేవతలను చేసింది ఎవరో తెలుసుకదా ......
అంటీలు : నావైపుకు చూసారు .
అక్కయ్యలు : గుర్తుంది గుర్తుంది చెల్లీ ...... అంటూ నవ్వులు .
అంటీలు : ష్ ష్ ష్ ఇప్పుడే తెగ అల్లరి చేస్తున్నాడు అంటూ నోళ్ళను మూసి సిగ్గుపడుతున్నారు .

పిల్లలూ - అమ్మలూ ...... బస్సెస్ ఎక్కండి అన్నారు ఆయా .....
పిల్లలు : అలాగే వార్డెన్ .
బుజ్జిజానకి - అక్కయ్యలు గుసగుసలాడుకుని , దేవతలూ ..... మేమూ అందరితోపాటు కాలేజ్ బస్సులో వస్తాము .
అంటీలు - మేడమ్ - పెద్దమ్మ నవ్వుకుని మేముకూడా ......
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ ......
పిల్లల సంతోషాలకు అవధులులేనట్లు , బుజ్జిదేవత - దేవతలూ - అన్నయ్యా ..... రండి రండి అంటూ బస్సులోకి తీసుకెల్లి వార్డెన్ వార్డెన్ రైట్ రైట్ అనడంతో బయలుదేరింది .

వార్డెన్ ? ......
ఆయా : నువ్వేగా బుజ్జిదేవుడా వార్డెన్ ను చేసావు అంటూ వివరించారు ...... 
( రోజూలానే తెల్లవారుఘామున చదువుకోవడానికి లేవాల్సిన పిల్లలు మొదటిసారిగా హాయిగా పడుకున్నట్లు సూర్యోదయ సమయానికి లేచారు - పిల్లలతోపాటు మేముకూడా ఆలస్యంగానే లేచాము ......
కటిక నేలపై - సరిగ్గా కప్పుకోవడానికి దుప్పట్లూ లేకుండా - చలిలో దోమల బెడదతో సరైన నిద్రలేనట్లు రోజూ ఇబ్బందిపడుతూ లేచే పిల్లలు మొదటిసారి మంచాలు - మెత్తని పరుపులపై ఉండటం , తమ హాల్ ..... సకల సదుపాయాలతో కొత్తగా ఇంటి వాతావరణంలా మారిపోయి ఉండటం చూసి సంతోషమైన షాక్ తో ఆయా - ఆయా - బామ్మలూ అంటూ కేకలువేశారు .....
పిల్లలూ అంటూ ఉలిక్కిపడి లేచిన మా పరిస్థితీ అంతే ....... , పిల్లల దగ్గరికివెళ్ళిచూస్తే ఫస్ట్ టైం ఫస్ట్ టైం సంతోషంతో బెడ్స్ పై చిందులువేస్తున్నారు , అందరి చేతులలో టెడ్డీ గిఫ్ట్స్ ..... ముద్దులు కురిపిస్తూ ఆయా - బామ్మలూ ..... మనం ఎక్కడ ఉన్నాము ? అంటూ చుట్టూ చేరారు .
చుట్టూ చూసి , రాత్రి దేవుడిలా ఒక పిల్లాడు వచ్చాడు పిల్లలూ ...... , ఒక బుజ్జిదేవత పంపించింది నమ్మండి ఉదయానికల్లా మొత్తం మార్చేస్తాను అన్నాడు ...... 
ఎవరు ఎవరు ఆయా ......
ఎవరో తెలియదు కానీ ఆ బుజ్జిదేవతకు కూడా మీలానే అమ్మ లేరట - తనలాగా చాలామంది ఉన్నారని తెలుసుకుని మనకోసం ఇలా మార్చేసింది , ఆ ఆ గుర్తొచ్చింది బుజ్జిదేవత పేరు బుజ్జిజానకి ......
గిఫ్ట్ తోపాటు ఈ బుక్ మరియు కీస్ ..... బెడ్ పై ఉన్నాయి అంటూ చూయించారు పిల్లలు .....
మా పరుపులపైన కూడా ఉన్నాయి అన్నారు బామ్మలు ......
ఆయా అందుకుని చూసి , ఇవి బ్యాంక్ బుక్స్ పిల్లలూ ..... ఒక్కొక్కరి అకౌంట్ లో లక్షకు పైగా డబ్బు ఉంది - ఇక ఈ తాళాలు మీ ఎదురుగా ఉన్న లాకర్స్ వి అయి ఉంటాయి అంటూ నెంబర్ చూసి ఒకటి తెరిచారు .
అందులో ఒక స్టూడెంట్ కు అవసరమైనవన్నీ కొత్తవి ఉండటం చూసి అందరూ వారి వారి లాకర్స్ తెరిచి చూసుకుని ఆనందించారు .
అక్కయ్యలూ చెల్లెళ్ళూ - బామ్మలూ ...... బాత్రూమ్స్ - ఆట స్థలాలు - కిచెన్ అన్నీ అన్నీ సూపర్ గా మారిపోయాయి రండి అంటూ బయటకు పిలుచుకునివచ్చారు .... , మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ కూడా.....
శరణాలయం మొత్తం అద్భుతంగా మారిపోయి ఉండటం చూసి మా ఆనందాలకు అవధులులేవు ......

మేడమ్స్ - పిల్లలూ ...... మేము కొత్తగా వచ్చిన చెఫ్స్ , కాసేపట్లో టీ - కాఫీ - బూస్ట్ - హార్లిక్స్ - మిల్క్ - ఫ్రూట్ జ్యూస్ - బ్రెడ్ రెడీ అయిపోతాయి , తరువాత టిఫిన్స్ ఏమిచెయ్యాలో చెబితే రెడీ చేసేస్తాము అంటూ ఐదుగురు విమెన్ చెఫ్ డ్రెస్సుల్లో వచ్చారు .
పిల్లలు : రోజూలానే ఉప్మా ......
చెఫ్స్ : ఇప్పటివరకూ వేరు ఇకనుండీ వేరు , మీకెమి ఇష్టమో ఆర్డర్ వెయ్యండి .
పిల్లలు ఒకరినొకరు చూసుకుని ఏదైనా చెప్పొచ్చా ......
చెఫ్స్ : ఏ టిఫిన్ అయినా - ఎన్ని అయినా ...... అన్నీ చేసేస్తాము .
ప్రతీ రోజూ రుచిలేని ఉప్మా నే తింటూ ఆకలితో వెళ్లే పిల్లలకు చిరు ఆశ కలిగినట్లు ఇడ్లీ వడ పూరి దోస పెసరట్టు పుణుగులు అప్పం లు ...... ఇలా ఎవరికిష్టమైనవి వాళ్ళు కొంతమంది అయితే రెండు మూడు .......
చెఫ్స్ : మీరు స్నానం చేసి రెడీ అయ్యేలోపు అన్నీ రెడీ అయిపోతాయి , నాన్ వెజ్ వద్దా ? , చికెన్ ఫ్రై - చికెన్ బిరియాణీ - కబాబ్స్ .....
అంతవరకూ ఒక్కసారి కూడా తినని పిల్లలకు నోరూరినట్లు , అవికూడా చేస్తారా ? నిజంగా ......
చెఫ్స్ : ఈరోజు నుండీ పూర్తిగా మారిపోయింది పిల్లలూ - ఇక్కడ ఇకనుండీ మీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి , మీరే ఓనర్స్ ......
పిల్లలు : మరి వార్డెన్ అంటూ భయపడుతున్నారు .
చెఫ్స్ : అదిగో మాజీ వార్డెన్ మరియు ఆఫీసర్స్ మాటల్లోనే వచ్చాడు .....

పిల్లలంతా భయంతో లోపలికివెళ్లబోయారు ......
క్షమించండి క్షమించండి పిల్లలూ ..... అంటూ కన్నీళ్లతో మోకాళ్లపైకిచేరారు , ఇంతకాలం మిమ్మల్ని ఎన్నిఇబ్బందులుపెట్టామో అంతటికీ శిక్ష పడింది - మామా పదవులకు రాజీనామా చేసే వచ్చాము - ఇక నుండీ మీ ఆయనే మీకు వార్డెన్ , మమ్మల్ని మన్నించండి లేదా మీ కోపం తగ్గేవరకూ కొట్టండి ......
ఇన్నాళ్లూ పడిన కష్టం గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆగడంలేదు పిల్లలకు - మిమ్మల్ని ఇక చూడకూడదు వెళ్లిపోండి ......
మన్నించండి అంటూ నమస్కరించి వెళ్లిపోయారు .
ఆయా - బామ్మలూ ..... అంటూ హత్తుకున్నారు .
ఆయా : ఇకపై మీ కన్నీళ్లు చూడకూడదని అన్నాడు బుజ్జిదేవుడి ...... , మీరు కన్నీళ్లు పెడితే బుజ్జిదేవత బాధపడుతుందట ......
లేదు లేదు ఆయా అంటూ తుడుచుకున్నారు , ఇకనుండీ వార్డెన్ వార్డెన్ ..... అంటూ సంతోషంతో కేకలువేస్తూ నవ్వుకుంటున్నారు , మాకు మొత్తం అర్థమైపోయింది బుజ్జిదేవత పంపించిన బుజ్జిదేవుడు సంతోషమయం చేసేసారన్నమాట అంటూ సంతోషంతో చిందులువేస్తున్నారు .
ఆయా : తరువాత ఎంతసేపైనా ఆనందించవచ్చు , ముందైతే టిఫిన్ ఏమికావాలో వెజ్ ఆర్ నాన్ వెజ్ ..... , మీరు ఫ్రెష్ అయ్యేలోపు రెడీ అయిపోతాయి .
పిల్లలు : సీరియస్ గా చర్చించుకుని , ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ వద్దు , టిఫిన్స్ మాత్రం మేము చెప్పినవన్నీ కావాలి ......
ఆయా : ఓకేరోజే అన్నీ టేస్ట్ చేసేస్తారన్నమాట ...... , మీ ఇష్టం .....
చెఫ్స్ : అలాగే పిల్లలూ అన్నీ రెడీ అయిపోతాయి అంటూ వెళ్లిపోయారు .

ప్రతీరోజూ ..... దుర్భరమైన స్థితిలో ఉన్న బాత్రూమ్స్ లో ఉదయాన్నే ఫ్రీజ్ అయ్యే నీళ్లతో నిమిషాలు కూడా ఉండలేని పిల్లలు , గంటలు గంటలు షవర్ కింద - బాత్ టబ్ లో కలిసి స్నానం చెయ్యడం చూసి చాలా చాలా ఆనందం వేసింది - తమ జీవితంలో మొదటిసారి కొత్త బట్టలు వేసుకుని వాళ్ళు పొందిన అనుభూతి మాటల్లో వర్ణించలేము , పేరుకు వంట గదే కానీ శుభ్రం చెయ్యక దుర్వాసన వచ్చేది అందరూ బయటకు వచ్చి తినేవారు అలాంటిది సూపర్ క్లీన్ గా వరుసగా డైనింగ్ టేబుల్స్ ఉండటం చూసి ఫస్ట్ టైం ఫస్ట్ టైం తృప్తిగా కడుపునిండా తిన్నారు అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుతున్నారు .
పిల్లల చేతులు అందుకుని ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడుచుకున్నారు దేవతలు .......
అంతలోనే మధ్యాహ్నానికి ఏమికావాలో ఆర్డర్ వెయ్యండి పిల్లలూ అంటూ వచ్చారు చెఫ్స్ - మధ్యలో ఆకలివేస్తే కిచెన్ హాలులోని ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ - చాక్లెట్స్ - ఫ్రూట్స్ - కూల్ డ్రింక్స్ ఉన్నాయి మొత్తం మీకోసమే .......
పిల్లలు : ఆశ్చర్యపోయారు , ఆయా వార్డెన్ ..... ముందైతే బుజ్జిదేవతను చూడాలని ఉంది అలాగే బుజ్జిదేవుడిని ......
వార్డెన్ : పేరు మాత్రమే తెలుసు బుజ్జిజానకి అని - బుజ్జిదేవుడి పేరు కూడా తెలియదు ...... ) 

బుజ్జిదేవుడి పేరు మహేష్ మహేష్ ..... అన్నారు బుజ్జిజానకి - అక్కయ్యలు .
మహేష్ మహేష్ - బుజ్జిజానకి అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .......
పిల్లలూ ..... నన్నుకాదు దేవతలు దేవతలు .....
పిల్లలు : సరే సరే అంటూ ..... బుజ్జిదేవత - దేవతలు అంటూ ఇష్టంలా కేకలువేస్తున్నారు .
అఅహ్హ్ .......
అక్కయ్యలు : అంత ప్రాణం అమ్మలూ మీరంటే .....
అంటీలు : పైకి మాత్రమే , అదంతా నటన ......

( పిల్లలు : ఆయా వార్డెన్ ..... అడ్రస్ కూడా తెలియదన్నమాట , రాత్రి ఏమిచేశారు మరి అంటూ ముద్దుముద్దుగా కోప్పడ్డారు .
నవ్వుకున్నాము , sorry sorry పిల్లలూ ..... మీ బుజ్జిదేవుడే చెప్పలేదు , బుజ్జిదేవతకు మీ సంతోషం మాత్రమే కావాలన్నాడు .
పిల్లలు : అదంతా తెలియదు ఈరోజు - రేపు కాలేజ్ హాలిడే , కాలేజీకు వెళ్ళేలోపు బుజ్జిదేవతను చూడాలి అంతే , వార్డెన్ కదా కనిపెట్టండి .
మీ మనసులు స్వఛ్చమైనవి , మీకోరిక కచ్చితంగా తీరుతుంది , అంతవరకూ మీ బుజ్జిదేవత ఇచ్చినవాటితో ఆడుకోండి .....

కొద్దిసేపటికి మెయిన్ గేట్ బయట ఒకదానితరువాత మరొక వెహికల్స్ అందులోనుండి పేరెంట్స్ తోపాటు దిగిన పిల్లలు సెక్యూరిటీకి చెప్పి అమ్మమ్మా నానమ్మా బామ్మా అవ్వా ..... అంటూ పరుగునవచ్చి అమ్మల ఒడిలోకి చేరిపోయారు .
పిల్లల వెనుకే తమ తప్పు తెలుసుకున్నట్లు వచ్చిన పిల్లల పేరెంట్స్ .... అమ్మా అమ్మా అత్తయ్యగారూ ...... మమ్మల్ని క్షమించండి , ఒక చిన్న పిల్లాడి ద్వారా మేము చేస్తున్న తప్పేమిటో తెలిసింది , మమ్మల్ని మన్నించి మన ఇంటికి వచ్చెయ్యండి , మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము ఇక ఎప్పుడూ బాధపెట్టాము అంటూ పాదాల చెంతకు చేరారు .......
బుజ్జిదేవుడే బుజ్జిదేవుడే ...... అంటూ పిల్లలంతా గుసగుసలాడుకుంటున్నారు .
బామ్మలు : పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దులుకురిపించి క్షేమసమాచారాలు తెలుసుకుని , బుజ్జిదేవతా - బుజ్జిదేవుడా ..... మళ్లీ మా మనవరాళ్లను చూస్తాము అనుకోలేదు మీరు నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి అంటూ దీవించారు .
అమ్మా - అత్తయ్యగారూ ..... ఇప్పుడే మన ఇంటికి వెళదాము .
బామ్మలు : చూడండీ ..... వీరంతా మా పిల్లలే వీరిని వదిలి ......
పిల్లలు : బామ్మలూ ..... , అనాధలుగా జీవించడం బాధగా ఉంటుంది - వాళ్లకు దూరమై మీరూ బాధపడటం చూడలేము .
బామ్మలు : బంగారం పిల్లలూ మీరు , వీరినీ వదిలి ఉండలేము - మీకూ దూరంగా ఉండలేము కాబట్టి వారంలో మూడు మూడు రోజులు అక్కడా ఇక్కడా ఉంటాము .
పిల్లలు : అలా అయితే ఒకరోజు మిగులుతుంది కదా ......
బామ్మలు : ఆరోజును బుజ్జిదేవత - బుజ్జిదేవుడికి ఇష్టమైతే వారితోనే ఉంటాము .
మేముకూడా మేముకూడా ..... ప్లీజ్ ప్లీజ్ .
బామ్మలు : వాళ్ళు ఒప్పుకోవాలే కానీ ...... )

Yes yes yes బామ్మలూ ..... అంటూ బుజ్జిజానకి - అక్కయ్యలు , మన ఇంటిలోకానీ - శరణాలయంలోకానీ ఒకరోజు కలిసే ఉందాము , ఆ ఏర్పాట్లేవో మన బుజ్జిదేవుడు చూసుకుంటాడు ......
లవ్ టు అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
చాలా సంతోషం ......

( కాసేపు ఆడుకుంటూ కాసేపు చదువుకుంటూ మధ్యమధ్యలో ఐస్ క్రీమ్స్ తోపాటు ఇష్టమైనవన్నీ తింటూ కొన్ని కొన్ని నిమిషాలకే బుజ్జిదేవత గురించి తెలిసిందా తెలిసిందా అని మధ్యాహ్నం వరకూ తెగ ఇబ్బందిపెట్టేశారు , లంచ్ లో కూడా రకరకాల వంటలతో కడుపునిండా తిన్నారు , అటుపైకూడా మల్లీ మీగురించే ..... 
పిల్లల కోరిక మన్నించినట్లు 3 గంటల సమయంలో ఒక క్యాబ్ వచ్చి ఆగింది , డ్రైవర్ సెక్యూరిటీకి ఏదో అందించాడు .
సెక్యూరిటీ లోపలికివచ్చి , వార్డెన్ గారూ ..... నిన్న రాత్రి ఎవరో పిల్లాడు ఇక్కడే శరణాలయం నుండి బయటకువచ్చి క్యాబ్ ఎక్కాడు - పర్సు మూలన పడిపోయింది - ఇప్పుడు క్లీన్ చేస్తుంటే దొరికింది అని ఇచ్చివెళ్లాడు .....
పిల్లలూ ..... మన బుజ్జిదేవుడి గురించి తెలిసింది అంటూ పరుగున క్యాబ్ దగ్గరకువెళ్లి ఎక్కడ దిగాడో తెలుసుకున్నాను , అందరమూ బస్సులలో అక్కడకు వెళ్ళిచూస్తే ఇల్లు లాక్ చేసి ఉంది , నిరాశలో ఉన్న మాదగ్గరికి దేవతలా ఒకరు వచ్చి ఈ అడ్రస్ కు వెళ్ళండి అనిచెప్పి చూసేంతలో మాయమైపోయారు , సంతోషంతో ఇక్కడకు వచ్చేసాము - వచ్చాక తెలిసింది బుజ్జిదేవత సంతోషం గురించి మరింత సంతోషంతో ఆశతో ఎదురుచూస్తూ ఉండిపోయాము ) .

పెద్దమ్మా మీరేకదా లవ్ యు ......

చాలాసేపు వెయిట్ చేయించాము sorry sorry అంటూ బుజ్జిజానకి - అక్కయ్యలు - దేవతలు .......
వార్డెన్ : మా బుజ్జిదేవత - దేవతలు క్షమించమని కోరితే అందరమూ బాధపడతాము .
పిల్లలు : మా బుజ్జిదేవత రాక కోసం ఎదురుచూడంలోనూ ఎంజాయ్ చేసాము , కొద్దికొద్దిసేపటికే ఫ్రీ రిఫ్రెష్మెంట్స్ వస్తూనే ఉన్నాయి ......
బుజ్జిజానకి - అక్కయ్యలు ..... నావైపు చూసి లవ్ యు లు , నేనేమో పెద్దమ్మ వైపు చూసి లవ్ యు లు ......
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 30-04-2024, 03:14 PM



Users browsing this thread: Kasim, 19 Guest(s)