04-10-2023, 05:14 AM
హంస తో మాట్లాడి చాలా రోజులు అవ్వడం వల్ల తను గుర్తు పట్టడానికి చాలా సమయం పట్టింది. కొద్దిసేపు మాట్లాడి తనని కలుద్దాం అని పిలిచాను. తను ఆఫీస్ లో ఉంది సో సాయంత్రం కలుస్తా అంది. అర్జెంట్ గా కలవాలి అంటే వచ్చింది. తను వచ్చాక మాట్లాడుతూ విషయం చెప్పాను. తను అసలు ఒప్పుకోలేదు. చూడు సుమంత్ నువ్వు నాకు సహాయం చేశావు నీ కోసం ఎలాంటి సహాయం అయినా చేస్తాను కానీ అమ్మాయిలతో వ్యాపారం చేసే దుర్మార్గులు వాళ్ళు, పది రోజుల ముందే నన్ను కలిసి అడిగారు నేను కుదరదు అనే చెప్పాను అంది. నీ జీవితం సెటిల్ అయ్యేలా చేస్తాను అన్నాను. ఇక నుంచి ఇవి అన్నీ వదిలేస్తాం అన్నారు నాతో కూడా కానీ నేను ఒకటి చెప్తా విను వాళ్ళు వదిలేసిన నిన్ను మాత్రం వదలరు ఎందుకు అంటే ప్రశాంతంగా ఉన్న జీవితం ని నువ్వు గెలికి పెట్టావు కానీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు బయటకి రావాలి సో దేనికి అయినా సరే అంటారు తరువాత పగ సాధించాలని చూస్తారు అంది. IG తో మాట్లాడాను అన్నాను. నువ్వు ఎవరితో మాట్లాడినా అలానే అంటారు కానీ కేసు మాత్రం వెనక్కి తీసుకోకుండా ఉండు, వాళ్ళు జైల్ లో ఉంటేనే మనకి సేఫ్ బయటకి వస్తే అది మొత్తానికి వస్తె ఇక అంతే ప్లీజ్ అర్థం చేసుకో అంది. నేను ఎన్ని చెప్పినా తను వినలేదు. నా పరిస్థితి ఎంటి ఆ రోజు నువ్వు కానీ రాకపోయి ఉంటే, అలా ఎంత మంది మహిళలు అనుకుని ఉంటారు. ఎంత మంది మహిళలు బానిసల లాగా ఉన్నారో, అలాంటి పరిస్థతుల్లో ఉన్న వాళ్ళకే ఆ బాధ అర్థం అవుతుంది అంది. నాకు తెలుసు నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అని చెప్పాను. తను సారి సుమంత్, నువ్వు ఈ పని మీద పిలిచి ఉన్నావు అని తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదు నేను వెళ్తా అని వెళ్ళింది. నేను ఎంత చెప్పినా తను వినలేదు, నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇక చిత్ర కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను క్యాజువల్ గా అవునా సరే వదిలేయ్, నీకు మనీ ఇస్తారు ఇంకో అరగంట లో ఎక్కడ తీసుకుంటావు అని అడిగింది. ఎక్కడ అయినా ఇస్తారా అని అడిగాను, అవును అంది. అయితే ముంబై లో ఇవ్వు అని చెప్పి, వర్ష కి ఫోన్ చేసి మనీ వస్తుంది తీసుకుని ఫోన్ చెయ్ అని చెప్పాను. కొద్దిసేపటికి ఒకడు వచ్చి మైనింగ్ లీజు పేపర్స్ ఇచ్చాడు. వర్ష ఫోన్ చేసి మనీ వచ్చాయి అంది. చిత్ర కి ఫోన్ చేసి చెప్పాను, తను ఇక అంతా అయిపోయింది కదా, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెల్లు కానీ ఇక హంస తో టచ్ లో ఉండకు అంది. ఎందుకు అన్నాను. మళ్ళీ లేనిపోని తలనొప్పి, ఈ కేసు కి సంబంధం ఉన్న ఎవరితో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకు అంది. సరే అని చెప్పి నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయాను. ఉదయం లేట్ గా లేచాను. హంస వి చాల మిస్డ్ కాల్స్ వచ్చాయి. తిరిగి చేద్దాం అనుకున్న కానీ రిస్క్ ఏమో అని చేయలేదు. నేను ఇక షిఫ్టింగ్ పనులలో బిజీ అయ్యి మొత్తం సెట్ చేసుకొని ముంబై వెళ్ళిపోయాను. ఒక మంచి ఆఫీస్, ఇల్లు, అంతా సెట్ చేశాను. వర్ష ని కూడా నాతో ఉండమని చెప్పాను. తను మంచి రోజు చూసుకుని వస్తాను అంది. ఇక మైనింగ్, ఎక్స్పోర్ట్ చూసుకుంటూ బిజీగా బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఒక వారం రోజుల తరువాత వర్ష రేపు షిఫ్ట్ అవుతున్న నీ ఇంటికి అంది. మంచి పని నీ కోసం ఎదురు చూస్తున్న అని చెప్పాను. అప్పుడు నాకు వైజాగ్ నుంచి ఒక CI ఫోన్ చేశాడు.