Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పుదీనా.. ఔషధాల ఖజానా!
#1
1206A2f2011.1703C3-8.
290923-8.
???????????134.
*మన ఆరోగ్యం…!

                      *పుదీనా*
                   ➖➖➖✍️


పుదీనా.. ఔషధాల ఖజానా!
**************************
టీ లో వేస్తే ఆ పరిమళం మనసుని హాయిగా తాకుతుంది.. బిర్యానీకి అదనపు రుచినిస్తుంది.. పచ్చడి చేసుకుంటే ఆకలి అరువొస్తుంది... అలాంటి అద్భుత ఔషధ గుణాలున్నదేపుదీనా...
పుదీనా.. ఔషధాల ఖజానా!

పుదీనాలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌లతోపాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ లాంటి సూక్ష్మపోషకాలుంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుదీనా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుదీనా.. ఔషధాల ఖజానా!
* నిమ్మరసం, పండ్లరసాలు, మజ్జిగ, టీ... వీటితో కలిపి పుదీనాను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందొచ్చు.

* పుదీనా ఆకుల్లో ఫినోలిక్‌ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి వివిధ రుగ్మతలను తగ్గిస్తాయి.

* కడుపులో మంట, ఉబ్బరాన్ని.. ఇది తగ్గిస్తుంది. ఈ ఆకులను తినడం వల్ల లాలా జలగ్రంథులు చురుగ్గా పనిచేసి జీర్ణప్రక్రియకు కావాల్సిన ఎంజైమ్‌ల ఉత్పత్తి సజావుగా సాగుతుంది. దాంతో ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

* దీన్ని క్రమంతప్పకుండా ఆహారంలో తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు.

* పుదీనా తైలం తలనొప్పిని, చికాకుని తగ్గిస్తుంది. పుదీనా నూనె, ఆకుల సువాసనను ఆస్వాదించడం వల్ల అలసట, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఇది మెదడును ఉత్తేజంగా ఉంచుతుంది. దాంతో శరీరం చురుగ్గా మారుతుంది.

* దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారు కప్పు పుదీనా టీ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

* గర్భిణుల్లో సాధారణంగా కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌ను పుదీనా తగ్గిస్తుంది. ఉదయం టీలో లేదా మజ్జిగలో ఈ ఆకులను వేసుకుని తాగితే వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

పుదీనా.. ఔషధాల ఖజానా!


పుదీనా.. ఔషధాల ఖజానా!
జల్‌జీరా

కావాల్సినవి: పుదీనా-కప్పు, కొత్తిమీర- కప్పు, అల్లంతరుగు-చెంచా, జీలకర్రపొడి-చెంచా, ఆమ్‌చూర్‌- చెంచా, నల్లఉప్పు-పావు చెంచా, నీళ్లు-తగినన్ని, నిమ్మరసం-రెండు చెంచాలు, మిరియాలపొడి-అరచెంచా, ఉప్పు-రుచికి సరిపడా.

తయారీ: మిక్సీలో పుదీనా, కొత్తిమీర వేసి, కొన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి.


* ఈ పేస్ట్‌లో తురిమిన అల్లం, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌, నల్ల ఉప్పు వేసి, నీళ్లు పోసి కలపాలి. నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి.

* ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
పుదీనా.. ఔషధాల ఖజానా! - by Yuvak - 28-09-2023, 06:51 PM



Users browsing this thread: 2 Guest(s)