27-09-2023, 12:04 PM
తను బయటకి వచ్చి నన్ను తనతో కార్ లో సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకెళ్ళింది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఒక కానిస్టేబుల్ తో టీ పంపింది. అప్పటికి టైమ్ రాత్రి 2 అయింది. నాకు ఏమి అర్ధం కావడం లేదు. తను బిజీగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. కొద్దిసపట్లోనే మీడియా ప్రతినిధులు వచ్చారు. తను ఏదో చెప్పింది. P. వర్ష కి మరియు తన బాయ్ ఫ్రెండు కి ముసుగు వేసి తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు వెళ్ళిపోయాక తను కొద్దిసేపటి నా దగ్గరకి వచ్చి వెళ్దామా అంది. ఎక్కడికి అన్నాను. నిన్నేమీ అరెస్ట్ చేయడం లేదు కానీ ఒక కంప్లైంట్ లెటర్ రాసి ఇవ్వు అంది. ఏం కంప్లైంట్ అన్నాను. తను రైటర్ ని పిలిచి నేను ఆల్రెడీ రాపించాను నువ్వు జస్ట్ సిగ్నేచర్ చెయ్ అంది. పేపర్ తీసుకుని చదివాను. నేను సుమంత్ రెడ్డి రజప్పగారి. RSR ఎక్స్పోర్ట్ అనే కంపెనీ మాది, అందులో రమేష్ ఉందా అనే వ్యక్తి పార్టనర్ గా ఉన్నాడు. నేను ఒక రోజు ఆఫీస్ లో ఫైల్స్ చెక్ చేస్తుండగా కొంచెం తేడాగా అనిపించాయి. అందుకే నేను ఎవరికీ తెలియకుండా ఏమి జరుగుతుంది అని తెలుసుకున్న. అప్పుడే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని తెలిసింది. నేను ఒక పని మీద ముంబై వెళ్ళినపుడు రమేష్ భార్య అయినా p. వర్ష మరియు తన స్నేహితుడు కలిసి ఒకరిని చంపడం చూసాను. కానీ నేను చూడటం వాళ్ళకి తెలియదు. అది తెలియని వాళ్లు నన్ను సహాయం కోరడం తో నేను నా స్నేహతురాలు అయిన చిత్ర IPS కి తెలియచేశాను. తను చెప్పినట్టే శవాన్ని నా స్నేహతురాలు అయినా c. వర్ష తో కలిసి ఆఫీస్ లో పుడ్చేశము. దీని మీద మీరు చర్యలు తీసుకుని మమ్మల్ని మా కంపెనీ నీ కాపుడుతారని ఆశిస్తున్న. ఇది లెటర్ లో ఉంది. నీకు ఇన్ని తెలుసా అన్నాను.దానికి చిత్ర చాలా తెలుసు లే సంతకం పెట్టు. దీన్ని ఫైల్ చేస్తే నీకు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు అంది. సరే అని సంతకం పెట్టేసాను. తను ఆ లెటర్ ని రైటర్ కి ఇచ్చి ఇది ఒక మూడు వారాల కింద ఇచ్చినట్టు డేట్ రాసి ఫైల్ చేయమని చెప్పింది. ఆయన వెళ్ళిపోయాక నువ్వు IPS ఆ అసలు చెప్పలేదు అన్నాను. ఇపుడు కాదు రిలాక్స్ అవ్వు మొత్తం చెప్తాను కదా పదా అని తన క్వార్టర్స్ కి తీసుకెళ్ళింది.