26-09-2023, 09:35 PM
నాకు ఏది కూడా అర్థం కావడం లేదు. అనవసరం గా p. వర్ష కి హెల్ప్ చేసి ఇరుక్కున్న నాతో పాటు c. వర్ష కి కూడా ప్రాబ్లెమ్ అని ఫీల్ అయ్యాను. C. వర్ష కి ఫోన్ చేసి చెప్పాను. సారీ నా వల్లే నీకు టెన్షన్ అంతా అని. తను ఎలా జరగాలో అలా జరుగుతుంది నువ్వు ఫీల్ అవ్వకు రిలాక్స్ అవ్వాలి అని ఉంటే ముంబై రా నేను ఉన్నా కదా అంది. వస్తాలే ఎక్కువ టెన్షన్ అవుతే అని చెప్పాను. ఇక ఆఫీస్ కి వెళ్ళాను. పెండింగ్ పనులు చూసుకుంటూ ఉన్నాను. పనిలో బిజీగా ఉంటే ఎలాంటి ఆలోచనలు రావు అని. హంస గురించి నాకు టెన్షన్ లేదు ఎందుకంటే నేను ఏమి చేయలేదు కానీ నా టెన్షన్ అంతా ముంబై లో చేసిన పని గురించే. సెక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు, ఇక రోజూ ఆఫీస్ కి వెళ్ళడం ఇంటికి రావడం c. వర్ష తో మాట్లాడుతూ ఉండటం ఇలా జరుగుతూ ఉంది. ఒక నాలుగు రోజుల తరువాత నేను రమేష్ భయ్య దగ్గరకి వెళ్లి మీ భార్య ఇంకా రాలేదా అని అడిగాను. లేదు ఫోన్ కూడా వర్క్ అవ్వడం లేదు అన్నాడు. మరి కంప్లైంట్ ఇవ్వకపోయరా అన్నాను. చూస్తా రేపటి లోగా రాకుంటే అన్నాడు. సరే అన్నాను. ఒక నాలుగు రోజుల తరువాత మా స్టాఫ్ లో కొంత మందికి ఆఫీస్ రాకున్న జీతం ఇస్తున్నారు. చెక్ చేస్తుంటే కనిపెట్టాను. నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అడిగాను. వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు అన్నారు. ఇపుడు నేనే కదా బిజినెస్ చూస్తున్న నాకు తెలియకుండా ఏం వర్క్ చేస్తున్నారు అని అడిగాను. ఏమో సార్ రమేష్ సార్ చెప్పారు జీతం ఇవ్వాలి వాళ్ళకి అని అందుకే అన్నారు. నేను వాళ్ళని పంపేసి వాళ్ళ డీటైల్స్ చూస్తూ ఉన్నాను. అందులో ఒకడి ఫోటో చూడగానే నాకు ముంబై లో మేము పూడ్చిన ప్లేస్ లో ఉన్న వ్యక్తి లా అనిపించాడు. ఆ రోజు c. వర్ష ఫోటో తీసింది మేము చెక్ చేసినపుడు నేను వెంటనే ఫోటో తీసి వర్ష కి చెప్పాను చెక్ చెయ్ అని. తను చెక్ చేసి మ్యాచ్ అయింది అంది. నాకు డౌట్స్ బాగా పెరిగిపోయాయి. ఇన్ని రోజులు భార్య ఫోన్ పని చేయడం లేదు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆయన చాల కూల్ గా ఉన్నాడు. ఎక్కడో కొడుతూ ఉంది నాకు. ఇక ఫస్ట్ నుంచి ఆయన చేసిన బిజినెస్ డీటైల్స్ చూసాను. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి అది ఒక్కటే మార్గం అనుకున్న. ఇక రమేష్ భయ్య ఇంట్లో ఎప్పుడు ఉండకుండా ఉంటాడో చెక్ చేశాను. నాలుగు రోజుల తరువాత ఆయన హాస్పిటల్ వెళ్తాడు, సో అదే మంచి టైమ్ అని డిసైడ్ అయ్యాను. ఆ రోజు కోసం ఎదరుచూడసాగాను. ఆయన హాస్పిటల్ వెళ్ళగానే నేను తయారు చేసుకున్న కీ తో ఇంట్లోకి వెళ్ళాను. బెడ్ రూమ్ లో ఉన్న సేఫ్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ అది పాస్వర్డ్ అడుగుతుంది. చాలా సేపు ట్రై చేశాను కానీ ఓపెన్ అవ్వలేదు. ఇక ఆయన వచ్చే టైమ్ అయింది అని బెడ్ రూమ్ లో ఒక అద్దం కి సీక్రెట్ కెమెరా పెట్టాను పాస్వర్డ్ కనిపెట్టడానికి. ఇక నేను వెళ్ళిపోయాను. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి పడుకున్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్న. రెండు రోజుల తరువాత సేఫ్ ఓపెన్ చేసాడు. నేను పాస్వర్డ్ నోట్ చేసుకున్న. మళ్ళీ వారానికి ఆయన బయటకి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే లోపలకి వెళ్లి సేఫ్ ఓపెన్ చేశాను. చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. చాలా ఫొటోస్ అమ్మయిలవి ఉన్నాయి. కోట్ల కొద్ది డబ్బు చాలా స్థలాల డాక్యుమెంట్స్ ఉన్నాయు. ఇంత సంపాదించాడు అనుకున్న. ఈయన చేసే ఎక్స్పోర్ట్ మాది ఒకటే కాదు అమ్మాయిలని కూడా అని నాకు అర్ధం అయ్యింది. అందుకే మొదట్లో నన్ను బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేయలేదు ఎక్కువ. ఫీల్డ్ లో తిరిగే వాళ్ళకి మా కంపెనీ నుంచి జీతాలు ఇస్తూ తన కోసం వాడుకుంటున్నాడు. నేను అన్ని డాక్యుమెంట్స్ ఫొటోస్ తీసుకుని నీట్ గా సర్ది పెట్టి ఇంటికి వెళ్ళిపోయాను. ఇక c. వర్ష కి ఫోన్ చేశాను. తనకి మాటర్ చెప్పగానే షాక్ అయింది.అసలు మీ బిజినెస్ ఏంటి అని అడిగింది. ఐరన్ ఓర్ కొని స్టిల్ బార్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాము అన్నాను. సో దానిని యుజ్ చేసుకుని అమ్మాయిలని కూడా చేస్తున్నట్టు ఉన్నాడు అంది. నేను అదే అనుకుంటున్న అన్నాను. సరే ఇపుడు ఏమి చేద్దాము అంది. అదే అర్థం కావడం లేదు అన్నాను. నువ్వు ముంబై కి రా మనం ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం అంది. సరే అని ముంబై వెళ్ళాను.