26-09-2023, 03:58 PM
ఇక హోటల్ వెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడు పొద్దున్న వెళ్ళిపోయాడు అని చెప్పారు. అక్కడ వాడి అడ్రస్ తీసుకుని వెళ్ళాను. ఇల్లు లాక్ లో ఉంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. P. వర్ష ఫోన్ కూడా స్వి్చాఫ్. ఏదో తేడా కొడుతుంది అనిపించింది. హంస గురించి తెలుసుకోవాలి అని హాస్టల్ దగ్గరకి వెళ్ళాను. అసలు నేను డ్రాప్ చేసిన హాస్టల్ లో తను ఉండటం లేదు. వేరే హాస్టల్ అంట. సో తను కావాలి అనే అక్కడ దిగింది. కానీ అక్కడి నుంచి ఎక్కడకి వెళ్ళింది. సో ఫస్ట్ నేను సెక్యూరిటీ అధికారి నుంచి రిలీఫ్ కావాలి అందుకే రమేష్ భయ్య కి ఫోన్ చేసి విషయం చెప్పి నాన్నకు చెప్పకు అని చెప్పాను. ఆయన నువ్వు ఏమి చేయలేదు కదా అన్నాడు. ఏమి చేయలేదు చేసి ఉన్న అని డౌట్ వచ్చినా సెక్యూరిటీ అధికారి వాళ్ళు నన్ను స్టేషన్లో ఉంచేవాల్లు కదా అన్నాను. ఆయన అయితే నేను ఎస్పీ తో మాట్లాడి సెట్ చేస్తా అన్నాడు. అర గంటకు ఫోన్ చేసి స్టేషన్ కి వెల్లు అంతా సెట్ చేశాను అన్నాడు. అక్కడ CI నీ మీద కొంచెం డౌట్ ఉంది కానీ నువ్వు డ్రాప్ చేసి వెళ్ళిపోయాక తను వేరే కార్ లో వెళ్ళింది, ఎప్పుడు పిలిచినా రావాలి అని చెప్పి డీటైల్స్ తీసుకుని కొంచెం మని దొబ్బి పంపేశాడు. హమ్మయ్య అని చిత్ర ని డ్రాప్ చేసి ముంబై వెళ్ళిపోయాను. అర్ధ రాత్రి c. వర్ష ఆఫీస్ కి వెళ్లి మేము పూడ్చిన ప్లేస్ కి వెళ్లి తవ్వి చూసాము. అక్కడ బాడీ ఉంది కానీ అది p. వర్ష బోయ్ ఫ్రెండ్ ది కాదు ఎవరిదో. నాకు ఏమి అర్ధం కాలేదు. C. వర్ష టెన్షన్ పడి ఎవడు వీడు అంది. నాకేమీ తెలుసే ఆ వర్ష ఫోన్ కూడా స్విచ్ ఆఫ్, వాళ్ళు ఇద్దరూ ఎక్కడ ఉన్నారో వాళ్ళు దొరికితేనే మనకి తెలుస్తుంది ప్రస్తుతానికి ఇలానే ఉంచేద్దం అని కప్పేసాము. తరువత మేము రిలాక్స్ అయ్యి నేను హైదరాబాద్ కి వచ్చేశాను. మరుసటి రోజు ఉదయం c. వర్ష ఫోన్ చేసి ఒకసారి రమేష్ భయ్య ఇంటికి వెళ్లి మామూలుగా మాట్లాడి ఇల్లు చెక్ చెయ్ ఇంట్లో మనీ గోల్డ్ లాంటివి ఉన్నాయో లేదో తెలుసుకో అంది. సరే అని ఫ్రెష్ అయ్యి వెళ్ళాను. హెల్ప్ చేసినందుకు థాంక్స్ చెప్పి p. వర్ష గురించి అడిగాను. రాలేదు ఇంకా అన్నాడు. ఫోన్ చేశారా అని అడిగాను. లేదు అన్నాడు. కొంచెం మనీ కావాలి అని అడిగాను. తెస్తాను అని వెళ్ళాడు. అడిగింది ఇచ్చాడు. అంతా ఒకే నా అని అడిగాను. హా ఒకే అన్నాడు. అయితే మనీ గోల్డ్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడకి వెళ్ళారు అని థింక్ చేస్తూ ఇంటికి వెళ్ళాను