26-09-2023, 03:16 PM
ఫస్ట్ వైజాగ్ నుంచి వెళ్లిపోవాలి అనుకున్న. డైరెక్ట్ airport కి వెళ్లి ఏ ఫ్లైట్ ఉంటే అది హైదరాబాద్ లేదా ముంబై వెళ్లిపోవాలి అనుకున్న. ఇక లగేజీ ప్యాక్ చేసుకుని చెక్ ఔట్ చేద్దాం అనుకుంటూ ఉంటే చిత్ర ఫోన్ చేసింది. ఏ టైమ్ కి వస్తావు అని అడిగింది. నాకు అర్జెంట్ పని పడింది హైదరాబాద్ వెళ్తున్న అని చెప్పాను. తను అంత అర్జెంట్ ఏంటి ఈ రోజు ఉండచ్చు కదా రేపు వెల్లు అంది. లేదు ఎమర్జెన్సీ అని చెప్పాను. తను సరే ఒక అయిదు నిమిషాలు మాట్లాడాలి కలిసి నీ హోటల్ అడ్రస్ చెపు వస్తా అంది. కలవడం ఎందుకు మళ్ళీ ఫోన్ లోనే చెప్పు అన్నాను. డైరెక్ట్ కలిసే మాట్లాడాలి అంది. నేను ఎంత చెప్పినా వినలేదు సరే అని రమ్మన్నా. అర గంట తరువాత వచ్చింది. నాకు ఫుల్ టెన్షన్ గా ఉంది. నిన్న సాయకాలం నుంచి రాత్రి వరకు హంస నాతోనే ఉంది. CCTV చెక్ చేస్తే నా మీదే డౌట్ వస్తుంది అని. చిత్ర వచ్చాక చెప్పు అన్నాను. తను ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు అంది. పని ఉంది ఫాస్ట్ గా చెప్తే వెళ్ళాలి అన్నాను. తను చెప్పడం మొదలు పెట్టగానే రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి సార్ సెక్యూరిటీ అధికారి వాళ్ళు వచ్చారు ఏదో ఎంక్వైరీ అంట అని పిలిచాడు. అంతా అయిపోయింది కదా ఇక అనుకున్న. చిత్ర కి నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను బయటకి వెళ్ళాను. సెక్యూరిటీ అధికారి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. చెప్పాను. వాళ్ళు CCTV చెక్ చేయడం తో రాత్రి తనని డ్రాప్ చేసింది చూసి అరెస్ట్ చేయలేదు కానీ వైజాగ్ లోనే ఉండాలి ఎపుడు పిలిచినా రావాలి స్టేషన్ కి ఎంక్వయిరీ కోసం అన్నారు. సరే అన్నాను. సాయంత్రం వచ్చి సంతకం పెట్టాలి రమ్మన్నారు. వస్తాను అని చెప్పాను. C. వర్ష కి ఫోన్ చేసి రాలేను ఇప్పుడు పని ఉంది అని చెప్పాను. తను టెన్షన్ లో ఎలా మరి అంది. నువ్వే ఏదోలా చెక్ చెయ్ అని చెప్పాను. తను నేను ట్రై చేస్తా అంది. సరే అన్నాను. ఇక p. వర్ష కి ఫోన్ చేశాను. నాట్ రీచబుల్ వస్తుంది. ఇక రమేష్ భయ్య కి ఫోన్ చేసి విషయం అడిగాను. తను రెండు రోజుల క్రితమే వాళ్ళ ఊరికి వెళ్ళింది ఇంకా రాలేదు అన్నాడు. ఎక్కడ వాళ్ళది అని అడిగాను. వైజాగ్ దగ్గర అనకాపల్లి అన్నాడు. నేను గూగుల్ మాప్స్ లో చూసి దగ్గరే కదా అని అనకాపల్లి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. చిత్ర కింద సెల్లార్ లోనే ఉంది. తను ఏమైంది అంది. ఏమి లేదు అన్నాను. ఎక్కడకి వెళ్తున్నావు అంది. పని మీద అనకాపల్లి వెళ్తున్న అన్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను వస్తాను అంది. నీకు ఆ ఊరు బాగా తెలుసా అన్నాను. తెలుసు అంది. అయితే తను నాకు ఉపయోగపడుతుంది అని తీసుకెళ్ళాను. అనకాపల్లి వెళ్లి p. వర్ష ఇంటి కోసం వెతికి చిత్ర సాయం తో కనుక్కున్న. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా రమేష్ భయ్య ఫ్రెండ్స్ అని చెప్పాము. మీ అమ్మాయి లేదా అని అడిగాము. లేదు హైదరాబాద్ లోనే ఉంది అన్నారు. నేను అవునా ఏదో మామూలుగా అడిగాను అని వాటర్ తాగి వచ్చేసాను. సో తను ఇక్కడకి రాలేదు అంటే నేను చూసింది కచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ సో ఇద్దరూ ఒకే చోట ఉంటారు అనుకుని, వైజాగ్ వచ్చాను హోటల్ కి.