Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
ఫోన్ రింగ్ అవుతుంటే నిద్ర మత్తులో లిఫ్ట్ చేసి హలో అనగానే అవతలి వైపు నుండి "ఏంటి నందు ఇంకా నిద్రలేవలేదా "అన్న మేడం మాటలు వినపడగానే, నిద్రమత్తు వదిలించుకొని "లేదు మేడం ఇప్పుడే లేచాను "అని చెప్పాను 
"ఇప్పుడు లేచావా, టైం ఎంత అయ్యిందో తెలుసా ఆఫ్టేర్నూన్ 2 అవుతుంది, ఇప్పటి వరకు ఏవరైనా నిద్రపోతారా  " అనగానే,2 అవుతుందా అమ్మో ఇప్పటి వరకు నిద్రపోయాన, ఏం నిద్ర రా బాబు ఇలా పడుకున్న, అనుకుంటుంటే "హలో నందు వున్నావా ",
"హ ఉన్న మేడం, రాత్రి కొంచం లేట్ అయ్యింది అందుకే ఇప్పుడు లేట్ గా లేచాను "అని చెప్పగానే "హో అయితే నైట్ బాగా ఎంజాయ్ చేసావా"అని మేడం అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక
"హ మేడం "
,"ఇంకా నిద్రొస్తుందా "
"అబ్బే లేదు మేడం "
"ఐతే రెడీ అయ్యి ఇంటికి రా బయటికీ వెళదాము "
"సరే మేడం " అని చెప్పగానే మేడం ఫోన్ కట్ చేసింది.
ఇంక నేను చిన్నగా రెడీ అయ్యి కార్ తీసుకొని అర్ధగంట లో మేడం ఇంటికి చేరుకున్నాను, కార్ చూడగానే సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేస్తే లోనికి వెళ్లి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాను.
మేడం హాల్ లో కూర్చొని బ్లాక్ సూట్ వేసుకున్న ఇద్దరితో మాట్లాడుతున్నారు, మేడం పక్కనే రాహుల్ నిలబడి కనిపించాడు, నేను వెళ్లి మేడంకీ విష్ చేయగానే, మేడం చిన్నగా నవ్వి "ఏంటి నందు అంత త్వరగా వచ్చావ్, సరేలే రా వచ్చి కూర్చో "అని తన పక్కన ప్లేస్ చూపించారు, మేడం అలా చెప్పగానే, నాకు కొంచెం భయమేసింది మేడం ఏంటి అందరి ముందు తన పక్కన కూర్చోమంటున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే ఇద్దరు వ్యక్తులు, రాహుల్ కూడ ఆశ్చర్యం గా నన్నే చూస్తున్నారు, ఇంతలో మేడం "నందు రా వచ్చి కూర్చో "అని చెప్పగానే ఏం చేయలేక వెళ్లి పక్కన కొంచెం దూరం గా కూర్చున్నాను, నేను దూరం గా కూర్చోవటం చూసి నాకు దగ్గరగా జరిగి,నన్ను ఆనుకొని కూర్చొని నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని "ఏమైనా తిన్నావా లేక అలానే వచ్చావా "అని మేడం అడుగుతుంటే నాకు మాటలు రావటం లేదు, మేడమ్ ఏంటి అందరి ముందు ఇలా చేస్తుంది అని ఇబ్బంది పడుతుంటే "నందు నిన్నే తిన్నావా లేదా " మళ్ళీ అడిగింది, 
నేను తడబడుతూ "లేదు మేడమ్ "అని, అక్కడ ఉన్న వారిని చూస్తే  ఇద్దరు ఆశ్చర్యం గా నన్నే చూస్తున్నారు, ఇంక రాహుల్ ఐతే నోరు తెరుచుకొని  ఉండిపోయాడు, ఇంతలో మేడం "సరే బయటికీ వెళ్లి ఏమైనా తిందాం, ఇప్పుడు జ్యూస్ తాగు "అని, రాహుల్ వైపు తిరిగి "రాహుల్ నందు కీ జ్యూస్ తీసుకొని రా " అని మేడం చెప్పగానే, రాహుల్ నేను ఇద్దరం షాక్, "చెప్పేది నీకె వినపడిందా "అని మేడం గట్టిగా అరిచేసరికి, రాహుల్ భయపడుతూ "హా వినపడింది మేడం తెస్తాను" అని వెళ్ళిపోయాడు
రాహుల్ వెళ్ళగానే మేడం నావైపు తిరిగి "ఒక 5 మినిట్స్ నందు వీళ్ళతో మాట్లాడి మనం వెళదము"అని వాళ్ళ తో ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతుంది,మేడమ్ మాట్లాడుతుంటే రాహుల్ వచ్చి నాకు జ్యూస్ ఇస్తూ కోపం గా చూస్తున్నాడు, రాహుల్ ని అలా చూడగానే నాకు నవ్వు ఆగలేదు కానీ కంట్రోల్ చేసుకొని జ్యూస్ తీసుకొని తాగుతున్న, పది నిమిషాల తరవాత మేడం ఆ ఇద్దర్ని పంపించింది.
మేడం నా చెయ్యి పట్టుకొని "పద నందు పైన రూమ్ కీ వెళదాం నేను కొంచం ఫ్రెష్ అవుతా "అని నన్ను తనతో పాటు తీసుకెళ్తుంది, నేను ఏం మాట్లాడకుండా మేడం వెనకే మెట్లు ఎక్కుతూ రాహుల్ ని చూస్తే నోరు, కళ్ళు పెద్దగా తెరుచుకొని నన్నే చూస్తున్నాడు, నాకెందుకో రాహుల్ ని అలా చూస్తుంటే నవ్వొస్తుంది, ఈసారి మాత్రం బయటికె నవ్వాను, నేను నవ్వటం చూసి రాహుల్ కోపం గా పళ్ళు కోరుకుతున్నాడు నేను అవేం పట్టించుకోకుండా మేడం వెనకే వెళ్లాను,
మేడం నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి,
"నందు కూర్చో నేను పది నిమిషాల్లో వస్తా" అని  లోన రూమ్ లోకి వెళ్ళింది, అన్నట్టు గానే పదినిమిషాల్లో బ్లూ కలర్ స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ఒకటి వేసుకొని వచ్చింది, మేడం ఈ డ్రెస్ లోకూడా అదిరిపోయింది, మేడం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రెడీ అవుతు నన్ను చూస్తూ నవ్వుతుంది, కొద్దిసేపటికి హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకొని నా దగ్గరికి వచ్చి "ఎలా ఉన్నా నందు "అని తనని నాకు చూపిస్తూ అడిగింది, మేడం అలా చూపిస్తుంటే కింద నుండి పైదాకా చూసాను చాలా సింపుల్ గా అనుపించింది కానీ చాలా బాగుంది, మేకప్ కూడ లైట్ గా వేసిందేమో మొకం తెల్లగా తాజాగా మెరుస్తుంది, తన కళ్ళు నేను ఏం చెబుతానా అని ఎదురుచూస్తున్నాయి నేను కొద్దిసేపు చూసి బాగుంది మేడం అని చెప్పాను, తను బుంగమూతి పెట్టి చిరు కోపంగా చూస్తుంది, మేడం ని అలా చూడగానే నోవ్వొచ్చి "నిజం గా చాలా బాగుంది మేడం "అనగానే నా బుగ్గ మీద ముద్దు పెట్టి "సరే వెళదాం" పద అని నా చెయ్యి పట్టుకొని కిందకి తీసుకెళ్ళింది, మెట్ల మీద నుండి కిందకి దిగుతుంటే సోఫాలా దగ్గర నిల్చొని రాహుల్ కనిపించాడు, అతని మొకం ఇంతకు ముందు లనే ఆశ్చర్యం గా కనిపించింది, మేడం నన్ను కిందకి తీసుకెళ్లి "రాహుల్ నాతో పాటు రా "అని రాహుల్ కీ చెప్పి నన్ను బయిటికి తీసుకెళ్లారు, కార్ దగ్గరికి వెళ్ళగానే "నందు కీస్ రాహుల్ కీ ఇవ్వు "అనగానే కీస్ రాహుల్ కీ ఇచ్చాను,"రాహుల్ నువ్వు కార్ డ్రైవ్ చెయ్ "అని, మేడం  తనతో పాటు నన్ను వెనక కూర్చోపెట్టున్నారు, మా ఇద్దరిని వింతగా చూస్తూ ఏం చేయలేక డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేసాడు, రాహుల్ కార్ స్టార్ట్ చేయగానే మేడం ఒక హోటల్ అడ్రెస్స్ చెప్పి అక్కడికి వెళ్లామన్నారు, నాకు మేడం చేస్తున్నదంతా ఇబ్బంది గా అనిపించి ఏం మాట్లాడకుండా కూర్చున్నాను, కార్ ముందుకు పోతుంటే కొద్దిసేపటికి మేడం నాకు ఆనుకొని కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసుకొని నా భుజం మీద తల వాల్చారు,ఇదంతా ముందు కూర్చున్న రాహుల్ గమనిస్తూనే వున్నాడు,మేడం అందరి ముందు ఇలా ఎందుకు చేస్తుందో అర్ధం కాక మేడమ్ వైపు చూస్తుంటే మేడం నన్ను చూసి "నందు మనం ఇప్పుడు నా ఫ్రెండ్ ని కావడానికి వెళ్తున్నాం, తనంటే నాకు చాలా ఇష్టం, చిన్నపటి నుండి కలిసే పెరిగామ్, కలిసే చదువుకున్నాం,నా గురించి తనకి అన్ని తెలుసు కానీ  ఇప్పుడు మేము దూరంగా ఉంటున్నాము,నా పెళ్లి అయ్యాక నేను ఇక్కడ సెటిల్ అయ్యాను, తను కూడ వేరే సిటీ లో సెటిల్ అయ్యింది,తరవాత నేను బిజీ అవ్వటం వళ్ళ ఫోన్ లోనే మాట్లాడుకునే వాళ్ళమ్ తప్ప పెద్దగా కలుసుకోలేదు, ఒక అర్జంట్ కేసు ఉంటే ఇక్కడికి వచ్చింది ఈవెనింగ్ వెళ్ళిపోతుంది అందుకే నిన్ను తనకి చూపిందం అని తీసుకెళ్తున్న "అని మేడం చెప్పగానే, నేను షాక్ అయ్యా నన్ను ఎవరికో చూపెట్టడం దేనికో అని అయోమయం గా మేడం ని చూస్తుంటే ఇంతలో రాహుల్ "మేడం మీరు ఇలా నందు తో ఉన్నట్టు కార్తీక్ సార్ కీ తెలిస్తే సార్ ఊరుకోరు మేడం "అని చెప్పాడు, రాహుల్ చెప్పగానే నా గుండె జల్లు మంది నిజమే సార్ పెళ్ళాం నాతో ఇలా ఉందని తెలిస్తే చంపేస్తాడేమో అనిపించిగానే భయం పట్టుకుంది, నా మొకం లో భయం కనిపించింది ఏమో మేడం కీ నా చెయ్యి గట్టిగా పట్టుకొని "ఇడియట్ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, అయినా రోడ్డు చూసి నడపకుండా మమ్మల్ని ఎందుకు చూస్తున్నావ్ "అని గట్టిగా అరిసేసరికి రాహుల్ బయపడి "సారీ మేడం "అని ఏం మాట్లాడకుండ డ్రైవ్ చేస్తున్నాడు,
నాకేమో భయం వేస్తుంది రాహుల్ ఒచ్చినప్పటి నుండి నన్ను కోపం గా చూస్తున్నాడు,సార్ కీ ముందు వీడె చెప్పేలా వున్నాడు అని భయం గా అనుకోని చిన్నగా మేడం చేతి నుండి నా చెయ్యి ని తీసుకున్నాను , నేను అలా చేయగానే "ఏం అయ్యింది నందు బయపడుతున్నావా, వాడు అంతే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు నువ్వు కంగారు పడకు అని "మళ్ళీ నా చెయ్యి పట్టుకొని నా భుజం మీద తల పెట్టింది, రాహుల్ మిర్రర్ నుండి మళ్ళీ చూస్తున్నాడు, వాడు అలా చూస్తుంటే గుండె స్పీడ్ గా కొట్టుంటుంది, నేను కంగారు పడుతుండటం చూసి మేడం ముందుకు చూస్తే మేడం కీ కూడ రాహుల్ చూస్తుండటం కనిపించింది దంతో మేడం కోపం గా "ఏంటి రాహుల్  అలా చూస్తున్నావ్, సార్ కీ చెప్తావా ఏంటి "అనేసరికి
"అదేంటి మేడం అలా అంటారు నా గురించి తెలిసి కూడ అలా మాట్లాడుతారు "అని రాహుల్ అనగానే "మరీ ఎందుకు అలా చూస్తున్నావ్ "
"మీరు సార్ తో మాత్రమే ఇలా ఉండేవారు కానీ ఇప్పుడు నందు తో ఇంత క్లోజ్ గా ఉంటే అస్సలు మీరేనా అని చూస్తున్న మేడం "
"నేనే కానీ, ఇక నుండి నందు తో ఇలానే వుంటా , నందు ఇబ్బంది పడేలా, భయపడేలా ఏం మాట్లాడొద్దు, ఇక నుండి కార్తీక్ తో ఎలా ఉండేవాడివో నందు తో కూడ అలానే ఉండాలి, నేను చెప్పింది అర్ధమైందా " అని మేడం అనగానే
"అర్ధమైనది మేడం "అని తల ఉపాడు
"ఇంకొకటి నందు ఇంటి కీ వచ్చిన విషయం, నేను నందు తో ఇలా ఉంటున్న అనే విషయం కార్తీక్ కీ తెలియకుండా చూసుకోవాల్సింది నువ్వే "అని మేడం చెప్పగానే
"సరే మేడం నేను చూసుకుంటా "అని గంగిరెద్దుల తల ఉపాడు.
అస్సలు ఏం జరుగుతుందో నాకర్ధం కాలేదు ఈమె చెప్పటం వాడు సరే మేడం అని తల ఉపటం ఏంటో, ఇద్దరు బలే ఉన్నారు అనుకోని మోనంగా వున్నా,
మేడం ఒకసారి నా కళ్ళలోకి చూసి "ఏం కంగారు పడకు నందు రాహుల్ చాలా మంచోడు, నా దగ్గర చాలా years నుండి పనిచేస్తున్నాడు, చాలా నమ్మకం గా ఉంటాడు, మన విషయం ఎవరికి తెలీదు నువ్వు టెన్షన్ పడకు "అని మేడం చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అస్సలు మేడం ఏం మాట్లాడుతుందో మేడం కీ అయినా అర్ధం అవుతుందో లేదో అని , అస్సలు నా జీవితం ఎటు పోతుందో ఏంటో అనుకుంటూ బయటికీ చూస్తూ కూర్చున్నా.ఒక పది నిమిషాలకి ఒక హోటల్ కీ చేరుకున్నాము, మేడం నా చెయ్యి పట్టుకొని లోనికి తీసుకెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టి, నా పక్కనే కూర్చుంది, రాహుల్ కూడ మాతోపాటు వచ్చి మా పక్కన టేబుల్ దగ్గర కూర్చున్నాడు,
"నందు ఆకలి అవుతుందా ఏమైనా తింటావా "అని మేడం అడగగానే , నేను ఏం మాట్లాడలేదు, మేడం నా చెయ్యి పట్టుకొని "ఎందుకు నందు అలా ఉన్నావ్, నాతో మాట్లాడొచ్చు కదా,నాతో ఫ్రీ గా ఉండొచ్చు కదా"అని నన్ను ఒకసారి చూసి" ముందు నన్ను మేడం అనటం మానెయ్  నందు అప్పుడే ఫ్రీ గా ఉంటావ్, సరేలే మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా ఇక్కడ బిర్యానీ బాగుంటుంది తిను సరేనా "అని మేడం అనగానే నేను మాట్లాడకుండా తల ఉపాను
అలా నన్ను చూసి మేడం నవ్వుకొని రాహుల్ తో ఆర్డర్ చేయమని చెప్పింది,రెండు నిమిషాలకి రాహుల్ వచ్చి కొంచెం టైం పడుతుందంట మేడం నేను దగ్గర ఉండి తీసుకొస్తా అని చెప్పాడు, మేడం సరే అని ఫోన్ చూసుకుంటుంది, ఒక ఐదు నిమిషాల తరవాత ఎవరో అమ్మాయి మా టేబుల్ ముందు నిలబడి చూస్తుంది, మేడం ఏమో ఫోన్ చూసుకుంటున్నారు, ఆ అమ్మాయి చూడటానికి బాగానే ఉంది, కొంచం ఎత్తు కూడ ఎక్కువే, ఆమె యెల్లో కలర్ లాంగ్ స్కర్ట్, పైన వైట్ షర్ట్ వేసుకొని పద్దతి గానే ఉంది కానీ తన కళ్లలో నుండి కామం కారిపోతుంది అంత సెక్సీ గా ఉన్నాయి కళ్ళు. అంతలో ఆ అమ్మాయి "హలో "అని పిలవగానే మేడం ఆ అమ్మాయి ని చూసి వెంటనే లేచి వెళ్లి "హయ్ మధు ఎన్ని రోజులు అయ్యింది నిన్ను చూసి "అని హాగ్ చేసుకుంది
ఆ అమ్మాయి నవ్వుతు "నేను వచ్చినా పట్టించుకోవట్లేదేంటే బొమ్మ "
"అయ్యో సారీ మధు, కార్తీక్ వైజాగ్ వెళ్ళాడు నైట్ వస్తున్నాడంట, దాని గురించే మాట్లాడుతున్న, అయినా నువ్వు ఏంటి చాలా మారిపోయావు ఇంత పద్దతి గా బట్టలు ఎప్పటి నుండి వేసుకుంటున్నావ్"

ఆమె నవ్వుతు "నా సంగతి పక్కన పెట్టు,నువ్వెంటి ఎప్పుడు బుట్ట బొమ్మ లా చీర లు కట్టేదానివి, ఇప్పుడేంటి కొత్తగా డ్రెస్ వేసావ్ పైగా స్లీవ్ లెస్ "అనగానే
సిగ్గుపడుతూ నా వైపు చూసి "ఏం లేదు లే ముందు కూర్చో "అని నా ముందు తనని కూర్చోపెట్టి మేడం కూడ ఆమె పక్కనే కూర్చున్నారు.

"ఏంటి మా బుట్ట బొమ్మ కొత్తగా కనిపిస్తుంది, సిగ్గు పడటం కూడ నేర్చుకుంది "

"అయ్యో మధు, సిగ్గు లేదు ఏం లేదు నేను మామూలుగానే ఉన్నాను " అని మళ్ళీ సిగ్గుపడుతుంది

"ఆ ఆ తెలుస్తుంది లే, ముందు ఇది చెప్పు ఏదో ముక్యమైనా విషయం మాట్లాడాలి అని పిలిచావ్ ఏంటో అంత ముక్యమైనా విషయం "అనగానే

మేడం నా వైపు చూపించి "ఇతను నా బాయ్ ఫ్రెండ్"అని నన్ను చూపించి సిగ్గుపడుతుంది

మేడం అలా చెప్పగానే నేను షాక్ తో నోరు తెరొచ
ఆ అమ్మాయి కూడ నాలానే షాక్ అయ్యి
"ఏంటి బాయ్ ఫ్రెండ్ ఆ "
"హ అవును మధు "

ఆ అమ్మాయి నన్ను కొద్దిసేపు చూసి నవ్వుతూ "మా బొమ్మ కీ పెళ్లి తరవాత బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే "అని మేడం బుగ్గలు లాగుతుంది

మేడం ఏం మాట్లాడకుండా నా వైపు చూస్తూ సిగ్గు పడుతుంది

"హో అందుకేనా ఈ చేంజ్, అందుకేనా ఈ సిగ్గు "అని మేడం బుగ్గని గిల్లింది

"స్స్ నొప్పెడుతుందే "అని మేడం అనగానే

నవ్వుతు "బాయ్ ఫ్రెండ్ ని చూసుకున్నావ్ బాగుంది కానీ ఈ విషయం కార్తీక్ కీ తెలిస్తే ఏం చేస్తావ్ " మేడం ని అడిగింది 

ఆమె అలా అనగానే మళ్ళీ నాకు భయం పట్టుకుంది

మేడం నన్ను చూసి కొంచం కోపం గా "అబ్బా నువ్వు కూడ ఏంటే, తెలిస్తే ఏం చేయాలో నాకు తెలుసు కానీ ముందు అది కాదు నేను చెప్పాలనుకుంది "

"హుమ్ నువ్వు దేన్ని అయిన పట్టుకుంటే వదలవని తెలుసు కానీ చెప్పు ఏంటో "అనగానే

మేడం నన్ను చూస్తూ, పక్కన వున్నా అమ్మాయిని నాకు చూపిస్తూ " తన పేరు మధురిమ, నా బెస్ట్ ఫ్రెండ్, నేను మధు అని పిలుస్తా "అని నాకు పరిచయం చేసింది

ఇదేంటి ఏదో చెప్తా అని పరిచయం చేస్తుంది అనుకోని మధురిమ కీ నవ్వుతు హాయ్ చెప్పాను తను కూడ చిన్నగా నవ్వింది

మళ్ళీ మేడం నే "మధు తన పేరు నందు, నా బాయ్ ఫ్రెండ్ "అని చెప్పగానే

మధురిమ గట్టిగా "వాట్ "అని అరిచింది

ఆ అరుపుకి నేను ఉలిక్కి పడ్డాను, దేవుడా ఏం అయ్యింది రా బాబు ఇంతకు ముందే కదా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది మరీ ఏం అయ్యింది అని ఇంత గట్టిగా అరిచింది అనుకుంటూ మధురిమ ని చూస్తుంటే తను ఆశ్చర్యం గా నన్నే చూస్తూ "ఏంటి అంజలి నువ్వు చెప్పేది నిజామా, ఇతని పేరు నందు నా నేను అస్సలు నమ్మలేకపోతున్నా,

 అస్సలు ఇది ఎలా సాధ్యమైంది "అని ఇంక షాకింగ్ గా నన్నే చూస్తుంది

"నీకు ఇది చెప్పాలనే నిన్ను పిలిచాను " అని మేడం చెప్పింది

నేను పిచోడిలా  ఇద్దర్ని మార్చి మార్చి చూస్తున్న,
ఒక ఐదు నిముషాలు ఇద్దరు ఏం మాట్లాడలేదు ఇక్కడ నాకేమో టెన్షన్ పెరిగి పోతుంది ఇంతలో

"ఐతే అది చెప్పింది జరిగింది అనమాట "అని మధురిమ అనగానే, మేడం "అవును "అని తల దించుకుంది

"ఐతే మిగతావి కూడ జరుగతాయ్ "అని గట్టిగా నవ్వుతుంది

మేడం కోపం గా "నువ్వు నవ్వకు, అవేం జరగవులే "అని మేడం ఉడుకుంటుంది

తనని చూసి మధురిమ ఇంకా గట్టిగా నవ్వుతుంది
నాకేమో ఏం అర్థం కాక టెన్షన్ తో బీపీ వచ్చేలా ఉంది

"ఎందుకు జరగవు, ఇప్పటి వరకు అది చెప్పినవన్నీ జరిగాయి కదా, అవి కూడ జరుగుతాయి "అని గట్టిగ నవ్వుతుంది

మేడం ఏడుపు మొకం పెట్టి "ప్లీజ్ మధు నువ్వు అలా అనకు ఇప్పటికె నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలిదు,దీనంతటి కారణం ఆ దొంగ మొకం ది అది నాకు కనపడితే అప్పుడు చెప్తా దాని సంగతి "అని పళ్ళు కోరుకుతుంది

మధురిమ పొట్ట పట్టుకొని మరీ నవ్వుతుంది నవ్వి నవ్వి తన కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయ్.

దీనంతటికి కారణం ఎవరో అమ్మాయా అస్సలు ఎవరు తను, అమ్మో తన గురించి తెలుసుకోకపోతో బుర్ర పగిలేలా ఉంది ఏదైతే అది అయ్యింది అనుకోని "మేడం మీరు ఎవరినో తిడుతున్నారు, దీనంతటికి కారణం తనే అంటున్నారు, ఎవరు మేడం తను "
అనగానే,
మధురిమ ఆశ్చర్యం గా నన్ను చూసి మేడం వైపు తిరిగి "ఏంటి బొమ్మ అబ్బాయ్ మేడం అంటున్నాడు "అని అంజలి మేడం ని అడిగింది

"హో అదా నందు ని చుసిన తరవాత తీసుకొచ్చి ఆఫీస్ లో జాబ్ ఇచ్చాను, నిన్ననే నా love సంగతి చెప్పాను "అని మేడం చెప్పగానే, మధురిమ వచ్చే నవ్వుని ఆపుకుంటుంది, మేడం అది చూసి ఉక్రోశం గా మధు నడుము గిల్లింది, దంతో బయటికే గట్టిగా నవ్వుంది, మధురిమ ని అలా చూసి మేడం పళ్ళు కోరుకుతుంది , కొద్దిసేపటికి మధురిమ మాములుగా అయ్యి మేడం బుగ్గలు లాగుతూ " సారీ బుట్టబొమ్మ గారు అది చెప్పినవే జరిగేసరికి నవ్వు ఆపుకోలేకపోయాను, చూడు నువ్వు అలిగితే ఎంత ముధోస్తున్నావో "అని మధురిమ అంటుంటే
 నేను ఆగలేక "ప్లీజ్ మేడం ఎవరో ఒకరు తన గురించి చెప్పండి" అనేసరికి

మధురిమ నన్ను చూస్తూ "అస్సలు ఆగలేక పోతున్నవే సరే చెప్తా విను "అంటు చెప్పటం మొదలు పెట్టింది

"అప్పుడు మేము 7th క్లాస్, అంజలి నేను ఇద్దరం కలిసే కాలేజ్ కీ వెళ్ళేవాళ్ళం, మా క్లాస్ కీ కొత్త గా ఒక అమ్మాయి వచ్చింది, తన పేరు మహా, చాలా అందం గా ఉండేది,చాలా అల్లరి పిల్ల కూడ, కొద్దిరోజుల్లోనే మాతో చాలా బాగా కలిసిపోయింది, ఎప్పుడు అంజలి ని బుట్టబొమ్మ, బుట్టబొమ్మ అని పిలిచేది, ఎందుకంటే అప్పుడు అంజలి చాలా ముద్దుగా, అందంగా ఉండేది, శనివారం ఐతే చాలు అంజలి తల నిండా పూలు పెట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, కాళ్లకి పట్టిలు పెట్టుకొని ముద్దుగా తయారై  కాలేజ్కీ  వచ్చేది అది చూసి మహా" బుట్టబొమ్మలా ఉన్నావ్" అని ఏడిపించేది, అంజలి మహా ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే వుండే వాళ్ళు, ఎంత కొట్టుకున్న మళ్ళీ వెంటనే కలిసిపోయేవాళ్ళు, మహా కీ అంజలి అంటే చాలా ఇష్టం తన కోసం పొద్దున్నే కాలేజ్ కీ వెళ్లి ఎదురు చూసేది, అంజలి కీ కూడ అంతే ఇష్టం, ముగ్గురం ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం, కలిసే తిరిగే వాళ్ళం.

ఒక సండే రోజు అంజలి ఇంట్లో ముగ్గురం కలిసి మాట్లాడుకుంటున్నాం అయితే సడన్ గా మా టాపిక్ పెళ్లి కీ మారింది అప్పుడు నేను ఇద్దరిని  అంజలి ని, మహా ని అడిగాను "మీ ఇద్దర్లో ఎవరు love మ్యారేజ్ చేసుకుంటారు" అని 
దానికి అంజలి "నాకు love మ్యారేజ్ మీద నమ్మకం లేదు నేను డాడీ చూపించిన అబ్బాయ్ నే పెళ్లి చేసుకుంటా "అని చెప్పింది, అప్పుడు మహా.... "అని చెప్పటం ఆపేసి మధురిమ గట్టిగ నవ్వుతుంది, మేడం మాత్రం కోపం గా ఉడుక్కుంటూ మధురిమని చూస్తుంది, మధురిమ మేడం ని అలా చూసి నవ్వటం ఆపేసింది, ఇంతలో నేను "ఎందుకు మేడం నవ్వుతున్నారు, అస్సలు మధ్యలో ఎందుకు ఆపేసారు, ప్లీజ్ మేడం చెప్పండి "అనేసరికి, మధురిమ నవ్వుతు మేడం ని చూసి  మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది "అప్పుడు మహా ఏం అన్నది అంటే "అబ్బో దీనికి love మ్యారేజ్ మీద నమ్మకం లేదంట బలే చెప్తుంది , పెద్ద అయ్యాక ఇదే love చేసి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే చస్తా అని బెదిరించి మరీ పెళ్లి చేసుకుంటుంది అలాంటిది ఇది love మ్యారేజ్ చేసుకొనని చెప్తుంది పెద్ద ఉత్తమురాలు "అనేసరికి, అంజలి కోపం గా "ఏంటే నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తున్నావ్ అని "కొట్లాటకి దిగింది అంజలి , ఆ రోజు అంజలి, మహా వెనక పరిగెత్తుతు "నన్ను అంత మాట అంటావా ఆగవే ని సంగతి చెప్తా అని " అంటుంటే, "నిజమే నే బొమ్మ నేను చెప్పేది, కావాలంటే నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నా మాటలు గుర్తొస్తాయి లే "అని అంజలి కీ దొరకకుండా ఇల్లంత పరిగెత్తింది, ఆ రోజు అలా గడిచిపోయింది, మళ్ళీ కొన్ని రోజులకి  మా ఇంట్లో ఎగ్జామ్స్ కీ  రాత్రి పూట కూర్చొని చదువుతున్నాం ముగ్గురం,అంజలి బుద్దిగా ఒక పక్కన కూర్చొని చదువుకుంటుంది, నేను మహా పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నాం,అంజలి అలా బుద్ధిగా చదువుతుంటే మాకు కోపం వచ్చింది ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం,అప్పుడు మహా నాతో అంది "చూడు అంజలి ని ఎలా ఏడిపిస్తానో "అని
"ఒసేయ్ బొమ్మ నువ్వు ఎంత చదివిన పీకేదేం లేదు చివరికి పొయ్యి మీ నాన్న ఆఫీస్ లో కూర్చుంటావ్ "అని మహా అనేసరికి అంజలి కోపం గా "నాకు తెలుసే నేను చదువుతున్నా అని నీకు కుళ్ళు అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ "అని మమ్మల్ని పట్టించుకోకుండా మళ్ళీ చదవటం మొదలు పెట్టింది, మహా మాటలు పట్టించుకోకుండ మళ్ళీ చదవటం తో మహా కీ కోపం వచ్చి "ఒసేయ్ బుట్టబొమ్మ ని పెళ్లి తరవాత ఒకడ్ని love చేసి ని ఆఫీస్ లోనే పెట్టుకొని కులుకుతావే దొంగమొఖం దాన"అనేసరికి, ఇంక అంజలి ఆగలే...."అని మధురిమ మళ్ళీ నవ్వటం మొదలు పెట్టింది, నాకేమో కొంచెం ఇబ్బంది గా ఆశ్చర్యం గా అనిపించింది, మేడం కోపం గా మధురిమ విపు మీద కొడుతుంది, కొద్దిసేపటికి నవ్వటం ఆపి మళ్ళీ స్టార్ట్ చేసింది "మహా అలా అనేసరికి అంజలి ఆగలేదు మహా మీద పడి "ఏంటే ఎమన్నావ్ నేను ఆఫీస్ లో ఎవడినో పెట్టుకుని కులుకుతాన దొంగమొఖం దాన, నోటికి ఎంత మాటోస్తే అంత మాట అంటావా "అని మహా ని కొడుతుంది, అంజలి కొడుతున్న,మహా నవ్వుతు "నిజమే నే బుట్టబొమ్మ,వాడి పేరు నందు "అని మహా చెప్పగానే అంజలి కీ కోపం పెరిగిపోయి "ఒసేయ్ నువ్వు ఈ చేత్త మాటలు ఆపుతావా లేదా "అని మహా జుట్టు గట్టిగా పట్టుకొని అడిగేసరికి,మహా నొప్పికి "స్స్ అబ్బా ఇంక అననులే వదిలేయ్ జుట్టు"అనేసరికి ఇంక ఆ గొడవ ఆ రోజుతో ఐపోయింది, ఐతే ఒక్కసారి క్లాస్ లో సైన్స్ క్లాస్ జరుగుతుంది, చాలా శ్రద్దగా నేను అంజలి వింటున్నాం , అంజలి కీ నాకు మధ్యలో మహా కూర్చుంది, మహా అంజలి చెవిలో ఏదో చెప్పింది అంతే టాప్ లేచిపోయేలా "ఒసేయ్ "అని గట్టిగా అరిచి, మహా జుట్టు పట్టుకొని ఆ బెంచెస్ మధ్యలో కొట్టుకోవడం మొదలు పెట్టారు, మా టీచర్ కీ అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక నిలబడి అలానే చూస్తున్నారు, క్లాస్ మొత్తం నాతో సహా సినిమా చూసినట్టు చూస్తున్నాం ఇద్దరు క్లాస్ మొత్తం పొర్లుతున్నారు, అంజలి మాత్రం కోపం గా "అంటావా అంటావా "అని అరుస్తుంటే, మహా మాత్రం నవ్వుతు "నువ్వు చేసేది అదేనే బొమ్మ "అని నవ్వుతుంది..."అని మధురిమ చెప్తుంటే మేడం తన నోరు మూసి "ఇంక చాలు మధు ఒద్దు చెప్పకు"అని బ్రతిమలింది, మధు కూడ సరే అని తల ఊపింది,
నాకు మాత్రం టెన్షన్ గా ఉంది అంజలి చెవి లో మహా ఏం చెప్పిందో అని అందుకే "మేడం అంజలి చెవి లో మహా ఏం చెప్పింది "అని అడిగేసరికి, మధురిమ మేడం వైపు చూసి నవ్వుతు "చెప్పనా "అనేసరికి, మేడం భయపడుతూ "అమ్మో, వద్దు మధు ఇప్పటికే నందు కార్తీక్ కీ మా విషయం తెలుస్తుందేమో అని బయపడుతున్నాడు, ఇప్పుడు నువ్వు అది చెప్తే పారిపోతాడు వద్దు చెప్పకు "అని మేడం అనేసరికి, నాకు నీరసం వచ్చింది దంతో పాటు నేను పారిపోయే అంత ఏం చెప్పి ఉంటుంది అని ఆతృత పెరిగింది
అప్పుడు మధురిమ "నిజమే నందు ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది "అనేసరికి, నేను కొంచం నిరూత్సహం గా "సరే మేడం, ఇంతకీ మహా ఇప్పుడు ఎక్కడ ఉంది "అని అడగానే, ఇద్దరు బాధపడుతూ "ఏమో తెలీదు నందు అని "మేడం చెప్పింది, నేను ఆశ్చర్యం గా "తెలీదు అంటే ఏమైంది మేడం "
"తను మాతో ఒక్క సంవత్సరం మాత్రమే కలిసి చదువుకుంది, తరవాత మాకు చెప్పకుండానే వెళ్లిపోయింది"అనేసరికి నేను షాక్ తో "వెళ్ళిపోయిందా అంటే ఎక్కడికి మేడం "
"ఏమో నందు తెలీదు మేము చాలా చోట్ల వెతికం, మహా వుండే ఇంటికి వెళ్లి అడిగితే వాళ్ళు రెంట్ కీ వున్నారని ఆ ఇంటి ఓనర్ చెప్పాడు, మహా వెళ్లిపోవడం తో అంజలి చాలా బాధపడింది, ఒక్కోసారి ఏడ్చేది కూడ, తరవాత చిన్నగా మహా ని మర్చిపోయాం కానీ అంజలి పెళ్లి అప్పుడు మహా మాటలు మా ఇద్దరికి గుర్తొచ్చాయి, అప్పుడు కూడ ఏదో మాట వరసకి అని ఉంటుంది లే అనుకున్నాం, తరవాత మహా చెప్పినవి చాలా జరిగాయి,అంజలి ఇష్టం గా చదువుకున్న డాక్టర్ ప్రొఫెషన్ ని వదిలేసి వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకుంటుంది అప్పుడు కూడ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ని విషయం లో మాత్రం మహా చెప్పినట్టు జరగటం తో ని పేరు వినగానే షాక్ అయ్యాను, ని విషయం లో నిజం అయ్యింది అంటే మహా చెప్పినవి అన్ని జరుగుతాయి అనుకుంట "అని మధురిమ చెప్పగానే, ఆశ్చర్యం తోపాటు భయం వేసింది అస్సలు తను ఎవరు జరగబోయేవి అంత చిన్న వయసులో ఎలా చెప్పింది అస్సలు నా గురించి ఎలా తెలుసు అని ఆలోచిస్తుంటే ఇంతలో రాహుల్ ఎప్పుడో చెప్పిన బిర్యానీ తెచ్చాడు, ఆ బిర్యానీ చూడగానే మేడం కోపం గా "బుద్దుందా నీకు ఎంత సేపు అయ్యింది నీకు చెప్పి ఇప్పుడా తెచ్చేది "అని అరిచేసరికి, రాహుల్ బయపడి "కిచెన్ లో ఏదో ప్రాబ్లెమ్ అంట మేడం అందుకే లేట్ అయ్యింది, ఆ విషయం మీకు చెబుదాం అని వస్తుంటే మేనేజర్ బ్రతిమలి ఆపేసాడు మేడం "అని తల దించుకొని చెప్పాడు, మేడం కోపం గా ఏదో అనేలోపు మధురిమ ఆపి "ఎలా ఉన్నావ్ రాహుల్, ఇంక మీరు మేడం ని వదలవా "
"అయ్యో మేడం నేను అంజలి మేడమ్ ని వదిలేసి ఎక్కడికి వెళ్తా మేడం "అనేసరికి
మధురిమ నవ్వుతు "అది కూడ నిజమే లే ఇంతకీ ని వైఫ్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు "
"అందరూ బాగానే ఉన్నారు మేడం "
"సరే ని వైఫ్ ని అడిగాను అని చెప్పు "
"తప్పకుండ చెప్తా మేడం "అనేసరికి
అంజలి మేడం "వెళ్లి మధు కీ జ్యూస్ తీసుకొని రా "అని మేడం చెప్పగానే,
మధురిమ "ఒద్దు అంజలి టైం లేదు వెళ్ళాలి, అక్కడ vip పేషంట్ వెయిటింగ్అందుకే హైదరాబాద్ వచ్చాను, లేకపోతే నేను రానని తెలుసు కదా, ఇప్పటికే లేట్ అయ్యింది అని నా బాయ్ ఫ్రెండ్ చంపుతున్నాడు త్వరగా రమ్మని, వాడిగురించి నీకు తెలిసిందే కదా ఇప్పుడు పెషేంట్ ని చూసి వెంటనే వైజాగ్ ఫ్లైట్ ఎక్కాలి, నేను వెళ్తా ప్లీజ్ "అని మధురిమ చెప్పేసరికి
మేడం బాధగా "అప్పుడే వెళ్తావా "అనగానే
మధురిమ నవ్వుతు మేడం బుగ్గలు పట్టుకొని "నా బుట్టబొమ్మ బాధపడుతుందే, నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాగా అప్పుడు నీతోనే వుంటా "అనేసరికి మేడం నవ్వుతు సరే bye అని చెప్పింది,
వాళ్లిదరిని చూస్తుంటే నాకు ముచ్చటసింది
నేను వాళ్ళని అలానే చూస్తుంటే "నందు అంజలి ఎ నిర్ణయం అంత సులువుగా తీసుకోదు తీసుకుంటే వదిలిపెట్టదు, నిన్ను ఎంత ప్రేమిస్తే తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించు, తనని బాధ పెట్టకు, తను బాధపడితే నేను చూడలేను"అని మధురిమ చెప్పేసరికి, "మేడం బాధ పడే విషయం నేను ఏది చెయ్యను మేడం "అని చెప్పగానే
"గుడ్ బాయ్, ఇక నుండి నన్ను, అంజలి ని మేడం అని పిలవటం మానెయ్ సరేనా,ఈసారి ఒచ్చినప్పుడు మహా అంజలి చెవిలో ఏం చెప్పిందో చెప్తా "అని నవ్వేసరికి, నేను కూడ నవ్వాను.
మధురిమ మేడం కీ, నాకు bye చెప్పి వెళ్లిపోయింది.
మధురిమ వెళ్ళిపోగానే మేడం వచ్చి నా పక్కన కూర్చొని "సారీ నందు మాటల్లో పడి ని ఆకలి గురించి మర్చిపోయాను "అని బిర్యానీ నా ప్లేట్ లో వడ్డించారు "పర్లేదు మేడమ్ నాకు అంతగా ఆకలి లేదు "అని చెప్తుంటే,
"ని పేస్ చూస్తేనే అర్థం అవుతుంది నీకు ఎంత ఆకలి అవుతుందో ఇంక మాట్లాడకుండా తిను "అనేసరికి, నేను తినటం మొదలు పెట్టాను, నిజానికి నాకు ఆకలి దంచేస్తుంది, పది నిమిషాల్లో తెచ్చిన బిర్యానీ మొత్తం కడుపునిండ తినేసాను, నేను తింటున్నంత సేపు మేడం నన్నే చూస్తున్నారు, బిర్యానీ ఐపోగానే "ఇంకా తింటావా నందు "అని మేడం అడిగేసరికి "అమ్మో వద్దు మేడం కడుపు నిండి పోయింది "అనేసరికి పకపక నవ్వింది, కొద్దిసేపటికి బిల్ కట్టి కార్ లో కూర్చుంటే రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు, అప్పటికి టైం 8 అయ్యింది, మేడం ఎక్కడికో వెళ్ళమని రాహుల్ కీ చెప్పింది, కార్ లో కూర్చున్న దగ్గరి నుండి మేడం నా చెయ్యిపట్టుకొనే ఉంది, ఇప్పుడు నాకు ఏం అనిపించడం లేదు, ఇంతకు ముందు కొంచం భయం అనిపించింది కానీ ఇప్పుడు అది లేదు, నేను కూడ మేడం చెయ్యి పట్టుకున్నాను
ఒక పదినిమిషాల తరవాత కార్ ఆగింది దిగి చూస్తే అది కార్ షోరూం దాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది, కోపందిసి  అనుకుంటుంటే మేడం నా చెయ్యి పట్టుకొని లోనికి తీసుకెళ్లారు, లోన వున్న కార్లని చూడగానే మతి పోయింది అన్ని పెద్ద బ్రాండ్స్ నే కేక ఉన్నాయి, నేను అన్ని కార్ల ని చూస్తుంటే 
"నందు నీకు నచ్చిన కార్ సెలెక్ట్ చేసుకో "అనగానే, ఆనందం తో గుండె ఉబ్బింది కానీ ఏదో మాట వరసకి "నాకెందుకు మేడం అవసరం లేదు "అనగానే, నా చెయ్యి పట్టుకొని కార్స్ మధ్యలోకి నడిపిస్తు"నీకు అవసరం లేదేమో, నాకు అవసరం, నా లవర్ కీ కార్ కూడ లేకపోతే నా వాల్యూ తగ్గిపోదు, తెలిసిన వాళ్ళు ఏం అనుకుంటారు చెప్పు ,పైగా నా లవర్ తో కార్ లో తిరగాలి అని నాకు ఉండదా ఏంటి,అందుకే కార్ తీసుకో "అని మేడం అనగానే కొంచెం షాక్ అయ్యాను,
అంటే తన వాల్యూ తగ్గుతుందని నాకు కార్ తీసుకుంటుందా, సరేలే మేడం రీసన్స్ మేడం వి, నాకైతే కార్ తీసుకుంటుంది కదా అనుకోని కార్స్ చూడటం మొదలు పెట్టాను అలా చూస్తుంటే నా కళ్ళు రెడ్ కలర్ రేంజ్ రోవర్ కార్ మీద పడింది కార్ మాత్రం అదిరిపోయింది, కానీ కాస్ట్ చాలా ఎక్కువ తీసుకుంటుందో లేదో అనుకోని కొంచం అనుమానంగానే ఆ కార్ ని చేత్తో చూపించా
ఆ కార్ చూపించగానే మేడం చూసి "కార్ చాలా బాగుంది నందు, నాక్కూడా నచ్చింది "అని రాహుల్ ని పిలిచి ఆ కార్ తీసుకోమంది, రాహుల్ ఆ కార్ చూసి నోరేళ్ళ బెట్టి " అది చాలా కాస్ట్ మేడం "అనేసరికి, మేడం కోపం గా "ని డబ్బులు పెట్టి కొంటున్నవా, మూసుకొని చెప్పింది చెయ్ "అనగానే రాహుల్ సరే మేడం అని వెళ్లిపోయాడు, రాహుల్ వెళ్ళగానే  మిగతా కార్స్ నేను మేడం చూస్తున్నాము, ఒక పది నిమిషాల తరువాత రాహుల్ కీస్ తీసుకొచ్చి మేడం కీ ఇచ్చాడు, మేడం వాటిని తీసుకొని "కార్ నందు పేరు మీద తీసుకో మిగతా ఫార్మాలిటీస్ రేపు వచ్చి చూడు ఇప్పుడు నా కార్ తీసుకొని నన్ను ఫాలో అవ్వు " అని చెప్పగానే రాహుల్ సరే అని వెళ్ళిపోయాడు 
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 21-09-2023, 06:56 PM



Users browsing this thread: 50 Guest(s)