Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
???,తోరణ గణపతి- శృంగేరి...!!
#1
???,తోరణ గణపతి- శృంగేరి...!!

????????????

?శ్రీ చాగంటివారి ప్రవచనం నుండి.

?శృంగెరి పీఠానికి ఉగ్రనృసింహాభారతీ స్వామివారని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు. 

?ఆయన ప్రతిరోజూ ఉదయం కేవలం కాకరాకులే తినేవారు. అలా తిని 24 గంటలలో 20 గంటలు తపస్సు చేస్తే అణిమాది సిద్దులన్నీ ఆయనకు వసమైపోయాయి. 

?ఒక సందర్భంలో అమ్మవారి సంపదను కొల్లగొట్టడానికి శత్రుసైన్యం శృంగగిరి వచేస్తున్నారంటే ఆయన బయటకు వచ్చి ఒకచోట నిలబడి 'నేను సన్యాసినీ... నేనేమి యుద్ధం చేస్తాను... ఈయన చూసుకుంటారు' అని ఒక గడప దగ్గరికి వెళ్లి ఒక మంత్రాన్ని పఠించారు. ..

?వెంటనే దానిమీదకి గణపతి వచ్చి కూర్చున్నాడు. 

?ఇప్పటికి ఆ గణపతిని 'తోరణ గణపతి' అంటారు. 

?మీరు శృంగేరీ పీఠంలోకి అడుగు పెట్టాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి లోపలికి వెడతారు. 

?బయటకు వెళ్లాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటకు వెడతారు. 

?ఆయన పైన కూర్చుని ఉండగా ఇన్నివేలమంది  శత్రుసైన్యం శృంగేరిపీఠంలోకి వెళ్లలేకపోయింది. 

?సనాతన ధర్మంలో శక్తి అంటే ఏమిటో చూపించారు. ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు. 

?వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు నిలబడలేవు. ఆయన మహాపురుషుడు. అనితరసాధ్యమైన శక్తి సంపద పొందారు..?????

????????????
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
???,తోరణ గణపతి- శృంగేరి...!! - by Yuvak - 20-09-2023, 11:06 AM



Users browsing this thread: 1 Guest(s)