18-09-2023, 01:13 PM
మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇద్దరి వర్ష ల ఇంటి పేర్ల తో చెప్తే కన్ఫ్యూజన్ ఉండదు . ఫస్ట్ పరిచయం అయిన వర్ష పూర్తి పేరు P. వర్ష. సెకండ్ వర్ష పూర్తి పేరు C. వర్ష. ఇక నేను ఆఫీస్ లో ఉండగా సాయంత్రం 6 కి C. వర్ష ఫోన్ చేసింది. హైదరాబాద్ చూస్తా అన్నావ్ కదా వస్తావా అని. సరే వస్తున్న అని తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాను బాగా రెఢీ అయ్యి. తను ఒక టాప్ లెగ్గిన్ లో లూజ్ హెయిర్ చున్ని లేదు. నుదిటి మీద బొట్టు. అబో ఒక దేవకన్య లా ఉంది. తను నన్ను చూసి హాయ్ అని తన హెయిర్ ని వేళ్ళతో నుదిటి మీద సరిచేసుకుంటూ చెవి వెనక్కి పెట్టుకొని తన పెదవుల మీద నవ్వు చూస్తుంటే మైండ్ ఒక్కసారిగా ఒక హాయి ఫీలింగ్ వచ్చింది. నా మనసు ఒక్క సారి కంట్రోల్ తప్పింది. నేను కంట్రోల్ చేసుకుని వెళ్లి హాయ్ చెప్పాను. తను నీ కార్ ఇక్కడే పెట్టు స్కూటీ లో వెళ్దాం పదా అంది. కార్ అయితే కంఫర్ట్ కదా అన్నాను. కార్ లో మజా ఉండదు బైక్ బెస్ట్ కం అంది. సరే అని కార్ ని పార్క్ చేశాను. తను స్కూటీ ఎక్కు అంది. నేను డ్రైవ్ చేస్తా అన్నాను. రూట్స్ నీకు తెలుసా అంది. లేదు అన్నాను. మరి సైలెంట్ గా కూర్చో అంది. సరే అని ఎక్కాను.