Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆచార్య సద్బోధన :
#1
(142-2)150923a1204.  170923-1.
???????????978.
నేటి… 

             ఆచార్య సద్బోధన :

*బాంధవ్యం!-భగవంతుడు!!- అనారోగ్యం!!!*
```
మనిషికి భవరోగం కన్నా - భగ్వద్ రోగం ముఖ్యం!

ఆన్ని రకాల అనారోగ్యాలకు మూలకారణం మనస్సు!
మనస్సులో దుఃఖం ఎక్కువైతే హృదయ రోగం వస్తుంది. 
దుఃఖం ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. మానవుడు తనకు ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు అతనికి ఎందుకు/ఎలా బ్రతకాలో తెలుస్తుంది!

నేడు మానవులందరూ చెప్పేది ఒక్కటే..!
నేను నా భార్య కోసం బ్రతుకుతున్నాను.
నేను నా భర్త కోసం బ్రతుకుతున్నాను. పిల్లల కోసం బ్రతుకుతున్నాను అంటారు. 

కాని నీవు.. నీకోసం బ్రతకాలి,```

*ఎందుకు???* 
```నిన్ను ఈ భూమిపైకి మానవుడులా పంపి... బ్రతకడానికి ప్రాణం పోసిన ఆ భగవంతునిపై అమితమైన ప్రేమను పెంచుకుని ఆ పరమేశ్వరునిలో మమేకమవ్వడానికి మాత్రమే బ్రతకాలి.
అంతే కానీ అనిత్యమైన బంధాలలో చిక్కుకుని భార్యను, భర్తను, పిల్లలను అమితంగా ప్రేమిస్తూ, మరలా వారు నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఏవిధంగానైతే వారిని ప్రేమించానో.. ఆ విధంగా నన్ను వారు ప్రేమించడంలేదు అని బాధ పడిపోతే ఏమి వస్తుంది?

పిల్లలు నా మాట వినడం లేదు.. నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను, ఈ రోజు నన్ను పట్టించుకొనడం లేదు అని వాపోతూ ఉంటే నీకు ఏమి వస్తుంది?
నీ హృదయంలో వేదన పెరుగుతుంది, నీ గుండెలో వత్తిడి పెరుగుతుంది, నీకు గుండె పోటు వస్తుంది.
‘నన్ను భగవంతుడు ఏపనికోసం పంపారో ఆ పని ముగించుకొంటున్నాను’ అని అనుకుంటున్నామా?

అందరూ కూడా.. నేను నా భార్యను అమితంగా ప్రేమించాను, కాని నన్ను అర్ధం చేసుకువడంలేదు. అందుకే నేను రోదిస్తున్నాను.
నా భర్తను అమితంగా ప్రేమిస్తున్నాను. కాని నన్ను బాగా చూసుకోవడం లేదు.
నా పిల్లలను అమితంగా ప్రేమించాను కాని నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా మాట వినడం లేదు, నన్ను గౌరవంగా చూడడం లేదు, ఒక తండ్రికి/తల్లికి ఇవ్వవలసి ప్రేమను ఇవ్వడంలేదు.
పెళ్ళి చేసుకున్నాక నా బిడ్డ నామాట వినడం లేదు, భార్యతో వెళ్ళిపోయాడు.
నన్ను ఒంటరివాడిని(లేదా)ఒంటరి దానిని చేసేసాడు అని రకరకాలుగా భాధలు చెపుతుంటారు. 

ఈ బాధల వల్లనే హృదయ రోగం వస్తుంది, అంతేకాదు వృత్తిలో ఇంకా ఎదగడం లేదు అని.. వ్యాపారంలో ఇంకా ఎక్కువగా లాభాలు రావడం లేదు అని... ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ రావడం లేదు అని.. ఇలా కారణాలు రకరకాలుగా ఉంటాయి.

ఇవన్నీ తీర్చమనే పూజలు, యాత్రలు సలుపుతాము కానీ, నాకు మోక్షమివ్వు, ముక్తినివ్వు, అని ఎప్పుడైనా భగవంతుడుని కోరుతున్నామా? 

కారణాలు ఏమైనా కూడా.. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.
ఎప్పుడూ కూడా… నిత్యమైన, సత్యమైన భగవంతుణ్ణి ప్రేమించాలి, సేవించాలి,స్మరించాలి,ఆధ్యాత్మిక చింతన చేయాలి, నిస్వార్థంగా సమాజ సేవలు సలపాలి, నీకు ప్రసాదించిన అన్నాన్ని నలుగురికి పంచాలి, సాటి మానవులకు నీకు తోచినంత సహాయపడాలి! అప్పుడే, అనారోగ్య బాధలు తీరి, భగవంతునికి దగ్గరై, భవ బంధాలనుండి బయటపడతాము.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఆచార్య సద్బోధన : - by Yuvak - 17-09-2023, 07:18 PM



Users browsing this thread: 1 Guest(s)