Thread Rating:
  • 61 Vote(s) - 3.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
#19
Episode 2

ఉదయం 6 గంటలకీ లేచి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి నా బైక్ తీసుకొని గుడికి వెళ్ళాను నా జాబ్ కీ ఇది మొదటి రోజు కదా అందుకే, గుడికి వెళ్లి దేవుడ్ని ఏదో ఒక తీరని కొరక కోరుకొని దారిలో టిఫిన్ చేసి మా కంపెనీ కీ బయలుదేరాను అక్కడికి వెళ్లేసరికి ఆఫీస్ టైం ఐయ్యింది.

 ఆఫీస్ బిల్డింగ్ చూడగానే కళ్ళు చెందిరాయ్ అంటే నమ్మండి నాకు చాలా నచ్చింది. అబ్బా అమ్మాయిలు ఐతే అదిరిపోయారు, కానీ అందరూ బలిసినోళ్ల లానే ఉన్నారు హుమ్మ్ మన అదృష్టం కొద్దీ ఇక్కడ జాబ్ వచ్చింది అస్సలు లోపల ఎలా ఉంటుందో అనుకుంటూ లోపలికి వెళ్ళాను

 ఇంతకీ కంపెనీ పేరు చెప్పలేదు కాదు "MNI groups of companies"చాలా పెద్ద కంపెనీ.

అలా లోనికి వెళ్లి రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి కీ నా అప్పోయింట్మెంట్ లెటర్ చూపించిగానె కొద్దిసేపు వెయిట్ చేయమంది ఇంక  అక్కడ హాల్ లో ఉన్న సోఫాలో కుర్చీని వచ్చే అమ్మాయిలను చూస్తూ కూర్చున్నా, వచ్చి గంట ఐయ్యింది ఎంత సేపటికి పిలవకవటం తో బోర్ కొట్టి ఫోన్ తీసుకుని మా ఫ్రెండ్ శేఖర్ కీ ఫోన్ చేశా వాడు ఫోన్ ఎత్తగానే "ఏరా ఆఫీస్ ఎలా ఉంది జాయిన్ అయ్యావా "అనగానే

"హ   ఇప్పుడే వచ్చారా  మా ఆఫీస్  చాలా బాగుంది  చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు,ఉండటానికి ప్లాట్ కూడ వాళ్లే ఇచ్చారు "

"హో ఇంకేం ఐతే ఫుల్ ఎంజాయ్ అనమాట "....

 నేను ఇలా మాట్లాడుతుండగా నా చుట్టూ పక్కల హడావిడి గా అనిపించింది ఏంటా అని చూస్తే ఎవరో వస్తున్నారు అంట అందుకే  ఈ హడావిడి  అంత పెద్ద vip ఎవరబ్బా అని ఫోన్ మాట్లాడుతూనే కూర్చొని ఎంట్రన్స్ వైపు చూస్తున్న కొద్దిసేపటికి నా చుట్టూ ఎవరు కనిపించలేదు ఇప్పటిదాక హడావిడి చేశారు ఏమైపోయారబ్బా అనుకుంటుండగా

 ఎంట్రన్స్ లో నుండి  ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు నేను కొంచం దూరం గా ఉండటం వల్ల మోకాలు కనపడట్లేదు కానీ అందులో ఒక్క అమ్మాయి అబ్బాయి జంట గా నడుచుకుంటూ వస్తున్నారు, అమ్మాయి వయస్సు  25,26 వుంటాయనుకుంటా అబ్బాయి వయసు 30 ఉండొచ్చు,

వాళ్ళు దగ్గర అవుతున్నాకోద్ది నేను ఆటోమెటిక్ గా లేచి నిల్చున్న ఎందుకంటే అంత బాగుంది ఆ అమ్మాయి, ఏం ఉంది రా బాబు చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలని పిస్తుంది, బ్లూ సారి లో అదిరిపోతుంది కళ్ళకి బ్లాక్ గ్లాస్సెస్ పెట్టుకొని చేతిలో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నడిచివస్తుంటే నరాలు అన్ని జువ్వు మని లాగుతున్నాయి, తను నవ్వుతుంటే అందమైన పలు వరుస, నవ్వినప్పుడు బుగ్గమీద వచ్చే దింపుల్స్ అబ్బోఓ అదిరిపోయింది..

ఆ అమ్మాయి తనతో పాటు వస్తున్న అతనితో చాలా చనువుగా మాట్లాడుతూ అతని చెయ్యి పట్టుకొని నడుస్తుంది

తన పక్కన ఉన్న అతను కూడ ఆ అమ్మాయి తో చాలా చనువుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, నేను మాత్రం ఆ అమ్మాయి ని నోరు తెరిచి అలానే చూస్తూ ఉండిపోయా కానీ అంతలోనే నిరుగారిపోయా ఎందుకంటే తనకి పెళ్లి ఐయ్యింది తన నుదిటిన కుంకుమ బొట్టు కనపడుతుంది అది చూసి కొంచం నిరూత్సహాపడిన ఇలాంటి అందాన్ని దూరం నుండి చూసి ఆనందపడాలి కానీ దగ్గరికి వచ్చి కౌగాలించుకోవాలి అనుకోకూడదు అనుకోకుని నన్ను నేను సముదహించుకొని తననే చూస్తువుండిపోయా

తను నా ముందు నుండి లోపలికి వెళ్తూ పక్కన ఉన్న అతనితో మాట్లాడుతూనే నన్ను ఒక్క క్షణం పాటు చూసి లోపలికి వెళ్లిపోయింది

నేను మాత్రం ఎలాంటి భయం లేకుండా నోరు తెరుచుకుని అలానే తననే చూస్తూ ఉండిపోయా అలా ఎంత సేపు ఉన్నానో నాకే తెలియదు ఎవరో పిలుస్తుంటే ఈ లోకంలోకి వోచి చూస్తే రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి కనిపించి లోపలికి వెళ్ళమని రూమ్ నెంబర్ చెప్పింది

 ఆమె చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టి లోపలికి వెళ్లి చూస్తే ఒకతను కనిపించాడు అతను నన్ను చూడగానే ఎవరు నువ్వు అన్నట్టు నా వైపు చూసాడు వాడి లుక్ అర్ధమయ్యి న్యూజాయింగ్ సార్ అని చెప్పగానే నా వైపు విచిత్రం గా చూసి "న్యూ జాయింగ్ ఆ అస్సలు మేము ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేదు కదా "అనేసరికి

 వీడేంటి ఇలా అంటున్నాడు అనుకోని త్వరగా నాకొచ్చినా లెటర్ తీసి ఇచ్చాను, అతను అది తీసుకుని కొద్దిసేపు నన్ను లెటర్ ని మార్చి మార్చి చూసి తన చైర్ లో నుండి లేచి తన వెనకాలే రమ్మని చెప్పాడు, అలా నేను తన వెనకే ఫాలో అయ్యాను

అతను నన్ను ఒక రూమ్ లోకి తీసుకునివెల్లాడు,అక్కడ ఆ రూమ్ లో ఇంతకు ముందు హాల్ లో అమ్మాయి తో చుసిన అతను కనిపించాడు,టేబుల్ మీద అతని నేమ్ ప్లేట్ కనిపించింది కార్తిక్ అని  ఒకసారి దాన్ని చూసి ఆ అమ్మాయి ఏమైనా ఇక్కడ ఉందా అని ఆ రూమ్ మొత్తం చూస్తున్న ఇతను ఇక్కడే ఉంటే మరీ తను ఏది అనుకుంటూ దిక్కులు చూస్తున్న

 ఇంతలో నన్ను తీసుకెళ్లిన అతను "సార్ ఇతను న్యూజాయింగ్ "అని నన్ను చూపిస్తూ చెప్పాడు

 "ఏంటి న్యూజాయిన్ ఆ, అస్సలు నాకు తెలియకుండా కొత్తవాళ్ళని ఎవరు తీసుకున్నారు " అని ఏం అర్ధం కానట్టు చూస్తున్నాడు

" సార్ ఇది మేడం రిక్రూట్ చేశారు సార్" అని నా లెటర్ తనకి ఇచ్చాడు
 అది తీసుకొని నన్ను లెటర్ ని మార్చి మార్చి చూస్తున్నాడు, ఇక్కడెంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు అనుకుంటుంటే 

అంతలో "సరే మేడం దగ్గరికి తీసుకెళ్ళు "అని చెప్పడం తో మళ్ళీ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఏంట్రా బాబు ఇలా తిప్పుతున్నారు అనుకుంటూ అతని వెనకే నడిచాను, అతను నన్ను ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లి నన్ను బయట ఉండమని అతను లోపలికి వెళ్ళాడు, నాకెందుకో కొంచెం టెన్షన్ గా ఉంది, కించెం చెమటలు కూడ పడుతున్నాయి. కొద్దిసేపటికి అతను బయటికి వచ్చి నన్ను లోపలికి వెళ్ళమని అతను వెళ్ళిపోయాడు

ఆ రూమ్ లోకి అడుగుపెడుతుంటే భయంతోనో, సంతోషం తోనే నా గుండె అదురుతున్నట్టు అనిపించింది.
కొంచం ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళగానే ఆ రూమ్ చూసి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అలానే నోరు తెరిచి చూస్తువుండిపోయాను అది ఆఫీస్ లా లేదు ఇంద్రబావనం లా తళ తళ తెల్లగా మెరిసిపోతుంది ఆ రూమ్ లో ఉన్న ప్రతి వస్తువు తెలుపుతో నిండిపోయింది అలా రూమ్ మొత్తం ఆశ్చర్యం తో చూస్తుండగా నా ఎదురుగా ఏదో సౌండ్ వినిపించి అటువైపు చూసేసరికి నా రొమాలు నిక్కపొడుచ్చాయ్ నా ఎదురుగా లాంగ్ టేబుల్ కీ అవతలి వైపు నిలిరంగు చీరలో కుర్చీలో వెనక్కి వాలి కాలుమీద కాలు వేసుకొని చేతివేళ్ల మధ్య పెన్ తిప్పుతూ నన్నే చూస్తుంది, రూమ్ మొత్తం పాల లాంటి తెలుపుతో నిండిపోయిన తను కట్టుకున్న నిలిరంగు చిర,తన అందం ఆ తెలుపుని సైతం డామినేట్ చేస్తున్నాయి
నేను మాత్రం ఎందుకు అక్కడ ఉన్నానో అనే విషయం మర్చిపోయి తన అందాన్ని చూస్తూ ఉండిపోయా

తను కొద్దిసేపు నన్ను అలానే చూసి "హెలో mister"అని గట్టిగా పిలిచేసరికి నేను  నా లోకం నుండి ఈ లోకం లోకి వచ్చి తడబడుతూ "good మార్నింగ్ " అంటు తన ఎదురుగా నిలబడ్డాను

నన్ను ఒకసారి పైనుండి కిందివరకు చూసి "అస్సలు ఎవరు నువ్వు లోపలికి వచ్చి దిక్కులు చూస్తున్నావ్ "

"సారీ మేడం, న్యూజాయింగ్ మేడం లోపలికి వెళ్ళమని చెప్తే వచ్చాను "

"హో అది నువ్వేనా మరీ ఏంటి వచ్చిన పని చూసుకోకుండా మనుషుల్ని ఎప్పుడు చూడనట్టు చూస్తున్నావ్ " అని కొంచం గట్టిగానే అనగానే

నేను తడబడుతూ "అదేం లేదు మేడం "అంటు ఏం చెప్పాలో తెలియక మోనంగా వున్నన్నాను

నన్ను కొద్దిసేపు చూసి కూర్చోమని చెప్పింది
నేను కూర్చోగానే "ని ఫైల్ ఏది "  అని అడిగింది

నాకేం అర్ధం కాక తనవైపే చూస్తుంటే మేడం కీ అర్థం అయ్యి చిరాకుగా "ఫైల్ అంటే ని సర్టిఫికెట్స్ ఏవి అని " భయబడుతూనే నా ఫైల్ తనకి అందించాను

తను ఆ ఫైల్ పట్టుకొని "దీంట్లో అన్ని ఒరిజినల్స్ నేనా లేకపోతే డూప్లికేట్ ఆ "

"అయ్యో లేదు మేడం అన్ని ఒరిజినల్స్ నె"

"దీంట్లో ని అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు డీటెయిల్స్ అన్ని వున్నాయిగా "

"అన్ని ఉన్నాయి మేడం "

"ఐతే ok"అని నా ఫైల్ చూడటం మొదలుపెట్టింది

నేను కాలిగా ఉండకుండా ఆ రూమ్ మొత్తం చూస్తుంటే నా కళ్ళు టేబుల్ మీద ఉన్న మేడం నేమ్ ప్లేట్ కనిపించింది దాని మీద "Dr. అంజలి " ఉందిపేరు బాగుంది కానీ ఒకటి వింతగా అనిపించింది ఏంటంటే  డాక్టర్ అంజలి అని అంటే తను డాక్టర్ కొంచం ఆశ్చర్యం గా ఆ పేరునే చూస్తూ ఉండిపోయాను

కొంత సమయం తరువాత మేడం నె ఫైల్ పక్కన పెడుతు
" వెరీ good నందు గ్రేట్ మర్క్స్ అన్నిటిలో నువ్వే ఫస్ట్ అనుకుంటా, ఇంక త్వరగానే b. Tech పూర్తిచేసావే " అనగానే

నాకు అర్ధం అవుతుంది తన మాటల్లోని వెటకారం ఎందుకంటే నేను అన్నింటిలోనూ లాస్ట్ నె అస్సలు పాస్ అయ్యాను అంటే నా మీద నాకే నమ్మకం లేదు కస్టపడి చదివి ఏదో నాకు తగట్టు ఐదు సంవత్సరాలలో పూర్తి చేసా,తన మాటలకి ఏం మాట్లాడకుండా మోనంగా  ఉండిపోయాను.

"సరే కానీ నీకు ఇక్కడ జాబ్ చేయాలనీ ఉందా "

"అదేంటి మేడం అలా అంటారు ఇంత మంచి కంపెనీ లో జాబ్ చేయాలనీ ఎవరికి ఉండదు "

"సరే నీకు జాబ్ ఇచ్చాను అనుకో ఏం చేస్తావ్ "

ఇదేంటి ఇలా ఆడుగుతుంది జాబ్ వస్తే ఏం చేస్తారు జోబే కదా చేసేది  దీనికి ఏదో ఒకటి చెప్పాలి అనుకోని
"కష్టంపడి పనిచేస్తా మేడం " అని చెప్పగానే

"ఏంటి కస్టపడి పని చేస్తావా, ఈ మార్కులతోనే "అని వెటకారం గా మాట్లాడింది

 నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను కొద్దిసేపు నన్ను చూసి మళ్ళీ తానే 
"సరే ఐతే నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా అన్ని నిజాలే చెప్పాలి, హా నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నాకెలా తెలుస్తుంది అనుకుంటావేమో, నువ్వు ఏంటో ఎవరో ఎక్కడ ఉంటావో అన్ని తెలుసు ఏం తెలియకుండానే ని ఇంటికి అప్పోయింట్మెంట్ లెటర్ పంపుతానా ఏంటి  సో ఇప్పుడు నేను అడిగే వాటికి అన్ని నిజాలే చెప్పాలి అబద్దం చెప్పావో తరవాత నిమిషం గేట్ బయట ఉంటావ్, నా గురించి అన్ని తెలిసి కూడ  మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అనుకుంటావేమో నాకు ని ధ్వారా వినాలని ఉంది సో నిజం మాత్రమే చెప్పు "

తను మాట్లాడిన మాటలకూ షాక్ తో నోరు తెరుచుకొని అలానే ఉండి పోయా అంటే తనకి నా గురించి అన్ని తెలుసు,అంటే కావలనె నాకు లెటర్ పంపింది,అస్సలు ఎందుకు నా గురించి తెలుసుకుంది, తనని ఇంతకు ముందు కూడ ఎప్పుడు చూడలేదు కదా, అస్సలు ఎవరు తను,ఐనా ఏవో అడుగుతా అంటుంది నిజం చెప్పమంటుంది అస్సలు ఏం అడుగుతుంది అని నేను ఆలోచిస్తుంటే

"హలో ఏం ఆలోచిస్తున్నావు చెప్తావా వెళ్ళిపోతావా"

"చెప్తా మేడం అడగండి "

"Ok ఐతే, నీకు డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా అదే మందు తాగటం సిగరెట్ లాంటివి "

నేను షాక్, ఏంటి ఇలా అడుగుతుంది నిజానికి ఇలాంటివి అడుగుతుందని అస్సలు అనుకోలేదు ఐనా జాబ్ కీ వీటికి ఏం సంబంధం ఉంది అని అడుగుతుంది అని ఆలోచిస్తుంటే

"ఆలోచించింది చాలు అలవాటు ఉందా లేదా ఏదో ఒకటి చెప్పు నాకు నీలా పనిలేకుండా కాలిగా లేను"

నేను మళ్ళీ షాక్ ఏంటి తను ఇలా మాట్లాడుతుంది అని నేను వెంటనే "వున్నాయి మేడం "

"Good ఇంక అమ్మాయిలు అదే లవర్, గర్ల్ఫ్రెండ్స్ లాంటివి "

దేవుడా ఏంట్రా బాబు ఇలాంటివి అడుగుతుంది అనుకుంటూ "లేరు మేడం "అని చెప్పాను

"లేరు అంటే ఇప్పుడు లేరా అస్సలు ఇంతవరకు ఎవర్ని ట్రై చేయలేదా"

నాకు ఏం చెప్పాలో అర్ధం కాక ఆలోచిస్తుంటే "హేయ్ అడిగింది వినడపడలేదా లేకపోతే చెవుడా "అని గట్టిగ అరిసేసరికి

ఆ అరుపుకి ఒళ్ళు జల్లు మంది  భయం గా "అది మేడం.. ఇంతకు ముందు నా ఇంటర్ లో ఒక అమ్మాయి ని love చేశా మేడం అంతే అప్పుడు తెలిసి తెలియని వయసు లో  అలా జరిగిపోయింది"

"మరీ తరవాత ఏం అయ్యింది "

 " తనకి పెళ్లి ఐయ్యింది మేడం " అన్నాను

నేను చెప్పిన దానికి నవ్వుతు "ఏంటి బ్రేకప్ aa"అంది

తనలా నవ్వుతుంటే కొంచం ఇబ్బంది గా అనిపించి చిన్నగా "అవును మేడం"అని చెప్పాను

"అదృష్టవంతురాలు నీలాంటోడిని వదిలేసి మంచిపని చేసింది లే  మరీ తరవాత ఎవర్ని ట్రై చేయలేదా "

తన మాటలకి ఆశ్చర్యం తో తననే చూస్తూ "నేనేం చేశా మేడం అలా అంటున్నారు "అన్నాను

"అబ్బో పోరుషం వచ్చిందా పెద్ద శ్రీరామచంద్రుడివి మరీ , నువ్వు రాముడివో కృష్ణుడివో నాకు తెలుసు కానీ ముందు నేను అడిగిన దానికీ సమాధానం చెప్పు తరవాత ఎవరిని ట్రై చేయలేదా "

తనకి నా గురించి అన్ని తెలుసు అనుకోని "ఇంటర్ ఐపోయిన తరవాత కాలేజీ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు మేడం "అని తల దించుకున్న

"ఉండేవారు అంటే ఎంత మంది ఉన్నారేంటి "

"ఏమో మేడం గుర్తులేదు " తను అలా అడుగుతుంటే ఏదో తెలియని భయం స్టార్ట్ ఐయ్యింది, నా వైపు కొద్దిసేపు చూసి ఏమనుకుందో మరీ వెంటనే 
"సరే కానీ చివరి ప్రశ్న దీనికి సమాధానం చెప్పు "అంటు నావైపు సూటిగా చూస్తుంది

 ఏం అడుగుతుందా అని టెన్షన్ తో నేను కూడ తననే చూస్తున్న
"ఎప్పుడైనా జైలు కీ వెళ్ళావా "

ఈసారి మాత్రం నుదిటి మీద చమటలు పట్టేసాయి గుండె కొట్టుకొనే వేగం కూడ పెరిగింది తను మాత్రం తాపిగా కూర్చొని నన్నే చూస్తుంది నేను ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉన్న తను కూడ ఏం మాట్లాడకుండా నన్నే చూస్తుంది, ఏం అనుకుందో ఏమో మళ్ళీ 
కొంతసమయం తరవాత తనే "హేయ్ నందు నేను ఊరికే అడిగాను టెన్షన్ పడకు "అని చిన్నగా నవ్వుతుంది

తన నవ్వు చూడగానే కొంచెం నార్మల్ అయ్యాను
"ఐతే నీకు ఇక్కడ జాబ్ చేయటం ఇష్టమే అనుకుంట "

"అవును మేడం "

"ఐతే సరే మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం "అని తన టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది వెంటనే ఎవరో డోర్ తీసుకొని వోచ్చారు చూడటానికి అతను 35,40 ఇయర్స్ ఉంటాయి అనుకుంట.

అతను రాగానే "రాహుల్ నేను చెప్పింది రెడీ చేసావా "అనగానే

"అంత రెడీ మేడం " అని కొన్ని పేపర్స్ మేడం కీ ఇచ్చాడు

మేడం వాటిని మొత్తం చూసి నా ముందుకు నెట్టి సంతకం పెట్టమని చెప్పింది, నేను ఇంక సంతకం పెడదాం పెన్ తీసుకొని పెడుతుంటే టీవీ షో లో ఆపినట్టు "ఒక్క నిమిషం "అని నన్ను ఆపి

"ఏంటి ఏం చదవకుండానే సంతకం పెడుతున్నావ్"

"దీంట్లో ఏం ఉంటుంది మేడం అన్ని కంపెనీలలో జరిగేదె కదా, పైగా ఇంత మంచి కంపెనీ లో జాబ్ రావటం అంటే అదృష్టం ఉండాలి మేడం, నాకు ఈ జాబ్ చాలా అవసరం మేడం అందుకే పెడుతున్న " అని చెప్పగానే

 నావైపు చూస్తూ ఒక్క కన్నింగ్ స్మైల్ ఇచ్చి "నీకు జాబ్ ఎంత అవసరమో నాకు తెలుసు కాని ముందు మొత్తం చదువి అప్పుడు సంతకం పెట్టు, ఏమో అది చదివిన తరవాత ని నిర్ణయాన్ని మార్చుకుంటావేమో ఏమో ఎవరికి తెలుసు కాబట్టి ముందు చదివి పెట్టు" అంది

 ఇదేంటి చదువు చదువు ఒకటే అరుస్తుంది దీంట్లో ఏం కుట్ర లేదు కదా దీని దగ్గరకు వచ్చిన తరువాత నుండి పగోడిని చూసినట్టు చూస్తుంది ఏం ప్లాన్ వేసిందో ఒకసారి చదివితే ఏం అవుతుంది అనుకోని చదవటం మొదలు పెట్టాను మొత్తం మూడు పేజీలు ఉన్నాయి మొదటి రెండు పేజీలు కంపెనీ గురించి రూల్స్ గురించి ఉంది
ఇంక మూడవ పేజీ చదువుతుంటే నా వేళ్లు వణుకుతున్నాయి మొత్తం చదవటం ఐపోయేసరికి వెన్నులో వణుకు పుట్టింది

అస్సలు ఇది నన్నేం చేద్ధం అనుకుంటుంది, దీనికి నా మీద ఏమైనా పగ ఉందా నేను పెద్దగా ఎవరితో గొడవలు కూడ పెట్టుకొను మరీ  వచ్చినదగ్గర  నుండి ఏదో విధం గా ఇబ్బంది పెడుతూనే ఉంది అనుకుంటూ  తన వైపు చూస్తే తాపిగా కాలుమీద కాలేసుకొని చిన్నగా నవ్వుతు నన్నే చూస్తుంది ఆ నవ్వు లో ఏదో సాధించాను అనే గర్వం కనపడుతుంది

"ఏంటి నందు అలా చూస్తున్నావ్ ఏమైంది అర్ధం కాలేదా, హో సారీ అది ఇంగ్లీష్ లో ఉంది కదా అర్థం అయ్యివుండదు లే సరే నేను చెప్తా విను "

తను అలా మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా అవమానం గా మాట్లాడుతుంది

"దానిలో ఉంది ఏంటంటే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన మరుక్షణం నుండి తరవాత పది సంవత్సరాల వరకు నువ్వు ఈ కంపెనీ కోసం మాత్రమే పని చేయాలి లేదు నేను చేయలేను అని ఎదైనా  కారణం చెత్త వెళ్ళిపోతాను అంటే కంపెనీ కీ 5కోట్లు కట్టి వెళ్ళిపోవాలి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతే కంపెనీ నిన్ను జాయిల్ కీ పంపిస్తుంది,దానితో పాటు కంపెనీ రూల్స్ పాటించాలి, బాస్ ఏం చెప్తే అది చేయాలి, ని జీతం నెలకి లక్ష రూపాయలు హుమ్ ఇంక అంతే లే, ఏం రాహుల్ అంత సరిగ్గానే చెప్పనా "అని తన పక్కన ఉన్న అతన్ని అడిగిది

వాడేమో "ఎస్ మేడం "అని గంగిరెద్దుల తల ఆడించాడు

మళ్ళీ మేడం నె "ఏంటి నందు ఏం మాట్లాడట్లేదు సంతకం పెడతావా వెళ్ళిపోతావా " అని చాలా కూల్ గా అడిగింది

హైదరాబాద్ కీ వచ్చి ఇప్పటికే 4నెలలు దాటిపోయింది ఇప్పటి వరకు జాబ్ లేదు ఇప్పుడు అనుకోకుండా మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది కానీ ఇక్కడేమో ఎక్కడ లేని రూల్స్ పెట్టి నన్ను చంపుతుంది ఇదేనేమో ముందు నుయ్యి వేనక గొయ్యి అంటే ముందుకు వెళ్ళలేను వెన్నక్కి వెళ్ళలేను, ఇది నన్నెదో చేసేలానే ఉంది కానీ నాకు వేరే దారి లేదు సంతకం పెట్టాల్సిందే ఇలా నా ఆలోచనలతో ఉండగా

"హలో మిస్టర్ నందు సంతకం పెడతావా వెళ్ళిపోతావా "అని గట్టిగ అరిచింది

భయంగా తనని చూస్తూ "పెడతా మేడం కాని మరీ పది సంవత్సరాలు అంటే..."అని బయతో మాటని మింగేసాను

"అంటే అని ఆగిపోయావ్ ఏంటి  " అని నన్ను సూటిగా చూస్తుంది

ఇంక తప్పదు అని "పది సంవత్సరాలు అంటే కొంచం కష్టం మేడం కొంచెం తగ్గించారా "అడిగేసరికి

కోపంగా "అంటే ఏంటి ని ఉదేశ్యం,ని ఇష్టం ఉన్నంత కాలం జాబ్ చేసి మధ్యలో వెళ్ళిపోతావా,ఇదేమైనా నువ్వు పెట్టిన కంపెనీ అనుకుంటున్నావా నీలాంటోడికి పిలిచి జాబ్ ఇవ్వటం వేస్ట్, అస్సలు నీకు జాబ్ చేయాలి కష్టపడాలి అని అస్సలు లేదు ఇంక నీకోసం టైమ్ వేస్ట్ చేయలేను ఇంక నువ్వు వెళ్లిపొచ్చు "అని ఫైల్ నామీద విసిరేంది

ఫైల్ విసిరేసరికి షాక్ తో అలానే చూస్తూ ఉండిపోయాను నాతో ఇప్పటి వరకు ఎవరు ఇలా  నడుచుకోలేదు,ఒక్కసారి గా అంత సీరియస్ అయ్యి ఫైల్ విసురుతుంది  అనుకోలేదు, నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదు,నిజానికి జాబ్ నుండి మధ్యలో వెళ్లిపోయే ఉదేశ్యం లేదు నాకు, టెన్ years అనే సరికి ఎందుకో బయం పట్టుకుంది, నేను అదె విషయం చెబుదాం అని మేడం ని చూస్తే చాలా కోపం ఉంది

అయినా కూడ ధైర్యం తెచ్చుకొని "మేడం"అని చిన్నగా పిలిచాను నా మాటలో తేడా నాకే తెలుస్తుంది భయంతో గొంతు వణుకుతుంది
నేను పిలిచేసరికి కోపం గా "ఇడియట్ నువ్వు ఇంక వెళ్లలేదా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నావ్ వెళ్ళిపో" అని తన చేతిలో ఉన్న పెన్ నా మీదకి విసిరి కొట్టింది

పెన్ వచ్చి నా తలకి తగిలింది
పెన్ విసిరినందుకు కాదు కానీ వెళ్ళిపో అన్నందుకు భయం తో పాటు బాధ కూడ తన్నుకొచ్చింది నాకర్థం అయ్యింది ఈ జాబ్ రాదని..........
Like Reply


Messages In This Thread
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 11-09-2023, 11:52 AM
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM



Users browsing this thread: 13 Guest(s)