Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
ప్రే


నా బుజ్జి కదా ఈ ఒక్క ముద్ద తినమ్మా.. ఇరవై నాలుగేళ్ల కూతురు స్వప్నని బతిమిలాడుతుంది వాళ్ళ అమ్మ తన కన్నీళ్లు దిగమింగుతూ

స్వప్న : బావని చూపిస్తా అన్నావ్

ఫోన్ చేసాను, వస్తున్నాడట.. నువ్వు అన్నం తినేసి రెడీ అయితే నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానన్నాడు

స్వప్న : రోజూ ఇదే చెప్తున్నావ్, అన్నం తిన్నాక నన్ను కట్టేస్తావ్.. ప్లీజ్ అమ్మా.. నీ కాళ్లు పట్టుకుంటా.. నన్ను నా బావ దెగ్గరికి పోనివ్వు.. నాకు బావ కావాలమ్మా.. నన్నోదిలేయి మా.. ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసింది.

సరే తిను ఇవ్వాళ నిన్ను నీ బావ దెగ్గరికి పంపించేస్తా, ప్రామిస్

స్వప్న : నిజంగా.. ఏది నా మీద ఒట్టేయి అని తల్లి చేతిని తీసుకుని తల మీద వేసుకుంది.

నీ మీద ఒట్టు, ఆనందంగా కళ్ళు తుడుచుకుంది.

స్వప్న : థాంక్స్ మా.. త్వరగా తినిపించు.. ఇంతకీ బావకి ఫోన్ చేసావా.. వస్తున్నాడా

బావ రాడు, నువ్వే వెళ్ళాలి

స్వప్న : అవునా.. ఏదోకటిలే.. అంతా మీ వల్లే.. అలిగినట్టున్నాడు.. ఇప్పుడు నేనెళ్ళి బతిమిలాడుకోవాలి.. మరి నాన్న...?

నాన్నకి చెప్పకుండానే పంపించేస్తున్నా

స్వప్న : అవునవును.. ఆయనకి తెలీకూడదు.. తెలిస్తే బావని ఆరోజు కత్తితొ పొడిచినట్టే మళ్ళీ పొడుస్తాడు. ఆ రోజు నేనెంత ఏడ్చానో

అవును అని కళ్ళు తుడుచుకుంటూ అన్నం తినిపించింది. అన్నం తింటున్నంతసేపు స్వప్న తన బావ గురించి చెపుతుంటే ఊ కొడుతూనే తన కూతురికి తినిపించి తనూ తినింది.

స్వప్నా.. ఇలా నా ఒళ్ళో పడుకో అంది ఇందాక తాను రాసిన ఉత్తరం పక్కన పెడుతూ.

స్వప్న : ఏంటిమా నా బట్టలు సర్దవా అంది ఒళ్ళో పడుకుంటూ

మళ్ళీ ఈ జన్మలో మనం కలుస్తామో లేదో కొంచెంసేపు నాతో ఉండమ్మా అని కూతురి తల నిమురుతూ పాట పాడసాగింది.

కన్నానే నిన్ను కనుపాపలా
పెంచానే నిన్ను పసిపాపలా
సాకితినే నిన్ను సివంగిలా
చంపుకుంటున్నా చేజేతులా

నీ ఆశలు నీరై పోయేనే
నీ బతుకే చితికి పోయేనే
ప్రేమకి బలి పశువాయనే.. నీ బావా

స్వప్న : ఆయి.. బావా.. పాడు పాడు

పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి
స్మశానానికి కాపురమిచ్చన్నే... స్మశానానికి కాపురమిచ్చన్నే... స్మశానానికి కాపురమిచ్చన్నే...

అని పాడుతూ కూతురి కళ్ళు మూసి అలానే జొ కొడుతూ తాను శాశ్వత నిద్రలోకి జారుకుంది.

కాసేపటికి రాజారెడ్డికి కబురొచ్చి ఇంటికి వచ్చాడు, ఏడ్చాడు. పీడా వదిలిందనుకుంది రాజరెడ్డి అమ్మ. జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయాయి. సొంత అమ్మే కూతురికి విషం పెట్టి చంపి తాను చనిపోయిందన్న వార్త తప్ప అస్సలు నిజాలు పేపర్లో చదివిన ఏ ఒక్కరికి తెలియవు. చెరువు గట్టున కూర్చుని పెళ్ళాం విడిచిన ఉత్తరం బైటికి తీసాడు.

"బావా.. నువ్వు ఎన్నో పాపాలు చేసావు. ఏ ఒక్కరోజు నేను నీతో ఒక్కసారి కూడా ఆ విషయాలు మాట్లాడలేదు.. ఇప్పుడు కూడా నాకు ఆ ధైర్యం లేదు అందుకే, ఇవే నేను నీతో మాట్లాడే చివరి మాటలు.

నీ పంతంతో నా కూతురిని ఎంతో ఏడిపించావు. మీ అమ్మ చెప్పుడు మాటలు విని నా మేనల్లుడి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు, అంతటితో ఆగారా మీరు.. లేదు.. నా మేనల్లుడిని పొట్టన బెట్టుకున్నావు. ఏమి చూడని అనుభవించని వయసు వాడిది, వాడిని ఎంత దారుణంగా చంపావో ఒక్కసారి గుర్తుతెచ్చుకో

మన బిడ్డ పిచ్చిది అయిపోయింది. నీ పంతము నెగ్గింది, మీ అమ్మ గారి మాట గెలుచుకుంది. కాని బలయ్యింది ఒక్కడి ప్రాణమే అనుకుంటున్నావేమో కాదు..

ఏ రోజు అయితే నువ్వు నా మేనల్లుడిని చంపావో అదేరోజు నీ కూతురు కూడా చచ్చిపోయింది. దాన్ని మీరంతా కలిసి పిచ్చిదాన్ని చేశారు, చంపేశారు. దాని బాధ చూడటం ఇక నా వల్ల కాదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

నా బిడ్డని నా చేతులతో నేనే విషం పెట్టి చంపుకునేలా చేసావ్.. అది భరించడానికి నేను రాజారెడ్డిని కాదుగా, అందుకే నేనూ వెళ్లిపోతున్నాను.

క్షమించలేనన్ని తప్పులు చేసేసావ్ రాజారెడ్డి.. నీకు ఆ దేవుడు శిక్ష వెయ్యాలని కోరుకుంటూ.. నీకు ఇరవై ఏడేళ్లు సేవలు చేసిన నీ భార్య."




Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 05-09-2023, 11:37 PM



Users browsing this thread: 19 Guest(s)