Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళైన బ్రహ్మచారి
#92
బిందు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అన్నపూర్ణ కూడా తన కూతురు తొందరగా మామూలు మనిషి అవుతుంది అని ఆశ పడి అదే విషయాన్ని వెళ్లి తన భర్త తో చెప్పింది, దాంతో కృష్ణమూర్తి కూడా సంతోషంగా ఫీల్ అయ్యాడు సూర్య తన తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోని ఆ తర్వాత తన పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నాడు, కొత్త జీవితం మొదలు పెట్టాలి అన్ని ఎన్నో ఆశలతో ఉన్న సూర్య తన భార్య కోసం అన్ని సమకూర్చాలి అని ఏర్పాటు చేసుకున్నాడు అలా ఉండగా ఒక రోజు తను బిందు కీ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకోని షాపింగ్ కీ వెళ్ళి తనకు ఏమీ కొన్నాలి అని ఆలోచిస్తే ఏమీ తట్టడం లేదు ఎలా అని ఆలోచిస్తే అప్పుడే తనకు శ్రీదేవి నుంచి ఫోన్ వచ్చింది, దాంతో తనని urgent గా రమ్మని చెప్పాడు సూర్య రమ్మని పిలిచే సరికి శ్రీదేవి ఏమీ ఆలోచించకుండా షాపింగ్ మాల్ కు వెళ్లింది అక్కడ సూర్య నీ చూసి ఎంతో ఉత్సాహంగా వెళ్లి "ఏంటి సార్ సడన్ గా షాపింగ్ కీ పిలిచారు" అని చాలా సంతోషంగా అడిగింది శ్రీదేవి, దానికి సూర్య "ఏమీ లేదు మేడమ్ ఇక్కడ ఉన్న చీరలు చూసి నేను బాగా confuse అయ్యాను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అర్థం కావడం లేదు కొంచెం సహాయం చేస్తారా" అని అడిగాడు, దాంతో శ్రీదేవి తనకు బాగా నచ్చిన ఒక క్రీమ్ కలర్ చీర తీసి చూస్తూ ఉంటే ఆ చీర నీ చూసిన సూర్య కీ అది బిందు కీ బాగ సూట్ అవుతుందని వెంటనే ఆ చీర నీ ప్యాక్ చేయమని చెప్పి "మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే మేడమ్" అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, దాంతో శ్రీదేవి కీ సూర్య చెయ్యి తగలిన వెంటనే ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు అయ్యింది దాంతో ఇద్దరు కలిసి బిల్ల్ కట్టడానికి వెళ్లిన తర్వాత "మేడమ్ ఈ ఆదివారం మీరు ఫ్రీ అయితే నాతో పాటు నా పెళ్లి చూపులకు వస్తారా" అని అడిగాడు సూర్య.


సూర్య చెప్పింది విన్న శ్రీదేవి ఒక్కసారిగా షాక్ అయ్యింది "ఏంటి మీకు పెళ్లి చూపులా" అని అడిగింది శ్రీదేవి, దానికి సూర్య అవును అన్నట్టు నవ్వుతూ తల ఆడించాడు దాంతో శ్రీదేవి కీ ఒక్కసారిగా తన కాలు కింద భూమి జారినట్టు అయ్యింది కంట్లో నుంచి నీలు రావడం గమనించిన శ్రీదేవి తనకు ఫోన్ వచ్చినట్టు నటిస్తూ అక్కడి నుంచి పక్కకు వెళ్లి ఏడుస్తూ తన కళ్లు తుడుచుకొని వెళ్లి "సరే సార్ వస్తాను ఎంతైనా మనం మనం ఫ్రెండ్స్ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా" అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు కలిసి సూర్య బైక్ మీదే తిరిగి కాలేజ్ కీ వెళుతూ ఉంటే, శ్రీదేవి కీ లోపల బాధ వేస్తూ ఉంటే ఒక చోట పని ఉంది అని చెప్పి దిగి ఇంటికి వెళ్లిపోయింది, అలా ఇంటికి వెళ్లి తన రూమ్ లో కూర్చొని తన కంప్యూటర్ లో ఫుల్ గా సౌండ్ పెట్టుకొని ఏడుస్తూ బెడ్ మీద పడుకుంది, అలా కొద్ది సేపటికి శ్రీదేవి వాళ్ల నాన్న చక్రవర్తి ఒక ప్లేట్ లో భోజనం పెట్టుకొని వచ్చి "ఏడ్చింది చాలు తిని కొంచెం శక్తి తెచ్చుకోని మళ్లీ ఏడ్చూ" అని చెప్పాడు, దానికి శ్రీదేవి "నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను నేను ఏమీ ఏడ్చడం లేదు " అని చెప్పింది, దానికి చక్రవర్తి "నువ్వు బాధ లో ఉన్న ప్రతి సారి ఇలా లౌడ్ స్పీకర్ పెట్టి మరీ ఏడుస్తావు అని నాకూ తెలుసు కానీ ఇదిగో నీకోసం చికెన్ చేశాను లేచి తిను నీ మూడ్ సెట్ అవుతుంది" అని చెప్పాడు, దాంతో శ్రీదేవి తన కళ్లు తుడుచుకొని బెడ్ మీద నోరు తెరిచి కూర్చుని ఉంటే చక్రవర్తి నవ్వుకోని తన కూతురు కీ ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తూ "చూడు చిట్టి తల్లి నిన్ను వదులు కోవడం వాడి దురదృష్టం లేదు వాడు మంచోడు అయితే కాలమే మిమ్మల్ని కలుపుతుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టు వాడికి పెళ్లి చూపులు మాత్రమే కదా పెళ్లి కాదు కదా ఒకవేళ పెళ్లి కూడా జరిగింది అనుకో అప్పుడు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయను అని నాకూ మాట ఇవ్వు" అని అన్నాడు చక్రవర్తి, దానికి శ్రీదేవి సరే అని చెప్పింది.

ఆ తరువాత ఆదివారం పెళ్లి చూపులకు వెళ్లిన తర్వాత బిందు కూడా పెళ్లికి ఒప్పుకోవడం తో నేరుగా పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు అది చూసి శ్రీదేవి కీ ఇంకా బాధ కలిగి అక్కడి నుంచి వెళ్లి పోవాలి అని చూస్తే సూర్య తన చేతిలో ఉన్న గిఫ్ట్ నీ బిందు కీ ఇవ్వమని శ్రీదేవి కీ చెప్పాడు, దాంతో శ్రీదేవి సరే అని వెళ్లి బిందు కీ ఆ గిఫ్ట్ ఇచ్చి "మీరు చాలా లక్కీ సూర్య సార్ లాంటి మంచి అబ్బాయి నీ భర్త గా పొందుతున్నారు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రీదేవి.

(ప్రస్తుతం కోర్టు లో)

సూర్య నీ కోర్టు లో హజరు పరిచిన తరువాత జడ్జ్ గారు బిందు నీ పిలిచి అసలు సూర్య అలా ప్రవర్తించడానికి గల కారణాలు అడిగాడు అంటే ఎప్పుడు ఇలాగే మృగం లాగా ప్రవర్తిస్తాడా అని అడిగితే, దానికి బిందు "మై లార్డ్ ఇతనికి ఆడవాళ్లను సుఖ పెట్టడం చేత కాదు అందుకే నేను తనని టెస్టు చేయించుకోమని చెప్పాను అని నను రోజు torture చేస్తున్నాడు నాలో ఎలాంటి సమస్య లేదు నీలోనే సమస్య అని చెప్పి అహంకారం తో నన్ను బలవంతంగా అనుభవిస్తున్నాడు, దయచేసి నాకూ ఇతని నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాను" అని కన్నీరు కారుస్తూ చెప్పింది బిందు, అది విని షాక్ అయిన సూర్య కీ తన మొదటి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

(కొన్ని నెలల క్రితం)

సూర్య కీ బిందు కీ పెళ్లి జరిగిన తరువాత ఇద్దరినీ శోభనం గదిలోకి పంపారు, సూర్య ఏమో ఎంతో ఆశగా బిందు కోసం ఎదురుచూస్తున్నాడు కానీ బిందు వచ్చి "నాకూ నువ్వు అంటే ఇష్టం లేదు నీ వల్ల నాకూ చాలా అన్యాయం జరిగింది దాని కోసం నీ మీద పగ తీర్చుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్న నేను నీతో తాళి కట్టించుకున్నది నీ మెడకు ఉచ్చు లాగా మారడం కోసం నేను ఒక independent women నీ ఎవరో దయా దాక్షిణ్యం మీద నేను బ్రతకాల్సిన అవసరం లేదు నను కనుక నువ్వు టచ్ చేసిన నన్ను నేను తగలబేట్టుకోని ఆ మంటల్లో నిన్ను కూడా తగలబెడతా" అని చెప్పింది బిందు. 
Like Reply


Messages In This Thread
RE: పెళైన బ్రహ్మచారి - by Vickyking02 - 04-08-2023, 09:20 AM



Users browsing this thread: 8 Guest(s)