Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళైన బ్రహ్మచారి
#75
శేఖర్ చెప్పినది విన్న తర్వాత బిందు ఒక్కసారిగా షాక్ అయ్యింది "బాలు చైర్మన్ అవ్వడం ఏంటి అతను మీ తమ్ముడూ ఏంటి సార్ అసలు ఏమీ జరుగుతుంది సార్" అని అడిగింది బిందు, దానికి శేఖర్ "నీకు నాయర్ గ్రూప్స్ గురించి తెలుసు కదా" అని అడిగాడు, దానికి తెలుసు అన్నట్టు తల ఆడించింది బిందు. 


"ఆ నాయర్ గ్రూప్ కంపెనీ అధినేత మహేంద్ర నాయర్ కొడుకే ఈ బాలమహేంద్ర నాయర్ ఇప్పుడు మీరు చూసిన బాలు వేరు నేను చూసిన బాలు వేరు, డబ్బు మదం తో తల ఏగుర వేసేవాడిని కానీ వీడికి మాత్రం డబ్బు మదం నర నరాలు లో పాకుతుంది డబ్బు ఉంటే ఎవరెస్ట్ శిఖరం నీ కూడా తన పెరటి లో పెట్టుకోవచ్చు అనే మనస్తత్వం వాడిది, వాడు నా సొంత తమ్ముడూ కాదు మా నాన్న రెండో భార్య కొడుకు వాడు చిన్నప్పటి నుంచి డబ్బు గర్వం తో చాలా చేశాడు ప్రిన్సిపల్  కొడుకు వాడిని కాలేజ్ స్పోర్ట్స్ లో ఒడించాడు అని వాడిని నీ కొట్టి మరీ వాడి నుంచి ఫ్రైజ్ లాక్కున్నాడు, ఇంటర్ లో ఒక అమ్మాయిని రేప్ చేసి మరీ చంపేసాడూ కానీ డాడీ వాడిని శిక్షించడానికి ఇంట్లో నుంచి దూరంగా ఉంచి వాడు ఏదైనా సాధించిన తరువాతే వాడికి ఆస్తి లో వాటా ఇస్తాను అని చెప్పారు, అందుకే వాడు ఇన్ని రోజులు లేని డబ్బు కోసం కష్టపడ్డాడు అలాంటిది వాడి జీవితం లో వాడి కళ నెరవేరబోతోంది అనుకున్న టైమ్ లో నువ్వు చేసిన పొరపాటు వల్ల వాడు ఎక్కిన నిచ్చెన నుంచి జారి పడ్డాడు, వాడు కనుక గెలిస్తే నన్ను కాపాడానికి నాన్న కూడా లేరు అందుకే వాడిని గెలవకుండా చెయ్యాలి అని ప్లాన్ చేసి నిన్ను HR గా ప్రమోట్ చేసి నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు వాడికి సహాయం చేసి నన్ను నాశనం చేశావు దయచేసి వాడికి దూరం గా ఉండు లేదు అంటే నీ జీవితం మొత్తం నాశనం అవుతుంది జాగ్రత్తగా ఉండు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శేఖర్.

దాంతో బిందు కీ ఒక్కసారిగా జరిగిన విషయాలు అన్ని గుర్తుకు వచ్చాయి ఆ రోజు బాలు తనని ముద్దు పెట్టుకున్నది, ఆ తర్వాత బెంగళూరు లో తనకు పార్టీ ఇచ్చింది, propose చేసింది, తనతో ఆ రోజు రాత్రి గడిపింది అంతా బాలు ప్లాన్ అని తెలిసి షాక్ అయ్యింది బిందు, ఆ తర్వాత ఆవేశంగా ఆఫీసు కీ వెళితే అక్కడ మాళవిక బిందు కీ ఎదురు వచ్చి "హలో HR గారు మీకు డిస్మిస్ ఆర్డర్ ఇవ్వమని చైర్మన్ గారు చెప్పారు తీసుకోని బయలుదేరు" అని చెప్పింది, దాంతో బిందు ఆవేశం కట్టలు తెగి చైర్మన్ రూమ్ లోకి వెళితే అక్కడ బాలు table మీద డ్రగ్స్ వేసుకోని పీలుస్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన బిందు నీ చూసిన బాలు "హే బేబీ ఏంటి ఇలా వచ్చావు నిన్ను డిస్మిస్ చేశాను కదా మాళవిక పాప కీ ఏదైన సర్టిఫికేట్ కావాలి అంటే ఇచ్చి పంపు, తన వల్లే నాకూ ఈ హోదా తిరిగి వచ్చింది అందుకే ఏమీ కావాలి అన్న ఇచ్చేయ్, నువ్వు నాకూ చేసిన దానికి నేను punishment ఇచ్చాను నాకూ తెలిసి ఇప్పుడు నీకు మూడో నెల కదా " అని చెప్పి నవ్వాడు బాలు, దాంతో బిందు, బాలు నీ గట్టిగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత బిందు బయటికి వచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటే అప్పుడే రోడ్డు అవతల సూర్య నీ చూసి అతనికి థాంక్స్ చెప్పాలి అని రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే అప్పుడే తనకు accident అయ్యింది.

ఇలా గతం నీ తలుచుకొని బాధ పడుతు ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన అన్నపూర్ణ, బిందు కీ భోజనం తినిపించాలి అని చూస్తూ ఉంటే బిందు వద్దు అని అరిచింది "చూడు బిందు నీకు మీ నాన్న పెళ్లి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు కాబట్టి ఇంక నీకు వేరే దారి లేదు పెళ్లి చేసుకుని నీ గతం మరిచిపో" అని చెప్పి సూర్య ఫోటో చూపించింది, దాంతో ఆ ఫోటో చూసిన బిందు, సూర్య ఫోటో చూసి వాడిని కలవడానికి వెళ్లినందుకే నా బిడ్డ చనిపోయింది అని బిందు, సూర్య మీద కోపం తో పెళ్లికి ఒప్పుకుంది. 
Like Reply


Messages In This Thread
RE: పెళైన బ్రహ్మచారి - by Vickyking02 - 02-08-2023, 11:03 AM



Users browsing this thread: 10 Guest(s)