Thread Rating:
  • 13 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు
అలా మేము కబుర్లు చెప్పుకుంటుంటే నా నెంబర్ కి అపర్ణ ఫోన్ చేసింది. నేను పావనిని అలాగే గట్టిగా కౌగిలించుకుని, ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను.

[Image: pxgo3hclpsfj.jpg]

అపర్ణ: పావని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది అందుకే నీకు చేశా అంది.

పావని: ఎంటో చెప్పవే నా మొబైల్ లో ఛార్జింగ్ లేదు అందుకే స్విచ్ఛాఫ్ అయింది......

అపర్ణ: అదే మీరు ఎక్కడికి వెళ్లారో....... రావడానికి ఇంకెంత టైం పడుతుందో తెలుసుకుందామని ఫోన్ చేశా......

పావని: (చెప్పాలా వద్దా అన్నట్టు నా కళ్ళలోకి చూస్తూ, నేను చెప్పొద్దూ అనేలోపే) మామయ్య వాళ్ళ ఇంటికే వచ్చాము అని నాలుక కరుచుకుంది.  

అపర్ణ: (కోపంగా) మరి నాకు బయటకి వెళ్తున్నాము అని అబద్ధం ఎందుకు చెప్పారు.

పావని: అది.... అది..... నువ్వు నాతో పాటు కాలేజీ వరకు వస్తావో రావో అని అలా అబద్ధం చెప్పానే.....

అపర్ణ: (కోపంగా) సరే...... ఇంక నీకు నాతో పని ఏముంది అంటూ ఫోన్ పెట్టేయబోయింది.

పావని: (పావని కంగారుపడుతూ ఫోన్ నా దగ్గర నుండి తీసుకుని) ప్లీస్ ఐ యామ్ రియల్లీ సారినే........


[Image: laying-woman-taking-phone-man-21272948.jpg?w=768]

అపర్ణ: నాతో నీ అవసరం తీరిపోయిందిగా ఇంక నేనెందుకునేను ఇంటికి వెళ్లిపోతున్నాను ....

పావని: (కంగారుపడుతూ)అక్కయ్య.....ప్లీస్ వద్దే నేను వచ్చే వరకు వెళ్లకు. మనం ఇద్దరం కలిసి వెళ్దాం లేదంటే అమ్మ నన్ను తిడుతుంది అని నీరసంగా అంది.

అపర్ణ: ఈ భయం ముందుండాలి....... మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు ముందే చెప్తే నేనేమైన మీతో వస్తాను అనుకున్నారా అంది.

పావని: అదేం లేదే అక్కయ్య........ నువ్వు అలా ఫీల్ అవ్వకు ప్లీస్ అంది.

అపర్ణ: (నసుగుతూ) సరేలే కానీ నువ్వు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది అంది.

దానితో నేను ఫోన్ తీసుకుని ఇంకొక గంటా గంటన్నర పట్టొచ్చు అన్నాను. దానికి అపర్ణ వెంటనే నా భుజం మీద కొరికి అదేం లేదులేవే తొందరగానే వస్తాను అంది.

పావని అలా కొరకడంతో అపర్ణకి వినబడేలా ఆహ్...... పొట్టిదాన అలా కొరికావు ఏంటే అని, " ఈ పొట్టిదానికి తిక్క బాగా ఉంది. నన్ను ఎలా కొరుకుతుందో చూడు అప్పు అన్నాను.

అపర్ణ: (కోపంగా) అయితే నాకెందుకు చెబుతున్నావు...... నాకు బస్ రెడీగా ఉంది నేను వెళ్లిపోతున్నా అంది.

[Image: rm3ka537h5v6.jpg]

నేను: హే  అప్పు........ఇప్పుడే కదా ఉంటాను అన్నావు మళ్ళీ ఏమైంది నీకు.......

అపర్ణ: హా..........ఏమైందో నీకు చెప్పాలా.......

పావని: అక్కయ్య ఎందుకే అలా చేస్తావు....... నువ్వు బావతో బయటకి వెళ్ళినప్పుడు నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు.

అపర్ణ: ఇప్పుడు ఆ విషయం అవసరమా...... అయినా అప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్ళాను. నీలా అబద్ధం చెప్పి ఇలా వెళ్ళలేదు అంది.


నేను: ప్లీస్ రా అప్పు అర్థం చేసుకోవచ్చు కదా....... కావాలంటే నీకు వచ్చిన తర్వాత పెద్ద డైరీమిల్క్ చాక్లెట్ కొనిస్తాలే అన్నాను.

అపర్ణ: నీ తొక్కలో చాక్లెట్ నాకేమి అక్కర్లేదులే. కొంచెం తొందరగా రావడానికి ట్రై చేయండి. నేను బస్టాండ్ లో వెయిట్ చేస్తా. అసలే నాకు తల నొప్పిగా ఉంది. పావనిని తీసుకుని నెక్స్ట్ బస్ టైం కి వచ్చెయ్యి....

నేను: బస్టాండ్ కి ఎందుకురా అప్పు.....ఇక్కడికి మీ అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చేయి మిమ్మల్ని ఇద్దరిని బస్టాండ్ లో నేనె దింపుతా.

 అపర్ణ: (కోపంగానే) వద్దులే.... నేను వస్తే మిమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేసినదాన్ని అవుతాను..... మళ్ళీ అందులోనూ అంత దూరం ఇప్పుడు నడవలేను కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నించండి అంది.

నేను: సరే అప్పు చాలా థాంక్స్ అప్పు అని ఫోన్ కట్ చేశా.

ఫోన్ కట్ చేయగానే "అక్కకి బావతో లవ్ మేటర్ లో నేను ఎంతో హెల్ప్ చేశా. అక్క నాకు ఈ మాత్రం కూడా హెల్ప్ చేయలేదా" అంటూ పావని తన అక్కని విసిగించుకుంటుంది.

[Image: iqaeznis0cm1.jpg]

నేను: హే........పొట్టి అపర్ణ అలా అంటుంది కానీ తను చాలా మంచిదే......... మనం ముందుగా తనకి నిజం చెబితే బాగుండేది అన్నాను.

పావని: అక్క మంచిది కాదు అనడంలేదు. నేను దానికి బావతో లవ్ మ్యాటర్ లో ఎంత హెల్ప్ చేసానో, అది కూడా మన ఇద్దరిని కలపడానికి నాకు చాలా హెల్ప్ చేసింది. కానీ దానికి కోపం వస్తే అది ఇలానే కోప్పుడుతుంది, మళ్ళీ అంతలోనే ప్రేమగా మాట్లాడుతుంది.


అలా అపర్ణ గురించి మాట్లాడుకుంటుంటే, మొదట అక్కనే బావని లవ్ చేసింది. అందువల్లనే నువ్వు అక్కకి ప్రపోస్ చేస్తే అది నీ లవ్ ని రిజెక్ట్ చేసింది.

ఒకరోజు బావ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు, బావ వాళ్ళ చెల్లి శృతి నుండి అక్క బావ నెంబర్ తీసుకుంది. ఆ తర్వాత బావ మరియు అక్క చిన్న చిన్నగా చాటింగులు, ఫోన్లో మాట్లాడుకోవడం, చేసేవాళ్ళు.

మేము హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు, బావనే మమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి రైల్వే స్టేషన్ కి వచ్చేవాడు.

[Image: da224c7b47b73e3b17612a5d20d0dc47.jpg]

బావ ప్రతిసారి అక్కతోనే మాట్లాడుతూ, తనని ఇంప్రెస్స్ చేయడానికి ఏమేమో కోతివేశాలు వేస్తుండేవాడు. అప్పుడు అక్కా మారియూ బావ, ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడం చేసేవారు.

భావనే మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేవాడు. ఇంక మమ్మల్ని హైదరాబాద్ లో టూరిస్ట్ ప్లేస్ లకి తీసుకెళ్లేవాడు. నాకు, శృతికి వాళ్లిద్దరూ లవ్ చేసుకుంటున్నారని క్లియర్ గా అర్థం అయి, మాకు తోచిన సాయం మేము చేసాము.

[Image: 87423ae6d10d361c0e8638d55d797867.jpg]
పావని, శృతి, మరియు అపర్ణ

ఇదిలా ఉండగా ఒకరోజు బావ అక్కని ఒక్కదాన్నే బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ప్రపోస్ చేశాడని, ఎస్ చెప్పాలో నో చెప్పాలో తెలియక నాకు లవ్ మీద ఇంటరెస్ట్ లేదు అని చెప్పిందట.

అలా జరగడంతో బావ చాలా ఫీల్ అయి అక్కతో అప్పటినుండి తక్కువ మాట్లాడటం మొదలుపెట్టాడు. 

దాంతో అక్క నా దగ్గరికి వచ్చి బాధపడుతూ, బావంటే నాకు ఇష్టమే కానీ, బావ నా ఎదురుగా నిలబడి ప్రపోస్ చేయగానే ఎందుకో భయం వేసింది. అందుకే నో చెప్పాను.

[Image: 054c4e4780e28101f3fe813ef6f6badb.jpg]
పావని మరియు అపర్ణ

నువ్వే ఎలాగైనా మమ్మల్ని ఇద్దరిని కలపాలి అని నన్ను బ్రతిమిలాడింది. ఇంక నేను ఆ విషయం మొదట బావ వాళ్ళ చెల్లి శృతికి చెప్పి, అక్క చాలా ఏడుస్తుంది వాళ్ళిద్దరిని  ఎలాగైనా మనమే కలపాలి అన్నాను.

మొదట శృతి, వాళ్ళ అన్నయ్య ప్రపోస్ చేస్తే నో చెప్పినందుకు అక్క మీద చాలా కోపంగా ఉంది. కానీ తన అన్నయ్య గురించి మా అక్క ఏడుస్తుంది అని చెప్పడంతో ఒప్పుకుంది.

దాంతో మేము ఇద్దరం ఒకరోజు అక్క, బావ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునెలా ప్లాన్ చేసాము. కానీ అక్కకి బావతో మాట్లాడాలంటే భయం వేసి, ఫోన్ నాకు ఇచ్చి నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయవే అని చెప్పింది.

దాంతో నేను మా బావతో ఫోన్లో  మాట్లాడుతూ, అక్కకి నువ్వంటే ఇష్టమేనట కానీ అది నిన్ను చూసి భయపడి నో చెప్పిందట అన్నాను.

అయినా కూడా మా బావకి ఇగో హర్ట్ అవడంవల్ల, నేను మీ అక్కని వాడుకొని వదిలేసే రకం కాదు. నాకు మీ అక్క అంటే నిజంగా ఇష్టం ఉండటం వల్లనే ప్రపోస్ చేశా. కానీ మీ అక్క నో చెప్పింది.

[Image: abdb8501f18167712f9878a91b9c1f15.jpg]
తన బావకి నో చెప్తున్న అపర్ణ

ఇప్పుడు నేను జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు లవ్ మీద పెద్దగా ఇంటరెస్ట్ లేదు అన్నాడు. బావ అలా అనడంతో అక్క ఫీల్ అయి చాలా బాధ పడింది. 

దాంతో బావ వాళ్ళ చెల్లి శృతికి ఫోన్ చేసి చెప్పడంతో, "మా అన్నయ్య జాబ్స్ కి ప్రిపేర్ అవుతుండటంతో ఇప్పుడు ఇంటరెస్ట్ లేదు అన్నాడు. 

కాని మీ అక్కనే మళ్ళీ అన్నయ్యకి తన మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి" అంది.

ఇంక అప్పటి నుండి శృతి వాళ్ళ అన్నయ్య ఎక్కడికైనా ఎక్సమ్ రాయడానికి వెళ్లినా, ఇంటర్వ్యూకి వెళ్లినా మాకు ముందే చెప్తుండేది. దాంతో అక్క బావకి ఫోన్ చేసి మాట్లాడుతూ, అల్ ది బెస్ట్ చెబుతూ, ఉండేది.

మొదట బావ కొన్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడంతో, కొంచెం డిసపోయింట్ అయ్యాడు. అప్పుడు అక్కనే బావకి ఫోన్ చేసి నీకు ఉన్న టాలెంట్ కి ఇంకా పెద్ద కంపెనీలో జాబ్ వస్తుందిలే అని సపోర్ట్ చేసేది.

[Image: 022c557c33ae57abd76cd4281f98315e.jpg]
పావని మరియు అపర్ణ

అక్క చెప్పినట్టుగానే బావకి చాలా పెద్ద కంపెనీలో చాలా పెద్ద ప్యాకేజీతో మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. దాంతో బావ అక్కని ఒక అదృష్టంలా భావించి, మళ్ళీ తనతో రోజూ ఫోన్లో మాట్లాడుతూ ఇంటరెస్ట్ చూపెట్టాడు.

అదే టైములో అత్తమ్మ వాళ్ళు అక్కని బావకి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగడంతో మా అమ్మా నాన్న టక్కున ఒప్పేసుకున్నారు.

[Image: c0051af03c769d61e168d2dbecc8213a.jpg]

 ఇంక మా రెండు కుటుంబాల వాళ్ళే పెళ్లి చేద్దాం అనడంతో, వాళ్ళిద్దరి మధ్యన చనువు ఇంకా బాగా పెరిగిపోయింది.
[+] 13 users Like Harsha.B's post
Like Reply


Messages In This Thread
1 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
2 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
3 - by Harsha.B - 06-08-2023, 09:33 PM
4 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
5 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
6 - by Harsha.B - 06-08-2023, 09:35 PM
7 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
8 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
RE: 8 - by రకీ1234 - 16-08-2023, 09:19 PM
9 - by Harsha.B - 06-08-2023, 09:37 PM
10 - by Harsha.B - 06-08-2023, 09:37 PM



Users browsing this thread: 1 Guest(s)