05-07-2023, 02:14 PM
(04-07-2023, 07:30 PM)earthman Wrote: ఉదయ్, శ్రావణ్ బాబులూ ఏమంటిరి, ఏమంటిరి.
ఇంత కష్టపడి ఒత్తులతో, పొల్లులతో, దీర్ఘాలతో, ఉపమానాలతో, అచ్చుతప్పులు లేకుండా రాసిన నా కథాభాగమును చిన్న అప్డేట్ అందురా, ఎంతమాట, ఎంతమాట.
ఇది కథాపరీక్షయే గానీ ఎస్సే, షార్ట్ ఆన్సర్ పరీక్ష గాదే. కాదూ కాకూడదూ ఇది పెద్ద సైజ్ పరీక్షయే అందురా, ముందుముందు పెద్ద అప్డేట్ రాసిన, అది నచ్చకున్న అప్పుడేమందురు.
చిన్నదయినా, పెద్దదయినా అప్డేట్ నచ్చుట కదా మనకి కావల్సినది.
నాతో చెప్పింతురేమయ్యా, పెద్దగా రాసినా నచ్చకున్న రాసి వ్యర్ధం కదా, నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరగును కదా. చిన్నది రాసినా జనులకి నచ్చిన అదే గొప్ప కదా.
సందర్భావసరములబట్టి చిన్నది, పెద్దది ఉండును, ఇది ఏనాడో నిశ్చయమయినది, కాగా నేడు చిన్న అప్డేట్, చిన్న అప్డేట్ అని అనుట ఎందుకు.
No comments only clapping
ఓ భూమానవ (earthman) మీ (సందర్భోజిత) సమయోజిత అనుకరణ చాలా బాగా కుదిరింది, మరి ఈ పేరడీ రాయడానికి ఎంత సమయం తీసుకున్నారో గాని చదివిన వెంటనే మొదట విపరీతమైన నవ్వొచ్చి కళ్ళెంబడి నీళ్ళు కారిపోయాయి ఆ తరువాత మరోసారి DVSK ను పక్కన వింటూ చూస్తే మక్కీకి మక్కి అలాగే రాసేసారు, మీకివే వీర తాళ్ళు వేసుకోండి నిండుగా
: :ఉదయ్